Not joining BJP
-
బీజేపీలో చేరకపోతే రాముడికి శిక్ష పడేది
న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరుపై ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పారీ్ట(ఆప్) జాతీయ కనీ్వనర్ అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ భగవాన్ శ్రీరాముడు ఇప్పుడు బతికి ఉండి బీజేపీలో చేరకపోతే ఆయన ఇంట్లో సోదాలు చేయడానికి ఈడీ, సీబీఐలను పంపించేవారని అన్నారు. బీజేపీలో చేరుతావా? లేక జైలుకు వెళ్తావా? అంటూ బీజేపీ పెద్దలు బెదిరించేవారని చెప్పారు. బీజేపీలో చేరకపోతే రాముడికి కచి్చతంగా జైలుశిక్ష పడేదని వ్యాఖ్యానించారు. ఢిల్లీ శాసనసభలో 2024–25 బడ్జెట్‌ను ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టింది. బడ్జెట్‌పై సభలో శనివారం జరిగిన చర్చ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడారు. -
బీజేపీలో చేరడం లేదు
ఎంపీ బీబీ పాటిల్ సాక్షి, హైదరాబాద్: తాను బీజేపీలో చేరతానం టూ వస్తున్న వార్తలను జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ ఖండించారు. మూడున్నరేళ్ల టీఆర్ఎస్ పాలనలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసింద న్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ మాట్లాడు తూ... తాను టీఆర్ఎస్లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. నారాయణ్‌ఖేడ్‌లోని మెగాఫుడ్ పార్క్ భూముల విషయంలో ఎలాంటి అక్రమాలూ జరగలేదని తెలిపారు. భూ బదలాయింపులో తన ప్రమేయం లేదని, తన పేరిట భూములు లేవని చెప్పారు. తన చెల్లెలు కంపెనీ పేరు మీదనే భూములు ఉన్నాయని, కంపెనీ ఎప్పుడో రైతులకు డబ్బులు చెల్లించిందని, ఇప్పుడు మళ్లీ నష్టపరిహారం కావా లని కోరుతున్నారని పేర్కొన్నారు. 700 ఎకరాల వరకు భూమి ఉంటుందని, రైతులకు అన్యాయం జరిగిన పక్షంలో వారికి న్యాయం చేస్తానన్నారు.