
సాక్షి, అమరావతి : బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని ఆయనే స్వయంగా తన ట్విటర్‌లో వెల్లడించారు. ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని... డాక్టర్ల సలహా మేరకు ఐసొలేషన్లో ఉన్నానని ట్వీట్ చేశారు. రమేశ్‌కు కరోనా సోకిందనే వార్తలతో ఆయన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా కరోనా బారిన పడి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.(తెలంగాణలో 75వేలు దాటిన కరోనా కేసులు)
Comments
Please login to add a commentAdd a comment