బీజేపీలో చేరకపోతే రాముడికి శిక్ష పడేది | BJP Would Have Sent ED, CBI To Raid Lord Ram Residence | Sakshi
Sakshi News home page

బీజేపీలో చేరకపోతే రాముడికి శిక్ష పడేది

Published Sun, Mar 10 2024 5:49 AM | Last Updated on Sun, Mar 10 2024 5:49 AM

BJP Would Have Sent ED, CBI To Raid Lord Ram Residence - Sakshi

ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌  

న్యూఢిల్లీ:  కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరుపై ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పారీ్ట(ఆప్‌) జాతీయ కనీ్వనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ భగవాన్‌ శ్రీరాముడు ఇప్పుడు బతికి ఉండి బీజేపీలో చేరకపోతే ఆయన ఇంట్లో సోదాలు చేయడానికి ఈడీ, సీబీఐలను పంపించేవారని అన్నారు.

బీజేపీలో చేరుతావా? లేక జైలుకు వెళ్తావా? అంటూ బీజేపీ పెద్దలు బెదిరించేవారని చెప్పారు. బీజేపీలో చేరకపోతే రాముడికి కచి్చతంగా జైలుశిక్ష పడేదని వ్యాఖ్యానించారు. ఢిల్లీ శాసనసభలో 2024–25 బడ్జెట్‌ను ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టింది. బడ్జెట్‌పై సభలో శనివారం జరిగిన చర్చ సందర్భంగా కేజ్రీవాల్‌ మాట్లాడారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement