pac meeting
-
పోలీసు కేసులు ప్రజాదరణను దూరం చేయలేవు!
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఎస్సార్సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఒక వ్యాఖ్య చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా ఏమవుతుందని ప్రశ్నించారు. జైలుకు పంపినంత మాత్రాన ప్రజా వ్యతిరేకతను అణచి వేయలేరని ఆయన స్పష్టం చేశారు. గతంలో తనను 16 నెలలు జైలులో పెట్టారని, పార్టీని నడిపే పరిస్థితి లేకుండా చేశారని, అయినా ప్రజలు ఆశీర్వదించారని గుర్తు చేశారు. ఇప్పుడు ప్రతి గ్రామంలో పార్టీ ఉందని, ఎన్ని కేసులు పెడితే ప్రజలు అంత తీవ్రంగా స్పందిస్తారని పేర్కొన్నారు. జగన్ వ్యాఖ్యలు హేతుబద్దమైనవి. మద్యం కేసుతో పాటు సీనియర్ పోలీసు అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులును అరెస్టు చేయడంపై ఆయన స్పందించారు. ఒక్కసారి గతంలోకి వెళితే 2011లో జగన్ కాంగ్రెస్ ఎంపీగా ఉండే వారు. తండ్రి మరణం తర్వాత జరిగిన పరిణామాలలో ఆయన సొంతంగా పార్టీని స్థాపించుకోవాలని నిర్ణయించుకుని పదవికి రాజీనామా చేశారు. కడప లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికలో 5.45 లక్షల ఓట్ల అధిక్యతతో విజయం సాధించి జగన్ సంచలనం సృష్టించారు. అప్పుడు కూడా కాంగ్రెస్, టీడీపీలు కలిసే కుట్ర చేశాయి. జగన్‌ను ప్రజా క్షేత్రంలో ఓడించాలేమన్న భయంతో చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఏపీలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై వచ్చిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వకుండా తటస్థంగా వ్యవహరించి కాంగ్రెస్‌కు అండగా నిలిచారు. ఆ తర్వాత జగన్ కంపెనీలతో సంబంధం లేని కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకరరావుతో హైకోర్టులో ఫిర్యాదు చేయించడం, దానికి టీడీపీ మద్దతివ్వడం, ఆ వెంటనే హైకోర్టు ఆ కేసును సీబీఐకి అప్పగించడం జరిగిపోయాయి.తదుపరి సీబీఐ కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు ముఖ్యంగా సోనియాగాంధీ ఆదేశాల ప్రకారం వ్యవహరించి జగన్‌ను జైలులో పెట్టింది. బెయిల్ రాకుండా కూడా అడ్డుపడ్డారు. చివరికి 16 నెలల తర్వాత బెయిల్ లభించింది. అయినా ఆయన రాజకీయంగా నిలబడ్డారు. జైలులో ఉన్నప్పుడు జరిగిన 18 ఉప ఎన్నికలలో 15 చోట్ల జగన్ పార్టీ విజయ దుంధుభి మొగించింది. ఆ అనుభవాలను మననం చేసుకుంటే సరిగ్గా అదే రీతిలో ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వైసీపీ నేతలపై, కొందరు అధికారులపై కేసులు పెడుతున్నట్లు కనిపిస్తుంది. కూటమి అధికారంలోకి రాగానే రాజకీయ ముద్ర వేసి కొందరు అధికారులను సస్పెండ్ చేయడం చేశారు. పోస్టింగులు ఇవ్వకుండా వేధించారు. ఒక మోసకారి నటిని పట్టుకు వచ్చి పోలీసు ఉన్నతాధికారిపై కేసు పెట్టించి, తదుపరి ఆయనను జైలులో పెట్టారు. మరో వైపు అనేక మంది వైసీపీ కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులు పెడుతూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. ఇందు కోసం కొందరు రిటైర్డ్ పోలీసు అధికారులను కూడా ఉపయోగించుకుంటున్నారని చెబుతారు. ఆ తర్వాత తమ రెడ్‌బుక్‌ను పై స్థాయికి తీసుకు రావడానికి ప్రయత్నాలు ఆరంభించారు. దీనికి తగ్గట్లే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో కూడా ఈ కేసుపై చర్చించారని అనుకోవాలి. పైకి పోలవరం-బనకచర్ల తదితర అంశాలపై షా ను కలిసినట్లు ఎల్లో మీడియాలో వార్తలు రాయించుకున్నారు. ఆ పత్రికలలోనే జగన్‌పై మద్యం కేసు విషయంపై కూడా మాట్లాడారని తెలిపారు. అంటే గతంలో కాంగ్రెస్‌తో కుమ్మక్కై పెట్టినట్లుగానే, ఈసారి బీజేపీతో ఒప్పందమై ఇలాంటిదేదో చేయాలని చూస్తున్నట్లు ఉన్నారు.2014 టర్మ్‌లో బీజేపీతో పొత్తులో ఉన్నపుడు ప్రధాని మోడీని చంద్రబాబు కలిసినప్పుడల్లా కేవలం జగన్ కేసులపై ఏదో ఒకటి చేయాలని కోరుతుండేవారని, అప్పటి బీజేపీ అధ్యక్షుడు, ఇప్పటి టీడీపీ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఆ రోజుల్లో పలుమార్లు చెప్పేవారు. అదే తరహాలో ఇప్పుడు కూడా బీజేపీ పెద్దలతో సంప్రదించి తన కుట్ర ప్లాన్ అమలు చేయాలని తలపెట్టినట్లు అనుమానాలు వస్తున్నాయి. జగన్ పై 2011 లో పెట్టిన కేసులు ఏమిటి? ఆయన కంపెనీలలో కొందరు పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టారని అందులో క్విడ్ ప్రోక్ జరిగిందని సీబీఐ ఆరోపించింది. అయితే ఇందుకు సంబంధించిన ఏ కంపెనీ కూడా జగన్‌పై ఫిర్యాదు చేయలేదు. అలాగే ప్రభుత్వం, మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలతో జగన్‌కు సంబంధం లేదు. అయినా తన కంపెనీలు ఏర్పాటైన మూడేళ్ల తర్వాత కక్షపూరితంగా కేసులు పెట్టారు. ఇప్పుడు కూడా అదే మోడల్ కనిపిస్తుంది. మద్యం కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని ఏ డిస్టిలరీ ఫిర్యాదు చేయలేదు. ఎవరో దారినపోయే వ్యక్తి లెటర్ రాయడం, ఆ వెంటనే దానిపై ప్రభుత్వ కార్యదర్శి ఏసీబీ విచారణకు విచారించాలని పంపడం, తదుపరి ఆగమేఘాల మీద కేసు పెట్టడం అనుమానాలకు తావిస్తోంది. ఈ కేసు దర్యాప్తులో సిట్ అధికారులు బెవరేజెస్ కార్పొరేషన్ అధికారులను బెదిరించి వాంగ్మూలాలను తీసుకోవడం, వారు హైకోర్టును ఆశ్రయించడం, ఆ తర్వాత వేధింపులు తట్టుకోలేక పోలీసు అధికారులు కోరిన స్టేట్మెంట్ పై సంతకాలు చేశారట. తదుపరి మాజీ ఎంపీ విజయ సాయి రెడ్డిని ఒక పావుగా వాడుకున్నట్లు అనిపిస్తుంది. ఆయన తనకేదో దీని నుంచి రక్షణ కలుగుతుందని అనుకున్నారో ,ఏమో కాని, రాజ్ కెసిరెడ్డి అన్న మాజీ ఐటి సలహాదారుపై ఆరోపణలు చేశారు.దాంతో విజయసాయిని అదుపులోకి తీసుకోకుండా సిట్ బృందం వదలి వేసింది. ఆ తర్వాత సుప్రీం కోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందిన ఎంపీ మిథున్ రెడ్డిని విచారించారు. ఆయన తన వాదన చాలా స్పస్టంగా వినిపించగలిగారు. ఆధారాలు ఉంటే కోర్టులో రుజువు చేయండని సవాల్ చేశారు. తమ కుటుంబంపై చంద్రబాబు కాని, ఎల్లో మీడియా కాని పగపట్టి ఇటీవలి కాలంలో ప్రచారం చేసిన ఉదంతాలను ఆయన మీడియా ముందు ప్రస్తావించి వాటిలో ఒక్కదానిని కూడా నిరూపించలేకపోయిన విషయాన్ని తెలిపారు. ఆ తర్వాత గోవా నుంచి హైదరాబాద్ వచ్చిన రాజ్ కెసిరెడ్డిని హడావుడిగా అదుపులోకి తీసుకున్నారు. ఎల్లో మీడియాలో ఆయనపై పలు కథనాలు రాయించారు. గోవా నుంచి హైదరాబాద్ వచ్చి, అక్కడ నుంచి చెన్నై ద్వారా విదేశాలకు వెళ్లాలని ఆయన ప్లాన్ చేశారని అర్థం, పర్థం లేని రాతలు రాశారు. నిజంగానే అలా వెళ్లదలిస్తే నేరుగా గోవా నుంచో, లేక దగ్గరలో ఉన్న ముంబై, లేదా చెన్నై వెళ్లి విదేశాలకు పోయి ఉండవచ్చు కదా అన్న ప్రశ్నకు జవాబు దొరకదు. కెసిరెడ్డిని విచారించిన సందర్భంలో కూడా పలు పరస్పర విరుద్దమైన అంశాలను సిట్ రిమాండ్ రిపోర్టులో కనిపించాయి. ఒకసారి ఆయన సీఎంఓ అధికారులకు మద్యం డబ్బు చేరవేసినట్లు, మరోసారి ఆయనే ఆయా కంపెనీలలో పెట్టుబడులు పెట్టినట్లు తెలిపారట. నాలుగు డిస్టిలరీల నుంచే మద్యం ఎక్కువగా తీసుకోవడంపై రిమాండ్ రిపోర్టులో సందేహం వ్యక్తం చేశారు. మరి అదే తరహాలో చంద్రబాబు ప్రభుత్వంలోను జరిగింది కదా అన్నదానికి రిప్లై లేదు.అన్నిటికి మించి రిమాండ్ రిపోర్టుపై రాజ్ సంతకం పెట్టడానికి నిరాకరించారని కూడా సిట్ తెలియ చేసింది. అలాంటప్పుడు ఆ రిపోర్టుకు ఎంత విలువ ఉంటుంది? కేవలం ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియాలో బానర్లు పెట్టుకుని ఆనందపడడానికి తప్ప. జగన్ పేరేదో ఆయన నేరుగా చెప్పారన్నట్లుగా ప్రచారం చేసిన ఈ మీడియా దానిపై రాజ్ సంతకం లేదన్న అంశానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా జాగ్రత్తపడింది. అంటే దీనర్థం ఏదో రకంగా జగన్‌ను జనంలో పలచన చేయడం ద్వారా ప్రజలు ఆ అంశంపై చర్చించుకుంటూ, చంద్రబాబు అండ్ కో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను మర్చిపోవాలనే కదా! మరో సంగతి చెప్పాలి. విజయసాయి తననేదో వదలి వేస్తారని అనుకున్నట్లు ఉన్నారు. రాజ్ అరెస్టు కాగానే ఆయన ఒక కామెంట్ చేశారట. దొరికిన దొంగలు, దొరకని దొంగలు అంటూ వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆయన కూడా నిందితుడే అయినందున ఏ తరహా కిందకు వస్తారో తేల్చుకోవాలి. ఒకటి మాత్రం వాస్తవం. ప్రజలలో కూటమి సర్కార్ పై విపరీతమైన వ్యతిరేకత కనిపిస్తోంది. అదే టైమ్‌లో జగన్ ఎక్కడకు వెళ్లిన వేల సంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారు. అంటే భవిష్యత్తులో తన పార్టీకి, తన వారసులకు జగన్ పెద్ద బెడద అవుతారని చంద్రబాబు భయపడుతున్నారు. అందుకే ఈ రకమైన కక్ష రాజకీయాలు చేస్తున్నారు.అమిత్ షా తో కూడా ఇదే అంశంపై మాట్లాడడానికి ఢిల్లీ వెళ్లారంటే ఆయనకు ప్రజలకు ఇచ్చిన హామీలకన్నా, జగన్‌ను ఎలాగొలా ఇబ్బంది పెట్టాలన్న లక్ష్యం ఉన్నట్లు అర్థం అవుతోంది కదా! ఇవన్ని గమనించిన తర్వాత జగన్ పీఏసీ సమావేశంలో మాట్లాడినట్లు ఆయన కాని, వైసీపీ శ్రేణులు కాని అన్నిటికి సిధ్దమైనట్ల స్పష్టం అవుతోంది కదా! ఇదే చంద్రబాబుకు అతి పెద్ద సవాల్!- కొమ్మినేని శ్రీనివాస రావు సీనియర్ జర్నలిస్టు, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
PAC మీటింగులో కూటమి రాజకీయాలపై జగన్ మాస్టర్ ప్లాన్
-
మొదటిసారి ఇలాంటి దుర్మార్గాలు చూస్తున్నా: వైఎస్ జగన్
-
PAC సభ్యులతో వైయస్ జగన్ సమావేశం
-
PAC నేతలతో జగన్ కీలక బేటీ!
-
మొదటిసారి ఇలాంటి దుర్మార్గాలు చూస్తున్నా: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: రాష్ట్రంలో కూటమి పాలనలో వ్యవస్థలన్నీ దిగజారుస్తున్నారని.. దుష్ట సంప్రదాయాలకు తెర లేపుతున్నారని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ పీఏసీ సమావేశంలో కూటమి ప్రభుత్వ కక్ష రాజకీయాలపై వైఎస్ జగన్ మండిపడ్డారు. ముంబై నటి జత్వానీని వేధించారంటూ సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయుల్ని కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామంపై వైఎస్ జగన్ వైఎస్సార్సీపీ పీఏసీ మీటింగ్‌లో స్పందించారు. ‘‘రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. ప్రజా సమస్యలు, అన్యాయాలు, అక్రమాలు, అవినీతి ప్రజల్లోకి వెళ్లకుండా డైవర్షన్ చేస్తున్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారి ఆంజనేయులును అరెస్ట్ చేయడం కూటమి కక్ష రాజకీయాలకు పరాకాష్ట. ఇదే కేసులో మరో ఇద్దరు పోలీస్ అధికారుల పట ప్రభుత్వ తీరును కోర్టు తప్పుబట్టింది. .. మొదటి సారి ఇలాంటి దుర్మార్గాలు చూస్తున్నా. ఒక వ్యక్తిని ఇరికించడానికి కేసులు క్రియేట్ చేస్తున్నారు. తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారు. రాష్ట్రం ఎటువైపు వెళ్తుందో అర్థం కావడం లేదు. రాష్ట్రంలోని వ్యవస్థలను దిగజారస్తున్నారు. దుష్ట సంప్రదాయాలకు తెర లేపుతున్నారు. ప్రభుత్వం ఇలా పోతే రాష్ట్రంలో అరాచకం తప్ప ఏం మిగలదు. .. ఎంపీ మిథున్ రెడ్డిని(MP Mithun Reddy) కూడా టార్గెట్ చేశారు. ఎలాగైనా మిథున్‌రెడ్డిని ఇరికించాలని చూస్తున్నారు. కాలేజీ రోజుల్లో చంద్రబాబును పెద్దిరెడ్డి ఎదురించారు. కాబట్టే పెద్దిరెడ్డి కుటుంబంపై చంద్రబాబు కక్ష పెంచుకున్నారు. లేని ఆరోపణలు, తప్పుడు సాక్ష్యాలు సృష్టించి పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారు. బాబు హయాంలో లిక్కర్ స్కాంపైనా గతంలో సీఐడీ కేసు పెట్టింది. మనం తెచ్చిన లిక్కర్ పాలసీ(YSRCP Liquor Policy) విప్లవాత్మకమైంది. ప్రైవేట్ దుకాణాలు తీసేసి ప్రభుత్వమే నిర్వహించింది. లిక్కర్ అమ్మకాలు తగ్గిస్తే లంచాలు ఇస్తారా? అమ్మకాలు పెంచితే లంచాలు ఇస్తారా? ఈ అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి..’’ అని పీఏసీ సభ్యులను ఉద్దేశించి వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు.‘‘విశాఖలో రూ.3వేల కోట్ల భూమిని ఊరు పేరులేని కంపెనీకి రూపాయికే కట్టబెట్టారు. లులూ గ్రూపునకు రూ.1500-2000 కోట్ల విలువైన భూమిని కట్టబెట్టారు. రాజధానిలో నిర్మాణపు పనుల అంచనాలను విపరీతంగా పెంచి దోచేస్తున్నారు. అప్పటి రేట్లతో పోలిస్తే సిమెంటు, స్టీల్ రేట్లు పెరిగాయి. రూ.36వేల కోట్ల పనులను ఇప్పుడు రూ.77 వేలకు పెంచారు. జ్యుడిషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ తీసేశారు. మొబలైజేషన్ అడ్వాన్స్‌లు తీసుకు వచ్చారు. ఇంత దోపిడీని గతంలో ఎప్పుడూ చూడలేదు. గతంలో అనేకసార్లు నేను చెప్పాను. గతంలో మనం చేసినట్టుగా ఎందుకు బటన్లు నొక్కలేదు అని అడిగాను. బటన్లు నొక్కితే చంద్రబాబు లాంటివారికి ఏమీ రాదు. ప్రజల ఖాతాలకే నేరుగా వెళ్తోంది. అందుకనే చంద్రబాబు బటన్లు నొక్కడంలేదు...రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు తగ్గిపోతున్నాయి. కాని, దేశవ్యాప్తంగా ఆదాయాలు పెరుగుతున్నాయి. ప్రభుత్వ పెద్దల జేబుల్లోకి ఆదాయాలు పెరుగుతున్నాయి. ఏదైనా ముఖ్యమైన ప్రజలకు సంబంధించిన సమస్య బయటకు వచ్చిందంటే, వెంటనే చంద్రబాబు డైవర్ట్ చేస్తున్నాడు. ఏమీలేకపోతే.. జగన్ మీద ఎవరో ఒకర్ని తీసుకు వచ్చి మాట్లాడిస్తున్నాడు. లేకపోతే ఎవరో ఒకర్ని అరెస్టు చేస్తున్నాడు. ప్రజల నోటిలోకి నాలుగేళ్లు ఇప్పుడు ఎందుకు పోవడంలేదు? మన ప్రభుత్వ పథకాలన్నీ ఎందుకు రద్దుచేశారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలు ఏమయ్యాయి. ఆరోగ్యశ్రీ పూర్తిగా ఎత్తివేశారు. రూ.3500 కోట్ల బకాయిలు ఎందుకు పెట్టారు?..ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడంలేదు. ప్రతి క్వార్టర్‌కు రూ.700 కోట్లు ఇవ్వాలి. ఫీజు రీయింబర్స్ మెంట్, వసతి దీవెన కింద రూ.3900 కోట్లు బకాయి గత ఏడాది పెట్టారు. ఇప్పుడు ఈ ఏడాది ప్రారంభమైంది. మళ్లీ ఈ ఏడాది ఫీజు రీయింబర్స్మెంట్ కలుపుకుంటే రూ.7వేల కోట్లకు గాను రూ.700 కోట్లు ఇచ్చాడు. ఏ రైతుకు గిట్టుబాటు ధరలేదు. పెట్టుబడి సహాయం లేదు. ఉచిత పంటల బీమా లేదు. వ్యవస్థల్లో పారదర్శకత లేదు. పెన్షన్లు నాలుగు లక్షలు తగ్గించాడు. కొత్తగా ఒక్క పెన్షన్ ఇచ్చింది లేదు. ఎక్కడ చూసినా రెడ్‌బుక్ పాలనే కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో PAC గణనీయమైన పాత్ర పోషించాల్సి ఉంటుంది. క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు మమేకం కావాలి. జిల్లా అధ్యక్షులను సమన్వయం చేసుకోవాలి. పార్టీ నిర్మాణంలో భాగస్వామ్యాన్ని అందించాలి. ..పార్టీ అధికారంలోకి వస్తుంది.. మరింతగా ప్రజలకు సేవలందిస్తుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. పార్టీకి చెందిన ప్రతీ కార్యక్రమాన్ని మనది అనుకుని చేసుకోవాలి. అందర్నీ కలుపుకుంటూ ముందుకు వెళ్లాలి. మన పార్టీకి పెద్దగా మీడియా లేదు. టీడీపీకి పత్రికలు, అనేక ఛానళ్లు ఉన్నారు. సోషల్ మీడియాలో వారికి ఉన్మాదులు ఉన్నారు. అందుకనే గ్రామస్థాయిలో కార్యకర్తను తయారు చేయాలి. అన్యాయాలను ఎదిరించడానికి, ప్రజల ముందు పెట్టడానికి ఫోన్ అనే ఒక బ్రహ్మాండమైన సాధనాన్ని వాడుకోవాలి. దీనిపై అందరికీ అవగాహన కల్పించాలి...కాంగ్రెస్ పార్టీని విభేదించి బయటకు వచ్చినప్పుడు మనపై ఇప్పటి మాదిరిగానే మనపై తప్పుడు ప్రచారాలు, దుర్మార్గపు ప్రచారాలు చేశారు. కాని ప్రజలు మనల్ని నమ్మారు, ఆశీర్వదించారు. ఇప్పుడు కూడా చంద్రబాబుపై వ్యతిరేకతను మూసేయడానికి వాళ్ల మీడియా ప్రయత్నిస్తుంది. కాని ప్రజల తీర్పే అంతిమం. వాళ్లిచ్చే నిర్ణయాన్ని ఎవ్వరూ మార్చలేరు. రాష్ట్రాన్ని ఒక భయంలో పెట్టి, పాలన కొనసాగించాలన్న చంద్రబాబు నాయుడి ధోరణిపై కచ్చితంగా ప్రజలు తగిన రీతిలో స్పందిస్తారు. చంద్రబాబు పెడుతున్న కేసులకు ఏమవుతుంది? జైలుకు పంపినంత మాత్రాన ప్రజా వ్యతిరేకతను అణచివేయలేరు. 16 నెలలు నన్ను జైల్లో పెట్టారు. పార్టీని నడిపే పరిస్థితులు లేకుండా చేశారు. కానీ ప్రజలు ఆశీర్వదించారు. ఇవాళ ప్రతి గ్రామంలో మన పార్టీ ఉంది. ఎవ్వరూ ఆపలేరు. ఈ ప్రభుత్వం ఎన్నికేసులు పెడితే, ప్రజలు అంతా స్పందిస్తారు...కలియుగంలో రాజకీయాలు ఈ రీతిలోనే ఉంటున్నాయి. కాని, భయపడి రాజకీయాలు మానుకుంటారు అనుకోవడం పొరపాటు. ఈ ప్రభుత్వం చేస్తున్న కుట్రలు, పన్నాగాలు తాత్కాలికం. మన పార్టీకి ఉన్న విలువలు, విశ్వసనీయత మనల్ని ముందుండి నడిపిస్తాయి. ప్రజలకు చేసిన మంచి ఇంకా ఆయా కుటుంబాల్లో బతికే ఉంది. ఈ మేరకు పీఏసీ సభ్యులు కార్యకర్తలకు దిశానిర్దేశం చేయాలి. వారిలో స్ఫూర్తిని నింపాలి. కష్టాలనుంచే నాయకులు ఎదుగుతారు. ప్రతిపక్షంలో మనం చేసే పోరాటాలను ప్రజలు గుర్తిస్తారు. ఆశీర్వదిస్తారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన చేసే పోరాటాలు, ప్రజా సమస్యలపట్ల స్పందిస్తున్న తీరును ప్రజలు గుర్తిస్తారు. ఒక పార్టీకి నాయకుడిగా వారి పనితీరు కూడా నా దృష్టికి వస్తుంది. ఇంకా టైముందిలే, తర్వాత చూద్దాంలే అన్న ధోరణి వద్దు...పార్టీలో అత్యున్నత స్థాయిలో ఉన్న మీరు స్పందిస్తే, ఆ సంకేతం పార్టీ శ్రేణులకూ వెళ్తుంది, ప్రజల్లోకి వెళ్తుంది. ఈ మూడు సంవత్సరాలు కూడా ప్రజల్లోకి ఉద్ధృతంగా వెళ్లాలి. ప్రజల తరఫున గట్టిగా ప్రశ్నించాలి.. పోరాటం చేయాలి. ఎలాంటి రాజీపడొద్దు. ప్రతి సమావేశంలోనూ అజెండాను నిర్దేశించుకుని దానిపైన డిస్కషన్ చేయాలి. పార్టీకి సూచనలు చేయాలి. పార్టీ ఐక్యంగా ఉండి, పార్టీ కార్యక్రమాలను బలోపేతంగా ముందుకు తీసుకెళ్లాలి. ఏ జిల్లాలో ఏ సమస్య వచ్చినా, ఆ సమస్య మనది అనుకుని దాని పరిష్కారం కోసం ప్రయత్నించాలి. వెంటనే కమిటీలు ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్లాలి. ఎవరో ఏదో ఆదేశాలు ఇస్తారని వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, ప్రజలకు అండగా ఉండడం, పార్టీని బలోపేతం చేయడం అన్నది ముఖ్యం’’ అని వైఎస్ జగన్ చెప్పారు. -
నేడు పార్టీ పీఏసీ సభ్యులతో వైఎస్ జగన్ సమావేశం
తాడేపల్లి,సాక్షి: వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు (మంగళవారం) అధ్యక్షతన నేడు ఉదయం 10.30 గంటలకు తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (పీఏసీ) తొలి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటు పార్టీ భవిష్యత్ కార్యచరణపై వైఎస్ జగన్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇటీవల, వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీని పూర్తిస్థాయిలో పునర్వ్యవస్థీకరించిన సంగతి తెలిసిందే. 33 మందిని పీఏసీ సభ్యులుగా నియమించారని, పార్టీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పీఏసీ కో–ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తారని పార్టీ కేంద్ర కార్యాలయం పేర్కొంది.పీఏసీ సభ్యులుగా మాజీ స్పీకర్ తమ్మినేని సీతారామ్, మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు, మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, మాజీ ఎమ్మెల్యే పుప్పాల శ్రీనివాసరావు (వాసుబాబు), మాజీ మంత్రులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు, కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని)..వెలంపల్లి శ్రీనివాస్, జోగి రమేష్, విడదల రజిని, మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, ఎంపీ ఆళ్ల అయోధ్యరావిురెడ్డి, మాజీ ఎంపీ నందిగం సురేష్‌బాబు, మాజీ మంత్రులు డాక్టర్ ఆదిమూలపు సురేష్, డాక్టర్ పోలుబోయిన అనిల్‌కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి..మాజీ మంత్రి ఆర్కే రోజా, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, మాజీ మంత్రులు షేక్ బెపారి అంజాద్ బాషా, బుగ్గన రాజేంద్రనాథ్, మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ హఫీజ్‌ఖాన్, మాజీ మంత్రి మాలగుండ్ల శంకర నారాయణ, మాజీ ఎంపీ తలారి రంగయ్య, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి, మహాలక్ష్మి శ్రీనివాస్, మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌లను నియమించారు. పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్లు పీఏసీ శాశ్వత ఆహ్వానితులుగా ఉంటారు. -
22న వైఎస్సార్సీపీ పీఏసీ సమావేశం
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన ఈ నెల 22వ తేదీ (మంగళవారం) ఉదయం 10.30 గంటలకు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (పీఏసీ) తొలి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి కమిటీ సభ్యులందరూ హాజరుకానున్నారు. ఈ విషయాన్ని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది.వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీని పూర్తిస్థాయిలో పునర్వ్యవస్థీకరించిన సంగతి తెలిసిందే. 33 మందిని పీఏసీ సభ్యులుగా నియమించారని, పార్టీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పీఏసీ కో–ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తారని పార్టీ కేంద్ర కార్యాలయం పేర్కొంది. పీఏసీ సభ్యులుగా మాజీ స్పీకర్ తమ్మినేని సీతారామ్, మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు, మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, మాజీ ఎమ్మెల్యే పుప్పాల శ్రీనివాసరావు (వాసుబాబు), మాజీ మంత్రులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు, కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని)..వెలంపల్లి శ్రీనివాస్, జోగి రమేష్, విడదల రజిని, మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, ఎంపీ ఆళ్ల అయోధ్యరావిురెడ్డి, మాజీ ఎంపీ నందిగం సురేష్‌బాబు, మాజీ మంత్రులు డాక్టర్ ఆదిమూలపు సురేష్, డాక్టర్ పోలుబోయిన అనిల్‌కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి..మాజీ మంత్రి ఆర్కే రోజా, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, మాజీ మంత్రులు షేక్ బెపారి అంజాద్ బాషా, బుగ్గన రాజేంద్రనాథ్, మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ హఫీజ్‌ఖాన్, మాజీ మంత్రి మాలగుండ్ల శంకర నారాయణ, మాజీ ఎంపీ తలారి రంగయ్య, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి, మహాలక్ష్మి శ్రీనివాస్, మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌లను నియమించారు. పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్లు పీఏసీ శాశ్వత ఆహ్వానితులుగా ఉంటారు. -
‘హరీష్ నామినేషన్ ఏమైంది?’.. పీఏసీ భేటీలో గందరగోళం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాల్లో చైర్మన్ అరికెపూడి గాంధీ అధ్యక్షతన పీఏసీ మొదటి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీఆర్ఎస్ సభ్యుల ప్రశ్నలతో గందరగోళం నెలకొంది. అనంతరం, బీఆర్ఎస్ సభ్యులు సమావేశం నుంచి వాకౌట్ చేశారు.కాగా, పీఏసీ చైర్మన్ గాంధీ అధ్యక్షతన నేడు మొదటి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.. కాంగ్రెస్ నుంచి మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, చిక్కుడు వంశీ కృష్ణ, ఎంఐఎం నుంచి బలాల, బీజేపీ నుంచి రామరావు పవార్, బీఆర్ఎస్ నుంచి పశ్రాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, భాను ప్రసాద్ రావు, సత్యవతి రాథోడ్, ఎల్ రమణ హాజరయ్యారు.ఈ సమావేశం సందర్భంగా పీఏసీ చైర్మన్‌గా అరికెపూడి గాంధీని ఎలా నియమిస్తారని శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబును బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్ అన్నారు. అలాగే, పీఏసీకి ఎన్ని నామినేషన్లను వచ్చాయని ప్రశ్నించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. అనంతరం, సమావేశం నుంచి వాకౌట్ చేశారు.అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడుతూ..‘మా ప్రశ్నలకు పీఏసీలో ఎటువంటి సమాధానం చెప్పడం లేదు.. అందుకే వాకౌట్ చేశాం. స్పీకర్ స్పందించడం లేదు.. అన్ని శ్రీధర్ బాబే మాట్లాడుతున్నాడు. వాళ్ల తప్పుడు పనులు మేము బయటపెడతామని భయపడుతున్నారు. అరికెపూడి గాంధీ బీఆర్ఎస్లోనే ఉంటే మా ఎల్పీ ఆఫీసుకు ఎందుకు రావడం లేదు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన వ్యక్తికి పీఏసీ చైర్మన్ ఇచ్చారు.గాంధీకి మా పార్టీ నుంచి నామినేషన్ ఇవ్వలేదు. హరీష్ రావు వేసిన నామినేషన్ ఏమైంది. గాంధీ నామినేషన్ ఎలా వచ్చింది. ఆయన ఎంపిక ఎలక్షన్ ప్రకారం జరిగిందా.. సెలక్షన్ ప్రకారం జరిగిందా అనేది మాకు తెలియాలి. పీఏసీ ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలకమైనది. ప్రతీ రూపాయిని ప్రజల పక్షాన పీఏసీ ఆడిట్ చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. మా సభ్యుల సంఖ్య ప్రకారం ఐదుగురి పేర్లు ఇవ్వమన్నారు. ఐదుగురి పేర్లు ఇచ్చాం. కానీ, అందులో గాంధీ పేరు లేదు. అయినప్పటికీ గాంధీకి ఎలా పదవి ఇచ్చారు.2014లో కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్లో ప్రతిపక్ష హోదా లేదు.. అయినా ప్రతిపక్ష హోదా ఇచ్చారు. పార్లమెంట్ పీఏసీ చైర్మన్‌గా కేసీ వేణుగోపాల్‌ను చేశారు. రాహుల్ గాంధీ సూచన మేరకే ఇది జరిగింది. 2014లో తెలంగాణలో కూడా కాంగ్రెస్‌కే పీఏసీ పదవి ఇచ్చాం. 2018లో కాంగ్రెస్ కంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఎంఐఎంకు ఉన్నారు. 2018లో సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఎంఐఎం కాబట్టి అక్బరుద్దీన్‌కు పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చాం. 2018లో పీఏసీ చైర్మన్ శ్రీధర్ బాబు అడిగారనేది అవాస్తవం’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ..‘నామినేషన్ వేయకుండానే గాంధీకి పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చారనేది మా వాదన. ఎజెండా ఏంటో ఇంకా చూడలేదు.. ఆలోపే వాకౌట్ చేశాం. హైకోర్టు తీర్పునకు అనుగుణంగా అసెంబ్లీ సెక్రటరీ నిర్ణయం తీసుకోవాలి. మొదట పార్టీ మారిన ముగ్గురిపై కేసు వేశాం. మిగతా వారిని ఇంప్లీడ్ చేస్తాం. స్పీకర్ తీర్పును న్యాయ సమీక్ష చేస్తామని హైకోర్టు చెప్పింది’ అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: అమృత్ టెండర్లలో సీఎం రేవంత్ కుటుంబీకుల భారీ అవినీతి: కేటీఆర్ -
తెలంగాణ నుంచి సోనియా పోటీ.. కాంగ్రెస్ పీఏసీ ఐదు నిర్ణయాలు ఇవే..
-
కాసేపట్లో తెలంగాణ కాంగ్రెస్ కీలక సమావేశం
సాక్షి, హైదరాబాద్: కాసేపట్లో గాంధీ భవన్ లో తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ(PAC) సమావేశం జరగనుంది. ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక జరుగుతున్న తొలి సమావేశం కావడంతో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది. కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్‌రావ్ ఠాక్రే అధ్యక్షతన ఈ సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది. పీసీసీ చీఫ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్లు, కమిటీ సభ్యులు ఈ భేటీలో పాల్గొంటారు. ప్రభుత్వం- పార్టీ మధ్య అనుసంధానం అనే ప్రధానాంశంతో పీఏసీ భేటీ జరగనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. పార్లమెంట్ ఎన్నికలపై, నామినేటెడ్ పదవుల భర్తీ పై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఇక.. ఈ నెల 28న కాంగ్రెస్ వ్యవస్థాపక దినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలపై పీఏసీలో నిర్ణయం తీసుకోనున్నారు, అలాగే.. బోయినపల్లి లోని గాంధీ నాలెడ్జ్ సెంటర్ నిర్మాణం వేగవంతం కోసం ఆ బాధ్యతను వర్కింగ్ ప్రెసిడెంట్లకు అప్పచెప్పే ప్రకటనలు పీఏసీలోనే చేస్తారని తెలుస్తోంది. మరోవైపు.. త్వరలో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. మలి విస్తరణలో తమకు అవకాశం వస్తుందని పలువురు నేతలు ఎదురుచూస్తున్నారు. ఇందుకోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రేపు(19న) ఢిల్లీ వెళ్లి పార్టీ అగ్ర నేతలతో సమావేశం కానున్నారు. ఇదీ చదవండి: సీఎం రేవంత్ ఆఫర్.. సున్నితంగా తిరస్కరణ -
రేపు తెలంగాణ కాంగ్రెస్ PAC సమావేశం
-
దారుణ ఓటమి... కారణమేంటి?
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నికలో దారుణ ఓటమి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని కుదిపేస్తోంది. ఉప ఎన్నిక ఫలితాల సరళి వెలువడిన వెంటనే కొందరు నేతలు చేసిన వ్యాఖ్యలతో మొదలైన దుమారం.. బుధవారం జరిగిన కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) భేటీలోనూ సెగలు పుట్టించింది. హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌కు అంత తక్కువ ఓట్లు రావడం ఏమిటి, అసలు తప్పు ఎక్కడ జరిగిందనే అంశాలపై వాడీవేడి చర్చ జరిగింది. హుజూరాబాద్ ఉప ఎన్నిక విషయంలో సరిగా వ్యవహరించలేదని అభిప్రాయం వ్యక్తమైంది. ఈ మేరకు ఓటమి కారణాలను లోతుగా పరిశీలించేందుకు ‘సమీక్షా కమిటీ’ని ఏర్పాటు చేయాలని భేటీలో నిర్ణయించారు. ఇక ఉప ఎన్నిక ఫలితం ఇలా ఉంటుందని ముందే ఊహించామంటూ కొందరు నేతలు చేసిన వ్యాఖ్యలపై సమావేశంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. పార్టీకి సంబంధించి అంశాలపై కొందరు నేతలు బహిరంగంగా చేస్తున్న వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగిస్తున్నాయని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ పేర్కొన్నట్టు తెలిసింది. అంతర్గత ప్రజాస్వామ్యంపేరుతో ఎవరికి వారు ఇష్టమొచ్చినట్టుగా పార్టీ లైన్ దాటి మాట్లాడితే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించినట్టు సమాచారం. బుధవారం గాంధీభవన్‌లో మాణిక్యం ఠాగూర్ అధ్యక్షతన టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం జరిగింది. సుమారు ఐదు గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన ఈ భేటీలో.. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితాలు, పార్టీ సభ్యత్వ నమోదు, జనజాగరణ యాత్ర, విద్యార్థి, నిరుద్యోగ జంగ్‌సైరన్, భవిష్యత్ కార్యాచరణ, పార్టీ పటిష్టత తదితర అంశాలపై చర్చించారు. హుజూరాబాద్‌లో ఎందుకిలా? కాంగ్రెస్ పీఏసీ భేటీలో ఉప ఎన్నిక పరాజయం అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది. అభ్యర్థి ఎంపికలో జాప్యం ఎందుకు జరిగింది, కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఎటు పోయింది?, ఎందుకు ఇంత దారుణంగా ఓటమి చవి చూడాల్సి వచ్చిందన్న ప్రస్తావన వచ్చింది. ఈ సందర్భంగా హుజూరాబాద్‌లో పార్టీ అభ్యర్థి ఎంపిక అంశంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వివరణ ఇచ్చినట్టు తెలిసింది. ఎవరికి టికెట్ ఇచ్చినా టీఆర్ఎస్ నేతలు కొనుగోలు చేస్తారనే ఆలోచనతోనే.. పార్టీకి కట్టుబడి ఉండే బల్మూరి వెంకట్‌ను బరిలోకి దింపామని ఆయన పేర్కొన్నట్టు తెలిసింది. అయితే దీనిపై వీహెచ్ మాట్లాడుతూ.. కొండా సురేఖ వంటి బలమైన నాయకురాలు ఉన్నా ఎందుకు బరిలోకి దించలేదని ప్రశ్నించినట్టు సమాచారం. స్థానిక కుల సమీకరణాల ఆధారంగా అక్కడ బీసీ అభ్యర్థిని నిలబెట్టాల్సి ఉందని, లేదంటే ఎస్సీ వర్గాలకు వ్యక్తిని నిలబెట్టాల్సి ఉందని పేర్కొన్నట్టు తెలిసింది. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. పార్టీ అభ్యర్థి ఖరారు అంశాన్ని భట్టి విక్రమార్క, దామోదర రాజ నర్సింహలతో కూడిన కమిటీకి అప్పగించామని, వారి నిర్ణయం మేరకే అభ్యర్థిని ఖరారు చేశామని వివరించినట్టు తెలిసింది. అయితే.. హుజూరాబాద్ ఓటమికి రేవంత్‌రెడ్డి ఒక్కడినే బాధ్యుడిని చేయడం సరికాదని, తానే బాధ్యత వస్తానని రేవంత్ చెప్పడం కూడా కరెక్ట్ కాదని సీనియర్ నేత జానారెడ్డి పేర్కొన్నట్టు సమాచారం. ఈ ఓటమికి పార్టీ నేతలందరూ కూడా బాధ్యత తీసుకోవాలని ఆయన స్పష్టం చేసినట్టు తెలిసింది. హుజూరాబాద్ ఉప ఎన్నిక విషయంలో పార్టీ సరైన వ్యూహంతో వెళ్లలేకపోయిందని.. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన పోటీలో సరిగా వ్యవహరించలేకపోయామని మరికొందరు నేతలు స్పష్టం చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే.. హుజూరాబాద్ ఓటమి గల కారణాలను తేల్చేందుకు, భవిష్యత్తులో ఇలాంటివి మళ్లీ ఎదురుకాకుండా సూచనలు చేసేందుకు ‘సమీక్షా కమిటీ’ని ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. త్వరలోనే ఈ కమిటీని ప్రకటించాలని.. ఆ కమిటీ అన్ని అంశాల్లో విచారణ జరిపి పీఏసీకి నివేదిక ఇవ్వాలని తీర్మానించారు. సామాజిక వర్గ ముద్రను తొలగించుకోవాలి ఈటల విజయాన్ని తేలికగా తీసుకోవద్దని.. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ సరైన వ్యూహంతో ముందుకెళ్లాలని సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి స్పష్టం చేసినట్టు తెలిసింది. కాంగ్రెస్ అంటే ఫలానా సామాజిక వర్గానికి చెందిన పార్టీ అనే ముద్రను తొలగించుకోవాలని.. బీసీ నాయకత్వాన్ని ప్రోత్సహించాలని, బీసీల నుంచి మంచి నేతలను తయారుచేసి ముందు నిలబెట్టాలని సూచించినట్టు సమాచారం. ఇక గతంలో తాను హుజూర్నగర్ అభ్యర్థిగా పద్మావతిని ప్రకటించినప్పుడు ముందే ఎలా చెప్తారని తప్పుబట్టిన నేతలు.. ఇప్పుడు పెద్దపల్లి, భూపాలపల్లిలో అభ్యర్థులను ముందుగానే ఎలా ప్రకటిస్తారని పరోక్షంగా రేవంత్‌ను ఉద్దేశించి ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శలు చేసినట్టు తెలిసింది. పీఏసీ సమావేశాలకు కోమటిరెడ్డి బ్రదర్స్ హాజరు కాకపోవడంపైనా చర్చ జరిగింది. ఇటు సమావేశాలకు రాకుండా, అటు మీడియాతో ఇష్టానుసారం మాట్లాడుతున్న కోమటిరెడ్డి బ్రదర్స్‌పై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఓ కీలక నేత ప్రశ్నించినట్టు సమాచారం. దీనిపై మరో నేత స్పందిస్తూ.. ఉత్తమ్ పీసీసీ చీఫ్‌గా ఉన్నప్పుడు కూడా చాలా మంది అలా ఇష్టానుసారం మాట్లాడారని, వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించినట్టు తెలిసింది. చివరిగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం, జనజాగరణ యాత్రను విజయవంతం చేయడంపై చర్చించారు. టీపీసీసీ నాలెడ్జ్ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. బహిరంగ విమర్శలు వద్దు హుజూరాబాద్ ఉపఎన్నిక ఓటమితో నేతల మధ్య ఒక్కసారిగా విమర్శలు, ప్రతి విమర్శలతో క్రమశిక్షణ పట్టుతప్పుతున్న విషయాన్ని మా ణిక్యం