కోల్‌కతా: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)అధికారులపై దాడి కేసులో బహిష్కృత టీఎంసీ నేత షాజహాన్ షేక్ ఇల్లు, ఆఫీసుల్లో సీబీఐ అధికారులు శుక్రవారం సోదాలు జరిపారు. దాడికి సంబంధించిన ఆధారాల కోసం ఉత్తర 24 పరగణాల జిల్లా సందేశ్‌ఖాలిలోని షాజహాన్ షేక్ నివాసం సమీప ప్రాంతాలను కూడా పరిశీలించారు. రేషన్ పంపిణీ కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా జనవరి 5వ తేదీన షాజహాన్ షేక్ ఇంట్లో సోదాలకు వెళ్లిన 14 మంది అధికారుల బృందంపై దాడి జరిగిన విషయం తెలిసిందే.
ఈ దాడిలో సీబీకి చెందిన ఆరుగురు, సెంట్రల్ ఫోరెన్సిక్ నిపుణులు ఆరుగురు, ఈడీ అధికారులు ఇద్దరు గాయపడ్డారు. ఘటనతో సంబంధముందన్న ఆరోపణలపై టీఎంసీ నుంచి షాజహాన్ షేక్ సస్పెండయ్యాడు. హైకోర్టు క్లియరెన్స్ ఇవ్వడంతో గురువారం షాజహాన్ షేక్‌ను అదుపులోకి తీసుకున్న సీబీఐ అధికారులు, సందేశ్‌ఖాలిలోని అతడి నివాసం, కార్యాలయాలకు సీల్ వేశారు.
Comments
Please login to add a commentAdd a comment