న్యూఢిల్లీ: పిల్లల నీలిచిత్రాలకు (చైల్డ్ పోర్నోగ్రఫీ) సంబంధించిన అంతర్జాతీయ రాకెట్‌ను సీబీఐ గురువారం భగ్నం చేసింది. వాట్సాప్‌లో ఓ గ్రూప్‌లో పిల్లల నీలిచిత్రాలు షేర్ అవుతుండటాన్ని గుర్తించిన సీబీఐ మూడు నెలలపాటు శ్రమించి ఈ ముఠా పనిపట్టింది. ఆ గ్రూప్‌కు ఉత్తరప్రదేశ్‌కు చెందిన నిరుద్యోగ యువకుడు నిఖిల్ వర్మ అడ్మిన్‌గా ఉండటంతో అతణ్ని సీబీఐ అరెస్టు చేసింది.
ఈ గ్రూప్‌లో అమెరికా, చైనా, న్యూజిలాండ్, మెక్సికో, అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, నైజీరియా తదితర దేశాలకు చెందిన వారు సభ్యులుగా ఉన్నారు. వీడియోలు అప్‌లోడ్ చేస్తున్న ఐపీ అడ్రస్‌లను గుర్తించిన సీబీఐ.. ఢిల్లీ, ముంబై, నోయిడా, కన్నౌజ్‌లలోని ఐదు ప్రదేశాల్లో గురువారం దాడులు చేసింది. పిల్లల నీలిచిత్రాలను చూడటం, రికార్డు చేయడం, ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేయడం నేరం. ఏడేళ్ల వరకు జైలు శిక్ష, రూ.10 లక్షల వరకు జరిమనా విధించొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment