Rekha Sharma
-
స్వాతి మలివాల్ వర్సెస్ రేఖాశర్మ.. సోషల్ మీడియాలో డైలాగ్ వార్
న్యూఢిల్లీ: రాజ్యసభ ఎంపీగా కొత్తగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత స్వాతిమలివాల్ ప్రమాణస్వీకారంపై వివాదం కొనసాగుతోంది. ఈ విషయంలో ఆమెపై జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖా శర్మ ట్రోల్ చేస్తూ ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్ట్ పెట్టారు. ‘స్వాతిమలివాల్ ఆందోళనల్లో నుంచి పుట్టిన ప్రోడక్టు. ఆమెకు నినాదాలు మాత్రమే తెలుసు. ఆమె తన చిన్న మెదడును అసలే వాడదు. బడ్జెట్ అంటే ఆమెకు ఏం తెలియదు. అయినా బడ్జెట్‌పై ఆమె నిపుణురాలు అనుకుంటోంది’ అని పోస్టులో రేఖాశర్మ వ్యంగ్యాస్రాలు సంధించింది.రేఖాశర్మ పోస్టుపై స్వాతిమలివాల్ అంతే ఘాటుగా స్పందించారు. ‘నేను ఆందోళనల్లో నుంచి పుట్టానని గర్వంగా చెప్పుకుంటున్నాను. నా జీవితం సామాజిక సేవకు అంకితం చేశాను.మహిళా కమిషన్ చైర్మన్‌గా మీరు ఫెయిల్ అయ్యారు. వెంటనే మీరు మీ పదవికి రాజీనామా చేసి ట్రోలింగ్ చేసుకోండి’అని రేఖాశర్మపై స్వాతి ఫైర్ అయ్యారు. జనవరి 31న రాజ్యసభ ఎంపీగా ప్రమాణం చేసిన స్వాతిమలివాల్ చివర్లో ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదమిచ్చారు.దీనిపై రాజ్యసభ చైర్మన్ జగదీప్ దన్కడ్ అభ్యంతరం తెలిపారు. మళ్లీ ఆమెతో ప్రమాణం చేయించారు. తొలిసారి చేసిన ప్రమాణస్వీకారాన్ని రాజ్యసభ రికార్డుల నుంచి తొలగించారు. స్వాతిమలివాల్ గతంలో ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా పనిచేయడం గమనార్హం. -
ఆసక్తిగా ఏపీలోని మహిళా సంక్షేమ విధానాలు
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి, భద్రత కోసం అమలు చేస్తున్న కార్యక్రమాలు ఆసక్తికరంగా ఉన్నాయని జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖాశర్మ వ్యాఖ్యానించారు. జాతీయ మహిళా కమిషన్, ఏపీ మహిళా కమిషన్ సంయుక్త ఆధ్వర్యంలో విశాఖపట్నంలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి సమావేశాలు సోమవారం ముగిశాయి. ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అధ్యక్షతన రెండు రోజులపాటు నిర్వహించిన సదస్సులో 16 రాష్ట్రాలకు చెందిన మహిళా కమిషన్ చైర్పర్సన్లు, సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేఖా శర్మ మాట్లాడుతూ.. ఎన్నారై వివాహ మోసాలకు సంబంధించిన కేసులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. విదేశీ సంబంధాల విషయంలో పూర్తి వివరాలు ముందుగానే తెలుసుకునేలా యువతులను అప్రమత్తం చేయాలని సూచించారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. ఏపీలో అమలవుతున్న మహిళా సంక్షేమ పథకాలు, రక్షణకు తీసుకుంటున్న చర్యలు, మహిళా సాధికారితను వివరించారు. మహిళలకు ఇళ్ల పట్టాల పంపిణీ, అమ్మ ఒడి, చేయూత, చేదోడు, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ తదితర సంక్షేమ పథకాలతో మహిళలకు వైఎస్ జగన్ ప్రభుత్వం అండగా ఉంటోందని తెలియజేశారు. ‘దిశ’ యాప్, దిశ పోలీస్స్టేషన్ల ద్వారా మహిళలు, బాలికల భద్రతకు ప్రభుత్వం భరోసా ఇస్తోందని వివరించారు. కాగా, ఏపీ ప్రభుత్వ మహిళా సంక్షేమ కార్యక్రమాలను తెలుసుకునేందుకు జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌తో పాటు వివిధ రాష్ట్రాల ప్రతినిధులు ఆసక్తి వ్యక్తం చేసినట్లు వాసిరెడ్డి పద్మ చెప్పారు. -
