Rajyasabha MP
-
స్వాతి మలివాల్ వర్సెస్ రేఖాశర్మ.. సోషల్ మీడియాలో డైలాగ్ వార్
న్యూఢిల్లీ: రాజ్యసభ ఎంపీగా కొత్తగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత స్వాతిమలివాల్ ప్రమాణస్వీకారంపై వివాదం కొనసాగుతోంది. ఈ విషయంలో ఆమెపై జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖా శర్మ ట్రోల్ చేస్తూ ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్ట్ పెట్టారు. ‘స్వాతిమలివాల్ ఆందోళనల్లో నుంచి పుట్టిన ప్రోడక్టు. ఆమెకు నినాదాలు మాత్రమే తెలుసు. ఆమె తన చిన్న మెదడును అసలే వాడదు. బడ్జెట్ అంటే ఆమెకు ఏం తెలియదు. అయినా బడ్జెట్‌పై ఆమె నిపుణురాలు అనుకుంటోంది’ అని పోస్టులో రేఖాశర్మ వ్యంగ్యాస్రాలు సంధించింది.రేఖాశర్మ పోస్టుపై స్వాతిమలివాల్ అంతే ఘాటుగా స్పందించారు. ‘నేను ఆందోళనల్లో నుంచి పుట్టానని గర్వంగా చెప్పుకుంటున్నాను. నా జీవితం సామాజిక సేవకు అంకితం చేశాను.మహిళా కమిషన్ చైర్మన్‌గా మీరు ఫెయిల్ అయ్యారు. వెంటనే మీరు మీ పదవికి రాజీనామా చేసి ట్రోలింగ్ చేసుకోండి’అని రేఖాశర్మపై స్వాతి ఫైర్ అయ్యారు. జనవరి 31న రాజ్యసభ ఎంపీగా ప్రమాణం చేసిన స్వాతిమలివాల్ చివర్లో ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదమిచ్చారు.దీనిపై రాజ్యసభ చైర్మన్ జగదీప్ దన్కడ్ అభ్యంతరం తెలిపారు. మళ్లీ ఆమెతో ప్రమాణం చేయించారు. తొలిసారి చేసిన ప్రమాణస్వీకారాన్ని రాజ్యసభ రికార్డుల నుంచి తొలగించారు. స్వాతిమలివాల్ గతంలో ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా పనిచేయడం గమనార్హం. -
రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల ప్రజల మైత్రికి చిహ్నం ప్రధాని అమెరికా అధికార పర్యటన
ప్రపంచంలో ప్రజాతంత్ర పంథాలో పయనిస్తున్న రెండు అతిపెద్ద దేశాలు ఇండియా, అమెరికా మైత్రి నేడు రోజురోజుకు బలపడుతోంది. ఈ నెల 21-23 మధ్య జరిగే భారత ప్రధాని నరేంద్రమోదీ అమెరికా అధికార పర్యటనకు విశేష ప్రాధాన్యం ఉంది. అనేక చారిత్రక కారణాలు, పరిస్థితుల వల్ల 1947 నుచి 1990ల ఆరంభం వరకూ భారత-అమెరికా ప్రజల మధ్య సుహృద్భావ సంబంధాలు ఉన్నంతగా ఈ రెండు దేశాల ప్రభుత్వాలు ఒకదానితో ఒకటి అంత దగ్గరగా లేవనే అభిప్రాయం నెలకొని ఉండేది. అప్పటి రెండు అగ్రరాజ్యాల మధ్య కొనసాగిన ప్రచ్ఛన్నయుద్ధం ప్రభావం రెండు ప్రజాస్వామ్య దేశాల పాలకులపై ఉండేదని రాజకీయ నిపుణులు చెబుతారు. అయితే, ప్రపంచీకరణ, సమాచార సాంకేతిక (ఐటీ) విప్లవం ఆధునిక ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చే ప్రక్రియ మొదలైన 20వ శతాబ్దం చివరిలో ఇండియా, అమెరికా ప్రభుత్వాల మధ్య కూడా సంబంధాలు బలోపేతమయ్యాయి. అన్ని రంగాల్లో రెండు పెద్ద దేశాల మధ్య స్నేహ, సహకార సంబంధాలు పటిష్ఠమవ్వడం మొదలైంది. అలా ఈ స్నేహబంధంలో వచ్చిన గొప్ప మార్పు ఈ పాతికేళ్లలో దృఢపడుతోంది. పెద్ద సంఖ్యలో ‘అవకాశాల స్వర్గం’ అమెరికా వెళ్లి స్థిరపడిన భారత సంతతి ప్రజలు ఈ మిత్ర సంబంధాలు మరింత పరిణతి చెందడానికి తమ వంతు కృషిచేస్తున్నారు. ప్రపంచంలో నేటి అత్యంత క్లిష్ట సమయంలో ఇండియాకున్న భౌగోళిక రాజకీయ ప్రాధాన్యమే అమెరికాకు కొత్త, అతి సన్నిహిత మిత్ర దేశంగా భారత్ అవతరించడానికి అతిపెద్ద కారణమని ప్రపంచ ప్రఖ్యాత ఇంగ్లిష్ పత్రిక ‘ది ఇకనామిస్ట్’ వ్యక్తం చేసిన అభిప్రాయం నూరు శాతం నిజమని అంతర్జాతీయ నిపుణులు అంగీకరిస్తున్నారు. గతంలో అమెరికా, పూర్వపు సోవియెట్ యూనియన్ మధ్య తీవ్ర పోటీ ఉన్న సమయంలో భారత పాలకులు సోవియెట్ పక్షాన ఉన్న మాట కూడా నిజమేనని చరిత్రకారులు చెబుతారు. అయితే, ‘ఇండియాకు సోవియెట్ యూనియన్ ఆదర్శ రాజ్యమని అప్పట్లో ప్రకటించిన కొందరు పెద్దలు మాత్రం తమ పిల్లలను పై చదువులకు అమెరికా పంపేవారు. అనారోగ్యం వస్తే అమెరికా ఆస్పత్రుల్లో చికిత్స చేయించు కోవడానికే ఇష్టపడేవారు,’ అని ప్రసిద్ధ భారత జర్నలిస్టు తవ్లీన్ సింగ్ వ్యగ్యంతో మేళవించి చెప్పిన మాటలు ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. అమెరికా కాంగ్రెస్ లో రెండోసారి ప్రధాని ప్రసంగించడం ఇండియాకు విశేష గౌరవం భారత ప్రధాని మోదీ వచ్చే వారం తన అధికార పర్యటనలో భాగంగా అమెరికా చట్టసభల (కాంగ్రెస్) సంయుక్త సమావేశంలో రెండోసారి ప్రసంగించబోతున్నారు. ఇలాంటి అరుదైన గౌరవం ఇప్పటి వరకూ బ్రిటిష్ ప్రధాని విన్స్టన్ చర్చిల్, దక్షిణాఫ్రికా నాయకుడు నెల్సన్ మండేలా వంటి కొద్ది మంది మహానేతలకే దక్కింది. అనేక రంగాలతోపాటు ఆర్థికరంగంలో పరుగులు పెడుతున్న ఇండియా కిందటేడాది బ్రిటన్ ను దాటి ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థికశక్తిగా అవతరించింది. అచిరకాలంలో జర్మనీ, జపాన్ దేశాలను భారత్ అధిగమించి విశ్వశక్తిగా దర్శనమిచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయని అనేక అంతర్జాతీయ సంస్థలు అంచనావేస్తున్నాయి. అందివస్తున్న అవకాశాలతో అట్లాంటిక్ మహాసముద్రం దాటి అమెరికా వెళ్లి స్థిరపడిన భారతీయుల సంఖ్య 45 లక్షలు దాటిపోయింది. ఈ ప్రవాస భారతీయులు అమెరికాతో భారత్ మైత్రీబంధం మరింత బిగయడానికి చేస్తున్న కృషికి నిదర్శనంగా భారత ప్రధాని అధికార పర్యటన నిలిచిపోతుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలోని కాపిటల్ హిల్ (చట్టసభలు–కాంగ్రెస్)లో భారత ప్రధాని వచ్చే వారం చేసే ప్రసంగం ప్రపంచంలో అతిపెద్ద, అతిగొప్ప ప్రజాస్వామ్య దేశాల మధ్య బలపడుతున్న స్నేహసంబంధాలను గొప్ప మలుపు తిప్పుతుందనడంలో సందేహం లేదు. విజయసాయిరెడ్డి, వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యులు -
ప్రత్యేక హోదాని నెరవేర్చాలని కోరతాం: ఎంపీ విజయసాయి రెడ్డి
-
సీఎం రమేశ్‌కు కరోనా పాజిటివ్
సాక్షి, అమరావతి : బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని ఆయనే స్వయంగా తన ట్విటర్లో వెల్లడించారు. ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని... డాక్టర్ల సలహా మేరకు ఐసొలేషన్‌లో ఉన్నానని ట్వీట్ చేశారు. రమేశ్‌కు కరోనా సోకిందనే వార్తలతో ఆయన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా కరోనా బారిన పడి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.(తెలంగాణలో 75వేలు దాటిన కరోనా కేసులు) -
మీ రాజ్యసభ ఎంపీలను ప్రశ్నించండి
న్యూఢిల్లీ: ప్రతిపక్షాల కారణంగానే రాజ్యసభలో విలువైన సమయం వృ«థా అవుతోందని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. ఇది ఆందోళనకరమైన విషయమని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష పార్టీలకు రాజ్యసభలో మెజారిటీ ఉన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న యువత తమ ఎంపీలను ఈ విషయమై ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. సభా సమయం వృథా కావడంపై నిలదీయాలని సూచించారు. తద్వారా జాతీయ స్థాయిలో విపక్ష పార్టీలపై ఒత్తిడి తీసుకురాగలమని అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో బుధవారం నిర్వహించిన ‘నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్–2019’లో మాట్లాడిన మోదీ.. పలువురు యువతీయువకులకు అవార్డులను అందజేశారు. మెజారిటీ వల్లే సాధ్యమైంది పార్లమెంటులో విలువైన చర్చా సమయం దుర్వినియోగం కావడంపై మోదీ మాట్లాడుతూ..‘ఎన్డీయే ప్రభుత్వానికి మెజారిటీ ఉన్న 16వ లోక్‌సభలో ఉత్పాదకత 85 శాతంగా ఉంది. గత లోక్‌సభ సమావేశాల కంటే ఇది 20 శాతం అధికం. ఈ లోక్‌సభ సమావేశాల సందర్భంగా 205 బిల్లులను ఆమోదించాం. ఇదంతా సభలో పూర్తి మెజారిటీ ఉన్నందువల్లే సాధ్యమైంది. అదే ఇటీవల జరిగిన రాజ్యసభ సమావేశాల్లో కేవలం 8 శాతం ఉత్పాదకత మాత్రమే నమోదైంది’అని తెలిపారు. చర్చలతోనే ప్రజాస్వామ్యం పటిష్టం యూత్ ఫెస్టివల్లో యువతీయువకులకు అవార్డులు అందించిన అనంతరం ప్రధాని స్పందిస్తూ..‘ఈ కార్యక్రమం నవభారతాన్ని ప్రతిబింబిస్తోంది. భారత్ అభివృద్ధి, సమాజ నిర్మాణం లో మరింత కీలకపాత్ర పోషించేలా చొరవ తీసుకోవాలని యువతను కోరుతున్నా. ఇప్పటి యువతకు కొత్త ఆలోచనలు, సరికొత్త ఉత్సాహంతో పాటు మల్టీటాస్కింగ్‌కు సిద్ధంగా ఉంది. నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ ద్వారా యువతీయువకులు తమ శక్తిని సరైన దిశలో కేంద్రీకృతం చేసేందుకు వీలవుతుంది. చర్చలే ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేస్తాయి. పార్లమెంటుకు ఎన్నికవ్వాలనుకునే వ్యక్తులకు ఈ వేదిక ఉపకరిస్తుంది. ఇకపై పార్లమెంటుకు రావాలనుకునే వ్యక్తులు ఎవరైనా తొలుత యూత్ పార్లమెంటుకు హాజరవ్వాలనుకోవాలి. ఈ విషయాన్ని తమ ప్రొఫైల్‌లో పెట్టుకోవాలి’అని వ్యాఖ్యానించారు. 10 శాతం రిజర్వేషన్ అందుకే ఇచ్చాం అగ్రకులాల్లోని పేదలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించడం పై మాట్లాడుతూ.. ‘యువతకు సమాన అవకాశాలు ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఎన్డీయే ప్రభు త్వం 10 శాతం రిజర్వేషన్‌ను తీసుకొచ్చింది. దీనివల్ల నిజంగా నైపుణ్యవంతులైన యువతీయువకులు తమ కలల ను నెరవేర్చుకోవడం వీలవుతుంది. యూత్ ఫెస్టి వల్కు హాజరై న యువతను ఈ సందర్భం గా ఒక్కటే కోరుతున్నా.. మీ స్వస్థలాలకు వెళ్లాక కార్యక్రమా లు నిర్వహించి స్థానిక రాజ్య సభ ఎంపీలను ఆహ్వానించండి. రాజ్యసభలో విలువైన సమయం దుర్వినియోగంపై ప్రశ్నించండి. తద్వారా జాతీ య స్థాయిలో ఈ విషయ మై ఒత్తిడి తీసుకురావచ్చు. అలాగే ఢిల్లీలోని జాతీ య యుద్ధ స్మారకం, జాతీయ పోలీస్ స్మారకాన్ని సందర్శించాల్సిందిగా కోరుతున్నా’అని పేర్కొన్నారు. ‘ఖేలో ఇండియా’యాప్ ఆవిష్కరణ.. యూత్ పార్లమెంట్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ‘ఖేలో ఇండియా యాప్‌ను ఆవిష్కరించారు. భారత క్రీడా ప్రాధికార సం స్థ(సాయ్) దీన్ని అభివృద్ధి చేసినట్లు మోదీ తెలిపారు. ఈ యాప్ ద్వారా దేశం లోని క్రీడా ప్రాంగణాలు, వాటిలో అందుబాటులో ఉన్న సౌకర్యాలు, క్రీడల నిబంధనలు, ఫిట్నెస్ను పరీక్షించుకోవచ్చని వెల్లడించారు. యువతీయువకులందరూ ఓటు కోసం తమ పేరును నమోదు చేసుకోవడంతో పాటు రాబోయే ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని మోదీ సూచించారు. అర్ధంతరంగా వెనుదిరిగిన మోదీ న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని విజ్ఞాన్ భవన్లో బుధవారం జరిగిన ‘నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్–2019’కు ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా యువతీయువకులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో పాక్ భారత గగనతలాన్ని ఉల్లంఘించిన విషయాన్ని ప్రధాని కార్యాలయం(పీఎంవో)కు చెందిన ఉన్నతాధికారి ఒకరు ఓ కాగితంపై మోదీకి అందించారు. దాన్ని చూసిన మోదీ వేదిక మధ్యలోకి వచ్చి సభికులకు అభివాదం చేశారు. అనంతరం అక్కడి నుంచి హుటాహుటిన తన కార్యాలయానికి వెళ్లిపోయారు. -
మీడియాపై సుజనా రుసరుస
చెన్నై : వేల కోట్ల రుణాలు కొల్లగొట్టి బ్యాంకులకు టోకరా వేసిన కేసులో టీడీపీ రాజ్యసభ ఎంపీ, ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితుడు సుజనా చౌదరి సోమవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరయ్యారు. బ్యాంకుల నుంచి రుణాల ద్వారా సేకరించిన మొత్తాలను దారిమళ్లించిన వైనంపై ఈడీ అధికారులు ఆయనను ప్రశ్నించినట్టు సమాచారం. డొల్ల కంపెనీలపైనా ఈడీ అధికారులు పలు కోణాల్లో సుజనాను ప్రశ్నించినట్టు తెలిసింది. ఈడీ విచారణ ముగిసిన అనంతరం సుజనా చౌదరిని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా సమాధానం ఇవ్వలేక వారిపై చిందులు తొక్కారు. ఎప్పటిలాగానే తన సహజసిద్ధ దబాయింపు ధోరణితో తాను నిజాయితీపరుడినని చెప్పుకునేందుకు ప్రయత్నించారు. బ్యాంకుల ఫిర్యాదు మేరకు సుజనా చౌదరి కంపెనీలపై ఈడీ దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. సుజనా చౌదరి మొత్తం 126 డొల్ల కంపెనీలు సృష్టించి.. బ్యాంకుల నుంచి ఏకంగా రూ. 7500 కోట్లు కొల్లగొట్టారని ఈడీ వెల్లడించింది. ఇప్పటికే సుజనా చౌదరి అక్రమాలపై ఈడీ, సీబీఐ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాయి. కాగా, ఈడీ జారీ చేసిన సమన్లు రద్దు చేయాలని సుజనా చౌదరి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. గత శుక్రవారం దీనిపై విచారణ చేపట్టిన ఢిల్లీ ధర్మాసనం పిటీషనర్ వాదనలతో ఏకీభవించలేదు. దీంతో పిటిషన్‌ను కొట్టివేస్తూ.. డిసెంబర్ 3న ఈడీ ముందు సుజనా చౌదరి వ్యక్తిగతంగా హాజరుకావాల్సిందేనని కోర్టు ఆదేశించింది. -
పాల్వాయిది కాంగ్రెస్‌లో ప్రత్యేక స్థానం: ఉత్తమ్
ఢిల్లీ: రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డికి కాంగ్రెస్ లో ప్రత్యేక స్థానం ఉందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. పాల్వాయి మృతికి తన సంతాపాన్ని ప్రకటించారు. పాల్వాయి పార్టీలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీగా కీలక బాధ్యతలు నిర్వర్తించారన్నారు. కాంగ్రెస్ కోసం నెహ్రూ హయాం నుంచి విశేష కృషి చేశారని గుర్తుచేసుకున్నారు. ప్రజా ప్రతినిధిగా నిస్వార్ధంగా ప్రజలకు సేవలందించారని, పాల్వాయి తమ మధ్య లేకపోవడాన్ని నమ్మలేక పోతున్నామన్నారు. శనివారం సాయంత్రం 5 గంటలకు పాల్వాయి స్వగ్రామం చండూరులో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. శనివారం ఉదయం హైదరాబాదులోని నివాసంలో రెండు గంటలపాటు, తరువాత గాంధీ భవన్ లో కొద్దిసేపు పాల్వాయి పార్దివ దేహాన్ని ఉంచుతామన్నారు. -
రేపు పాల్వాయి అంత్యక్రియలు
హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అంత్యక్రియలు రేపు (శనివారం) సాయంత్రం 5గంటలకి పాల్వాయి స్వగ్రామం నల్లగొండ జిల్లా చండూరు మండలం ఇడికుడ గ్రామంలో జరుపనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి చురుకైన నాయకుడని, ఆయన పార్లమెంట్ లో తెలంగాణ సమస్యలపై ఎంతో పోరాటం చేశారని, ఏఐసీసీ కార్యదర్శి ఎంపీ ఆర్సీ కుంతియా గుర్తు చేసుకున్నారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటు అని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. పాల్వాయి ఆకస్మిక మృతికి శాసన మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్ షబ్బీర్ అలీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పాల్వాయి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. -
రాజ్యసభ సీటు ఆశిస్తున్న హరికృష్ణ
-
ఆ పదవి చేపడితే టీడీపీ పార్టీ మారాల్సిందేనా ?
-
వేములవాడ రాజన్నను దర్శించుకున్న రాపోలు
వేములవాడ (కరీంనగర్) : కరీంనగర్ జిల్లా వేములవాడ రాజన్నను రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్ దర్శించుకున్నారు. ఆయన ఆదివారం ఉదయం స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ సిబ్బంది స్వామివారి లడ్డూ ప్రసాదాలను అందజేశారు. కాగా ఆదివారం కావడంతో ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది.