Senior Congress leader
-
ఛత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం ఆస్తులు రూ.447 కోట్లు
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీకి ఈనెల 17న రెండో విడత ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో 253 మంది కోటీశ్వరులు. ఈ జాబితాలో కాంగ్రెస్ సీనియర్ నేత, డిప్యూటీ సీఎం టీఎస్ సింగ్ దేవ్ రూ.447 కోట్లతో మొదటి స్థానంలో నిలిచారు. మొత్తం 958 మందికిగాను 953 మంది అభ్యర్థులు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో వెల్లడించిన ఆస్తుల వివరాలను విశ్లేషించినట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫారమ్స్(ఏడీఆర్)తెలిపింది. అభ్యర్థుల ఆస్తుల సరాసరి రూ.2 కోట్లని తెలిపింది. అత్యంత ధనికులైన ముగ్గురు అభ్యర్థులు కూడా కాంగ్రెస్‌కు చెందిన వారేనని పేర్కొంది. సుర్‌గ్రుజా రాచకుటుంబ వారసుడైన టీఎస్ సింగ్ దేవ్ రూ.447 కోట్ల ఆస్తులతో మొదటి స్థానంలో ఉన్నారు. అంబికాపూర్ నుంచి పోటీ చేస్తున్న ఈయన 2018 ఎన్నికల సమయంలో రూ.500 కోట్ల ఆస్తులున్నట్లు వెల్లడించారు. ఆ తర్వాత మణేంద్రగఢ్ స్థానంలో పోటీ చేస్తున్న రమేశ్ సింగ్ రూ.73 కోట్ల పైచిలుకు ఆస్తులు, రజిమ్‌లో పోటీ చేస్తున్న అమితేశ్ శుక్లా రూ.48 కోట్ల పైచిలుకు ఆస్తులున్నట్లు ప్రకటించారని వెల్లడించింది. కాంగ్రెస్‌కు చెందిన 70 మంది అభ్యర్థుల్లో 60 (86%)మంది, బీజేపీకి చెందిన 70 మంది అభ్యర్థుల్లో 57 (81%)మంది, జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్ (జే)కి చెందిన 62 మందిలో 26 (42%) మంది, ఆప్‌నకు చెందిన 44 మందిలో 19 (43%) మంది అభ్యర్థులు రూ.1 కోటి కంటే ఎక్కువ ఆస్తులున్నట్లు ప్రకటించారని వివరించింది. ఆస్తులే లేవన్న ముగ్గురు అభ్యర్థులు భట్గావ్ సీటుకు పోటీ చేస్తున్న కళావతి సార్థి, బెల్టారాలో పోటీ చేస్తున్న గౌతమ్ ప్రసాద్ సాహు అనే స్వతంత్ర అభ్యర్థులు, ఖర్సియాలో పోటీలో ఉన్న జోహార్ ఛత్తీస్‌గఢ్ పార్టీకి చెందిన యశ్వంత్ కుమార్ నిషాద్ తమకు ఎలాంటి ఆస్తులు లేవని అఫిడవిట్లో పేర్కొన్నట్లు ఏడీఆర్ తెలిపింది. అదేవిధంగా, రెండో విడత ఎన్నికల బరిలో ఉన్న ముగ్గురు అభ్యర్థులు అతి తక్కువగా ఆస్తులున్నట్లు అఫిడవిట్లో వెల్లడించారు. ముంగేలి ఎస్సీ రిజర్వుడు సీటుకు పోటీ చేస్తున్న నేషనల్ యూత్ కాంగ్రెస్ అభ్యర్థి రాజ్‌రత్న ఉయికే తన వద్ద కేవలం రూ.500 ఉన్నట్లు తెలిపారు. రాయ్‌గఢ్‌లో ఆజాద్ జనతా పార్టీ టికెట్‌పై పోటీ చేస్తున్న కాంతి సాహు రూ.1,000 మాత్రమే ఉన్నట్లు వెల్లడించారు. అదే విధంగా, బెల్టారా బరిలో నిలిచిన ఆజాద్ జనతా పార్టీకే చెందిన ముకేశ్ కుమార్ చంద్రాకర్ రూ. 1,500 ఉన్నట్లు వెల్లడించారని ఏడీఆర్ తెలిపింది. సీఎం బఘేల్‌కు అత్యధిక ఆదాయం ఆప్ అభ్యర్థి విశాల్ కేల్కర్, కాంగ్రెస్ నేత, సీఎం భూపేశ్ బఘేల్, బీజేపీ నేత ఓపీ చౌధరి తమకు అత్యధిక ఆదాయం వస్తున్నట్లు అఫిడవిట్లో వెల్లడించారని ఏడీఆర్ పేర్కొంది. కేల్కర్ తన మొత్తం ఆదాయం రూ.2 కోట్లుగా, సీఎం బఘేల్, చౌధరిలు రూ.కోటికి పైగా ఆదాయం ఉన్నట్లు చెప్పారు. 52 శాతం మంది 12వ తరగతిలోపే మొత్తం అభ్యర్థుల్లో 499(52 శాతం) మంది తమ విద్యార్హతలను 5 నుంచి 12వ తరగతి మధ్య ఉన్నట్లు తెలపగా మరో 405(42%)మంది గ్రాడ్యుయేషన్ ఆపైన చదువుకున్నట్లు వెల్లడించారని ఏడీఆర్ విశ్లేషించింది. 19 మంది అక్షరాస్యులమని మాత్రమే తెలపగా, ఆరుగురు నిరక్షరాస్యులమని తెలిపారు. ముగ్గురు అభ్యర్థులు విద్యార్హతలను పేర్కొనలేదు. -
కాంగ్రెస్ పార్టీకి చురకలంటించిన ఆ పార్టీ సీనియర్ నేత
భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రచారాన్ని వేగవంతం చేశాయి. హిందూ ఓటర్లను ప్రభావితం చేసేందుకు కాంగ్రెస్ నేతలు హిందూత్వ మంత్రాన్ని జపిస్తుండటంపై ఆ పార్టీ సీనియర్ నేత అజీజ్ ఖురేషి తమ పార్టీపైనే విమర్శలు చేయడం మధ్యప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ ఇటీవల కాలంలో ఎక్కువగా హిందూ దేవాలయాలను సందర్శిస్తూ హిందుత్వ అస్త్రాన్ని ప్రయోగించడాన్ని తప్పుబట్టారు సీనియర్ కాంగ్రెస్ నేత అజీజ్ ఖురేషి(82). మంత్రిగానూ, ఎంపీగానూ, ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ గానూ సేవలందించిన అజీజ్ ఖురేషీ భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్బంగా జరిగిన కార్యక్రమంలో పాల్గొని మీరు చెప్పిందల్లా చెయ్యడానికి ముస్లింలు మీ బానిసలు కాదని. కాంగ్రెస్ పార్టీతో సహా అన్ని పార్టీలు ఈ విషయాన్ని తెలుసుకోవాలని అన్నారు. పోలీస్ శాఖలోనూ, రక్షణ శాఖలోనూ, బ్యాంకుల్లోనూ ముస్లింలకు ఉద్యోగాలు రావు, వారికి కనీసం బ్యాంకు లోనులు కూడా రావు.. అలాంటప్పుడు మీకు ఎందుకు ఓటు వెయ్యాలని ప్రశ్నించారు. ముస్లింల ఇళ్ళు, దుకాణాలు, మందిరాలు తగలబెడుతూ వారి పిల్లలను అనాధలుగా చేస్తుంటే చూస్తూ ఉంటారనుకోకండి. వారేమీ పిరికివారు కాదు. 22 కోట్ల మందిలో 2 కోట్లు మంది ప్రాణాలర్పిస్తే పోయేదేమీ లేదని హెచ్చరించారు. కాంగ్రెస్ లీడర్లు గురించి మాట్లాడుతూ.. ఈ మధ్య వారు కొత్తగా హిందూత్వ మంత్రాన్ని జపిస్తున్నారు. పార్టీ ఆఫీసుల్లో దేవుళ్ళ ప్రతిమలు ఏర్పాటు చేస్తున్నారు. ఓట్ల కోసం దిగజారడం సిగ్గుమాలిన చర్య అని అన్నారు. దీనిపై కాంగ్రెస్ నేత కేకే మిశ్రా స్పందిస్తూ అది ఆయన అభిప్రాయమని కాంగ్రెస్ ఎప్పుడూ లౌకికవాదాన్ని విశ్వసిస్తుందని అన్నారు. ఇక బీజేపీ నేత నరేంద్ర సాలూజ అజీజ్ ఖురేషీ చేసిన వ్యాఖ్యలను ఆధారం చేసుకుని కాంగ్రెస్ పార్టీకి మైరిటీలను బుజ్జగించే రాజకీయాలు అలవాటేనని రాహుల్ గాంధీ, కమల్ నాథ్ సహా కాంగ్రెస్ నాయకులంతా ఎన్నికల నేపథ్యంలో హిందువుల అవతారం ఎత్తుతారని మధ్యప్రదేశ్‌లో ఉండే 82 శాతం హిందూ ఓటర్లను ప్రభావితం చేయాలన్నదే కాంగ్రెస్ పార్టీ ఎజెండా అని ఆయన అన్నారు. చేతనైతే ఖురేషీ అడిగిన దానికి సమాధానం చెప్పాలని అన్నారు. ఇది కూడా చదవండి: మిజోరంలో కుప్పకూలిన రైల్వే వంతెన.. 17 మంది మృతి -
‘మహమ్మారిని ఆ దేవుడే పంపాడు’
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారిని శ్రీకృష్ణ భగవానుడే పంపాడని కాంగ్రెస్ నేత సూర్యకాంత్ దస్మానా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ చానెల్ చర్చా కార్యక్రమంలో ఉత్తరాఖండ్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సూర్యకాంత్ మాట్లాడుతూ కరోనా వైరస్, కృష్ణ రెండూ ‘క’ శబ్ధంతో మొదలవుతాయని, అందుకే ఈ వైరస్‌ను శ్రీకృష్ణుడే మన వద్దకు పంపారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై ట్విటర్లో నెటిజన్లు ఘాటుగా స్పందించారు. హిందూ దేవతలతో కోవిడ్-19ను పోల్చడం పట్ల యూజర్లు ఆయనపై మండిపడ్డారు. చదవండి : 100 రోజుల లాక్డౌన్.. ఏం జరిగింది? -
మోదీజీ.. మీ తండ్రి పేరేంటి..?
ముంబై : వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య మాటల యుద్ధం తారాస్ధాయికి చేరింది. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభల్లో ఆయా పార్టీల నేతలు ప్రత్యర్థి పార్టీల అగ్రనేతల కుటుంబ మూలాలపై ప్రశ్నలు సంధిస్తూ ప్రచారాన్ని వ్యక్తిగత స్ధాయికి దిగజార్చుతున్నారు. తాజాగా మాజీ కేంద్ర మంత్రి సీనియర్ కాంగ్రెస్ నేత విలాస్‌రావు ముత్తెంవార్ ప్రధాని నరేంద్ర మోదీ తండ్రి పేరు వెల్లడించాలని కోరుతూ కొత్త వివాదానికి తెరలేపారు. రాహుల్ గాంధీ తండ్రి ఎవరో, అమ్మమ్మ ఎవరో ప్రపంచానికి తెలుసని, మోదీ తండ్రి ఎవరో ఏ ఒక్కరికీ తెలియదని వ్యాఖ్యానించారు. రాహుల్ గురించి పుట్టుపూర్వోత్తరాలు, ఆయన కుటుంబానికి చెందిన ఇందిరా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ సహా అయిదు తరాల వారు అందరికీ తెలిసినా, మోదీ తండ్రి గురించి ఏ ఒక్కరికీ ఏమీ తెలియదని అన్నారు. మోదీ తండ్రిని గురించి ప్రశ్నిస్తూ విలాస్‌రావు చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వీడియోను బీజేపీ జాతీయ ఐటి, టెక్నాలజీ విభాగం ఇన్చార్జ్ అమిత్ మాలవీయ ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. -
కాంగ్రెస్ సీనియర్ నేత గురుదాస్ కామత్ కన్నుమూత
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, నెహ్రూ–గాంధీల కుటుంబానికి విధేయుడిగా పేరొందిన గురుదాస్ కామత్(63) బుధవారం తీవ్రగుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఢిల్లీలో బుధవారం ఉదయం ఏడింటికి తీవ్రగుండెపోటుకు గురైన కామత్‌ను హుటాహుటిన చాణక్యపురి ప్రాంతంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఆయన కన్నుమూశారు. ఆ సమయంలో ఆయన వెంట కుటుంబసభ్యులు ఎవరూ లేరు. విషయం తెలియగానే ముంబై నుంచి కామత్ కొడుకుసహా కుటుం బమంతా ఆస్పత్రికి వచ్చిం ది. బుధవారం సాయంత్రం కామత్ పార్థివదేహాన్ని ముంబైకి తరలించారు. గురువారం ముంబైలో కామత్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. న్యాయవాది నుంచి కేంద్ర మంత్రిదాకా.. వృత్తిరీత్యా న్యాయవాది అయిన కామత్ తొలుత ఎన్ఎస్యూఐ విద్యార్థి నేతగా ఎదిగారు. ఇందిరా గాంధీ హయాంలో 1976 –80 వరకు ఎన్ఎస్యూఐ అధ్యక్షుడిగా చేశారు. 1987లో ఇండియన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడయ్యారు. ముంబై ప్రాంతీయ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగానూ చేశారు. ముంబై నుంచి ఐదుసార్లు పార్లమెంటుకు ఎన్నికైన ఆయన గతంలో హోం వ్యవహారాల సహాయ మంత్రిగా, కమ్యూనికేషన్స్, ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. గతంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఆయన గుజరాత్, రాజస్తాన్‌లలో పార్టీ సంక్షిష్ట సమయాల్లో, దాద్రా నగర్ హవేలీ, డయ్యూ డామన్‌లలో పార్టీ వ్యవహారాలు చూసు కున్నారు. కాంగ్రెస్ పగ్గాలు రాహుల్ చేపట్టాక గత కాంగ్రెస్‌లోని అన్ని పదవులకు రాజీనామా చేశారు. ప్రముఖుల నివాళులు కామత్ మరణం వార్త తెలియగానే యూపీఏ చీఫ్ సోనియా గాంధీ ఢిల్లీలో ఆస్పత్రికి వచ్చి కామత్‌కు నివాళులర్పించారు. ‘సీనియర్ నేత కామత్ మరణం పార్టీకి తీరని లోటు. ముంబైలో కాంగ్రెస్ పునర్వైభవానికి ఆయన ఎంతగానో కృషి చేశారు’ అని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ ట్వీట్ చేశారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, కాంగ్రెస్ నేత మల్లి కార్జున్ ఖర్గేలు కామత్ మృతిపట్ల తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. కామత్ గొప్ప పార్లమెం టేరియన్, సమర్థుడైన మంత్రి అని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యానించారు. మాస్ లీడర్ అయిన కామత్ ముంబైకర్ల సమస్యలపై పార్లమెంటు వేదికగా పోరాడేవారని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ అన్నారు. -
రేపు పాల్వాయి అంత్యక్రియలు
హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అంత్యక్రియలు రేపు (శనివారం) సాయంత్రం 5గంటలకి పాల్వాయి స్వగ్రామం నల్లగొండ జిల్లా చండూరు మండలం ఇడికుడ గ్రామంలో జరుపనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి చురుకైన నాయకుడని, ఆయన పార్లమెంట్ లో తెలంగాణ సమస్యలపై ఎంతో పోరాటం చేశారని, ఏఐసీసీ కార్యదర్శి ఎంపీ ఆర్సీ కుంతియా గుర్తు చేసుకున్నారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటు అని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. పాల్వాయి ఆకస్మిక మృతికి శాసన మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్ షబ్బీర్ అలీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పాల్వాయి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. -
కన్నుమూసిన పోరాట యోధుడు
∙రాజకీయాలకు వన్నె తెచ్చిన మాధవరెడ్డి ∙పీవీ మెుదలు చెన్నారెడ్డితో కలిసి పయనం ∙తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర జనగామ : తెలంగాణ సాయుధ పోరాటంలో రావినారాయణరెడ్డి, ఆరుట్ల రాం చంద్రారెడ్డి, భీంరెడ్డి నర్సింహారెడ్డితో కలిసి పాల్గొన్న కల్వల మాధవరెడ్డి(82) గురువారం కన్నుమూశారు. ఆరున్నర దశాబ్దాల పాటు రాజకీయాల్లో కొనసాగిన ఆయన మృతి అభిమానుల్లో విసాదాన్ని నింపింది. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మాధవరెడ్డి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 1950 దశకంలో విద్యార్థిగా రాజ కీయ జీవితాన్ని ప్రారంభించిన ఆయన.. కమ్మూనిస్టు పార్టీ పూర్తి స్థా యి కార్యకర్తగా పదేళ్ల పాటు సేవలందించారు. అంతకు ముందు ఆయన స్వగ్రామమైన పాలకుర్తి మండలం ముత్తారంలో రెండు దశాబ్దాలుగా సర్పంచ్‌గా పనిచేశారు. అనంతరం జనగామ కేం ద్రంగా 1960 నుంచి క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చిన మాధవరెడి కాంగ్రెస్‌లో గొప్ప నాయకుడిగా పేరు సంపాదించుకున్నాడు. వరంగల్ జిల్లా కాంగ్రె స్ జిల్లా అధ్యక్షుడిగా, జనగామ మార్కె ట్ కమిటీ చైర్మెన్‌గా నిస్వార్థంగా పని చేసి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. నాటి మాజీ ప్రధాని పీ.వీ.నర్సింహారావు నుంచి మాజీ సీఎంలు మర్రి చెన్నారెడ్డి, జలంగం వెంలరావు, వరదారెడ్డి, హయగ్రీవాచారి, మాజీ కేంద్రం మంత్రి కమాలొద్దీన్, ప్రస్తుత సీఎం కేసీఆర్ రాజకీయ గురువు అనంతలు మదన్మోహన్కు సమకాలికుడు. నాటి ప్రధాని ఇందిరా గాంధి నల్లగొండ జిల్లా సూర్యాపేటలో జరిగిన భా రీ బహిరంగ సభలో తెలుగు అనువాదంచేసి ఆమె మెప్పు పొందిన నా యకుడు మాధవరెడ్డి. ఇందిరా, నెహ్రూ కు అత్యంత సన్నిహితంగా ఉన్నప్పటికీ ఏరోజు కూడా పదవులను ఆశించకుం డా పార్టీకీ నిస్వార్థంగా సేవలందించా రు. 1983లో ఎన్టీఆర్ ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ నుంచి జనగామ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కోరితే సున్నితంగా తిరస్కరించడం ఆయనలోని మంచితనానికి నిదర్శనం. నీతి, నిజాయితీతో కూడిన రాజకీయం చేసిన మాధవరెడ్డి ప్రజాసేవలో మచ్చలేని నాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు. రచయితగా తన కలానికి పదును పెట్టి ఎన్నో పుస్తకాలు రాశారు. మాధవరెడ్డి జీవితం భావితరాలకు ఆదర్శం : మాజీ మంత్రి పురుషోత్తమరావు రాజకీయ విలువల కోసం పరితపించిన మాధవరెడ్డి జీవితం భావితరాలకు ఆదర్శంగా నిలుస్తుందని మాజీ మంత్రి తక్కెళ్లపల్లి పురుషోత్తమరావు అన్నారు. మాధవరెడ్డి మృతి వార్త తెలుసుకున్న ఆయన కుమారుడు రాంతో కలిసి జనగామకు వచ్చారు. మాధవరెడ్డి భౌతికఖాయంపై పుష్పగుచ్ఛాలు నివాళులర్పించారు. అలాగే, పీసీసీ మా జీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఫోన్ లో మాధవరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అంత్యక్రియలకు పెద్ద సంఖ్యలో అభిమానులు, బంధువులు, ప్రజలు తరలివచ్చి తుది వీడ్కోలు పలికారు. -
గులాబీ గూటికి కాంగ్రెస్ సీనియర్ నేత?
సాక్షి, హైదరాబాద్: నిజామాబాద్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ దిగ్గజం, మాజీ మంత్రి ఒకరు టీఆర్ఎస్ గూటికి చేరనున్నట్లు అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ఈ మేరకు టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతో సంప్రదింపులు కూడ జరిపినట్లు సమాచారం. కేసీఆర్ సైతం సదరు నేత చేరికకు పచ్చాజెండా ఊపినట్లు తెలిసింది. కేసీఆర్ తనయుడు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కూడా ఆ నేత చేరికను ఆహ్వానించినట్లు చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించిన సదరు నేత కొద్ది రోజులుగా ఆ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఉద్యమాల్లో కీలక పాత్ర వహించి లాఠీ దెబ్బలు తిన్నాననే కాంగ్రెస్ దిగ్గజం చివరకు టీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధమయ్యారన్న ప్రచారం నిజామాబాద్ జిల్లా రాజకీయవర్గాల్లో హాట్‌టాఫిక్‌గా మారింది. సోమవారం నిజామాబాద్‌లోని వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నేతల్లో ఈ చర్చే సాగింది. రెండు, మూడు రోజుల్లో ఆ నేత చేరిక అధికారికంగా వెల్లడికాను ందని కూడ మాట్లాడుకున్నారు. అయితే సదరు నేత చేరికపై గ్రామీణ ప్రాంతానికి చెందిన టీఆర్ఎస్ శాసనసభ్యులు ఒకరు గట్టిగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. -
ఇకనైనా మారండి
ఓటుకు నోటుపై తమిళుడిపై విమర్శలు సాక్షి, చెన్నై : ‘ తమిళుడు అంటే ఓటుకు నోటు’ తీసుకునే వాడు. అన్న ముద్ర పడిందని, ఎగతాళి కూడా చేస్తున్నారంటూ కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం వ్యాఖ్యానించారు. ఓటుకు నోటు సంప్రదాయం అవసరమా..? అని ప్రశ్నిస్తూ, ఇకనైనా మారండంటూ తమిళులకు హితవు పలికారు. శివగంగై లోక్‌సభ నియోజకవర్గంలో పార్టీ బలోపేతం, కోల్పోయిన తన వైభవాన్ని, హవాను చేజిక్కించుకోవడం లక్ష్యంగా పి. చిదంబరం ముందుకు సాగుతున్నారు. ఆదివారం, లేదా సెలవు దినాల్లో అయితే చాలు అన్ని పనుల్ని పక్కన పెట్టి నియోజకవర్గంలో పర్యటించే పనిలో పడ్డారు. అన్ని గ్రామాల్లో పార్టీ జెండాను ఆవిష్కరించడం లక్ష్యంగా, ఆయా గ్రామాల్లోని పార్టీ వర్గాలు, ముఖ్యులతో మంతనాల దిశగా తన పయనం సాగిస్తున్నారు. తాజాగా ముదునన్దిడల్లో పర్యటించిన ఆయన పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈసందర్భంగా అక్కడ జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ తన ఆవేదనను వ్యక్తం చేయడంతో పాటు తమిళుడి మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటుకు నోటు : యూపీఏ తీసుకొచ్చిన పథకాలను బీజేపీ ప్రభుత్వం తుంగలో తొక్కుతున్నదని మండిపడ్డారు. వంద రోజుల పనికి ఆహారం పథకం ద్వారా పేద కూలీలు ఎంతో ఆనందంగా ఉన్నారు. అయితే, ఇప్పుడు ప్రభుత్వ తీరుతో పేదల కూలీలతో పాటుగా కా ర్మిక, వ్యవసాయ తదితర వర్గాల వారు కష్టాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయడం లక్ష్యంగా కుట్రలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇదే నినాదం, కుట్రలతో అనేక పంది కొక్కులు వచ్చాయని, కాంగ్రెస్ దెబ్బకు పారి పోయాయని ఎద్దేవా చేశారు. విద్యార్థులకు విద్యా సంవత్సరం ఆరంభమవుతున్నా, ఇంత వరకు విద్యా రుణాలకు సంబంధించిన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విచారకరంగా పేర్కొన్నారు. రుణాలు లేవు, ఉద్యోగాలు లేవు, రాను రాను, దేశంలో ఏమీ లేకుండా చేస్తారేమోనని మండి పడ్డారు. ఇక, ఓటుకు నోటు సంప్రదాయమా..? అని ప్రశ్నిస్తూ, తీవ్రంగా మండి పడ్డారు. ఎక్కడికైనా వెళ్లి తమిళుడు అని పరిచయం చేసుకుంటే చాలు ఎగతాళి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చటుక్కున ఓటుకు నోటు తీసుకునే వాళ్లే కదా..? అని ఎద్దేవా చేస్తున్నారని పేర్కొన్నారు. నోటు తీసుకుని ఓట్లు వేయబట్టే చులకనకు గురి అవుతున్నామని, ఇకనైనా ఆ పద్దతికి స్వస్థి పలకండని హితవు పలికారు. -
మాజీ ఎమ్మెల్యే రామారెడ్డికి పుత్రవియోగం
అనపర్తి :అనపర్తి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తేతలి రామారెడ్డి పెద్ద కుమారుడు రామిరెడ్డి అలియాస్ రాంబాబు (54) బుధవారం తెల్లవారు జామున రైలు నుంచి జారిపడి మరణించారు. అనపర్తి రైల్వేస్టేషన్ సమీపంలో వేగంగా వెళుతున్న రైలునుంచి పడిపోయిన రాంబాబు తీవ్రగాయాలకు లోనై సంఘటన స్థలంలోనే మృతి చెందారని సామర్లకోట రైల్వే పోలీసులు తెలిపారు. మృతుడు రాంబాబుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఎస్సై ఎ. వెంకటేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మృతుడు రాంబాబు వ్యక్తిగత పనుల నిమిత్తం అమరావతి ఎక్స్‌ప్రెస్‌లో రాజమండ్రి నుంచి శ్రీకాకుళం బయలుదేరారని తెలిపారు. అనపర్తి సమీపంలో రాంబాబు రైలు నుంచి జారిపడ్డారన్నారు. అనపర్తి రైల్వే సిబ్బంది అందించిన సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్నామని ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పెద్దాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించామని తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. అలముకున్న విషాదం.. పలువురి సానుభూతి మాజీ ఎమ్మెల్యే తేతలి రామారెడ్డి తనయుడు రాంబాబు రైలు నుంచి జారిపడి మృతి చెందిన వార్త తెలియడంతో అనపర్తి, మండపేట, రామచంద్రపురం నియోజకవర్గాల వ్యాప్తంగా విషాదఛాయలు అలముకున్నాయి. మంచికి మారుపేరుగా, అందరికీ ఆప్తునిగా మసలిన రాంబాబు ఇక లేరన్న విషయాన్ని పలువురు పార్టీ కార్యకర్తలు, తేతలి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. పలువురు రాజకీయనాయకులు అనపర్తిలోని మాజీ ఎమ్మెల్యే రామారెడ్డి నివాసానికి చేరుకున్నారు. తేతలికి వారు తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ ీసీజీసీ సభ్యుడు, మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్, అనపర్తి నియోజక వర్గ కోఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి శేషారెడ్డి, జెడ్పీ ప్రతిపక్ష మాజీ నేత సత్తి రామారెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు కర్రి ధర్మారెడ్డి, రాష్ట్ర రైతు నాయకుడు కొవ్వూరి త్రినాథరెడ్డి, రామచంద్రపురం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కొవ్వూరి తాతారెడ్డి, పీఏసీఎస్ అధ్యక్షుడు కర్రి రామారెడ్డి (రామన్నతాత), వైఎస్సార్ సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు సత్తి వీర్రెడ్డి, రామవరం ఉపసర్పంచ్ సబ్బెళ్ల కృష్ణారెడ్డి, కొప్పవరం, పొలమూరు గ్రామాల మాజీ సర్పంచ్‌లు తాడి వెంకట రామకృష్ణారెడ్డి, సత్తి వీర్రాఘవరెడ్డి, మేడపాటి గంగిరెడ్డి తదితరులు తేతలికి తమ సానుభూతిని వ్యక్తం చేశారు. -
మురళీ దేవరా కన్నుమూత
అనారోగ్యంతో ముంబైలో తుదిశ్వాస విడిచిన దేవరా సాక్షి, ముంబై/న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర పెట్రోలియం శాఖ మాజీ మంత్రి మురళీ దేవరా సోమవారం కన్నుమూశారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న 77 ఏళ్ల దేవరా సోమవారం తెల్లవారుజామున 3.25 నిమిషాల సమయంలో ముంబైలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థివదేహాన్ని ముంబైలోని కాంగ్రెస్ కార్యాలయంలో కార్యకర్తల సందర్శనార్థం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉంచారు. అనంతరం దేవరా భౌతికకాయాన్ని చందన్వాడి శ్మశాన వాటికకు భారీ ఊరేగింపుతో తరలించి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. రాజకీయ ప్రస్థానం: మహారాష్ట్రకు చెందిన మురళీ దేవరాకు భార్య హేమ, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమారుడు మిలింద్ దేవరా ఎంపీగా, కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆర్థికశాస్త్రంలో పట్టభద్రుడైన దేవరా 1968లో బీఎంసీ ఎన్నికల్లో గెలిచి రాజకీయ రంగప్రవేశం చేశారు. 1977 నుంచి ఏడాది పాటు ముంబై మేయర్‌గా పనిచేశారు. 1982-85 మధ్య మహారాష్ట్ర విధాన మండలి సభ్యునిగా, 1985 నుంచి నాలుగుసార్లు ముంబై సౌత్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు గెలుపొందారు. తర్వాత ఆయన కుమారుడు మిలింద్ దేవరా ఈ స్థానం నుంచి గెలుపొం దారు. మురళీ దేవరా ముంబై కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా22 ఏళ్లు పనిచేశారు. దేవరా గాంధీ కుటుంబానికి అత్యంత విధేయుడు. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీకివిశ్వాసపాత్రుడు. దేశంలోని ప్రముఖ పారిశ్రామిక వేత్తలతో సన్నిహిత సంబంధాలున్న దేవరా.. కాంగ్రెస్ పార్టీకి నిధుల సమీకరణలోనూ కీలకపాత్ర పోషించారు. యూపీఏ హయాంలో పెట్రోలియం, కార్పొరేట్ వ్యవహారాల శాఖలను దేవరా నిర్వహించారు. ప్రస్తుతం మూడోసారి రాజ్యసభ సభ్యునిగా కొనసాగుతున్నారు. దేశంలో ఎక్కువ కాలం పెట్రోలియం మంత్రిగా పనిచేసిన ఘనత దేవరాదే. 2011లో మురళీని కేంద్ర మంత్రి వర్గం నుంచి తప్పించి ఆయన కుమారుడు మిలింద్కు కేంద్ర మంత్రి పదవిని కాంగ్రెస్ అధిష్టానం కట్టబెట్టింది. ప్రముఖుల నివాళి మురళీ దేవరా మృతికి పలువురు ప్రముఖులు ప్రగాఢ సంతాపం తెలిపారు. దేవరా తనకు ఆప్తమిత్రుడని, దేశం గొప్ప నాయకుడిని, సామాజిక కార్యకర్తను కోల్పోయిందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. మురళీ దేవరా మరణవార్త విచారకరమని ప్రధాని మోదీ ట్వీటర్లో పేర్కొన్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ, రాబర్ట్‌వాద్రా ముంబై చేరుకుని దేవరా భౌతికకాయానికి పుష్పాంజలి ఘటించారు. మురళీ దేవరా ముంబైలో కాంగ్రెస్ పార్టీకి చిహ్నంగా నిలిచారన్నారు. కేంద్ర మంత్రులు వెంకయ్య, పియూష్గోయల్, పాస్వాన్, కాంగ్రెస్ నేతలు అహ్మద్‌పటేల్, మోతీలాల్వోరా, ఆనంద్ శర్మ, అజయ్ మాకెన్, దిగ్విజయ్‌సింగ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ తదితరులు సంతాపం తెలిపారు. పార్లమెంట్ సంతాపం.. అనంతరం వాయిదా మురళీ దేవరా మృతికి పార్లమెంట్ ఉభయసభలు సోమవారం సంతాపం తెలిపాయి. దేవరాతో పాటు లోక్‌సభలో సిట్టింగ్ ఎంపీలు హేమేంద్ర చంద్ర సింగ్ (బీజేడీ), కపిల్ కృష్ణ (టీఎంసీ)తో పాటు మాజీ సభ్యులు అమితావా నేండీ, ఎంఎస్ సంజీవరావు, అవైధ్యనాథ్, సైఫుద్దీన్ చౌధురీ, సంజయ్ సింగ్ చౌహాన్ మృతికి సభ్యులుసంతాపం తెలిపారు. హుద్‌హుద్ తుపాను, జమ్మూ కశ్మీర్ వరదలు, పట్న దసరా ఉత్సవాల్లో తొక్కిసలాటలో మృతిచెందిన వారి కుటుంబాలకు సభ్యులు సంతాపం తెలిపారు. తర్వాత ఉప ఎన్నికల్లో గెలిచిన బీజేపీ సభ్యులు రంజనీబెన్ భట్ (వడోదర), ప్రీతం గోపీనాథ్ ముండే (బీడ్), ఎస్పీసభ్యుడు తేజ్ ప్రతాప్ యాదవ్ (మెయిన్‌పురి) ప్రమాణం స్వీకారం చేశారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన మంత్రులను ప్రధాని మోదీ సభకు పరిచయం చేసాక లోక్‌సభ వాయిదా పడింది. రాజ్యసభ ప్రారంభమైన వెంటనే చైర్మన్ హమీద్ అన్సారీ మురళీ దేవరా మృతి విషయం సభకు తెలిపి సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. -
కేంద్ర మాజీ మంత్రి మురళీదేవ్‌రా కన్నుమూత
-
గులాబీ గూటికి ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు
నేడు సీఎం సమక్షంలో చేరిక నిజాంసాగర్ /నిజామాబాద్ సిటీ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ ధర్పల్లి రాజేశ్వర్‌రావు గులాబీ గూటికి చేరనున్నారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సీఎం క్యాంప్ ఆఫీస్‌లో కేసీఆర్ సమక్షంలో ఆయన టీఆర్ఎస్లో చేరనున్నారు. కాంగ్రెస్ పార్టీలో కౌన్సిలర్ నుంచి ఎమ్మెల్సీ స్థాయిగా ఆయన ఎదిగారు. 2004లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి రాజేశ్వర్‌రావుకు రాష్ట్ర హౌసింగ్ బోర్డు చైర్మన్‌గా నియమించారు. అప్పటి నుంచి ఆయన రాజకీయ జీవితం బలపడింది. అనంతరం రాజేశ్వర్‌ను ఎమ్మెల్సీగా నియమించారు. నాలుగేళ్లుగా పదవీ కాలం పూర్తికాగా, అనంతరం మరొకసారి ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం కోల్పోవటంతో ఆయన ఆ పార్టీకి కొంతకాలంగా దూరంగా ఉంటూ వచ్చారు. ఇటీవల జరిగిన శాసన మండలి, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెరాసకు మద్దతు ఇచ్చి ఆ పార్టీలో చేరుతున్నట్లు సంకేతాలు పంపారు. శాసనమండలి చైర్మన్‌గా పోటీచేసిన స్వామిగౌడ్‌కు మద్దతు ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు. అనంతరం నిజామాబాద్ నగర మేయర్ ఎన్నిక సందర్భంగా ఆ పార్టీకి మద్దతు ఇచ్చి తెరాస పార్టీకి మేయరు దక్కేందుకు కృషిచేసి పార్టీకి మరింత దగ్గరయ్యారు. గత నెలలో సీఎం కేసీఆర్ నిజామాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు రాజేశ్వర్ సీఎంను తన ఇంటికి భోజనానికి ఆహ్వానించారు. రాజేశ్వర్ ఆహ్వానాన్ని కేసీఆర్ మన్నించి ఆయన ఇంటికి వె ళ్లి భోజనం చేయటం అందరినీ ఆశ్చర్యపరిచింది. అప్పటి వరకు రాజేశ్వర్ తెరాస పార్టీలో చేరలేదు. సోమవారం మధ్యాహ్నం పార్టీ కండువా వేసుకోనున్నారు. జుక్కల్, నిజామాబాద్ నియోజకవర్గాల్లోని ఆయన అనుచరులు, అభిమానులు, ప్రజాప్రతినిధులు భారీగా టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. -
టీఆర్ఎస్లోకి సుదర్శన్‌రెడ్డి?
నిజామాబాద్: మాజీ నీటి పారుదల శాఖ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడనున్నారా? టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నారా.. అంటే అవుననే అనుచరవర్గం అం టోంది. ఆయన శనివారం హైదరాబాద్‌లో బోధన్ నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం కానున్నారని అంటున్నారు. కొంతకాలం స్థబ్దుగా ఉన్న సుదర్శన్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రచారాన్ని ఆయన ఖండించకపోవడం గమనార్హం