child pornography
-
గుడ్ వాచ్... బ్యాడ్ వాచ్
బోలెడన్ని డబ్బులు పోసి మనసుకు నచ్చిన స్మార్ట్ ఫోన్, ల్యాప్‌ట్యాప్ వంటి డిజిటల్ వస్తువులు కొనుక్కుంటాం. కానీ, వాటిలో నచ్చినవన్నీ చూసేస్తాం అనుకోవడానికి లేదు. పిల్లల అశ్లీల వీడియోలు చూసినా, వాటిని షేర్ చేసినా, స్టోర్ చేసుకున్నా ..జైలుకెళ్ళాల్సిందే అంటోంది సుప్రీం కోర్టు. అందుకని ఇకపైన నా ఫోన్ నా ఇష్టం అంటే విషయం ఎక్కడకు వరకు వెళుతుందో. ఇంటి కోర్టులోనే డిజిటల్లో గుడ్ వాచ్.. బ్యాడ్ వాచ్ గురించి అవగాహన కలిగి ఉండటం ముఖ్యం అంటున్నారు నిపుణులు.డిజిటల్లో అశ్లీల వీడియోలు కుప్పలు తెప్పలుగా చాపకింద నీరులా చేరుతుంటాయి. మీ డివైజ్‌లో పిల్లలకు సంబంధించిన అశ్లీల వీడియోలు, అశ్లీల సమాచారం ఉన్నా, వాటిని ఎవరైనా షేర్ చేసినా ఇక నుంచి క్రిమినల్ నేరంగా పరిగణించబడుతుంది. ఈ విషయాన్ని ఇటీవల భారతదేశంలోని అత్యున్నత న్యాయస్థానం చట్టంగా తీసుకొచ్చి, కొరడా ఝలిపించింది. నేరాన్ని ప్రేరేపించే చర్యలను కట్టడి చేయడానికి న్యాయశాస్త్రంలో ‘ఇంకోట్ క్రైమ్’ సిద్ధాంతం ప్రాముఖ్యతను సుప్రీం కోర్టు నొక్కి చెప్పింది.నేరాన్ని ప్రేరేపించేవే! పిల్లలకు సంబంధించిన అశ్లీల వీడియోలు, చిత్రాలు, కంటెంట్ ఎవరి దగ్గర ఉన్నా దాని వెనుక గల చెడు ఉద్దేశ్యం ఒకటే. ప్రేరేపిత నేరాలు తదుపరి నేరానికి సిద్ధమయ్యే క్రిమినల్ చర్యలుగా కోర్టు దీనిని నిర్వచించింది. కంటెంట్ అసలు ప్రసారం అయ్యిందా, లేదా అనే దానితో కూడా సంబంధం లేకుండా శిక్షార్హులే అని కోర్టు స్పష్టం చేసింది.కఠిన శిక్షలు తప్పవుపిల్లల అశ్లీల వీడియోలు, చిత్రాలు వంటివి తమ డివైజ్‌లో ఏవి స్టోర్ చేసుకున్నా వాటిని స్వాధీనం చేసుకోవడంతో ΄ాటు లైంగిక నేరాల నుండి పిల్లలను రక్షించే పోక్సోలోని సెక్షన్ 15 కింద జరిమానా లేదా శిక్ష లేదా రెండూ విధించాలని నిర్ణయించింది. ఉపవిభాగాలు (1), (2), (3)లో చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన వివిధ నేరాలకు శిక్షలు, నేరం స్వభావాన్ని బట్టి జరిమానాల నుండి జైలు శిక్ష వరకు ఏ విధంగా ఉంటాయో వివరించింది.వివిధ రకాల శిక్షలు ⇒పిల్లల పోర్న్‌కు సంబంధించిన డిజిటల్ స్టోరేజ్ స్వాధీనం చేసుకుంటే సెక్షన్ 15 (1) కింద కనీసం రూ. 5,000 నుంచి రూ. 10,000 వరకు జరిమానా ఉంటుంది. ⇒పిల్లల అశ్లీల విషయాలను వ్యాప్తి చేస్తే సెక్షన్ 15 (2) ప్రకారం మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ ఉంటాయి.⇒వాణిజ్య లాభాల కోసం పిల్లల పోర్న్ కంటెంట్‌ను ఉపయోగిస్తే సెక్షన్ 15 (3) కింద మొదటిసారి నేరం చేసిన వారికి మూడు సంవత్సరాల నుండి ఐదు సంవత్సరాల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ ఉంటాయి. ⇒పునరావృతం చేసే నేరాలకు జరిమానాతో ΄ాటు ఐదేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చు.డిజిటల్ అక్షరాస్యత అవసరంఅన్ని వయసుల వారూ ఫోన్‌ని ఉపయోగించే వెసులుబాటు మన దగ్గర ఉంది. కానీ, ఆన్లైన్లో ‘ఏం చూస్తున్నాం, జాగ్రత్తగా ఎలా ఉండాలి’ అనే అవగాహన లేదు. పక్కనవాళ్లు చూస్తున్నారు కదా అని మనం కూడా ‘పియర్ క్యూరియాసిటీ’తో వీడియోలను షేర్ చేసుకొని మరీ చూస్తుంటారు. స్వీయ వినోదం కోసం చెత్తను పోగేసుకుంటూ ఉంటారు. దీనికి కారణం డిజిటల్ అక్షరాస్యత లేకపోవడమే. ఆఫ్‌లైన్‌లో అంటే సమాజంలో ఎలాంటి మర్యాదలు ΄ాటిస్తున్నారో, ఆన్లైన్లో కూడా అంతే మర్యాదగా ఉండాలనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. పోస్ట్ చేసే కంటెంట్ విషయంలోనూ కంట్రోల్ లేకపోవడం, వెరిఫికేషన్ చెక్ చేసుకకోపోతే సమస్యలు కొని తెచ్చుకున్నట్టే.వయసుల వారీగా అవగాహనపిల్లలు, యువత డిజిటల్లో ఏం చూస్తున్నారు, ఏం చేస్తున్నారో పెద్దలు తప్పక తెలుసుకోవాలి. చట్టపరంగా వచ్చిన మార్పుల గురించీ వారికి అవగాహన కల్పిస్తూ ఉండాలి. పిల్లలు డిజిటల్‌ను వాడుతుంటే వారి వయసును బట్టి పేరెంటల్ కంట్రోల్స్ కీ లను ఉపయోగించాలి. బ్రౌజింగ్, యాప్స్... వంటివన్నీ సేఫ్ మెథడ్స్‌లో ఉంచాలి. సాధారణంగా పిల్లలకు గుడ్‌టచ్–బ్యాడ్ టచ్ ఏ విధంగా చెబుతుంటారో డిజిటల్ పరంగా గుడ్ వాచ్–బ్యాడ్ వాచ్ గురించి కూడా తెలియజేయాలి. పిల్లలు ఏదైనా షేర్ చేస్తుంటే వారు పోస్ట్ చేసే కంటెంట్‌పైన మానిటరింగ్ ఉండాలి. స్కూళ్లలోనూ వయసు పరంగా అవగాహన తరగుతలను నిర్వహించాలి. టీనేజ్ స్థాయి నుంచి వయసులవారీగా మెంటల్ హెల్త్ ద్వారా కౌన్సెలింగ్స్ ఇస్తూ నివారణో΄ాయాలు సూచించాలి. ఎవరి దగ్గరైనా చైల్డ్ పోర్న్ ఉన్నా, షేర్ చేస్తున్నా .. వారి గురించి పోలీసులకు లేదంటే జ్టి్టpట://ఛిyb్ఛటఛిటజీఝ్ఛ.జౌఠి.జీn లో కంప్లైంట్ చేయచ్చు. – అనీల్ రాచమల్ల, సైబర్ సేఫ్టీ నిపుణులు, ఎండ్ నౌ ఫౌండేషన్ -
బాలలకు సుప్రీమ్ రక్షణ!
భారత సర్వోన్నత న్యాయస్థానం సోమవారం చరిత్రాత్మకమైన తీర్పునిచ్చింది. మద్రాస్ హైకోర్ట్ గతంలో చేసిన తప్పును సరిదిద్దింది. బాలలపై లైంగిక అకృత్య, అశ్లీల దృశ్యాల వీడియోలను డౌన్ లోడ్ చేసినా, కలిగివున్నా, చివరకు చూసినా, సదరు అంశాలపై నిర్ణీత అధికారులకు ఫిర్యాదు చేయకున్నా కూడా పోక్సో, ఐటీ చట్టాల కింద నేరమేనని కుండబద్దలు కొట్టింది. దాదాపు 200 పేజీల తాజా తీర్పుతో బాలలపై లైంగిక అత్యాచారాలను నిరోధించేలా ‘లైంగిక అకృత్యాల నుంచి బాలలకు రక్షణ’ (పోక్సో) చట్టానికి పదును పెట్టింది. పసిపాపల నుంచి ఎదిగిన మైనర్ల వరకు బాలలందరి పైనా దేశంలో అంతకంతకూ అఘాయిత్యాలు పెరుగుతున్న వేళ రానున్న రోజుల్లో ఈ తీర్పు బలమైన ప్రభావం చూపనుంది. ఇంటా బయటా ప్రతిచోటా కామాంధుల బెడద పెచ్చరిల్లిన సమయంలో ఈ సుప్రీమ్ తీర్పు భారతదేశంలోని బాలబాలికలకు భారీ ఊరట, బలమైన అండ. తాజా సుప్రీమ్ కోర్ట్ ఆదేశంతో చైల్డ్ పోర్నోగ్రఫీ సమాచారాన్ని ‘కలిగి ఉండడం’ అనే పదం తాలూకు నిర్వచన పరిధి పెరిగింది. అలాంటి దృశ్యాలను డౌన్లోడ్ చేయకున్నా, పరికరంలో పదిలపరుచుకోకపోయినా... కేవలం చూసినా సరే ఇప్పుడది పోక్సోలోని సెక్షన్ 15 కింద నేరమే అవుతుంది. ఇది కేవలం సాంకేతికపరమైన అంశం కానే కాదు... తీవ్రమైన నేరం. నిజానికి, చైల్డ్ పోర్న్ దృశ్యాల తయారీ, పంపిణీయే నేరమనీ, ఎలక్ట్రానిక్ పరికరాల్లో డౌన్లోడ్ చేసి ప్రైవేటుగా చూసినంత మాత్రాన అది నేరం కిందకు రాదనీ ఆ మధ్య మద్రాస్ హైకోర్ట్ తీర్పునిచ్చింది. మొబైల్లో డౌన్లోడ్ చేసి చూసిన ఓ చెన్నై కుర్రాడిపై నేర విచారణను జనవరి 11న రద్దు చేసింది. దీని వల్ల బాలల సంక్షేమంపై దుష్ప్రభావం పడుతుందని తప్పుబడుతూ వివిధ స్వచ్ఛంద సంస్థల సమాహారమైన ‘జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అలయన్స్’ సుప్రీమ్ గడప తొక్కింది. సింగిల్ జడ్జి ఇచ్చిన సదరు తీర్పు ‘ఘోరమైనది’ అంటూ మార్చిలోనే సుప్రీమ్ తప్పుబట్టింది. మద్రాస్ హైకోర్ట్ తీర్పు ‘అసాధారణ∙తప్పు’ అని సుప్రీమ్ తన తాజా ఆదేశంలో వ్యాఖ్యానించడం గమనార్హం.సుప్రీమ్ తన తాజా ఆదేశంతో ఆ పాత మద్రాస్ హైకోర్ట్ తీర్పును తోసిపుచ్చినట్టయింది. అదే సమయంలో ‘చైల్డ్ పోర్నోగ్రఫీ’ అనే పదం నేరాన్ని తేలిక చేస్తున్నట్టు ఉందని భావించింది. ఆ పదాన్ని పరిహరించి, దాని బదులు ‘బాలలపై లైంగిక అకృత్యాలు, దాడుల సమాచారం’ (సీఎస్ఈ ఏఎమ్) అనే పదాన్ని సంబంధిత చట్టాలన్నిటిలో వాడేలా పార్లమెంట్ ఆర్డినెన్స్ తీసుకురావాలని అభ్యర్థించడం విశేషం. ఇకపై న్యాయస్థానాలన్నీ తమ ఆదేశాలు, తీర్పుల్లో ఈ పదాన్నే వాడాలని కూడా సుప్రీమ్ పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్, మరో న్యాయమూర్తి జస్టిస్ పార్దీవాలాలతో కూడిన సుప్రీమ్ ధర్మాసనం ఇచ్చిన ఆదేశం, చేసిన అభ్యర్థన ఆలోచించదగినది, స్వాగతించవలసినది. గమనిస్తే, సమస్యంతా చట్టాలలోని అంశాలకు కొన్ని కోర్టులు సంకుచిత అంతరార్థాలు తీయడంతో వస్తోంది. మద్రాస్ హైకోర్ట్‌లోనూ జరిగింది అదే. తద్వారా బాలలపై సైబర్ నేరాలకు పాల్పడినవారిని శిక్షించడానికి ఉద్దేశించిన చట్టాల ప్రయోజనమే దెబ్బతింటోంది. అందుకే, ఈ విషయంలో కోర్టులు జాగరూకతతో ఉండాలని సుప్రీమ్ ఇప్పుడు చెప్పాల్సి వచ్చింది. గణాంకాలు గమనిస్తే, దేశంలో బాలలపై అకృత్యాలు అంతకంతకూ అధికమవుతున్నాయి. ఒక్క 2022లోనే వాటి సంఖ్య 8.7 శాతం పెరిగింది. అలాంటి ఘటనలు 1.68 లక్షలకు చేరినట్టు జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్సీఆర్బీ) మాట. పసివారిపై అఘాయిత్యాలు జరిగినప్పటికీ భయం, సమాజంలో పడే కళంకం, అవగాహన లేమితో ఇంకా అనేక కేసులు వెలుగులోకి రావట్లేదు. పైగా, ఇంట్లో అయినవాళ్ళు, బడిలో ఉద్యోగులు సైతం సాగిస్తున్న ఈ అమానుషాలు పిల్లల మనసులపై జీవితాంతం ప్రభావం చూపుతున్నాయి. పెరిగి పెద్దయినా సరే వారిని ఆ చేదు అనుభవాల నుంచి మానసికంగా బయట పడనీయకుండా చేస్తున్నాయి. వీటన్నిటినీ అరికట్టడానికే 2012లోనే పోక్సో లాంటి కఠినచట్టాలు వచ్చాయి. అయినా, బాలలపై అత్యాచారాలు ఆగక పోవడం విషాదం. సదరు కేసులు పెరుగుతున్నందున ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టాలంటూ అయిదేళ్ళ క్రితమే సుప్రీమ్ ఆదేశించింది. అయితే, రెగ్యులర్ కోర్ట్లకే జడ్జీలు కరవైన పరిస్థితుల్లో ఇక ఈ ఫాస్ట్ట్రాక్ల కథేమిటో ప్రత్యేకించి చెప్పనక్కర లేదు. దానికి తోడు చట్టంలోని కఠిన అంశాలకు ఒక్కో హైకోర్ట్ ఒక్కో రకం అర్థం చెబుతూ, వ్యాఖ్యానం చెప్పడం పెను సమస్యయి కూర్చుంది. తాజా తీర్పుతో ఆ పరిస్థితులు కొంతవరకు మారతాయని ఆశించాలి. చట్టాన్ని అతిక్రమిస్తున్న వారికి మేలుకొలుపు. అదే సమయంలో అది అందరికీ స్పష్టమైన సందేశం ఇస్తోంది. అదేమిటంటే – బాలల భద్రత అతి ముఖ్యమైనది! వారి భద్రత కోసమే కోర్టు చట్టానికి మరింత కఠినమైన, కట్టుదిట్టమైన వ్యాఖ్యానం అందించింది. ఇక యూ ట్యూబ్ – గూగుల్ లాంటి వేదికలు, చట్టాన్ని అమలు చేసే వ్యవస్థలు, నిత్యం ఇంటర్నెట్ వాడేవారు అప్రమత్తంగా ఉండక తప్పదు. అలాంటి కంటెంట్‌ను తక్షణం తొలగించడం, పోలీసులకు ఫిర్యాదు చేయడమే మార్గం. అదే సమయంలో విద్యాలయాల్లో లైంగిక విజ్ఞానాన్ని సమగ్రంగా బోధించి, పిల్లల్లో అవగాహన కల్పించాలంటూ ప్రభుత్వానికి సుప్రీమ్ చేసిన సూచన విలువైనది. బిడియపడకుండా తల్లితండ్రులు, గురువులు పిల్ల లకు విషయాలను వివరించడం మేలు. శారీరకంగా, సామా జికంగా, చట్టపరంగా అవగాహన పెరి గితే అకృత్యాల్ని అడ్డుకోవడం సులభమవుతుంది. ఇలాంటి కేసులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదన్న సంకేతం సుప్రీమ్ తాజా తీర్పు అందించడం అన్ని విధాలా ఆహ్వానించదగ్గ పరిణామం. -
చైల్డ్ పోర్న్ చూసినా, వీడియోలున్నా... తీవ్ర నేరమే!
న్యూఢిల్లీ: చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించి సుప్రీంకోర్టు సోమవారం చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. లైంగిక వేధింపుల బారి నుంచి బాలలకు భద్రత కలి్పంచే పోక్సో చట్టం ప్రకారం ఆ వీడియోలను వ్యాప్తి చేయడం మాత్రమే నేరమన్న వాదన సరికాదని స్పష్టం చేసింది. ‘‘ఆ వీడియోలను కలిగి ఉండటం, డౌన్లోడ్ చేయడంతో పాటు ఆన్లైన్లో గానీ ఇతరత్రా గానీ వాటిని చూడటం కూడా పోక్సో, ఐటీ చట్టాల ప్రకారం కచ్చితంగా నేరమే. ఇవి ‘ఆరంభ నేరం’ కిందకే వస్తాయి’’ అని పోక్సో చట్టం సెక్షన్ 15లోని 1, 2, 3 సబ్ సెక్షన్లను, ఐటీ చట్టంలోని సెక్షన్ 67బిని ఉటంకిస్తూ పేర్కొంది. చైల్డ్ పోర్నోగ్రఫీని చూడటం, డౌన్లోడ్ చేయడం నేరం కాదన్న మద్రాస్ హైకోర్టు తీర్పును ఘోర తప్పిదంగా సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ జె.బి.పార్డీవాలా ధర్మాసనం అభివరి్ణంచింది. తన మొబైల్లో చైల్డ్ పోర్నో వీడియోలున్న ఓ 28 ఏళ్ల వ్యక్తిని నిర్దోíÙగా పేర్కొంటూ జనవరి 11న హైకోర్టు ఇచి్చన తీర్పును కొట్టేస్తున్నట్టు పేర్కొంది. అతనిపై నేరాభియోగాలను పునరుద్ధరించాల్సిందిగా తిరువళ్లువర్ జిల్లా ఫాస్ట్ ట్రాక్ సెషన్స్ కోర్టును ఆదేశించింది. ‘‘బాలలపై లైంగిక వేధింపులు అత్యంత ఆందోళనకరమైన అంశం. సమాజంలో లోతుల దాకా వేళ్లూనుకుపోయిన ఈ పెను జాఢ్యం ఏ ఒక్క ప్రాంతానికో, దేశానికో పరిమితం కాదు. ప్రపంచవ్యాప్త సమస్య’’ అంటూ ఆవేదన వెలిబుచి్చంది. దీని నిర్మూలనకు చేపట్టాల్సిన చర్యలకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ధర్మాసనం పలు సూచనలు చేసింది. ‘‘న్యాయపరమైన ఉత్తర్వులు, తీర్పుల్లో ఇకపై చైల్డ్ పోర్నోగ్రఫీ అనే పదాన్ని వాడొద్దు. దానికి బదులు సదరు నేరాలను మరింత నిర్దుష్టంగా పేర్కొనేలా ‘చైల్డ్ సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేటివ్ అండ్ అబ్యూజ్ మెటీరియల్ (సీఎస్ఈఏఎం)’ అని మాత్రమే వాడాలి’’ అని అన్ని కోర్టులనూ ఆదేశించింది. పోక్సో చట్టానికి ఈ మేరకు సవరణ చేసే అంశాన్ని పరిశీలించాలని పార్లమెంటుకు సూచించింది. ఆలోపుగా కేంద్రం