పిల్లల అశ్లీల కంటెంట్ ను పోస్ట్ చేయడానికి అనుమతించినందుకు ట్విటర్ పై నిన్న ఢిల్లీ పోలీసులు కేసు దాఖలు చేశారు. అయితే, నేడు ఆ చైల్డ్ పోర్నోగ్రఫీ కంటెంట్ కేసుపై సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్ స్పందించింది. పిల్లల అశ్లీల కంటెంట్ విషయాల్లో సంస్థ జీరో-టాలరెన్స్ పాలసీని కలిగి ఉన్నట్లు తెలిపింది. సంస్థ మార్గదర్శకాలను ఉల్లంఘించే కంటెంట్ ను ముందుగానే గుర్తించి తొలగిస్తుందని, అటువంటి విషయాల్లో చట్టానికి సహకరిస్తామని కంపెనీ తెలిపింది. "ట్విటర్ నిబంధనలను ఉల్లంఘించే కంటెంట్ ను ముందుగా గుర్తించి తొలగించడంలో మేము కృషి చేస్తున్నాము. ఈ సమస్యను పరిష్కరించడం కోసం, భారతదేశంలోని చట్టాల అమలు కోసం ఎన్‌జిఓ భాగస్వాములతో పనిచేస్తాము" అని ట్విటర్ ప్రతినిధి ఎఎన్ఐకు తెలిపారు .
జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్(ఎన్‌సీపీసీఆర్) దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా నిన్న(జూన్ 29) ఢిల్లీ పోలీస్ సైబర్ సెల్ ట్విటర్ పై కేసు నమోదు చేసింది. అశ్లీల కంటెంట్ ను తొలగించాలని, మైక్రోబ్లాగింగ్ సైట్ లో సర్క్యులేట్ చేసిన ఖాతాల వివరాలను పంచుకోవాలని ట్విటర్ ను కోరినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(సైబర్ సెల్) అన్యేష్ రాయ్ తెలిపారు.
జాతీయ మహిళా కమిషన్(ఎన్‌సీడబ్ల్యు) ట్విటర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ను ఒక వారంలోగా మీడియా వేదిక నుంచి అన్ని అశ్లీల కంటెంట్ ను తొలగించాలని కోరింది. ఈ విషయంపై దర్యాప్తు చేసి తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎన్‌సీడబ్ల్యు చైర్ పర్సన్ రేఖా శర్మ ఢిల్లీ పోలీసు కమిషనర్ కు లేఖ రాశారు.
చదవండి: వాట్సాప్ వార్నింగ్.. ఈ యాప్ వాడితే మీ అకౌంట్ బ్లాక్
Comments
Please login to add a commentAdd a comment