Tamilisai Soundararajan: మహిళలకు అనుక్షణం అండగా ఉంటాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆపదలో ఉన్న ప్రతి మహిళకు అండగా ఉంటానని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చెప్పారు. మహిళల సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకే రాజ్‌భవన్‌లో మహిళా దర్బార్ ఏర్పాటు చేశామన్నారు. సోమవారం రాజ్‌భవన్‌లో జరిగిన మహిళా దర్బార్‌లో జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖాశర్మతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ.. మహిళల కోసం మాత్రమే ఈ దర్బార్ కృషి చేస్తుందని, వివాదాలకు తావులేకుండా వీలైనంత వేగంగా సమస్యను పరిష్కరించడమే దీని లక్ష్యమని చెప్పారు. మహిళల సమస్యలను పరిష్కరించేందుకు జూన్ 10న ఏర్పాటు చేసిన మహిళా దర్బార్‌కు అనూహ్య స్పందన వచ్చిందని.. దాదాపు 500 మంది మహిళలు హాజరై తమ సమస్యలు చెప్పుకొన్నారని వివరించారు. అందులో న్యాయ సంబంధిత అంశాలు 41 ఉన్నాయని.. ఆయా కేసులకు సంబంధించి లీగల్ సర్వీసెస్ అథారిటీ, సెంటర్ ఫర్ ప్రాక్టీసింగ్ లా తరఫున పరిష్కరించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. మహిళల సమస్యల పరిష్కారంలో జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ) చురుకుగా పనిచేస్తోందని ప్రశంసించారు. రాష్ట్రంలో భారీగా పెండింగ్ కేసులు.. తెలంగాణలో పెద్ద సంఖ్యలో మహిళల సమస్యలకు సంబంధించి పెండింగ్ కేసులు ఉన్నాయని ఎన్సీడబ్ల్యూ చైర్పర్సన్ రేఖాశర్మ చెప్పారు. మహిళలకు ఏవైనా సమస్యలు ఉంటే తొలుత పోలీసులకు ఫిర్యాదు చేయాలని.. అక్కడ స్పందన రాకుంటే రాష్ట్ర మహిళా కమిషన్‌కుగానీ, జాతీయ మహిళా కమిషన్‌కు గానీ ఫిర్యాదు చేయాలని సూచించారు. గవర్నర్ తమిళిసై మహిళా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తుండటం గొప్ప విషయమని ప్రశంసించారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ గవర్నర్ స్థాయి వ్యక్తులు ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టలేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళలపై ఇటీవల జరిగిన ఘటనలకు సంబంధించి ‘యాక్షన్ టేకెన్ రిపోర్టు (ఏటీఆర్)’ ఇవ్వాలని ఎన్సీ డబ్ల్యూ కోరిందని.. కానీ ఇప్పటికీ ఆ వివ రాలు అందలేదని, దీనిపై డీజీపీని కలిసి చర్చి స్తానని చెప్పారు. కాగా ఈ కార్యక్రమానికి 41 మంది బాధిత మహిళలను పిలవగా 27 మంది హాజరయ్యారు. వారికి లీగల్ కౌన్సెలింగ్‌తో పాటు న్యాయ పరమైన అంశాల్లో సహకారం అందించేందుకు వీలుగా పూర్తి వివరాలను తీసుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కవాడిగూడకు చెందిన జ్యోతి, మల్కాజ్‌గిరికి చెందిన ఉమారాణి, ఆత్మకూరుకు చెందిన సంధ్యకు ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున ఆర్థికసాయం అందించారు. -
మహిళలపై దాడులను వేగంగా విచారించాలి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మహిళలు, బాలికలపై జరిగిన అత్యాచారాలు, దాడుల ఘటనలపై విచారణ వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖా శర్మకు బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతామూర్తి విజ్ఞప్తిచేశారు. ఈమేరకు సోమవారం మహిళా మోర్చా నాయకులతో కలిసి ఆమె వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో మైనర్ బాలికలు, మహిళలపై హేయమైన దాడులు జరుగుతున్నందున, ఇటీవల చోటుచేసుకున్న కొన్ని ఘటనలపై వేగంగా దర్యాప్తు జరిగేలా ఒక కమిటీని నియమించాలని కోరారు. ఈ ఘటనల్లో నిందితులను వీలైనంత తొందరగా శిక్షించేలా, బాధితులకు ఆర్థిక సహకారంతో పాటు బాలికలకు తగిన విద్య అందేలా ఆదేశాలివ్వాలన్నారు. ఈ ఘటనలపై రాష్ట్రప్రభుత్వానికి పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినా ఎలాంటి స్పందన లేదని, బాధితులు, వారి కుటుంబసభ్యులకు స్వాంతన చేకూర్చే చర్యలేవీ తీసుకోలేదని తెలిపారు. ఫిర్యాదులు చేస్తున్నా తగిన చర్యలు తీసుకోకుండా పోలీసు అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని చైర్పర్సన్ దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్రంలో మహిళలు, బాలికల భద్రతకు ప్రమాదం ఏర్పడిందని, ఒక్క జూలైలోనే ఐదు అత్యాచార ఘటనలు వెలుగుచూశాయని ఆందోళన వ్యక్తంచేశారు. -
ఆయన్ను తొలగించండి: పంజాబ్ సీఎంకు మీటూ సెగ
చండీగఢ్: అనూహ్య పరిణామాల మధ్య పంజాబ్ కొత్త ముఖ్యమంత్రిగా చరణ్‌జిత్ సింగ్ చన్నీని కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింది. రాష్ట్రానికి మొదటి దళిత సీఎంగా ఇంకా పూర్తి బాధ్యతలు చేపట్టకముందే ఛన్నీపై గతంలో చెలరేగిన మీటూ వివాదాల సెగ తాకింది. మీటూ ఆరోపణలొచ్చిన చన్నీని సీఎంగా ఎంపిక చేయడంపై జాతీయ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ రేఖా శర్మ అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పదవికి ఆయన అనర్హుడని, ఆయనను తొలగించాలని సోనియా గాంధీకి విజ్ఞప్తి చేశారు. 2018 లో చన్నీపై వచ్చిన మీటూ ఆరోపణలను రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించిందని రేఖా శర్మ గుర్తు చేసుకున్నారు. దీనిపై ఆందోళన చేసినా చర్యలేవీ లేకపోగా, తాజాగా అలాంటి వ్యక్తిని సీఎంగా ఎంపిక చేయడం శోచనీయమన్నారు. ఒక మహిళ (సోనియా గాంధీ) నేతృత్వంలోని పార్టీలో ఈ పరిణామం తీవ్ర ద్రోహమన్నారు. ఈ చర్య మహిళల భద్రతకు ముప్పు అని రేశాఖర్మ వ్యాఖ్యానించారు. దీనిపై సమగ్రవిచారణ జరిపి, బాధిత మహిళ స్టేట్‌మెట్‌ను పరగణనలోకి తీసుకుని, చన్నీపై చర్యలు తీసుకోవాలని ఆమె సోనియాను కోరారు. పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ, అమరీందర్‌మధ్య మధ్య నెలరోజుల పాటు సాగిన సంక్షోభం నేపథ్యంలో కెప్టెన్ పదవినుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు సీఎంగా చరణ్‌జిత్ సింగ్ చన్నీ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్బంగా ఇసుక మాఫియాపై చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ హాజరైన ఈ వేడుకకు మాజీ సీఎం అమరీందర్ సింగ్ గైర్హాజరు కావడం గమనార్హం. కాగా 2018లో తనకు చరణ్‌జీత్ అసభ్య మెసేజ్‌లు పంపారంటూ ఒక మహిళా ఐఏఎస్ ఆఫీసర్ ఆరోపణలు గుప్పించారు. అయితే తనపై ఆరోపణలు చేసిన అధికారిణికి క్షమాపణలు చెప్పడంతో ఆ వివాదం అక్కడితో ముగిసినట్టు అంతా భావించారు. Today, he has been made Punjab CM by a party that is headed by a woman. It is betrayal. He is a threat to women safety. An enquiry should be conducted against him. He is not worthy to be CM. I urge Sonia Gandhi to remove him from the CM post: NCW Chairperson Rekha Sharma (1/2) pic.twitter.com/56kjw4XG7F — ANI (@ANI) September 20, 2021 -
Twitter: అసభ్య సమాచారం తొలగించండి
న్యూఢిల్లీ: ట్విట్టర్ ప్లాట్‌ఫామ్ నుంచి అసభ్య, పోర్నోగ్రఫిక్ డేటాను వారంలోగా పూర్తిగా తొలగించాలని జాతీయ మహిళ కమిషన్ బుధవారం ఆ సంస్థను ఆదేశింంది. అలాగే, దీనికి సంబంధిం సమగ్ర దర్యాప్తు జరిపి, బాధ్యులపై చర్య తీసుకోవాలని కమిషన్ అధ్యక్షురాలు రేఖా శర్మ ఢిల్లీ పోలీస్ కమిషనర్‌ను ఆదేశించారు. కొన్ని ట్విటర్ ఖాతాలు అసభ్య వీడియోలు, సందేశాలను షేర్ చేస్తున్న విషయాన్ని గుర్తించామని, వీటిని తొలగించాలని ఆదేశిస్త ట్విటర్ ఎండీకి లేఖ రాశామని కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఆయా ఖాతాల వివరాలను కూడా అందించామని పేర్కొంది. గతంలోనూ ఇదే తరహాలో కమిషన్ ఇచ్చిన ఆదేశాలను ట్విటర్ పట్టించుకోకపోవడం గమనార్హం. -
చైల్డ్ పోర్నోగ్రఫీ కంటెంట్‌పై ట్విటర్ వివరణ
పిల్లల అశ్లీల కంటెంట్ ను పోస్ట్ చేయడానికి అనుమతించినందుకు ట్విటర్ పై నిన్న ఢిల్లీ పోలీసులు కేసు దాఖలు చేశారు. అయితే, నేడు ఆ చైల్డ్ పోర్నోగ్రఫీ కంటెంట్ కేసుపై సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్ స్పందించింది. పిల్లల అశ్లీల కంటెంట్ విషయాల్లో సంస్థ జీరో-టాలరెన్స్ పాలసీని కలిగి ఉన్నట్లు తెలిపింది. సంస్థ మార్గదర్శకాలను ఉల్లంఘించే కంటెంట్ ను ముందుగానే గుర్తించి తొలగిస్తుందని, అటువంటి విషయాల్లో చట్టానికి సహకరిస్తామని కంపెనీ తెలిపింది. "ట్విటర్ నిబంధనలను ఉల్లంఘించే కంటెంట్ ను ముందుగా గుర్తించి తొలగించడంలో మేము కృషి చేస్తున్నాము. ఈ సమస్యను పరిష్కరించడం కోసం, భారతదేశంలోని చట్టాల అమలు కోసం ఎన్జిఓ భాగస్వాములతో పనిచేస్తాము" అని ట్విటర్ ప్రతినిధి ఎఎన్ఐకు తెలిపారు . జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్(ఎన్సీపీసీఆర్) దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా నిన్న(జూన్ 29) ఢిల్లీ పోలీస్ సైబర్ సెల్ ట్విటర్ పై కేసు నమోదు చేసింది. అశ్లీల కంటెంట్ ను తొలగించాలని, మైక్రోబ్లాగింగ్ సైట్ లో సర్క్యులేట్ చేసిన ఖాతాల వివరాలను పంచుకోవాలని ట్విటర్ ను కోరినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(సైబర్ సెల్) అన్యేష్ రాయ్ తెలిపారు. జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యు) ట్విటర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ను ఒక వారంలోగా మీడియా వేదిక నుంచి అన్ని అశ్లీల కంటెంట్ ను తొలగించాలని కోరింది. ఈ విషయంపై దర్యాప్తు చేసి తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎన్సీడబ్ల్యు చైర్ పర్సన్ రేఖా శర్మ ఢిల్లీ పోలీసు కమిషనర్ కు లేఖ రాశారు. చదవండి: వాట్సాప్ వార్నింగ్.. ఈ యాప్ వాడితే మీ అకౌంట్ బ్లాక్ -
మాదొక విన్నపం మేడం.. అసలేంటి ఇదంతా?!
న్యూఢిల్లీ/ముంబై: జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ) చీఫ్ రేఖా శర్మపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఆమె, లవ్ జిహాద్ కేసులు అంటూ విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించడం సరికాదంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొష్యారీతో మంగళవారం రేఖా శర్మ భేటీ అనంతరం ఎన్సీడబ్ల్యూ తన అధికార ట్విటర్లో పేర్కొన్న అంశాలే ఇందుకు కారణం. ‘‘మా చైర్ పరస్సర్ రేఖా శర్మ, మహారాష్ట్ర గవర్నర్ శ్రీ భగత్ సింగ్ కొష్యారీని కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మహిళల భద్రత, ఆడవాళ్లపై వేధింపులు, కోవిడ్ సెంటర్లలో మహిళా పేషెంట్లపై జరుగుతున్న లైంగిక దాడులు, లవ్ జిహాద్ కేసుల గురించి చర్చించారు’’ అని ఎన్సీడబ్ల్యూ పేర్కొంది. ఇందుకు స్పందించిన నెటిజన్లు, రేఖా శర్మ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: నా ఒడి నింపే వేడుక..ఇప్పుడేంటి!?) రేఖా శర్మ గారు మాదొక విన్నపం ‘‘మాదొక విన్నపం రేఖా శర్మగారు. లవ్ జిహాద్ అన్న పదానికి నిర్వచనం ఏమిటి? కొంతమంది అతివాదులు ఉపయోగించే ఈ పదాన్ని బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మీరు వాడటమేమిటి? చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని వివాదాలు సృష్టించే వారి తరఫున మీరు మాట్లాడుతున్నారా?’’అంటూ ఓ నెటిజన్ ప్రశ్నలు సంధించారు. ‘‘ఇది నిజంగా బాధ్యతారాహిత్యమే. లవ్ జిహాద్ అనే పదం ఉపయోగించి ఓ వర్గాన్ని టార్గెట్ చేయడం ఎంతమాత్రం సరికాదు. మైనారిటీలు, మహిళలపై అత్యాచారాలు పెరుగుతున్న తరుణంలో మరింత రెచ్చగొట్టేవిధంగా వ్యాఖ్యలు చేయడం దేనికి సంకేతం. రైట్ వింగ్ భావజాలం ఉన్న ఓ మహిళ ఇలాంటి బాధ్యతాయుతమైన పదవి ఎలా చేపట్టగలిగారు. ఇటువంటి వ్యక్తుల కారణంగా దేశంలోని మహిళలకు, లౌకిక వాదుల భద్రతకు ప్రమాదం పొంచి ఉన్నది. మేజర్లు అయిన వ్యక్తులు తమకు నచ్చిన వారిని ప్రేమించి, పెళ్లి చేసుకునే హక్కు లేదా? ఆమెను పదవి నుంచి తక్షణమే తొలగించాలి’’ అంటూ మరొకరు డిమాండ్ చేశారు. అనుమానాస్పద కార్యకలాపాలు అంతేగాకుండా గతంలో రాజకీయ నాయకులు, ముఖ్యంగా మహిళా నేతల గురించి రేఖా శర్మ గతంలో చేసిన వివాదాస్పద ట్వీట్లను షేర్ చేస్తూ ఆగ్రహాన్ని ప్రదర్శించారు. ఈ క్రమంలో తనపై