న్యూఢిల్లీ: రాజ్యసభ ఎంపీగా కొత్తగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత స్వాతిమలివాల్ ప్రమాణస్వీకారంపై వివాదం కొనసాగుతోంది. ఈ విషయంలో ఆమెపై జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేఖా శర్మ ట్రోల్ చేస్తూ ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్ట్ పెట్టారు. ‘స్వాతిమలివాల్ ఆందోళనల్లో నుంచి పుట్టిన ప్రోడక్టు. ఆమెకు నినాదాలు మాత్రమే తెలుసు. ఆమె తన చిన్న మెదడును అసలే వాడదు. బడ్జెట్ అంటే ఆమెకు ఏం తెలియదు.
అయినా బడ్జెట్‌పై ఆమె నిపుణురాలు అనుకుంటోంది’ అని పోస్టులో రేఖాశర్మ వ్యంగ్యాస్రాలు సంధించింది.రేఖాశర్మ పోస్టుపై స్వాతిమలివాల్ అంతే ఘాటుగా స్పందించారు. ‘నేను ఆందోళనల్లో నుంచి పుట్టానని గర్వంగా చెప్పుకుంటున్నాను. నా జీవితం సామాజిక సేవకు అంకితం చేశాను.మహిళా కమిషన్ చైర్మన్‌గా మీరు ఫెయిల్ అయ్యారు. వెంటనే మీరు మీ పదవికి రాజీనామా చేసి ట్రోలింగ్ చేసుకోండి’అని రేఖాశర్మపై స్వాతి ఫైర్ అయ్యారు.
జనవరి 31న రాజ్యసభ ఎంపీగా ప్రమాణం చేసిన స్వాతిమలివాల్ చివర్లో ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదమిచ్చారు.దీనిపై రాజ్యసభ చైర్మన్ జగదీప్ దన్‌కడ్ అభ్యంతరం తెలిపారు. మళ్లీ ఆమెతో ప్రమాణం చేయించారు. తొలిసారి చేసిన ప్రమాణస్వీకారాన్ని రాజ్యసభ రికార్డుల నుంచి తొలగించారు. స్వాతిమలివాల్ గతంలో ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా పనిచేయడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment