CBI searches
-
బీజేపీలో చేరకపోతే రాముడికి శిక్ష పడేది
న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరుపై ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పారీ్ట(ఆప్) జాతీయ కనీ్వనర్ అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ భగవాన్ శ్రీరాముడు ఇప్పుడు బతికి ఉండి బీజేపీలో చేరకపోతే ఆయన ఇంట్లో సోదాలు చేయడానికి ఈడీ, సీబీఐలను పంపించేవారని అన్నారు. బీజేపీలో చేరుతావా? లేక జైలుకు వెళ్తావా? అంటూ బీజేపీ పెద్దలు బెదిరించేవారని చెప్పారు. బీజేపీలో చేరకపోతే రాముడికి కచి్చతంగా జైలుశిక్ష పడేదని వ్యాఖ్యానించారు. ఢిల్లీ శాసనసభలో 2024–25 బడ్జెట్‌ను ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టింది. బడ్జెట్‌పై సభలో శనివారం జరిగిన చర్చ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడారు. -
షాజహాన్ షేక్ ఇంట్లో సీబీఐ సోదాలు
కోల్‌కతా: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)అధికారులపై దాడి కేసులో బహిష్కృత టీఎంసీ నేత షాజహాన్ షేక్ ఇల్లు, ఆఫీసుల్లో సీబీఐ అధికారులు శుక్రవారం సోదాలు జరిపారు. దాడికి సంబంధించిన ఆధారాల కోసం ఉత్తర 24 పరగణాల జిల్లా సందేశ్‌ఖాలిలోని షాజహాన్ షేక్ నివాసం సమీప ప్రాంతాలను కూడా పరిశీలించారు. రేషన్ పంపిణీ కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా జనవరి 5వ తేదీన షాజహాన్ షేక్ ఇంట్లో సోదాలకు వెళ్లిన 14 మంది అధికారుల బృందంపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో సీబీకి చెందిన ఆరుగురు, సెంట్రల్ ఫోరెన్సిక్ నిపుణులు ఆరుగురు, ఈడీ అధికారులు ఇద్దరు గాయపడ్డారు. ఘటనతో సంబంధముందన్న ఆరోపణలపై టీఎంసీ నుంచి షాజహాన్ షేక్ సస్పెండయ్యాడు. హైకోర్టు క్లియరెన్స్ ఇవ్వడంతో గురువారం షాజహాన్ షేక్‌ను అదుపులోకి తీసుకున్న సీబీఐ అధికారులు, సందేశ్‌ఖాలిలోని అతడి నివాసం, కార్యాలయాలకు సీల్ వేశారు. -
చైల్డ్ పోర్నోగ్రఫీ కేసు.. 59 చోట్ల సీబీఐ దాడులు
న్యూఢిల్లీ: ఆపరేషన్ ‘మేఘ చక్ర’లో భాగంగా సీబీఐ శనివారం దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 59 చోట్ల సోదాలు జరిపింది. చిన్నారులపై లైంగిక వేధింపుల మెటీరియల్ (సీఎస్ఏఎం)పై నమోదైన రెండు కేసుల దర్యాప్తు భాగంగా ఈ దాడులు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. గత ఏడాది చేపట్టిన ఆపరేషన్ ‘కార్బన్’ ద్వారా సేకరించిన సమాచారం, సింగపూర్‌లోని ఇంటర్‌పోల్ కార్యాలయం అందించిన వివరాల మేరకు సీఎస్ఏఎం పంపిణీ దారుల క్లౌడ్ స్టోరేజీ కేంద్రాల్లో సోదాలు చేపట్టింది. ఈ పంపిణీదారులు బాలలపై అసభ్యకరంగా చిత్రీకరించిన వీడియోలను ఆన్లైన్లో ఉంచి డబ్బు సంపాదిస్తున్నట్లు సీబీఐ వర్గాలు పేర్కొన్నాయి. అనుమానితుల నుంచి స్వాధీనం చేసుకున్న అశ్లీల వీడియోలున్న ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి వివరాలు తెలుసుకుని బాధితులు, బాధ్యులను గుర్తిస్తామని అధికార వర్గాలు తెలిపాయి. -
వైఎస్ వివేకా హత్య కేసు: అనుమానితుల ఇళ్లలో సీబీఐ సోదాలు
పులివెందుల/కడప అర్బన్: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి అనుమానితుల ఇళ్లలో సీబీఐ అధికారులు బుధవారం ముమ్మరంగా సోదాలు నిర్వహించారు. కడప కేంద్ర కారాగారంలోని గెస్ట్‌హౌస్‌లో అనుమానితులను, ముగ్గురు ఎస్బీఐ అధికారులను విచారించారు. హత్య జరిగిన తర్వాత వివేకా ఇంట్లో రక్తపు మరకలను తుడిచేసిన ఘటనకు సంబంధించి పులివెందుల పట్టణంలోని బయమ్మ తోటలో ఉంటున్న వైఎస్ వివేకా ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి ఇంట్లో సోదాలు చేశారు. నిత్యావసరానికి ఉపయోగించే మచ్చుకత్తి, కత్తులను స్వాధీనం చేసుకున్నారు. విచారణ నిమిత్తం ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. టి.