వస్తున్న విమర్శలపై స్పందించిన రేఖా శర్మ, తన ట్విటర్ అకౌంట్ ద్వారా జరిగిన కార్యకలాపాలు అనుమానాస్పదంగా ఉన్నాయని, ఈవిషయం గురించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్లు పేర్కొన్నారు. దీంతో లోతుగా విచారణ చేపట్టి సమస్యను పరిష్కరిస్తామని చెప్పినట్లు పేర్కొన్నారు. కాగా ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ తనిష్క్ ఇటీవల రూపొందించిన యాడ్ వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ముస్లిం కుటుంబంలోని హిందూ కోడలికి సీమంతం నిర్వహించే థీమ్‌తో రూపొందించిన ఈ వీడియో కారణంగా లవ్ జిహాద్ అంశం మరోసారి చర్చనీయాంశమైంది. ఈ విషయం గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం రేగుతున్న తరుణంలో ఎన్సీడబ్యూ చీఫ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇక ట్రోలింగ్ నేపథ్యంలో తనిష్క్ తన యాడ్ తొలగించిన విషయం తెలిసిందే. Our Chairperson @sharmarekha met with Shri Bhagat Singh Koshyari, His Excellency, Governor of Maharashtra & discussed issues related to #womensafety in the state including defunct One Stop Centres, molestation & rape of women patients at #COVID centres & rise in love jihad cases pic.twitter.com/JBiFT477IU — NCW (@NCWIndia) October 20, 2020 -
కశ్యప్‌పై పాయల్ లైంగిక దాడి ఆరోపణలు
ముంబై: బాలీవుడ్ చిత్ర నిర్మాత అనురాగ్ కశ్యప్ తనపై లైంగిక దాడి చేశారంటూ నటి పాయల్ ఘోష్ ఆరోపించారు. తనకు న్యాయం చేయాలంటూ ప్రధాని మోదీని కోరారు. శనివారం ఆమె ట్విట్టర్లో..‘అనురాగ్ కశ్యప్ నాపై చాలా తీవ్రంగా ఒత్తిడి తెచ్చాడు. నరేంద్ర మోదీజీ.. ఈ విషయంలో చర్య తీసుకోండి. కశ్యప్‌లోని రాక్షస కోణాన్ని ప్రజలకు చూపెట్టండి. ఇలా వెల్లడించడం నాకు హాని చేస్తుందని, నా భద్రతకు ముప్పు అని నాకు తెలుసు. సాయం చేయండి’ అని కోరారు. దీనిపై జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖా శర్మ స్పందించారు. పూర్తి వివరాలతో ఫిర్యాదు చేస్తే తాము చర్య తీసుకుంటామని ట్విట్టర్లో పేర్కొన్నారు. పటేల్‌కి పంజాబీ బీబీ అనే సినిమాలో, నిభానా సాథియా అనే టీవీ కార్యక్రమంలో పాయల్ ఉన్నారు. ఇప్పటికే నటి కంగనా రనౌత్, దర్శకుడు అనురాగ్ కశ్యప్ మధ్య మాటల యుద్ధం నడుస్తున్న నేపథ్యంలో పాయల్ ఘోష్ ఆరోపణలపై కంగనా మద్దతు తెలిపారు. -
5 కోట్లు దాటిన కరోనా పరీక్షలు
న్యూఢిల్లీ: దేశంలో గత 5 రోజులుగా రోజుకు 80 వేలకు పైగా, గత రెండు రోజులుగా రోజుకు 90 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, సోమవారం కేసులు తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 75,809 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 42,80,422 కు చేరుకుంది. గత 24 గంటల్లో 1,133 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 72,775 కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 33,23,950 కు చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 8,83,697 గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 20.65 శాతం ఉన్నాయి. దేశంలో కరోనా రికవరీ రేటు క్రమంగా పెరుగుతోంది. శనివారానికి ఇది 77.65 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు 1.7 శాతం వద్ద స్థిరంగా ఉందని తెలిపింది. సెప్టెంబర్ 7 వరకు 5,06,50,128 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. సోమవారం మరో 10,98,621 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది. ఇప్పటి వరకూ దేశంలో దాదాపు 5 కోట్ల పరీక్షలు చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. గత రెండు వారాల్లోనే దాదాపు 1.33 కోట్లకు పైగా పరీక్షలు చేసినట్లు పేర్కొంది. తాజా 1,016 మరణాల్లో అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 423 మంది మరణించారు. మొత్తం మరణాల్లో కూడా మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతోంది. తర్వాతి స్థానాల్లో తమిళనాడు, కర్ణాటకలు ఉన్నాయి. కేంద్ర రాష్ట్రాలు సమన్వయంతో పని చేస్తుండటంతో కరోనాను కట్టడి చేయగలుగుతున్నామని, టెస్ట్, ట్రాక్, ట్రీట్ అనే త్రిముఖ వ్యూహంతో ముందుకెళుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో మొత్తం 1,668 ల్యాబుల్లో కరోనా నిర్థారణ పరీక్షలు చేస్తున్నారు. మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తర ప్రదేవ్ రాష్ట్రాల్లోనే దాదాపు 62 శాతం కేసులున్నాయని కేంద్ర మంత్రిత్వ శాఖ చెప్పింది. ప్రతి మిలియన్ మందికి 36,703 పరీక్షలు చేసినట్లు కేంద్రం తెలిపింది. దేశంలో ప్రతి పదిలక్షల జనాభాకు రోజుకు 758 పరీక్షలు జరుగుతున్నట్లు వెల్లడించింది. ఎన్సీడబ్ల్యూ చీఫ్ రేఖా శర్మకు పాజిటివ్ జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ)చీఫ్ రేఖా శర్మ కరోనా వైరస్ బారిన పడ్డారు. తనకు కరోనా పాజిటివ్ నిర్థారణ కావడంతో హోం క్వారంటైన్లో ఉంటున్నట్లు మంగళవారం ఆమె స్వయంగా తెలిపారు. ప్రస్తుతం జలుబుతో బాధపడుతున్నట్లు పేర్కొన్నారు. -
టిక్‌టాక్‌ను పూర్తిగా నిషేధించాలి: ఎన్సీడబ్ల్యూ
న్యూ ఢిల్లీ : అసభ్యకరమైన వీడియోలతో యువతను టిక్‌టాక్ పెడదోవ పట్టిస్తుందని జాతీయ మహిళా కమిషన్ ఛైర్మన్ రేఖా శర్మ ధ్వజమెత్తారు. టిక్‌టాక్‌ను పూర్తిగా నిషేధించాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు ఆమె తెలిపారు. సోషల్ మీడియా యాప్ టిక్‌టాక్‌ను యువత అత్యంత ఎక్కువ వినియోగిస్తున్న విషయం తెలిసిందే. సరాదా కోసం వినియోగించే టిక్‌టాక్ ప్రస్తుతం హింసను రెచ్చగొట్టే విధంగా తయారవుతోంది. మహిళలపై అత్యాచార వీడియోలు యాసిడ్ దాడులను ప్రోత్సహించే విధంగా టిక్‌టాక్‌లో వీడియోలు చేస్తున్నారని బీజేపీ నాయకుడు తాజిందర్ సింగ్ బగ్గా చేసిన ట్వీట్‌పై ఆమె స్పందించారు. (వ్యాక్సిన్ లేకుండానే కరోనా కట్టడి.. ప్రయోగం సక్సెస్! ) I am of the strong openion that this @TikTok_IN should be banned totally and will be writting to GOI. It not only has these objectionable videos but also pushing youngsters towards unproductive life where they are living only for few followers and even dying when no. Decline. https://t.co/MyeuRbjZAy — Rekha Sharma (@sharmarekha) May 19, 2020 టిక్‌టాక్‌లో అసభ్యకరమైన వీడియోలు పోస్ట్ చేయడంతోపాటు హింసను ప్రేరేపిస్తున్నారని రేఖ శర్మ మండిపడ్డారు. టిక్‌టాక్‌ను పూర్తిగా నిషేధించాలని కేంద్రానికి లేఖ రాయనున్నట్లు పేర్కొన్నారు. కాగా యాసిడ్ దాడులను ప్రోత్సహించే విధంగా టిక్‌టాక్ కంటెంట్ క్రియేటర్ ఫైజల్ సిద్దిఖీ వీడియో పోస్ట్ చేశారు. ఇతనికి 13.4 మిలియన్లకు పైగా అనుచరులు ఉన్నారు. ఈ క్రమంలో ఇలాంటి అభ్యంతరకరమైన వీడియోలను పోస్ట్ చేయడం ద్వారా సమాజంపై చెడు ప్రభావం పడుతుందని, అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళ కమిషన్ మహారాష్ట్ర డీజీపీకి లేఖ రాసింది. ఫైజల్ చేసిన పోస్ట్‌ను వెంటనే తొలగించాలని ఎన్సీడబ్ల్యూ డిమాండ్ చేసింది. (మహేశ్ జిమ్ బాడీ చూసి ఫ్యాన్స్ ఫిదా! ) సల్మాన్‌ను టార్గెట్ చేసిన సింగర్ సోనా @NCWIndia has written to @DGPMaharashtra Shri. Subodh Kumar Jaiswal to take action against #FaizalSiddiqui for the video he posted that promotes a grievous crimes of #acidattack on social media using @TikTok_IN App. @CyberDost @MahaCyber1 pic.twitter.com/pcjyXtGiJG — NCW (@NCWIndia) May 18, 2020 -
పోలీసుల తీరుపై మహిళా కమిషన్ అసంతృప్తి