ఈ మేరకు ఆర్డినెన్స్ జారీ చేయాలని పేర్కొంది. బాలలపై లైంగిక వేధింపుల సమస్యను రూపుమాపడంలో ప్రపంచ దేశాలన్నింటికీ ఈ తీర్పు మార్గదర్శకం కాగలదంటూ న్యాయ వర్గాలు హర్షం వెలిబుచ్చాయి. తీర్పులో ముఖ్యాంశాలు → చైల్డ్ పోర్నో మెటీరియల్ బాలల భద్రతకు పెను ముప్పు. బాలలను లైంగిక అవసరాలు తీర్చుకునే బొమ్మలుగా అది చిత్రిస్తుంది. ఫలితంగా జరగరానిది జరిగితే బాధితుల లేత మనసులపై అది ఎన్నటికీ చెరిగిపోని గాయం చేస్తుంది. → విద్యార్థులకు సమగ్ర లైంగిక విద్యా బోధన కార్యక్రమాలను అమలు చేయాలి. ఆరోగ్యకరమైన సంబంధాలు, సరైన ప్రవర్తన వంటివాటిలపై అవగాహన కలిగించాలి. → విద్యార్థులు మొదలుకుని సాధారణ ప్రజల దాకా అన్ని స్థాయిల్లోనూ లైంగిక విద్య, అవగాహన కార్యక్రమాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలి. → చట్టపరమైన పర్యవసానాలను విస్తృతంగా ప్రచారం చేయాలి. తద్వారా వాటి వ్యాప్తికి అడ్డుకట్ట వేయవచ్చు. ఆ నేరాలకు పాల్పడేందుకు వెనకాడేలా చేయవచ్చు. → నేరానికి సంబంధించి బాలల నుంచి సాక్ష్యాల సేకరణ, దర్యాప్తు, విచారణ తదితర ప్రక్రియ వీలైనంత సున్నితంగా జరిగేలా చూడాలి. తద్వారా వారి మనసులు మరింత గాయపడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలి.లైంగిక విద్య అత్యవసరం బాలలపై లైంగిక నేరాలు తగ్గాలంటే లైంగిక విద్య, లైంగిక ఆరోగ్యం గురించి ప్రజల్లో విస్తృత అవగాహన అవసరమని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. దురదృష్టవశాత్తూ దీనిపై భారత సమాజంలో తీవ్ర అపోహలు నెలకొని ఉన్నాయంటూ జస్టిస్ పార్డీవాలా ఆవేదన వెలిబుచ్చారు. ధర్మాసనం తరఫున 200 పేజీల తీర్పును ఆయనే రాశారు. ‘‘లైంగిక విద్యను పాశ్చాత్య భావనగా, మన సంప్రదాయ విలువలను దిగజార్చేదిగా భారత సమాజం భావిస్తుంది. దాంతో స్కూళ్లలో లైంగిక విద్యపై వ్యతిరేకత నెలకొని ఉంది. దానిపై పలు రాష్ట్రాల్లో నిషేధమే ఉంది!’’ అని పేర్కొన్నారు. ‘‘సెక్స్, సంబంధిత విషయాలను పిల్లలతో చర్చించడాన్ని ఇబ్బందికరంగా మాత్రమే గాక ఘోర అపరాధంగా, అనైతికంగా మనవాళ్లు చూస్తారు. వాటివల్ల ఎదిగే వయసులో విచ్చలవిడి లైంగిక ధోరణులు తలెత్తుతాయన్న అపోహ వ్యాప్తిలో ఉంది. తల్లిదండ్రులు, పెద్దల్లోనే గాక విద్యావేత్తల్లో కూడా ఈ తిరోగమన ధోరణి నెలకొని ఉండటం దారుణం. దీంతో ఎదిగే పిల్లల్లో లైంగికపరమైన అవగాహన లోపిస్తోంది. అందుకే టీనేజర్లు ఇంటర్నెట్లో సులువుగా అందుబాటులో ఉన్న సెక్సువల్ కంటెంట్‌కు ఇట్టే ఆకర్షితులవుతున్నారు. ఎలాంటి నియంత్రణా, వడపోతా లేని ఆ విచ్చలవిడి కంటెంట్ వారిని తప్పుదోవ పట్టించడమే గాక అనారోగ్యకరమైన లైంగిక ప్రవర్తనకు, లైంగిక నేరా లకు పురిగొల్పుతోంది’’ అంటూ ధర్మాసనం ఆందోళన వెలిబుచ్చింది. ‘‘కను క ఈ విషయమై ముందు పెద్దలను చైతన్యవంతులను చేయడం చాలా ముఖ్యం. సమగ్ర లైంగిక విద్య, అవగాహన బాల లకు ఎంత ముఖ్యమో వారికి అర్థమయ్యేలా చేయాలి. చైల్డ్ పోర్నోగ్రఫీ వీక్షణ, వ్యాప్తి, లైంగిక హింస వంటివాటి చట్టపరమైన పరిణామాలను కూడా అర్థం చేసుకుంటారు. కనుక వాటికి దూరంగా ఉంటారు. పరిశోధనల్లో రుజువైన వాస్తవాలివి. మన దేశంలో సమగ్ర లైంగిక విద్య అవసరం చాలా ఉందని అవి తేల్చాయి’’ అని పేర్కొంది. -
ఆ వీడియోలు చూడటం పోక్సో కింద నేరం..
-
చైల్డ్‌పోర్నోగ్రఫీ వీక్షణ ముమ్మాటికీ నేరమే: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: చైల్డ్ పోర్నోగ్రఫీ వీక్షణ నేరమా? కాదా? అనే అంశంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. అదేం నేరం కాదని గతంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేస్తూ.. ముమ్మాటికీ నేరమేనంటూ సీజేఐ ధర్మాసనం సోమవారం తుది తీర్పు వెల్లడించింది. పోక్సో చట్టం సెక్షన్ 15 ప్రకారం.. చైల్డ్ పోర్నోగ్రఫీ మెటీరియల్‌ను(ఫొటోలు, వీడియోలు) వీక్షించడం మాత్రమే కాదు నిల్వ చేసుకోవడం కూడా నేరమే అని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ఈ క్రమంలో గతంలో మద్రాస్ హైకోర్టు తీర్పును తీవ్ర తప్పిదంగా పేర్కొంటూ.. దాన్ని పక్కన పెట్టేసింది. అలాగే ఈ కేసులో నిందితుడికి ఇచ్చిన ఊరటను ఎత్తేస్తూ.. క్రిమినల్ ప్రాసిక్యూషన్ కొనసాగించాలని స్పష్టం చేసింది. పనిలో పనిగా.. కోర్టులు కూడా చైల్డ్ పోర్నోగ్రఫీ అనే పదాన్ని ఉపయోగించొద్దు అని సుప్రీం కోర్టు సూచించింది. కేసు ఏంటంటే..తమిళనాడుకు చెందిన 28ఏళ్ల యువకుడు ఛైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలను డౌన్లోడ్ చేసుకుని వీక్షించాడన్న అభియోగాలపై క్రిమినల్ చర్యలను నిలిపివేస్తూ మద్రాస్ హైకోర్టు ఈ ఏడాది జనవరి 11వ తేదీన సంచలన తీర్పు వెల్లడించింది. అతను కేవలం వీడియోలు కేవలం చూసాడని,ఇతరులకు పంపలేదని పేర్కొంది. ఐటీ యాక్ట్ సెక్షన్ 67బీ కింద అతని చర్య నేరం కాదని స్పష్టం చేసింది. అలాగే.. పోక్సో, ఐటీ చట్టాల ప్రకారం.. ఛైల్డ్ పోర్నోగ్రఫీని చూడటం తప్పేమీ కాదంటూ జస్టిస్ ఎన్ ఆనంద్ వెంకటేష్ వ్యాఖ్యానించారు. అదే సమయంలో.. ఇలాంటి కేసుల్లో శిక్షించే బదులు, వారికి సరైన మార్గం చూపడం ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే.. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఫరీబాద్కు చెందిన జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అలయెన్, ఢిల్లీకి చెందిన బచ్పన్ బచావో ఆందోళన్ అనే ఎన్జీవోలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. మద్రాస్ హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలా,జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఏప్రిల్‌లో వాదనలు ముగించి.. తీర్పును రిజర్వ్ చేసింది. అయితే విచారణ సందర్భంలోనే.. మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును తీవ్రంగా తప్పుబట్టింది. పోక్సో, ఐటీ చట్టాల ప్రకారం చైల్డ్ పోర్నోగ్రఫీ నేరమేనని గతంలో పలు సందర్భాల్లో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. మరోవైపు.. ఈ ఏడాది జులైలో కర్ణాటక హైకోర్టు సైతం చైల్డ్ పోర్నోగ్రఫీ చూడడం ఐటీ యాక్ట్ కింద నేరం కాదని తెలిపింది. అయితే రెండు వారాలు తిరగకముందే ఆ తీర్పును రీకాల్ చేస్తూ మరో తీర్పు ఇచ్చింది.ఇదీ చదవండి: జడ్జిల్లారా.. జాగ్రత్త! అన్ని కళ్లు మన మీదే!! -
చైల్డ్ పోర్నోగ్రఫీపై ఆ తీర్పు దుర్మార్గం: సుప్రీం
న్యూఢిల్లీ: చైల్డ్ పోర్నోగ్రఫీని డౌన్లోడ్ చేయడం, చూడటం నేరం కాదంటూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు దుర్మార్గంగా అభివర్ణించింది. ఆ తీర్పుపై విచారణ జరిపేందుకు అంగీకరించింది. చెన్నైకి చెందిన ఎస్.హరీశ్(28) పిల్లలతో కూడిన పోర్నోగ్రఫీ కంటెంట్‌ను తన సెల్ఫోన్లో డౌన్లోడ్ చేసుకున్నాడంటూ పోలీసులు కేసు పెట్టారు. దీనిపై హరీశ్ మద్రాస్ హైకోర్టుకు వెళ్లాడు. విచారణ చేపట్టిన ఏకసభ్య ధర్మాసనం పోక్సో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టాల ప్రకారం చైల్డ్ పోర్నోగ్రఫీ కంటెంట్‌ను డౌన్లోడ్ చేయడం, చూడటం నేరం కాదని పేర్కొంటూ జనవరి 11వ తేదీన తీర్పు వెలువరించింది. దీనిని సవాల్ చేస్తూ ఫరీబాద్కు చెందిన జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అలయెన్, ఢిల్లీకి చెందిన బచ్పన్ బచావో ఆందోళన్ అనే ఎన్జీవోలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం పిటిషన్‌పై విచారణ చేపట్టింది. హైకోర్టు తీర్పు చట్టాలకు వ్యతిరేకం, దుర్మార్గమని పేర్కొంది. ఏకసభ్య ధర్మాసనం ఇలాంటి తీర్పు ఎలా ఇవ్వగలదని ప్రశ్నించింది. -
చైల్డ్ పోర్నోగ్రఫీ నిందితుడు అరెస్టు
అన్నమయ్య : చైల్డ్ పోర్నొగ్రఫీ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. వాల్మీకిపురం సీఐ బీఎన్ సురేష్ కథనం మేరకు... 18 సంవత్సరాల లోపు వయస్సు గల అమ్మాయిలు, అబ్బాయిలు కొన్ని అశ్లీల వీడియాలను చూసిన, ఇతరులకు పంపిన సమాచారంపై నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎంక్సాప్లెయిటెడ్ చిల్డ్రన్(ఎన్సీఎంసీ) వారి నుంచి అందిన సమాచారం మేరకు అన్నమయ్య జిల్లా ఎస్పీ గంగాధర్ రావు ఆదేశాలతో మే నెల 2న కలికిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కలికిరి పట్టణ పరిధిలోని గిరిజన కాలనికి చెందిన బండి బాలాజీ(27)ని నిందితుడుగా గుర్తించిన పోలీసులు శుక్రవారం సాయంత్రం మండలంలోని మేడికుర్తి క్రాస్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితున్ని జుడీషియల్ కస్టిడీకి తరలిస్తున్నట్లు సీఐ తెలిపారు. కేసులో చురుగ్గా వ్యవహరించిన సీఐ, ఏఎస్ఐ మధుసూదనాచారి, హెడ్‌కానిస్టేబుల్ మనోహర్, పీసీలు మునిరత్నం, రామాంజులు, సతీష్, అమరనాథ్, హోంగార్డు నిజాముద్దీన్లను ఎస్సీ, డీఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో ఎస్ఐ రహీముల్లా, సిబ్బంది పాల్గొన్నారు. -
చైల్డ్ పోర్నోగ్రఫీ కేసు.. 59 చోట్ల సీబీఐ దాడులు
న్యూఢిల్లీ: ఆపరేషన్ ‘మేఘ చక్ర’లో భాగంగా సీబీఐ శనివారం దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 59 చోట్ల సోదాలు జరిపింది. చిన్నారులపై లైంగిక వేధింపుల మెటీరియల్ (సీఎస్ఏఎం)పై నమోదైన రెండు కేసుల దర్యాప్తు భాగంగా ఈ దాడులు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. గత ఏడాది చేపట్టిన ఆపరేషన్ ‘కార్బన్’ ద్వారా సేకరించిన సమాచారం, సింగపూర్‌లోని ఇంటర్‌పోల్ కార్యాలయం అందించిన వివరాల మేరకు సీఎస్ఏఎం పంపిణీ దారుల క్లౌడ్ స్టోరేజీ కేంద్రాల్లో సోదాలు చేపట్టింది. ఈ పంపిణీదారులు బాలలపై అసభ్యకరంగా చిత్రీకరించిన వీడియోలను ఆన్లైన్లో ఉంచి డబ్బు సంపాదిస్తున్నట్లు సీబీఐ వర్గాలు పేర్కొన్నాయి. అనుమానితుల నుంచి స్వాధీనం చేసుకున్న అశ్లీల వీడియోలున్న ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి వివరాలు తెలుసుకుని బాధితులు, బాధ్యులను గుర్తిస్తామని అధికార వర్గాలు తెలిపాయి. -
ఆపరేషన్ ‘మేఘ్‌చక్ర': 50 మంది అనుమానితులు అరెస్టు
సాక్షి, న్యూఢిల్లీ: లైంగిక వేధింపుల కంటెంట్‌తో మైనర్లపై బ్లాక్‌మెయిల్‌కు దిగుతున్న ముఠాల పని పట్టేందుకు ఆపరేషన్ ‘మేఘ్‌చక్ర’తో సీబీఐ శనివారం మెరుపుదాడులు నిర్వహించింది. దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాల్లో 59 ప్రదేశాల్లో దాడులు జరిపింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణ, చిత్తూరు జిల్లాల్లో అధికారులు తనిఖీలు చేశారు. తెలంగాణలో హైదరాబాద్‌లో విస్తృత సోదాలు నిర్వహించారు. న్యూజీల్యాండ్‌లోని ఇంటర్‌పోల్ యూనిట్ సమాచారంతో సీబీఐ అధికారులు ఈ ఆపరేషన్ నిర్వహించారు. క్లౌడ్ స్టోరేజిని ఉపయోగిస్తూ చైల్డ్ పోర్నోగ్రఫీ కంటెంట్‌ను సర్క్యులేట్ చేస్తున్న నిందితులను గుర్తించారు. దాడుల్లో 50 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. భారీ ఎత్తున ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. బాలలపై జరుగుతున్న లైంగిక హింస, వీడియో చిత్రీకరణపై విచారణ బాధితులను గుర్తించేందుకు సీబీఐ ప్రత్యేక నిఘా పెట్టింది. చదవండి: దారుణం.. ఉపాధ్యాయుడిపై పదో తరగతి విద్యార్థి కాల్పులు -
అశ్లీలం.. విశృంఖలం!.. ఇంటర్నెట్లో రాజ్యమేలుతున్న పోర్న్ వెబ్సైట్లు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్... మొఘల్‌పుర... కాలాపత్తర్... రామ్‌గోపాల్‌పేట్... కార్ఖానా... ఇలా నగరంలో వరుసగా దారుణాలు వెలుగులు చూస్తున్నాయి. ప్రతి ఉదంతంలోనూ నలిగిపోయింది మాత్రం బాలికలే. జూబ్లీహిల్స్, కార్ఖానా కేసుల్లో నిందితులుగా ఉన్న వారిలో మైనర్లు ఉన్నారు. ఈ పెడ ధోరణి వెనుక పోర్న్ వెబ్సైట్ల ప్రభావం ఎక్కువగానే ఉంటోందని పోలీసులు చెబుతున్నారు. ఇంటర్నెట్లో ఉన్న వీటి సర్వర్లు విదేశాల్లో ఉండటంతో చర్యలకు ఆస్కారం ఉండట్లేదంటున్నారు. నిఘా సంస్థలు సైతం చైల్డ్ పోర్నోగ్రఫీని పరిగణించినంత తీవ్రంగా ఇతర అశ్లీలతను పరిగణించట్లేదు. ‘చేతుల్లోకి’ రావడంతో తేలికైంది.. కొన్నేళ్ల క్రితం అశ్లీల చిత్రాలు చూడాలంటే ప్రత్యేకించి సినిమా థియేటర్లు ఉండేవి. ఆ తర్వాత వీడియో క్యాసెట్లు రూపంలో అందుబాటులోకి రావడంతో వీసీపీ, టీవీ ఉంటేనే వీటిని చూడటానికి ఆస్కారం ఉండేది. కంప్యూటర్, ల్యాప్‌టాప్‌ల వాడకం పెరిగిన తర్వాత నెట్కేఫ్లతో పాటు ఇళ్లల్లోనూ ఈ ‘దృశ్యాలు’ కనిపించడం మొదలైంది. అప్పట్లో ఎదుటి వారు చూస్తారనే భయం, అదే జరిగితే పరువు పోతుందనే ఆందోళన యువతలో ఉండేది. స్పార్ట్‌ఫోన్ యుగం ప్రారంభమైన తర్వాత ఈ పోర్న్ సైట్లన్నీ వాటి నుంచే చూసేందుకు అవకాశం చిక్కింది. ఈ కారణంగానే అనేక మంది యువత పోర్నోగ్రఫీకి బానిసలుగా మారుతున్నారు. ఇలాంటి వారిలో కొందరు అదుపుతప్పి జీవితాన్ని బుగ్గి చేసుకుంటున్నారు. చదవండి: (Hyderabad: బస్‌పాస్ చార్జీలు భారీగా పెంపు?) ఆ సర్వర్లు ఇక్కడ లేకపోవడంతో... పోర్న్ వెబ్సైట్లపై ఫిర్యాదులు వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం వాటిని నిషేధించి బ్లాక్ చేయిస్తోంది. తెలివిమీరిన వీటి నిర్వాహకులు బ్లాక్ అయిన వెబ్సైట్ పేరును పోలిన లేదా దాని చివర 1, 2 లాంటి అంకెలు ఏర్పాటు చేసి మరో సైట్ ప్రారంభిస్తున్నారు. వీటిపై ఫిర్యాదులు అందే వరకు యథేచ్ఛగా ఇంటర్నెట్లో ఉంటున్నాయి. ఈ తరహా వెబ్సైట్లను హోస్ట్ చేస్తున్న సర్వర్లన్నీ విదేశాల్లో ఉన్నవే. ఈ కారణంగానే వరుసగా ఫిర్యాదులు వచ్చిన వెబ్సైట్ల నిర్వాహకుల వివరాలు తెలుసుకోవడానికి, వారిపై చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉండట్లేదు. ఇక్కడి చట్టాలు అక్కడి వారికి పట్టకపోవడంతో నిర్వాహకుల వివరాలు కోరుతూ లేఖలు రాసినా, ఈ– మెయిల్స్ పంపినా వారి నుంచి ఎలాంటి స్పందన ఉండట్లేదు. ఇది పోర్న్ వెబ్‌సైట్స్ నిర్వాహకులకు కలిసి వచ్చే అంశంగా మారింది. దీన్ని అలుసుగా తీసుకుని మరింత రెచ్చిపోతున్నారు. ఆ చర్యలు మిగిలిన వాటిపై లేవు.. ప్రస్తుతం చైల్డ్ పోర్నోగ్రఫీని మాత్రమే తీవ్రమైన అంశంగా పరిగణిస్తున్నారు. దీనిపై ప్రపంచ వ్యాప్తంగా నిషేధమూ కొనసాగుతోంది. ఇంటర్నెట్తో పాటు సోషల్ మీడియాలో సాగుతున్న చైల్డ్ పోర్నోగ్రఫీపై కన్నేసి ఉంచడానికి అమెరికాకు చెందిన యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ అనే స్వచ్ఛంద సంస్థ నేతృత్వంలో నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్‌ప్లాయిటెడ్ చిల్డన్ర్ (ఎన్‌సీఎంఈసీ) పని చేస్తోంది. చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించి ఇంటర్నెట్, సోషల్‌మీడియా వంటి సైబర్ స్పేస్‌లో ఉన్న అంశాలను సీఎంఏఎంగా పరిగణిస్తారు. దీన్ని గుర్తించడానికి ఎంసీఎంఈసీ ప్రత్యేక సాఫ్ట్వేర్లను రూపొందించింది. గూగుల్, యాహూ సహా ఇతర సెర్చ్ ఇంజిన్లు, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్ తదితర సోషల్ మీడియా ఉన్న సీఎస్ఏఎంలను గుర్తించడానికి ఒప్పందాలు కుదుర్చుకుంది. అలాంటి చర్యలు వీటికీ అవసరం.. ఆయా సైబర్ స్పేస్, సోషల్ మీడియాల్లో చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన విషయాలను కనిపెట్టడానికి కొన్ని కీవర్డ్స్‌ను రూపొందించింది. ఫలితంగా ప్రపంచంలో ఎవరైనా ఆయా వేదికలపై సీఎస్ఏఎంకు సంబంధించి ఎవరైనా సెర్చ్ చేసినా, వీక్షించినా, డౌన్లోడ్ చేసినా, అప్లోడ్ చేసినా.. తక్షణం గుర్తించే సాంకేతిక పరిజ్ఞానం వారి వినియోగించిన ఐపీ అడ్రస్‌లను గుర్తిస్తుంది. ఈ సమాచారం స్థానిక పోలీసులకు ఇచ్చి నిందితులను అరెస్టు చేయిస్తుంది. చైల్డ్ పోర్నోగ్రఫీపై ఉన్న మాదిరిగానే ఇతర అశ్లీల అంశాలపైనా చర్యలు అవసరమన్నది నిపుణుల మాట. పోర్న్‌సైట్స్‌ను ఎవరు సెర్చ్ చేసినా చర్యలు తీసుకోవాలని చెబుతున్నారు. దీనిపైనా సుమోటో కేసుల్ని నమోదు చేయాలని ఐటీ యాక్ట్‌లోని సెక్షన్ల ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. -
Hyderabad: సాఫ్ట్వేర్ ఉద్యోగి.. రూ.100కే వెయ్యి చైల్డ్ పోర్న్ వీడియోలతో..
సాక్షి, హైదరాబాద్: సులభంగా డబ్బులు సంపాదించేందుకు అలవాటుపడిన ఓ యువకుడు చైల్డ్ పోర్న్ వీడియోలను సోషల్ మీడియా గ్రూపుల ద్వారా అమ్మకాలు సాగిస్తూ గురువారం పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. నగరంలోని మాదాపూర్‌లో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తోన్న మధుకర్ రెడ్డి స్వస్థలం కరీంనగర్ జిల్లాలోని ఎల్ఎండీ కాలనీ పోలీసుస్టేషన్ పరిధిలోని నుస్తుల్లాపూర్. అయితే సులభమైన డబ్బు సంపాదించేందుకు తన మొబైల్లోని టెలీగ్రామ్ యాప్ ద్వారా పోర్న్‌వెబ్ సైట్ల నుంచి చిన్నారుల అశ్లీల వీడియోలను డౌన్లోడ్ చేసి అదే యాప్ ద్వారా వాటిని రూ.100కు 300 నుంచి 1000 వరకు విక్రయిస్తున్నాడు. ఇక మధుకర్ రెడ్డి క్రియేట్ చేసిన సోషల్ మీడియా గ్రూప్‌లో చేరేందుకు రూ.100 పెట్టి జాయిన్ అవ్వాలని షరతు పెట్టాడు. చదవండి: హైదరాబాద్‌లో వ్యభిచార ముఠా గుట్టురట్టు ఈ పేమెంట్ల కోసం థర్డ్ పార్టీ ద్వారా క్యూ ఆర్ కోడ్ పొంది స్కాన్ అండ్ పేతో డబ్బులు తన అకౌంట్లోకి జమ అయ్యేలా చేసుకున్నాడు. అయితే రాష్ట్రంలోని మహిళలు, చిన్నారుల వేధింపుల నియంత్రణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మహిళలు, చిన్నారుల భద్రతా విభాగం రూపొందించిన సాఫ్ట్వేర్ల ద్వారా ఎస్సై పి.హరీశ్ సైబర్ పెట్రోలింగ్ చేస్తుండగా మధుకర్‌రెడ్డి వ్యవహారాన్ని గుర్తించారు. చదవండి: పట్టుకోవడానికి వెళ్తే పోలీసులపైకి కుక్కలు వదిలాడు -
చైల్డ్ పోర్నోగ్రఫీ కంటెంట్‌పై ట్విటర్ వివరణ
పిల్లల అశ్లీల కంటెంట్ ను పోస్ట్ చేయడానికి అనుమతించినందుకు ట్విటర్ పై నిన్న ఢిల్లీ పోలీసులు కేసు దాఖలు చేశారు. అయితే, నేడు ఆ చైల్డ్ పోర్నోగ్రఫీ కంటెంట్ కేసుపై సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్ స్పందించింది. పిల్లల అశ్లీల కంటెంట్ విషయాల్లో సంస్థ జీరో-టాలరెన్స్ పాలసీని కలిగి ఉన్నట్లు తెలిపింది. సంస్థ మార్గదర్శకాలను ఉల్లంఘించే కంటెంట్ ను ముందుగానే గుర్తించి తొలగిస్తుందని, అటువంటి విషయాల్లో చట్టానికి సహకరిస్తామని కంపెనీ తెలిపింది. "ట్విటర్ నిబంధనలను ఉల్లంఘించే కంటెంట్ ను ముందుగా గుర్తించి తొలగించడంలో మేము కృషి చేస్తున్నాము. ఈ సమస్యను పరిష్కరించడం కోసం, భారతదేశంలోని చట్టాల అమలు కోసం ఎన్జిఓ భాగస్వాములతో పనిచేస్తాము" అని ట్విటర్ ప్రతినిధి ఎఎన్ఐకు తెలిపారు . జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్(ఎన్సీపీసీఆర్) దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా నిన్న(జూన్ 29) ఢిల్లీ పోలీస్ సైబర్ సెల్ ట్విటర్ పై కేసు నమోదు చేసింది. అశ్లీల కంటెంట్ ను తొలగించాలని, మైక్రోబ్లాగింగ్ సైట్ లో సర్క్యులేట్ చేసిన ఖాతాల వివరాలను పంచుకోవాలని ట్విటర్ ను కోరినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(సైబర్ సెల్) అన్యేష్ రాయ్ తెలిపారు. జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యు) ట్విటర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ను ఒక వారంలోగా మీడియా వేదిక నుంచి అన్ని అశ్లీల కంటెంట్ ను తొలగించాలని కోరింది. ఈ విషయంపై దర్యాప్తు చేసి తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎన్సీడబ్ల్యు చైర్ పర్సన్ రేఖా శర్మ ఢిల్లీ పోలీసు కమిషనర్ కు లేఖ రాశారు. చదవండి: వాట్సాప్ వార్నింగ్.. ఈ యాప్ వాడితే మీ అకౌంట్ బ్లాక్ -
షాకింగ్: బైడెన్‌ని హత్యచేయాలనుకున్నాడు
వాషింగ్టన్: మరో వారం రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో శనివారం కోర్టు రికార్డులు షాకింగ్ న్యూస్‌ని వెల్లడించాయి. 19 ఏళ్ల యువకుడు ఒకరు డెమొక్రాటిక్ ప్రెసిడెంట్ అభ్యర్థి జో బైడెన్‌ని హత్య చేయాలని భావించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో సదరు వ్యక్తి బైడెన్ ఇంటి చుట్టూ తిరగడమే కాక ఆయుధాలు కూడా కొనుగోలు చేశాడు. ఇంతలో పేలుడు పదార్థాలు తీసుకెళ్తూ చైల్డ్ పోర్నోగ్రఫీ నేరం కింద అరెస్ట్ అయ్యాడు. ఈ క్రమంలో పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెల్లడించాడు. వివరాలు.. ఈ ఏడాది మే 28న, నార్త్ కరోలినాలోని కన్నపోలిస్లో పోలీసులు, బ్యాంకింగ్ పార్కింగ్ ప్లేస్ నుంచి మిస్సయిన వ్యాన్‌ను అలెగ్జాండర్ హిల్లెల్ ట్రెయిస్‌మన్(19) తీసుకెళ్లడం గమనించారు. దాని కిటికీలోంచి ఏఆర్-15 స్టైల్ రైఫిల్, ఒక .380-క్యాలిబర్ హ్యాండ్‌గన్, ఒక పెట్టె గమనించారు. (చదవండి: ఈసారి వైట్‌హౌస్ ఎవరి సొంతం?) వ్యాన్ని అడ్డుకుని సర్చ్ చేయడంతో దానిలో 509,000 డాలర్ల డబ్బు, పుస్తకాలు (మనుగడ, బాంబు తయారీ, మెరుగైన ఆయుధాలు ఇస్లాంకు సంబంధించినవి), స్వస్తికా డ్రాయింగ్స్, భవనాల్లో కూలిపోతున్న విమానాలకు సంబంధించిన ఫోటోలు, సిగ్ సావర్ ఏఆర్ రైఫిల్, 9 మిమీ లుగర్, ఒక కెల్-టెక్ సబ్ -2000, ఒక .22-క్యాలిబర్ రైఫిల్ వంటి వాటిని గుర్తించారు. ఆ మరుసటి రోజు పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇక అతడి మొబైల్, ఇతర 15 ఎలాక్ట్రానిక్ పరికరాల్లో ఆన్లైన్ సర్చ్ హిస్టరీలో వేలాది చిన్నపిల్లల అశ్లీల చిత్రాలు.. 1200లకు పైగా చైల్డ్ పోర్న్ వీడియోలను గుర్తించారు. దాంతో అతడి మీద కేసు నమోదు చేసి సెప్టెంబర్‌లో అరెస్ట్ చేశారు. ఇక పోలీసుల విచారణలో ట్రెయిస్‌మన్ విస్తుపోయే అంశాలు తెలిపాడు. ఉగ్రవాద సంఘటనలు, సామూహిక కాల్పులపై తనకు ఆసక్తి ఉందన్నాడు. అతను ద్వేషించేవారిని అంతం చేయడం.. మాస్ షూటింగ్ చేయాలనే కోరిక ఉన్నట్లు వెల్లడించాడు. (అమెరికా ఎన్నికలు: జో బైడెన్ వార్నింగ్) అలానే జో బైడెన్‌ని చంపాలని భావించానన్నాడు ట్రెయిస్‌మన్. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మార్చి నుంచి మే వరకు అతడు జో బైడెన్ ఇంటి అడ్రెస్, స్టేట్ గన్ చట్టాలు, రైఫిల్ పార్ట్స్, నైట్ విజన్ గాగుల్స్ గురించి సర్చ్ చేశానన్నాడు. అలానే మే నెలలో డెలావేర్‌లోని బైడెన్ ఇంటికి నాలుగు మైళ్ల దూరంలో సంచరించినట్లు తెలిపాడు. రికార్డులు ఇది నిజమని నిర్థారించాయి. వీటితో పాటు ఈ ఏడాది ఏప్రిల్ 15న ఐ ఫన్నీ అనే ప్లాట్ఫామ్లో నేను జో బైడెన్‌ని చంపుతానా అనే మిమ్‌ని కూడా షేర్ చేశాడు. న్యూ హాంప్‌షైర్‌లో ట్రెయిస్‌మాన్ ఒక ఏఆర్-15 రైఫిల్‌ను కొనుగోలు చేసి, "ఎగ్జిక్యూట్" అనే పదంతో ముగిసే చెక్‌లిస్ట్ నోట్‌ను కూడా రాసుకున్నట్లు తెలిపారు. ఆ తర్వాత ఓ నెలలోపు చైల్డ్ పోర్నోగ్రఫి ఆరోపణ కింద అరెస్ట్ అయ్యాడు. మేజిస్ట్రేట్ న్యాయమూర్తి బెయిల్ లేకుండా ట్రెయిస్‌మన్ నిర్భందాన్ని సమర్థిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక గతేడాది అక్టోబర్‌లో క్రిస్టమస్ లేదా బ్లాక్ ఫ్రైడే నాడు మాస్ షూటింగ్ చేయాలని రాసుకున్నట్లు తెలిసింది. -
ఆన్లైన్లో ఆశ్లీల వీడియోలు: 41 మంది అరెస్ట్
సాక్షి, తిరువనంతపురం : లాక్డౌన్ కాలంలో ఆన్‌లైన్‌తోపాటు సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా యువత రోజులో అధిక సమయం ఆన్లైన్లోనే వెచ్చిస్తున్నారు. దీని వల్ల జరిగే మంచిని పక్కకు పెడితే చెడు వ్యసనాలకు బానిస అవుతున్నారు. ఈ క్రమంలో చిన్న పిల్లల ఆశ్లీల వీడియోలు, ఫోటోలను ఆన్లైన్లో షేర్ చేసినందుకు కేరళలో 41 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఎక్కువగా ఐటీ ఉద్యోగులు, వివిధ ఉద్యోగాల్లో పనిచేసేవారు ఉండటం గమనార్హం. చదవండి: పోర్నోగ్రఫీ చూసినా... కటకటాల్లోకే! కోవిడ్ -19 కాలంలో పిల్లలపై లైంగిక దోపిడీ పెరిగిందనే ఫిర్యాదుల అందిన నేపథ్యంలో కేరళ సైబర్ సెల్ వీటిపై నిఘా పెంచింది. కేరళ పోలీసుల ఆధ్వర్యంలో సైబర్‌డోమ్ సహాయంతో ఆపరేషన్ పి హంట్ 20.2లో ఆదివారం నిర్వహించిన హైటెక్ దర్యాప్తులో ఈ అరెస్టు కొనసాగింది. అరెస్టైన నిందితులు వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్స్‌లో కరోనా లైఫ్, ఇతర పేరు పెట్టి చైల్డ్ పోగ్నోగ్రఫీ చిత్రాలను, వీడియోలను షేర్ చేస్తుంటారు. రాష్ట్రంలో మొత్తం 362 ప్రాంతాల్లో నిర్వహించిన ఈ దాడుల్లో మొత్తం 268 మందిపై కేసులు నమోదయ్యాయి. ఈ ఆపరేషన్‌లో కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు,హార్డ్ డిస్క్‌లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చదవండి: చైల్డ్ పోర్నోగ్రఫీ సెర్చ్.. ఇద్దరు అరెస్ట్ ఈ నేపథ్యంలో డార్క్‌నెట్ వంటి ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించి పోర్నోగ్రఫీ చిత్రాలను చూడటం, షేర్ చేయడం, డౌన్లోడ్ చేయడం వంటి ఆరోపణలపై నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేరానికి ఐదేళ్ల వరకు జైలు శిక్ష, రూ .10 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. అయితే ఈ నేరం వెనుక ఉన్నత వ్యక్తుల ప్రమేయం ఉందని పోలీసుల బృందం అనుమానం వ్యక్తం చేస్తోంది. -
పోర్నోగ్రఫీ చూసినా... కటకటాల్లోకే!
సాక్షి, సిటీబ్యూరో: అభం శుభం ఎగురని చిన్నారులపై లైంగిక దాడులు జరగడానికి, పెరగడానికి చైల్డ్ పోర్నోగ్రఫీ ఓ ప్రధాన కారణం. ఈ నేపథ్యంలోనే దీనిపై ప్రపంచ వ్యాప్తంగా నిషేధం కొనసాగుతోంది. ఇంటర్నెట్తో పాటు సోషల్ మీడియాలో సాగుతున్న చైల్డ్ పోగ్నోగ్రఫీపై కన్నేసి ఉంచడానికి నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్‌ప్లాయిటెడ్ చిల్డ్రన్ (ఎన్‌సీఎంఈసీ) పని చేస్తోంది. చైల్డ్ సెక్స్‌వల్ అబ్యూజ్డ్ మెటీరియల్‌ను (సీఎస్ఏఎం) కనిపెట్టడానికి ఈ సంస్థ అత్యాధునిక సాఫ్ట్వేర్స్ వినియోగిస్తోంది. వీరు గుర్తించిన వివరాల ఆధారంగానే గత వారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు నగరంలోని తార్నాక ప్రాంతానికి చెందిన మహ్మద్ ఫిరోజ్, కాచిగూడ వాసి ప్రశాంత్ కుమార్‌లను అరెస్టు చేశారు. ప్రస్తుతం అమలులో ఉన్న కఠిన చట్టాల ప్రకారం ఇంటర్నెట్తో పాటు సోషల్ మీడియాలో చైల్డ్ పోర్నోగ్రఫీని సెర్చ్ చేసినా, చూసినా, డౌన్లోడ్, అప్లోడ్ చేసినా... నేరమే అని సైబర్ క్రైమ్ పోలీసులు స్పష్టం చేస్తున్నారు. అమెరికా కేంద్రంగా ఎన్సీఎంసీ... అమెరికాకు చెందిన యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ ఎన్సీఎంఈసీని ఏర్పాటు చేసింది. ఈ స్వచ్ఛంద సంస్థ ప్రపంచ వ్యాప్తంగా తమ కార్యకలాపాలు కొనసాగిస్తోంది. తప్పిపోతున్న చిన్నారులు, వారిపై జరుగుతున్న లైంగిక దాడులను నిరోధించడానికి ఈ సంస్థ పని చేస్తోంది. చిన్నారులకు సంబంధించి అశ్లీల చిత్రాలు, వీడియోలు, సాహిత్యం తదితరాలను చైల్డ్ పోర్నోగ్రఫీగా పరిగణిస్తారు. దీన్ని ప్రపంచ వ్యాప్తంగా నిషేధించిన తర్వాత ఎన్‌సీఎంఈసీ కార్యకలాపాలు మరింత ముమ్మరం అయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా 18 ఏళ్ల లోపు వయస్సున్న ప్రతి ముగ్గురు బాలికల్లో ఒకరు, ప్రతి ఐదుగురు బాలురులో ఒకరు లైంగిక దాడులకు గురవుతున్నారని ఐక్యరాజ్య సమితికి చెందిన యునిసెఫ్ అధ్యయనంలో తేలింది. ఆన్లైన్లో చైల్డ్ పోర్నోగ్రఫీ అనేది అత్యంత వేగంగా పెరుగుతోందని ఎన్‌సీఎంఈసీ గుర్తించింది. ఒక్క భారతదేశంలోనే ప్రతి 40 సెకండ్లకు ఈ తరహా వీడియో ఒకటి క్యాప్చర్ అవుతోంది. వివిధ సెర్చ్ ఇంజన్లలో జరుగుతున్న సెర్చ్‌ల్లో 25 శాతం చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించినవే. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) గణాంకాల ప్రకారం ఈ ఏడాది మే 2 వరకు ఇంటర్నెట్లో 25 వేల చైల్డ్ పోర్నోగ్రఫీకి చెందిన వీడియోలు, చిత్రాలు అప్లోడ్ అయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్‌సీఎంఈసీ ఆన్లైన్, సోషల్‌మీడియాలో ఉన్న చైల్డ్ పోర్నోగ్రఫీపై సాంకేతిక నిఘా వేసి ఉంచుతోంది. అత్యంత పటిష్ట నిఘా... చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించి ఇంటర్నెట్, సోషల్‌మీడియా వంటి సైబర్ స్పేస్‌లో ఉన్న అంశాలను సీఎంఏఎంగా పరిగణిస్తారు. దీన్ని గుర్తించడానికి ఎంసీఎంఈసీ ప్రత్యేక సాఫ్ట్వేర్లను రూపొందించింది. గూగుల్, యాహూ సహా ఇతర సెర్చ్ ఇంజన్లు, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్ తదితర సోషల్‌మీడియాల్లో ఉన్న సీఎస్ఏఎంలను గుర్తించడానికి ఆయా సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఆయా సైబర్ స్పేస్, సోషల్‌మీడియాల్లో చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన విషయాలను కనిపెట్టడానికి కొన్ని కీవర్డ్స్‌ను రూపొందించింది. ఫలితంగా ప్రపంచంలో ఎవరైనా ఆయా వేదికలపై సీఎస్ఏఎంకు సంబంధించి సెర్చ్ చేసినా, వీక్షించినా, డౌన్లోడ్ చేసినా, అప్లోడ్ చేసినా... అందులో ఉన్న ప్రత్యేక సాఫ్ట్వేర్ వెంటనే వారు వినియోగించిన ఐపీ అడ్రస్‌లను గుర్తిస్తుంది. ఈ వివరాలను తక్షణం ఎన్సీఎంఈకి చెందిన సర్వర్‌కు అందిస్తుంది. వీటిని క్రోడీకరించే అక్కడి సిబ్బంది చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన వివరాలు సెర్చ్ చేసిన, చూసిన, అప్లోడ్ చేసిన, డౌన్లోడ్ చేసిన వారి వివరాలను ఆయా దేశాల నోడల్ ఏజెన్సీలకు అందిస్తారు. మన దేశానికి సంబంధించి జాతీయ స్థాయిలో హోమ్ మంత్రిత్వ శాఖ ఆధీనంలోని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది. దీంతో ఈ వివరాలు ఎన్‌సీఎంఈసీ నుంచి ఎన్సీఆర్బీకి వస్తాయి. అరెస్టులు చేసే స్థానిక పోలీసులు... ఎన్‌సీఎంఈసీ నుంచి చైల్డ్ పోర్నోగ్రఫీ నిందితుల జాబితా అందుకున్న ఎన్సీఆర్బీ అధికారులు ఆ వివరాలను రాష్ట్రాల వారీగా విభజించి, ఆ సమాచారాన్ని ఆయా రాష్ట్ర స్థాయి దర్యాప్తు సంస్థలకు పంపిస్తారు. 2019లో చైల్డ్ పోర్నోగ్రఫీ అప్లోడ్ చేసిన తెలంగాణకు చెందిన 15 మంది వివరాలను ఇటీవల ఎన్సీఆర్బీ నుంచి రాష్ట్ర సీఐడీ అధికారులకు అందగా.. వీరు ఆ నిందితుల జాబితాలను ఆయా స్థానిక పోలీసులకు పంపించారు. ఇలా ఇద్దరి వివరాలు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు అందగా.. ఐపీ అడ్రస్‌ల ఆధారంగా వారిని గుర్తించారు. గతేడాది ఏప్రిల్‌లో ఫేస్‌బుక్‌లోకి ఓ చైల్డ్ పోర్న్ వీడియోను అప్లోడ్ చేసిన తార్నాక వాసి మహ్మద్ ఫిరోజ్, చిన్నారుల అశ్లీల చిత్రాలను ఓ సైట్లోకి అప్లోడ్ చేసిన కాచిగూడ వాసి ప్రశాంత్ కుమార్‌ను ఇలానే పట్టుకున్నారు. వీరిద్దరిని గురువారం అరెస్టు చేసిన విషయం విదితమే. మిగిలిన 13 మంది రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉండటంతో ఆయా జిల్లాల పోలీసులకు ఆ సమాచారం సీఐడీ ద్వారా అందింది. వీరినీ అరెస్టు చేయడానికి సన్నాçహాలు జరుగుతున్నాయి. ఈ 15 మందీ తమ ఫోన్ల ద్వారానే ఇంటర్నెట్ను యాక్సస్ చేశారు. కఠిన చర్యలు తీసుకుంటాం ‘చైల్డ్ పోర్నోగ్రఫీని ఎవరు సెర్చ్ చేసినా చర్యలు తప్పవు. ఎన్సీఆర్బీ ద్వారా అందిన సమాచారంతో సుమోటో కేసుల్ని నమోదు చేస్తున్నాం. వీరిపై ఐటీ యాక్ట్‌లోని సెక్షన్ 67 (బి) ప్రకారం ఆరోపణలు రిజిస్టర్ అవుతున్నాయి. ఈ కేసులో నేరం నిరూపణ అయితే మొదటిసారి నేరం చేసిన వారికి గరిష్టంగా ఐదేళ్లు, రెండోసారి అయితే ఏడేళ్ల వరకు శిక్ష పడుతుంది. బాధితులు నేరుగా వచ్చి ఫిర్యాదు చేస్తే దీంతో పాటు పోక్సో యాక్ట్ కింద కేసులు నమోదవుతాయి. వీటిలో కోర్టు దోషులుగా నిర్థారిస్తే జీవితఖైదు వరకు పడే ఆస్కారం ఉంది. – ఎన్.మోహన్‌రావు, ఇన్స్పెక్టర్, సిటీ సైబర్ క్రైమ్ ఠాణా -
చైల్డ్ పోర్నోగ్రఫీ సెర్చ్.. ఇద్దరు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: బాలల అశ్లీలతకు సంబంధించిన అంశాలు, చిత్రాలు, వీడియోల కోసం ఇంటర్నెట్లో వెతికారంటే పోలీసులకు దొరికిపోవడం ఖాయం. ఇలాంటి అంశాలను పరిశీలించేందుకు ఢిల్లీలోని నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ (ఎస్సీఆర్బీ)లో ప్రత్యేక సెల్ కొనసాగుతోంది. గూగుల్‌లో చైల్డ్పోర్న్కు సంబంధించిన కీ వర్డ్స్ తో సర్చ్ చేసినా, బాలల అశ్లీలతకు సంబంధించిన వెబ్సైట్లలోకి వెళ్లినా వెంటనే ఈ సెల్ సదురు ఐపీ(ఇంటర్నెట్ ప్రొటోకాల్)ని గుర్తిస్తోంది. ఇలా గుర్తించిన ఐపీలను ఆయా రాష్ట్రాల్లోని సీఐడీ విభాగానికి పంపిస్తున్నారు. అక్కడి నుంచి ఆయా నగరాలు, పట్టణాలకు ఆయా సమాచారాన్ని పంపించి, నిందితులను పట్టుకుంటున్నారు. ఇలా హైద్రాబాద్‌లో గురువారం ఇద్దరు యువకులను సిటీ సైబర్‌క్రైమ్ ఇన్స్పెక్టర్ మోహన్రావ్ బృందం అరెస్ట్ చేసింది. తార్నాకకు చెందిన మహ్మద్ ఫిరోజ్ వృత్తిరీత్యా ప్రైవేట్ ఉద్యోగి. అశ్లీల వెబ్సైట్లలోకి వెళ్లి బాలలకు సంబంధించిన వీడియోలను డౌన్లోడ్ చేశాడు, వాటిని తన ఫేస్బుక్లో అప్లోడ్ చేసుకున్నాడు. అలాగే కాచిగూడకు చెందిన ప్రశాంత్‌కుమార్ ఎంబిఏ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నాడు. అశ్లీల వెబ్సైట్లలోకి వెళ్లి అక్కడ బాలలకు సంబంధించిన అశ్లీల ఫోలోలను, వీడియోలను డౌన్లోడ్ చేసి వాటిని ఇతర సైట్లలో అప్లోడ్ చేశాడు. ఆయా ఐపీలను రికార్డ్ చేసిన ఎన్‌సిఆర్‌బీ వాటిని రాష్ట్ర సీఐడీకి పంపించింది. ఆ సమాచారం హైద్రాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులకు అందడంతో ఐపీ చిరునామాల ఆధారంగా ఇద్దరు నిందితులను గుర్తించిన సైబర్‌క్రైమ్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా మరో 12 మందికి సంబంధించిన ఐపీలపై కూడా సైబర్‌క్రైమ్ పోలీసులు దృష్టి పెట్టినట్లు తెలిసింది. చైల్డ్ పోర్నోగ్రఫీ అనేది ప్రపంచవ్యాప్తంగా నిషేధం ఉంది. చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన అంశాలపై ఇంటర్నెట్లో శోధన చేసే వారికి సంబంధించిన సమాచారం ఇవ్వడంలో ఎన్సీఆర్బీకి ఇతర దేశాలు కూడా సహకరిస్తున్నాయి. ఇంటర్నెట్ వాడేవారు ఈ కీవర్డ్స్ పై తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి.. లేదంటే కేసులు ఎదుర్కోవాల్సి వస్తోందని సైబర్‌క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. -
పోక్సో బిల్లుకు పార్లమెంటు ఓకే
న్యూఢిల్లీ: ‘లైంగిక నేరాల నుంచి చిన్నారులకు రక్షణ (పోక్సో) (సవరణ) బిల్లు–2019’ని పార్లమెంటు గురువారం ఆమోదించింది. చిన్నారులపై లైంగిక దాడులకు సంబంధించి అత్యంత అరుదైన కేసుల్లో దోషులకు మరణ శిక్ష విధించేందుకు కూడా ఈ బిల్లులో నిబంధనలు ఉన్నాయి. ఈ బిల్లును రాజ్యసభ గత నెల 29నే ఆమోదించగా, లోక్‌సభలో బిల్లు గురువారం పాసయ్యింది. మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతీ ఇరానీ ఈ బిల్లును ఆమోదం కోసం ప్రవేశపెడుతూ చిన్నారులపై నేరాలను లింగభేదం లేకుండా ఒకేలా చూసేందుకు ఈ బిల్లును తెచ్చామని అన్నారు. ‘చిన్నారులతో నీలి చిత్రాలు’ (చైల్డ్ పోర్నోగ్రఫీ)కి ఈ బిల్లులో నిర్వచనం కూడా చేర్చి, మరిన్ని ఎక్కువ దుశ్చర్యలను నేరం కిందకు వచ్చేలా చేశారు. పార్టీలకు అతీతంగా అనేకమంది ఎంపీలు ఈ బిల్లుకు మద్దతు తెలిపారు. దేశంలో 43 కోట్ల మంది చిన్నారులు ఉన్నారనీ, లింగభేదం లేకుండా వారందరికీ న్యాయపరంగా అదనపు భద్రతను ఈ బిల్లు కల్పిస్తుందని ఆమె తెలిపారు. చర్చ అనంతరం మూజువాణి ఓటుతో బిల్లును లోక్‌సభ ఆమోదించింది. నపుంసకులుగా మార్చాలి: కిరణ్ ఖేర్ ఈ బిల్లుపై చర్చ సందర్భంగా ఆర్ఎల్పీ సభ్యుడు హనుమాన్ బేనీవాల్ మాట్లాడుతూ పోక్సో చట్టం కింద దోషులుగా తేలిన వారిని బహిరంగంగా ఉరి తీయాలనీ, అప్పుడే ఇలాంటి నేరాలు చేయాలనుకునే వారికి భయం కలుగుతుందని డిమాండ్ చేశారు. నేరస్తులకు ఉరిశిక్ష విధించడం సాధ్యం కాకపోతే వారిని నపుంసకులుగా మార్చేలా నిబంధనలు ఉండాలని బీజేపీ ఎంపీ కిరణ్ ఖేర్ సూచించారు. -
అశ్లీల వీడియోలకు అడ్డుకట్ట వేయండి
సనత్‌నగర్: సామాజిక మాధ్యమాల్లో అశ్లీల వీడియోలు ప్రసారం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పలు స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు కోరారు. ఈ మేరకు మంగళవారం హోంమంత్రి మహమూద్ అలీని కలిసి వినతిపత్రం అందజేశారు. గాయత్రీ వాలంటరీ సర్వీస్ ఆర్గనైజేషన్, ఝాన్సీ లక్ష్మిబాయి వాలంటరీ సర్వీస్ ఆర్గనైజేషన్లకు చెందిన పుష్పలత, దశరథ లక్ష్మి, ప్రొఫెసర్ కవిలత, జోయ, డాక్టర్ ప్రమీల, అనిత, జరీనా వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అశ్లీల వీడియోల కారణంగా యువత పెడదోవ పట్టే అవకాశం ఉందన్నారు. అశ్లీల వీడియోలు ప్రసారం చేస్తున్న సామాజిక మాధ్యమాలకు అడ్డుకట్టవేయాల్సిన అవసరం ఉందన్నారు. యువత అత్యధికంగా వివిధ వెబ్సైట్లలో అశ్లీల చిత్రాలను చూస్తున్న కారణంగా మహిళలు, విద్యార్థినులపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీటి నివారణకు అశ్లీల వెబ్సైట్లపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. 12 ఏళ్ల లోపు బాలికలపై లైంగికదాడికి పాల్పడితే ఉరి శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రేణుకా ముదిరాజ్, కృష్ణగౌడ్, మధుగౌడ్, అనిత, సంగీత, నాగరాణి, తులసి తదితరులు పాల్గొన్నారు. హోంమంత్రి మహమూద్ అలీకి వినతిపత్రం అందజేస్తున్న మహిళా సంఘాల ప్రతినిధులు... -
చైల్డ్ పోర్నోగ్రఫీకి స్థానం లేదు: వాట్సప్
న్యూఢిల్లీ: వాట్సప్ మెసేంజర్‌లో చైల్డ్పోర్నోగ్రఫీకి స్థానం లేదని, అలాంటి సమాచారంపై చర్యలు చేపడుతూ ఎప్పటికప్పుడు వాటికి కారణమైన ఖాతాలను నిషేధిస్తున్నట్లు శుక్రవారం ఆ సంస్థ యాజమాన్యం ప్రకటించింది. ఇలాంటి నేరాలకు సంబంధించి దర్యాప్తు నిమిత్తం చట్టబద్ధ సంస్థలు పంపిన లీగల్ రిక్వెస్ట్‌లపై స్పందిస్తూ.. ‘వినియోగదారులు షేర్ చేసిన సమాచారాన్ని మేం చూడలేం. వినియోగదారుడు ఇచ్చే ఫిర్యాదు నివేదికను బట్టే చర్యలు తీసుకోగలం లేదా ఆ ఖాతాలను నిషేధించగలం’ అని వాట్సప్ తెలిపింది. చైల్డ్‌పోర్నోగ్రఫీ వంటి అనుచిత సమాచారం తొలగించేందుకు గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్‌లతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. -
పిల్లల నీలిచిత్రాల ముఠా గుట్టు రట్టు
న్యూఢిల్లీ: పిల్లల నీలిచిత్రాలకు (చైల్డ్ పోర్నోగ్రఫీ) సంబంధించిన అంతర్జాతీయ రాకెట్‌ను సీబీఐ గురువారం భగ్నం చేసింది. వాట్సాప్‌లో ఓ గ్రూప్‌లో పిల్లల నీలిచిత్రాలు షేర్ అవుతుండటాన్ని గుర్తించిన సీబీఐ మూడు నెలలపాటు శ్రమించి ఈ ముఠా పనిపట్టింది. ఆ గ్రూప్‌కు ఉత్తరప్రదేశ్‌కు చెందిన నిరుద్యోగ యువకుడు నిఖిల్ వర్మ అడ్మిన్‌గా ఉండటంతో అతణ్ని సీబీఐ అరెస్టు చేసింది. ఈ గ్రూప్‌లో అమెరికా, చైనా, న్యూజిలాండ్, మెక్సికో, అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, నైజీరియా తదితర దేశాలకు చెందిన వారు సభ్యులుగా ఉన్నారు. వీడియోలు అప్లోడ్ చేస్తున్న ఐపీ అడ్రస్‌లను గుర్తించిన సీబీఐ.. ఢిల్లీ, ముంబై, నోయిడా, కన్నౌజ్‌లలోని ఐదు ప్రదేశాల్లో గురువారం దాడులు చేసింది. పిల్లల నీలిచిత్రాలను చూడటం, రికార్డు చేయడం, ఇంటర్నెట్లో అప్లోడ్ చేయడం నేరం. ఏడేళ్ల వరకు జైలు శిక్ష, రూ.10 లక్షల వరకు జరిమనా విధించొచ్చు. -
అంతర్జాతీయ చైల్డ్ పోర్నోగ్రఫీ రాకెట్ గుట్టురట్టు
సాక్షి, న్యూఢిల్లీ: అంతర్జాతీయ చైల్డ్ పోర్నొగ్రఫీపై ఉక్కుపాదం మోపిన సీబీఐ ఓ గ్యాంగ్ ఆట కట్టించింది. అశ్లీల వీడియోలను వాట్సాప్ గ్రూపుల్లో పలు దేశాల కస్టమర్లకు పంపుతున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు సీబీఐ ఓ ప్రకటనలో తెలిపింది. తాము అదుపులోకి తీసుకున్న నిఖిల్ వర్మ ఈ కేసులో ప్రధాన నిందితుడని, అతడే వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ అని సీబీఐ అధికారులు వెల్లడించారు. నిందితుడి వద్ద నుంచి చిన్నారుల పోర్స్ వీడియోలు స్టోర్ చేసిన మొబైల్ ఫోన్లు, టాబ్లెట్స్, ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. నిఖిల్ తన వాట్సాప్ గ్రూప్‌లో దాదాపు 100 మందిని సభ్యులుగా చేసుకుని అమెరికా, పాకిస్తాన్, చైనా, శ్రీలంక సహా మరికొన్ని దేశాలకు చిన్నారుల అశ్లీల వీడియోలు పంపుతున్నట్లుగా నిందితుడి వాట్సాప్ లో గుర్తించారు. ఐటీ యాక్ట్ 2000 ప్రకారం చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించి ఇప్పటికే ప్రధాన నిందితుడు నిఖిల్ వర్మతో పాటుగా నఫీజ్ రేజా, ఢిల్లీకి చెందిన జహిద్, ముంబైకి చెందిన సత్యేంద్ర ఓమ్ ప్రకాశ్ చౌహాన్, నోయిడాకు చెందిన ఆదర్శ్ లపై కేసులు నమోదు చేశారు. ఇదివరకే 3500 వెబ్సైట్లు చిన్నారుల అశ్లీల వీడియోలు పోస్ట్ చేస్తున్నాయని వాటిని బ్లాక్ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వివరించింది. చైల్డ్ పోర్నోగ్రఫీని ఉపేక్షించేంది లేదని, ఇలాంటి వీడియోలు తీసిన, వాటిని సైట్లలో పోస్ట్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరించిన విషయం తెలిసిందే. -
ఉరేసుకొని నటుడు ఆత్మహత్య
న్యూయార్క్ : లైంగిక వేధింపులు, చైల్డ్ పోర్నోగ్రఫీ ఆరోపణలు ఎదుర్కొంటున్న అమెరికన్ నటుడు మార్క్ సాలింగ్ (35) చనిపోయాడు. తన నివాసంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని అతడి తరుపు న్యాయవాది మైఖెల్ ప్రోక్టార్ ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం ఉదయాన్నే అతడు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు చె్పారు. గ్లీ వంటి టీవీ సిరీస్‌లలో మంచి నటుడిగా అతడికి పేరుంది. అయితే, 2015లో అతడిపై లైంగిక వేధింపులు, చైల్డ్ పోర్నోగ్రఫీ ఆరోపణలు వచ్చాయి. దీంతో అతడిని అరెస్టు చేసిన పోలీసులు 2016లో చార్జిషీట్ ఫైల్ చేశారు. అతడి ల్యాప్‌టాప్‌ను స్వాధీనంలోకి తీసుకొని పరిశీలించగా అందులో దాదాపు 50 వేల చైల్డ్ పోర్నోగ్రఫిక్ ఫొటోలు, వీడియోలు లభించాయి. ఈ మేరకు వాదోపవాదాలు పరిశీలించి అతడు దోషి అని న్యాయమూర్తి నిర్దారించారు. ఈ వచ్చే మార్చి 7న అతడికి శిక్ష ఖరారు కానుంది. ఈ లోగానే అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత ఆగస్టులో (2017)లో కూడా ఓసారి ఆత్మహత్యాయత్నానికి సాలింగ్ పాల్పడినట్లు తెలిసింది. -
నా భర్త వద్ద ఆ పోర్న్ వీడియోలు ఉండేవి: ఎంపీ
సాక్షి, విక్టోరియా: ఆస్ట్రేలియా మహిళా ఎంపీ ఒకరు సంచలన విషయాలు వెల్లడించారు. చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలు కలిగి ఉండటంతో తన భర్తను జైలుకు పంపించినట్టు ఆమె తెలిపారు. గత ఏడాది తమ ఇంట్లో పెద్ద ఎత్తున చైల్డ్ పోర్న్ వీడియోల కలెక్షన్‌ను దొరికిందని, దీంతో వెంటనే తాను, తన కొడుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశామని, ఈ కేసులో భర్తకు శిక్షపడిందని చెప్పారు. విక్టోరియా రాష్ట్ర పార్లమెంటు సభ్యురాలైన రాచెల్ కార్లింగ్-జెంకిన్స్ ఈమేరకు గురువారం వెల్లడించిన విషయాలు ఆస్ట్రేలియా వాసులను విస్మయపరిచాయి. పెద్దలసభలో కన్జర్వేటివ్ సభ్యురాలైన ఆమె మాట్లాడుతూ తమ ఇంట్లో ఆ వీడియోలు, ఫొటోలు దొరకడంతో తన జీవితం తల్లకిందులైందని తెలిపారు. 'ఆ కలెక్షన్లో అత్యంత బాధ కలిగించే ఫొటోలను చూశాను. అప్పుడు కలిగిన ఆక్రోశం నాలో ఇంకా కొనసాగుతూనే ఉంది. వెంటనే నా వివాహబంధాన్ని తెంపుకున్నాను. అవి దొరికిన రోజునే అత్తవారి ఇంటిని విడిచిపెట్టాను. నా వస్తువులు తీసుకోవడానికి తప్ప మళ్లీ ఆ ఇంట్లో అడుగుపెట్టలేదు' అని ఆమె చెప్పారు. ప్రస్తుతం విడిగా ఉంటున్న తన భర్తపై కేసు విచారణకు ఆటంకం కలుగకూడదనే ఇన్నాళ్లు ఈ విషయాలు వెల్లడించలేదని తెలిపారు. తన భర్త చైల్డ్ ప్రోర్నోగఫీకి బానిస అని తనకు ఎన్నడూ అనుమానం కలుగలేదని, ఒక భార్యగా, ఒక తల్లిగా ఈ దారుణమైన నేరాన్ని వెలుగులోకి తీసుకొచ్చినందుకు ఏమాత్రం చింతించడం లేదని ఆమె తెలిపారు. అప్పటినుంచి భర్త విడాకుల పత్రాలపై సంతకం చేయకుండా తనను వేధిస్తున్నాడని, తనకు రావాల్సిన ఆస్తులను తనకివ్వడానికి నిరాకరిస్తున్నాడని ఆమె తెలిపారు. చైల్డ్ పోర్నోగ్రఫీ వల్ల నిరుపేద, నిస్సహాయ, బలహీన వర్గాల పిల్లలు ఎంతో లైంగిక హింసను, క్షోభను అనుభవిస్తున్నారని ఆమె తెలిపారు. -
ఆ వీడియోలపై ఫేస్బుక్, వాట్సాప్‌లకు సుప్రీం ఆదేశాలు
న్యూఢిల్లీః లైంగిక దాడులు, సామూహిక అత్యాచారాలు, చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన అభ్యంతరకర వీడియోలు, ఫోటోల అప్లోడింగ్పై వచ్చిన ఫిర్యాదుల వివరాలు ఇవ్వాలని ఫేస్బుక్, గూగుల్, వాట్సాప్, యాహూలను సుప్రీం కోర్ట్ ఆదేశించింది. ఈ ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో వెల్లడించాలని కోరింది. ఈ తరహా నేరాలపై పోక్సో చట్టం కింద ఎన్ని కేసులు నమోదు చేశారో తెలపాలని జస్టిస్ మదన్ బీ లోకూర్, యూయూ లలిత్‌తో కూడిన బెంచ్ హోంమంత్రిత్వ శాఖను ఆదేశించింది. అభ్యంతరకర వీడియోలు, కంటెంట్‌పై ఈ ఏడాది ఆగస్ట్ 31 వరకూ భారత్‌లో వచ్చిన ఫిర్యాదులు వాటిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారనే వివరాలను తెలుపుతూ అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆయా కంపెనీలను ఆదేశిస్తున్నట్టు సుప్రీం బెంచ్ పేర్కొంది. అప్పటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్ఎల్ దత్తుకు హైదరాబాద్‌కు చెందిన ఎన్జీఓ ప్రజ్వల పంపిన లేఖపై కోర్టు విచారణ చేపట్టింది. ప్రజ్వల సంస్థ లేఖతో పాటు లైంగికదాడులకు సంబంధించిన రెండు వీడియోలనూ పెన్‌డ్రైవ్‌లో పంపింది. లేఖను సుమోటోగా స్వీకరించిన కోర్టు వాట్సాప్‌లో పోస్ట్ చేసిన వీడియోలపై తీవ్రంగా స్పందించింది. దీనిపై విచారణ చేపట్టి దోషులను పట్టుకోవాలని సీబీఐని కోరింది. ఇక సోమవారం జరిగిన విచారణ సందర్భఃగా అభ్యంతరకర దృశ్యాలను సోషల్ మీడియాలో బ్లాక్ చేసేలా చర్యలు చేపట్టడంపై ఇంటర్నెట్ కంపెనీల ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులతో కూడిన కమిటీ చేస్తున్న ప్రయత్నాలను కంపెనీల ప్రతినిధులు కోర్టుకు వివరించారు. -
చైల్డ్ పోర్నోగ్రఫి కేసులో నటుడు!
లాస్ ఎంజిల్స్: బాలల అశ్లీల చిత్రాలు, ఫోటోలు కలిగివున్నాడన్న ఆరోపనలతో అరెస్టైన అమెరికన్ నటుడు మార్క్ సాలింగ్(33) కేసు విచారణ ఫెడరల్ కోర్టులో జరిగింది. ఈ సందర్భంగా న్యాయమూర్తుల బృందం సాలింగ్ చర్యలను తీవ్రంగా తప్పుబట్టింది. బాలలపై జరిగే నేరాలను అదుపు చేసే ఇంటర్నెట్ క్రైమ్స్ ఎగయినెస్ట్ చిల్రన్స్ టాస్క్‌ఫోర్స్ ఇటీవల నిర్వహించిన దాడుల్లో బాలలకు సంబంధించిన అశ్లీల వీడియోలు, ఫోటోలు దొరకడంతో సాలింగ్ అరెస్టయిన విషయం తెలిసిందే. బాలలకు సంబంధించిన అశ్లీల చిత్రాలు షేర్ చేయడం, అంతర్జాలం నుంచి డౌన్లోడ్ చేయడం లాంటి చర్యలు బాలలను బాధితులుగా మార్చడాన్ని ప్రేరేపిస్తుందని ఈ సందర్భంగా కోర్టు అభిప్రాయపడింది. ఈ కేసులో సాలింగ్కు ఐదు నుంచి గరిష్టంగా 20 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.