ఠాగూర్ సీరియస్‌గా తీసుకున్నారు. పార్టీకి సంబంధించిన ఎలాంటి విషయాన్ని అయినా పీఏసీ భేటీల్లోనే చర్చించాలని, లేదంటే నేరుగా సమస్యను తమ దృష్టికి తీసుకురావాలని స్పష్టం చేశారు. పార్టీ ప్రయోజనాలకు భిన్నంగా మా ట్లాడే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రాజకీయాలే కాకుండా ఇతర పరిణామాలపై టీవీ చానళ్లలో జరిగే డిబేట్లకు కూడా ఎవరంటే వారు వెళ్లవద్దని, ఇందుకోసం ప్యానెల్ తయారుచేయాలని, ఆ ప్యానెల్లో ఉన్న వారే ఆయా కార్యక్రమాలకు వెళ్లాల్సి ఉంటుందని పేర్కొ న్నారు. ఈ సమావేశంలో పీఏసీ కన్వీనర్ షబ్బీర్ అలీ, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్, ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్‌రెడ్డి, ఇన్చార్జి ఏఐసీసీ కార్యదర్శి బోసురాజుతోపాటు కమిటీ సభ్యులు జానారెడ్డి, వీహెచ్, పొన్నాల లక్ష్మయ్య, జగ్గారెడ్డి, గీతారెడ్డి, మహేశ్‌కుమార్‌గౌడ్, అజారుద్దీన్, జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, సంపత్‌కుమార్, చిన్నారెడ్డి, రేణుకాచౌదరి, బలరాంనాయక్, దాసోజు శ్రవణ్ పాల్గొన్నారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి మాత్రం రాలేదు. -
తప్పని అన్నారు, తప్పు ఒప్పుకున్నాను: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి శుక్రవారం రోజున చేసిన వ్యాఖ్యల దుమారం సద్దుమణిగింది. గాంధీభవన్‌లో శనివారం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, మహేష్ గౌడ్, సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి సమావేశమై, మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ.. 'సంస్థాగతంగా పార్టీ పటిష్టతపై చర్చించాము. నిన్నటి సమస్య సద్దు మణిగింది. అన్నదమ్ములం అన్నప్పుడు కొన్ని సమస్యలు ఉంటాయి. మళ్లీ కలిసిపోతాం. ఏఐసీసీ కార్యదర్శులు కొన్ని సూచనలు చేశారు. నా తప్పును అడిగారు, మరోసారి మాట్లాడనని వివరణ ఇచ్చాను. నిన్నటితో సమస్య అయిపోయింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వంలో పనిచేస్తా. అంతర్గత విషయాలను బయట మాట్లాడొద్దని ఏఐసీసీ సూచించింది. అలా మాట్లాడటం తప్పని అన్నారు, నేను తప్పు ఒప్పుకున్నాను' అంటూ శుక్రవారం రోజున జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. చదవండి: (జగ్గారెడ్డి తీరుపై గాంధీభవన్‌లో వాడివేడి చర్చ) -
జగ్గారెడ్డి తీరుపై గాంధీభవన్‌లో వాడివేడి చర్చ
హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్‌లో అసమ్మతి సెగలు కొనసాగుతున్నాయి. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలను పార్టీ హైకమాండ్ సీరియస్‌గా తీసుకుంది. ఈ నేపథ్యంలో శనివారం గాంధీ భవన్లో వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీరుపై చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఏఐసీసీ కార్యదర్శులు బోసు రాజు, శ్రీనివాస కృష్ణన్ సమక్షంలో జగ్గారెడ్డి, మల్లు రవి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరువురు నేతలు ఒకరిపై ఒకరు గట్టిగా అరుచుకున్న పరిస్థితి తలెత్తింది. పార్లమెంటు నియోజకవర్గాల సమీక్ష సమావేశంలో చోటు చేసుకున్న పరిణామంపై చర్చించారు. పార్టీ అంతర్గత విషయాలను, రేవంత్ రెడ్డి తీరుపై జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడడం వంటి అంశాలను మల్లు రవి తప్పు పట్టారు. ఈ క్రమంలో ఇరువురు నేతలు ఒకరిపై ఒకరు అరుచుకున్నారు. ఏఐసీసీ కార్యకర్తలు ఇద్దరిని సముదాయించి సమీక్ష సమావేశాన్ని కొనసాగిస్తున్నారు. సాయంత్రం జరిగే పీఏసీ సమావేశంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మానిక్కం ఠాగూర్ పాల్గొననున్నారు. (చదవండి: నివురుగప్పిన నిప్పు: రేవంత్ వర్సెస్ సీనియర్లు) పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలను పార్టీ హైకమాండ్ సీరియస్‌గా తీసుకుంది. జగ్గారెడ్డి విమర్శలపై రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ ఆరా తీశారు. ఆయన మాట్లాడిన వీడియో క్లిపులను తెప్పించుకున్నారు. సంగారెడ్డి జిల్లాలో పీసీసీ చీఫ్ టూర్‌కు సంబంధించి సమాచారం ఇవ్వకపోవడంపై జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న తనకు జిల్లాలో కార్యక్రమం గురించి ఎందుకు చెప్పరని ప్రశ్నించారు. వన్ మ్యాన్ షో లా చేస్తే కుదరదని జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: దో షేర్.. దో బకరే -
తిరుపతిలో బీజేపీకి అంత సీన్ లేదు..!
తిరుపతి అన్నమయ్య సర్కిల్: తిరుపతి లోక్‌సభ స్థానం ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని కచ్చితంగా పోటికి దింపాలని జనసేన నాయకులు పవన్‌కల్యాణ్‌పై ఒత్తిడి చేసినట్లు తెలిసింది. బీజేపీకి సీటు కేటాయించి వారికి సహకరించాలంటే జరిగే పరిణామాలు వేరుగా ఉంటాయని వారు పేర్కొన్నట్లు సమాచారం. తిరుపతిలో గురువారం జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం జరిగింది. అనంతరం పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్, పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ నేతలు, ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు. వారితో చర్చించి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు పవన్ కల్యాణ్‌కు వాస్తవ పరిస్థితులు వివరించారు. తిరుపతిలో బీజేపీకి గెలిచే సీన్ లేదని చెప్పినట్లు తెలిసింది. బీజేపీ అభ్యర్థికి ఎట్టి పరిస్థితుల్లోనూ తాము సహకరించబోమని వారు తేల్చిచెప్పినట్లు సమాచారం. దీంతోపాటు తెలంగాణలో జీహెచ్ఎంసీ ఎన్నికలకు సహకరించిన నేపథ్యంలో తిరుపతిలో మనమే పోటీ చేద్దామని తేల్చిచెప్పినట్లు ఆ పార్టీ నాయకులు చెప్పినట్లు ఆ పార్టీ నాయకుడు ఒకరు తెలిపారు. అయితే అంతకుముందు పీఏసీ సమావేశంలో కూడా దీనిపై చర్చించినట్లు తెలిసింది. -
పీఎసీ డైరెక్టర్‌కు కరోనా.. సమావేశంలో సీఎం రమేష్