సాక్షి, న్యూఢిల్లీ/ హైదరాబాద్: ప్రియాంకపై లైంగికదాడి, హత్య ఘటనపై జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్య్లూ) స్పందించింది. జరిగిన ఘటన చాలా దారుణమని కమిషన్ చైర్పర్సన్ రేఖాశర్మ అభివర్ణించారు. ప్రియాంక అదృశ్యమవగానే పోలీసులు స్పందించిన తీరుపైనా ఆమె ట్వీట్లో అసంతృప్తి వ్యక్తం చేశారు. అమ్మాయి కనిపించకండా పోగానే వెతకకుండా ఎవరితోనో వెళ్లిపోయిందని ఎలా నిందిస్తారని ఆమె ప్రశ్నించారు. ప్రియాంక హత్య కేసులో దోషులను ఉరితీయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబ సభ్యులకు సాయం చేసేందుకు, కేసు త్వరగా విచారణ జరిపి చర్యలు తీసుకునేలా పోలీసులతో స్వమన్వయం చేసుకునేందుకు తమ ప్రతినిధులను పంపనున్నట్లు తెలిపారు. సదరు పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీ, తెలంగాణ సీఎంవో కార్యాలయానికి సూచించారు. ఊహే భయానకంగా ఉంది: రాహుల్ ప్రియాంక హత్య తనను తీవ్రంగా కలచివేసిం దని కాంగ్రెస్ నేత రాహుల్ అన్నారు. ఒక మనిషి సాటి మనిషిపై ఇంత క్రూరంగా ఎలా దాడికి పాల్పడతాడనేది ఊహే భయానకంగా ఉందన్నారు. బాధితురాలి కుటుంబ సభ్యుల కోసం ప్రార్థిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
మతం కన్నా సమానత్వం ముఖ్యం
సాక్షి, న్యూఢిల్లీ : శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై దేశ వ్యాప్తంగా మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రార్థనా ప్రదేశాల్లో స్త్రీ పురుష భేదం లేకుండా అందరీకి సమాన హక్కులు కల్పించేందుకు ఈ తీర్పు దోహద పడుతోందని మహిళలు అనందం వ్యక్తం చేస్తున్నారు. ఏ వయసు మహిళలైనా శబరిమల ఆలయంలోకి ప్రవేశించవచ్చని, ఇప్పటి వరకు కొనసాగుతూ వస్తున్న నిషేధాన్ని ఎత్తివేస్తూ సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. మతం కన్నా, సమానత్వం ముఖ్యం.. సుప్రీం తీర్పుపై కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ స్పందించారు. శబరిమల ఆలయంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అద్భుతమైనదిగా ఆమె వర్ణించారు. హిందుత్వంలో స్త్రీ, పురుష భేదం లేదని న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసిందని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ తీర్పు తనకెంతో ఆనందం కలిగించిందని అన్నారు. మతం కన్నా, సమానత్వం ముఖ్యమైనదని సుప్రీంకోర్టు రుజువు చేసిందని జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ వ్యాఖ్యానించారు. ఆలయంలోకి మహిళ ప్రవేశంతో అందరికీ సమాన హక్కుని కల్పించిందన్నారు. తమ పోరాటానికి ఫలితం దక్కిందన్నారు. శబరిమలలోకి మహిళల ప్రవేశానికి సుప్రీం గ్రీన్ సిగ్నల్ అంబేద్కర్ నిజంగా గొప్పవాడు.. రాజ్యాంగం అమలులోకి వచ్చిన ఇన్నేళ్లకు మహిళలకు న్యాయం జరిగిందని కర్ణాటక మహళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి జయమాల సంతోషం వ్యక్తం చేశారు. తన జీవితంతో ఇంతగా సంతోష పడిన రోజు ఇంకోకటి లేదని.. రాజ్యాంగాన్ని నిర్మించి మహిళల హక్కులు గుర్తించిన అంబేద్కర్ నిజంగా గొప్పవాడని గుర్తు చేసుకున్నారు. వీరే కాకుండా అనేక మంది మహిళా ఉద్యమ నేతలు తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా తాము పోరాడుతున్న దానికి ఇప్పుడు ఫలితం దక్కిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
‘ఆ రిజర్వేషన్లు కేవలం వారి కోసమే’
సాక్షి, న్యూఢిల్లీ : మహిళా రిజర్వేషన్ల బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందినా అవి కేవలం రాజకీయ నాయకుల బిడ్డలకు, భార్యలకు మాత్రమే దక్కే అవకాశం ఉందని జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖా శర్మ అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో మహిళా కమిషన్ శుక్రవారం నిర్వహించిన ‘భారతదేశంలో మహిళల రాజకీయ పాత్ర, ప్రాతినిధ్యం’ అనే అంశంపై ఆమె మాట్లాడుతూ... ‘ దేశంలో మహిళలు స్వశక్తితో ఎదగాలి. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభిస్తే.. అది కేవలం రాజకీయ నాయకుల కుటుంబాలకు మాత్రమే లబ్ధి చేకూరుస్తుంది. మీ లాంటి, మా లాంటి సామాన్య మహిళకు ప్రాతినిధ్యం వహించే అవకాశం రాదు. 50 శాతం మహిళా జనాభా ఉన్నప్పుడు అంతే శాతం రాజకీయాల్లో కూడా ఉండాలి. అది మహిళల హక్కు. ప్రస్తుతం గ్రామ పంచాయతీ స్థాయిలో ఎన్నికైన మహిళలకు రాజకీయ హక్కును వారి భర్తలే హరిస్తున్నారు. పేరుకే మహిళా ప్రజా ప్రతినిధి. అధికారాలన్నీ పురుషులే చలాయిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు వస్తున్నాయో కూడా వారికి తెలియదు. వారు కేవలం సంతకాలకే పరిమితం అవుతున్నారు’ అంటూ వ్యాఖ్యానించారు. చదువుకున్న యువతులు రాజకీయంగా ఎదగడనికి ప్రయత్నించాలని సూచించారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాల్లో మహిళా బిల్లు చర్చకు రానున్న నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. పార్లమెంట్లో, అసెంబ్లీలో మహిళలకు 33 శాతం రిజరేషన్ల బిల్లు రాజ్యసభలో ఆమోదం పొంది ప్రస్తుతం లోక్‌సభలో పెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. -
హాదియాకు బెదిరింపులు: మహిళా కమిషన్
కొచ్చి: కేరళలో బాలికల బలవంతపు మతమార్పిడులు ఆందోళనకరంగా మారిందని జాతీయ మహిళాకమిషన్ ఇంచార్జ్ చైర్మన్ రేఖా శర్మ ఆరోపించారు. కేరళలో హాదియా (24) అనే యువతి ‘లవ్ జిహాద్’లో చిక్కుకున్నాననడంతో ఈ విషయం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ఎన్సీడబ్ల్యూ చైర్మన్ కేరళలోని కొట్టాయం జిల్లా వైకోమ్లో బాధితురాలిని పరామర్శించారు. ‘హాదియా ఆరోగ్యం బాగుంది. ఇక్కడెవరూ ఆమెను కొట్టడం లేదు. సుప్రీంకోర్టు ముందు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉంది. కొందరు ఆమెను బెదిరిస్తున్నారు. కొందరు బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఇదేమీ చిన్న విషయం కాదు. పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది’ అని రేఖా శర్మ వెల్లడించారు. -
కోర్టుకు హాజరైన ఎంపీ, ఎమ్మెల్యే
ఆదిలాబాద్ క్రైం : 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎన్నికల నియమావళి ఉల్లంఘించినట్లు ఆదిలాబాద్ ఎంపీ గొడాం నగేశ్, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖాశ్యాంనాయక్లపై అప్పట్లో ఇంద్రవెల్లిలో కేసు నమోదైంది. ఆ కేసుకు సంబంధించి శుక్రవారం ఎంపీ, ఎమ్మెల్యేలు ఆదిలాబాద్ ప్రథమ శ్రేణి న్యాయస్థానానికి హాజరయ్యారు. విచారణ అనంతరం కేసును కొట్టివేస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది. -
'భర్త రేప్ చేసినా శిక్ష వేయాల్సిందే'
న్యూఢిల్లీ: భర్త కానీ ఇతరులు కానీ ఎవరు అత్యాచారం చేసినా నేరంగా పరిగణించాలని జాతీయ మహిళా సంఘం (ఎన్సీడబ్ల్యూ) సభ్యురాలు రేఖా శర్మ డిమాండ్ చేశారు. భారతీయుల విషయంలో భార్యాభర్తల సంబంధాలను అత్యాచారంగా పరిగణించడం సరికాదని పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం పేర్కొనడంపై ఆమె స్పందించారు. 'మత విశ్వాసాల పేరిట భర్తలతో భార్యలు చిత్రహింసలు పడటాన్ని సహించలేం. జంతువుల పరిరక్షణకు కూడా చట్టాలు ఉన్నాయి. ఎవరు అత్యాచారం చేసినా అత్యాచారమే. భర్త అయినా మరొకరయినా ఒకే శిక్ష వేయాలి' అని రేఖా శర్మ ట్వీట్ చేశారు. భారతీయుల విషయంలో భార్యాభర్తల మధ్య అత్యాచార ఘటనగా పరిగణించలేమని రాజ్యసభలో కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ అన్నారు. కాగా ప్రపంచ వ్యాప్తంగా వివాహ సంబంధిత అత్యాచార ఘటనలను నేరంగా పరిగణిస్తున్నారని, వ్యతిరేకంగా చట్టాలున్నాయని, మన దేశంలో ప్రత్యేకత ఎందుకని రేఖా శర్మ ప్రశ్నించారు.