
రామ్ మాధవ్
సాక్షి, న్యూఢిల్లీ : ఇటీవల జరిగిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశానికి హాజరైన పీఏసీ డైరెక్టర్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో పీఏసీ సమావేశానికి హాజరైన వారందరిని హోం క్వారంటైన్‌కు వెళ్లాల్సిందిగా పార్లమెంట్ మంగళవారం పిలుపు నిచ్చింది. ఈ సమావేశంలో ఎంపీ సీఎం రమేష్ కూడా పాల్గొన్నారు. అదే విధంగా జమ్మూ కశ్మీర్ బీజేపీ అధ్యక్షుడికి కూడా కరోనా పాజిటివ్ రావడంతో బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ హోం క్వారంటైన్‌కు వెళ్లారు. రెండు రోజుల క్రితం కశ్మీర్‌లో బీజేపీ అధ్యక్షుడిని కలిసినందున ఆయన క్వారంటైన్‌కు వెళ్లినట్లు ప్రకటించారు.
చదవండి: ఆ దశకు భారత్ ఇంకా చేరుకోలేదు
Comments
Please login to add a commentAdd a comment