సాక్షి, న్యూఢిల్లీ : ఇటీవల జరిగిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశానికి హాజరైన పీఏసీ డైరెక్టర్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో పీఏసీ సమావేశానికి హాజరైన వారందరిని హోం క్వారంటైన్‌కు వెళ్లాల్సిందిగా పార్లమెంట్ మంగళవారం పిలుపు నిచ్చింది. ఈ సమావేశంలో ఎంపీ సీఎం రమేష్ కూడా పాల్గొన్నారు. అదే విధంగా జమ్మూ కశ్మీర్ బీజేపీ అధ్యక్షుడికి కూడా కరోనా పాజిటివ్ రావడంతో బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ హోం క్వారంటైన్‌కు వెళ్లారు. రెండు రోజుల క్రితం కశ్మీర్లో బీజేపీ అధ్యక్షుడిని కలిసినందున ఆయన క్వారంటైన్‌కు వెళ్లినట్లు ప్రకటించారు. చదవండి: ఆ దశకు భారత్ ఇంకా చేరుకోలేదు -
ముగిసిన పీఏసీ సమావేశం
సాక్షి, అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ప్రజాపద్దుల కమిటీ బుధవారం అనంతపురంలో సమావేశమైంది. చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని పలు ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లపై చర్చించారు. ఈసందర్భంగా 2012-2013 సంవత్సరానికి సంబంధించి కాగ్ రిపోర్ట్ గమనికలపై రివ్యూ చేసినట్లు పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. నీటి పారుదలలేని ప్రాంతాలకు చిన్ననీటి పారుదల ద్వారా నీరందించే మార్గాలపై చర్చింనట్లు బుగ్గన చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు విశ్వేశ్వర్‌రెడ్డి, ఆదిమూలపు సురేష్, బీకే పార్థసారథి, ఎమ్మెల్సీలు పిల్లి సుభాష్‌చంద్రబోస్, వెన్నపూస గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు. -
అనంతపురంలో పీఏసీ మీటింగ్
-
‘నేను పార్టీలో ఉండాలంటే మూడు కండీషన్లు’
ఢిల్లీ: సొంతపార్టీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత కుమార్ విశ్వాస్ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ముందు మూడు డిమాండ్లు పెట్టినట్లు పార్టీ వర్గాల సమాచారం. వాటిని పరిగణనలోకి తీసుకుంటేనే తాను పార్టీలో ఉంటానంటూ కూడా కేజ్రీవాల్‌కు ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన విశ్వాస్.. ఆ మాటలు మాట్లాడించింది ఎవరో తనకు తెలుసంటూ పరోక్షంగా పార్టీ అగ్ర నాయకత్వాన్నే టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. బీజేపీ, ఆర్ఎస్ఎస్ల ప్రోద్బలంతోనే కుమార్ విశ్వాస్ వ్యవహరిస్తున్నారని ఖాన్ ఆరోపించిన విషయం తెలిసిందే. తనగురించి అమానతుల్లా ఖాన్ చేసిన వ్యాఖ్యలు అందరూ చూశారని.. అలాంటి వ్యాఖ్యలే అరవింద్ కేజ్రీవాల్ మీద గానీ, మనీష్ సిసోదియా మీద గానీ చేసి ఉంటే పది నిమిషాల్లో అతడిని పార్టీ నుంచి బయటకు పంపేసేవారని, కానీ తన గురించి ఎన్నిసార్లు అతడు ఏం మాట్లాడినా పార్టీ నుంచి తొలగించలేదు సరికదా.. ఎలాంటి చర్యలు తీసుకోలేదని కుమార్ విశ్వాస్ మండిపడ్డారు. దీంతో విశ్వాస్ పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు బయలుదేరాయి. దీంతో పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన విశ్వాస్ వెళ్లిపోతే పార్టీకి తీరని దెబ్బవుతుందని గ్రహించిన కేజ్రీవాల్ బుధవారం సమావేశం ఏర్పాటుచేసి ఆయన అసంతృప్తిని తెలుసుకున్నారు. దీంతో కుమార్ విశ్వాస్ మూడు షరతులు పెట్టినట్లు సమాచారం. అవేమిటంటే.. 1. అవినీతి, జాతీయవాదంపై ఎలాంటి రాజీ పడొద్దు. 2.పార్టీ కార్యకర్తలో నిత్యం కమ్యునికేషన్లో ఉండాలి.. వారి తరుపు వాదనలు కూడా వినాలి. 3.అమనతుల్లా ఖాన్ తొలగింపు అంశంపై తప్పకుండా చర్చ జరగాలి. -
ఇరిగేషన్‌పై పీఏసీలో చర్చ: గీతా రెడ్డి
హైదరాబాద్: పీఏసీ మీటింగ్ లో ఇరిగేషన్ ఫై రెండు పర్యాయాలు ఆడిట్ చేశామని పీఏసీ చైర్మన్ గీతారెడ్డి తెలిపారు. 1989 నుంచి 2000 వరకు 14 ఆక్షన్ రిపోర్ట్‌లఫై చర్చించామన్నారు. ఇందులో మొదటిది కాంట్రాక్టర్లకు లాభం చేకూరేలా ఉందని.. దానిపై పీఏసీ చర్చించిందని ఆమె తెలిపారు. ప్రాజెక్టుల ఆలస్యం, పునరాకృతి తదితర అంశాలఫై కూడా మీటింగ్‌లో చర్చించామని చెప్పారు. -
ఆడిట్ అభ్యంతరాలను పరిష్కరించాలి
పీఏసీ సమావేశంలో నిర్ణయం సాక్షి, హైదరాబాద్: సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న ఆడిట్ అభ్యంతరాలన్నింటినీ ఈ ఏడాది డిసెంబరు ఆఖరు నాటికి పరిష్కరించాలని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) సమావేశం నిర్ణయించింది. పీఏసీ చైర్మన్ గీతారెడ్డి అధ్యక్షతన సోమవారం అసెంబ్లీ కమిటీ హాలులో ఈ సమావేశం జరి గింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతో పాటు అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు హాజరైన సమావేశం వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది. ఆడిట్ అభ్యంతరాలన్నింటినీ పరిష్కరించేందుకు ఎప్పటికప్పుడు కమిటీకి సమాచారం అందివ్వాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు ప్రతి నెలా కనీసం రెండుసార్లు సమావేశాలు జరిపాలని నిర్ణయించారు. స్థానిక సంస్థల ఆడిట్‌నూ పీఏసీ పరిధిలోకి తేవాలని ఈ విషయాన్ని స్పీకర్ దృష్టికి తీసుకు వెళ్లాలని కూడా నిర్ణయించారు. ఈ నెల 20వ తేదీన మరోమారు సమావేశం కావాలని పీఏసీ నిర్ణయించింది. రెవెన్యూ శాఖలోనూ ఎక్కువగా ఆడిట్ అభ్యంతరాలు పెండింగులో ఉన్నట్లు గుర్తించి వాటిపైనా చర్చించారు. వచ్చే సమావేశంలో పర్యాటకం, యువజన సంఘాల విభాగాలతోపాటు మున్సిపల్ శాఖలపై చర్చించనున్నారు. కమిటీ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్, గువ్వల బాలరాజు, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఫారుఖ్ హుస్సేన్, పాటూరి సుధాకర్‌రెడ్డి, భానుప్రసాద్, రాములు నాయక్, శాసన సభా కార్యద ర్శి రాజసదారాం, జాయింట్ సెక్రటరీ నర్సింహా చారి తదితరులు పీఏసీ సమావేశంలో పాల్గొన్నారు. -
పీఏసీ సమావేశం ప్రారంభం
హైదరాబాద్: చైర్పర్సన్ గీతారెడ్డి అధ్యక్షతన తెలంగాణ పబ్లిక్ అక్కౌంట్స్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. అసెంబ్లీలోని కమిటీ హాల్లో శనివారం జరుగుతున్న ఈ సమావేశంలో ముందుగా స్పీకర్ మధుసూదనాచారి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, బాలరాజు, గంగుల కమలాకర్, రాములు నాయక్, జీవన్‌రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్, ఎమ్మెల్సీ రాములు నాయక్ పాల్గొన్నారు.