
సాక్షి, అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ప్రజాపద్దుల కమిటీ బుధవారం అనంతపురంలో సమావేశమైంది. చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని పలు ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లపై చర్చించారు. ఈసందర్భంగా 2012-2013 సంవత్సరానికి సంబంధించి కాగ్ రిపోర్ట్ గమనికలపై రివ్యూ చేసినట్లు పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు.
నీటి పారుదలలేని ప్రాంతాలకు చిన్ననీటి పారుదల ద్వారా నీరందించే మార్గాలపై చర్చింనట్లు బుగ్గన చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు విశ్వేశ్వర్‌రెడ్డి, ఆదిమూలపు సురేష్, బీకే పార్థసారథి, ఎమ్మెల్సీలు పిల్లి సుభాష్‌చంద్రబోస్, వెన్నపూస గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.