తుమ్మలపల్లెలోని గంగిరెడ్డి సోదరులు, బంధువుల ఇళ్లలో కొడవళ్లు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. భాకరాపురంలోని సునీల్‌కుమార్ యాదవ్ నివాసంలోనూ సోదాలు చేశారు. బ్యాంక్ అకౌంట్ బుక్‌లను, చెక్ కాపీతో పాటు పాత చొక్కాను తీసుకెళ్లారు. అనంతరం సునీల్‌కుమార్ సొంత గ్రామమైన మోట్నూతలపల్లెకు తండ్రి కృష్ణయ్యను తీసుకెళ్లి వారి నివాసాన్ని తనిఖీ చేసి అక్కడ కొన్ని ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. సునీల్‌కుమార్ అత్త గ్రామమైన యల్లనూరు మండలం వెన్నపూసపల్లెలో వ్యవసాయానికి ఉపయోగించే వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. భాకరాపురంలోని దస్తగిరి నివాసంలో 5 కొడవళ్లు, బ్యాంకు అకౌంట్ బుక్‌లను స్వాధీనం చేసుకున్నారు. పులివెందుల కొత్త బస్టాండ్ సమీపంలో ఉన్న ఉమా శంకర్‌రెడ్డి నివాసం, ప్రొద్దుటూరులో ఆయన సోదరుడి ఇంట్లో సోదాలు చేశారు. సుంకేసుల గ్రామంలో కూడా కొన్ని ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర వైద్య విభాగం కార్యదర్శి వైఎస్ అభిషేక్‌రెడ్డిని, ఉమా శంకర్‌రెడ్డిని సీబీఐ అధికారులు విచారించారు. కర్ణాటక నుంచి బ్యాంక్, రెవెన్యూ అధికారుల రాక కర్ణాటక నుంచి 20 వాహనాల్లో బ్యాంక్, రెవెన్యూ అధికారులు బుధవారం కడపకు వచ్చారు. వారంతా సీబీఐ అధికారులతో కలిసి ఉదయాన్నే బయటకు వెళ్లిపోయారు. కడపకు చెందిన ముగ్గురు ఎస్బీఐ అధికారులు బుధవారం విచారణకు హాజరయ్యారు. కర్ణాటకలో ల్యాండ్ సెటిల్మెంట్కు సంబంధించి వైఎస్ వివేకానందరెడ్డి, సునీల్ కుమార్ యాదవ్ మధ్య వివాదం ఉన్న నేపథ్యంలో అక్కడి బ్యాంక్, రెవెన్యూ సిబ్బందిని సీబీఐ అధికారులు పిలవడం చర్చనీయాంశంగా మారింది. సునీల్‌కుమార్ యాదవ్ సీబీఐ కస్టడీలో ఇచ్చిన సమాచారం మేరకు అన్ని ప్రాంతాల నుంచి వివరాలను సేకరిస్తున్నారు. ఈ క్రమంలోనే వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్‌రెడ్డి బుధవారం మధ్యాహ్నం సీబీఐ అధికారులను కలిసి వెళ్లారు. కేసు దర్యాప్తు గురించి అడిగి తెలుసుకున్నారు. -
ఎన్డీటీవీ షేర్లకు సీబీఐ షాక్!
ముంబై: సీబీఐ అనూహ్య దాడుల నేపథ్యంలో ఎన్డీటీవీ షేర్లు ఇవాల్టి మార్కెట్లో కుప్పకూలిపోయాయి. ఐసీఐసీఐ బ్యాంకుకు రూ.48 కోట్ల మేర నష్టం కలిగించారన్న ఆరోపణలతో సీబీఐ సోదాల వార్తల కారణంగా ఈ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ఎన్డీటీవీ వ్యవస్థాపకుడు, సహ చైర్మన్ ప్రణయ్ రాయ్, అతని భార్య రాధికా రాయ్, ఆర్ఆర్ పీఆర్ (రాధికా రాయ్, ప్రణయ్ రాయ్) అనే ప్రైవేటు కంపెనీలపై సీబీఐ దాడుల వార్తలతో ఆందోళకు గురైన ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలు దిగారు. దీంతో ఈ షేరు దాదాపు 7 శాతానికి బాగా నష్టపోయింది. భారీ నష్టాలతో దీంతో 52 వారాల కనిష్ట స్థాయికి చేరింది. రాయ్, రాయ్ భార్య రాధిక, ఆర్ఆర్పీఆర్ హోల్డింగ్స్ తదితరాల వల్ల ఈ నష్టం వాటిల్లిందన్న ఆరోపణలపై సీబీఐ కేసులు నమోదు చేసింది. ఐసీఐసీఐ బ్యాంకుకు రూ.48 కోట్ల మేర నష్టం కలిగించారంటూ ఎన్డీటీవీ వ్యవస్థాపకుడు, సహ చైర్మన్ ప్రణయ్ రాయ్, అతని భార్య రాధికా రాయ్, ఆర్ఆర్ పీఆర్ (రాధికా రాయ్, ప్రణయ్ రాయ్) అనే ప్రైవేటు కంపెనీ, మరికొందరిపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కేసు నమోదు చేసింది. అనంతరం ఈ రోజు ఢిల్లీలోని గ్రేటల్ కైలాష్-1 ప్రాంతంలో ఉన్న రాయ్ నివాసంలో సీబీఐ అధికారులు సోదాలకు దిగారు. మరో నాలుగు ప్రాంతాల్లోనూ సోదాలు నిర్వహించారు. మరోవైపు ఈ దాడులను ఎన్డీటీవీ తీవ్రంగా ఖండించగా, వివిధ పత్రికాధిపతులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కాగా బ్యాంకును మోసం చేసిన కేసుల్లో భాగంగానే ఈ సోదాలు చేపట్టినట్టు సీబీఐ అధికార ప్రతినిధి తెలిపారు. విదేశీ యూనిట్ల ద్వారా భారీ స్థాయిలో నిధులు తరలింపునకు సహకరించడం ద్వారా ఎన్డీటీవీ ఫెమా నిబంధనలు ఉల్లంఘించిందంటూ 2015 నవంబర్ లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ 2,030 కోట్లకు నోటీసు జారీ చేసింది.