రేపు పాల్వాయి అంత్యక్రియలు | Palvai Govardhan Reddy funeral tomorrow | Sakshi
Sakshi News home page

రేపు పాల్వాయి అంత్యక్రియలు

Published Fri, Jun 9 2017 6:26 PM | Last Updated on Fri, Mar 22 2019 6:13 PM

రేపు పాల్వాయి అంత్యక్రియలు - Sakshi

రేపు పాల్వాయి అంత్యక్రియలు

హైదరాబాద్‌:  కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అంత్యక్రియలు రేపు (శనివారం) సాయంత్రం 5గంటలకి పాల్వాయి స్వగ్రామం నల్లగొండ జిల్లా చండూరు మండలం ఇడికుడ గ్రామంలో జరుపనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి చురుకైన నాయకుడని, ఆయన పార్లమెంట్ లో తెలంగాణ సమస్యలపై ఎంతో పోరాటం చేశారని, ఏఐసీసీ కార్యదర్శి ఎంపీ ఆర్సీ కుంతియా గుర్తు చేసుకున్నారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటు అని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని తన సంతాపాన్ని వ్యక్తం చేశారు.

పాల్వాయి ఆకస్మిక మృతికి శాసన మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్ షబ్బీర్ అలీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పాల్వాయి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement