-
∙రాజకీయాలకు వన్నె తెచ్చిన - మాధవరెడ్డి
- ∙పీవీ మెుదలు చెన్నారెడ్డితో కలిసి పయనం
- ∙తెలంగాణ సాయుధ
- పోరాటంలో కీలక పాత్ర
కన్నుమూసిన పోరాట యోధుడు
Published Thu, Aug 11 2016 11:41 PM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM
జనగామ : తెలంగాణ సాయుధ పోరాటంలో రావినారాయణరెడ్డి, ఆరుట్ల రాం చంద్రారెడ్డి, భీంరెడ్డి నర్సింహారెడ్డితో కలిసి పాల్గొన్న కల్వల మాధవరెడ్డి(82) గురువారం కన్నుమూశారు. ఆరున్నర దశాబ్దాల పాటు రాజకీయాల్లో కొనసాగిన ఆయన మృతి అభిమానుల్లో విసాదాన్ని నింపింది. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మాధవరెడ్డి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 1950 దశకంలో విద్యార్థిగా రాజ కీయ జీవితాన్ని ప్రారంభించిన ఆయన.. కమ్మూనిస్టు పార్టీ పూర్తి స్థా యి కార్యకర్తగా పదేళ్ల పాటు సేవలందించారు. అంతకు ముందు ఆయన స్వగ్రామమైన పాలకుర్తి మండలం ముత్తారంలో రెండు దశాబ్దాలుగా సర్పంచ్‌గా పనిచేశారు. అనంతరం జనగామ కేం ద్రంగా 1960 నుంచి క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చిన మాధవరెడి కాంగ్రెస్‌లో గొప్ప నాయకుడిగా పేరు సంపాదించుకున్నాడు. వరంగల్ జిల్లా కాంగ్రె స్ జిల్లా అధ్యక్షుడిగా, జనగామ మార్కె ట్ కమిటీ చైర్మెన్‌గా నిస్వార్థంగా పని చేసి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. నాటి మాజీ ప్రధాని పీ.వీ.నర్సింహారావు నుంచి మాజీ సీఎంలు మర్రి చెన్నారెడ్డి, జలంగం వెంలరావు, వరదారెడ్డి, హయగ్రీవాచారి, మాజీ కేంద్రం మంత్రి కమాలొద్దీన్, ప్రస్తుత సీఎం కేసీఆర్ రాజకీయ గురువు అనంతలు మదన్‌మోహన్‌కు సమకాలికుడు. నాటి ప్రధాని ఇందిరా గాంధి నల్లగొండ జిల్లా సూర్యాపేటలో జరిగిన భా రీ బహిరంగ సభలో తెలుగు అనువాదంచేసి ఆమె మెప్పు పొందిన నా యకుడు మాధవరెడ్డి. ఇందిరా, నెహ్రూ కు అత్యంత సన్నిహితంగా ఉన్నప్పటికీ ఏరోజు కూడా పదవులను ఆశించకుం డా పార్టీకీ నిస్వార్థంగా సేవలందించా రు. 1983లో ఎన్‌టీఆర్ ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ నుంచి జనగామ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కోరితే సున్నితంగా తిరస్కరించడం ఆయనలోని మంచితనానికి నిదర్శనం. నీతి, నిజాయితీతో కూడిన రాజకీయం చేసిన మాధవరెడ్డి ప్రజాసేవలో మచ్చలేని నాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు. రచయితగా తన కలానికి పదును పెట్టి ఎన్నో పుస్తకాలు రాశారు.
మాధవరెడ్డి జీవితం భావితరాలకు ఆదర్శం : మాజీ మంత్రి పురుషోత్తమరావు
రాజకీయ విలువల కోసం పరితపించిన మాధవరెడ్డి జీవితం భావితరాలకు ఆదర్శంగా నిలుస్తుందని మాజీ మంత్రి తక్కెళ్లపల్లి పురుషోత్తమరావు అన్నారు. మాధవరెడ్డి మృతి వార్త తెలుసుకున్న ఆయన కుమారుడు రాంతో కలిసి జనగామకు వచ్చారు. మాధవరెడ్డి భౌతికఖాయంపై పుష్పగుచ్ఛాలు నివాళులర్పించారు. అలాగే, పీసీసీ మా జీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఫోన్ లో మాధవరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అంత్యక్రియలకు పెద్ద సంఖ్యలో అభిమానులు, బంధువులు, ప్రజలు తరలివచ్చి తుది వీడ్కోలు పలికారు.
Advertisement