madhavareddy
-
కన్నుమూసిన పోరాట యోధుడు
∙రాజకీయాలకు వన్నె తెచ్చిన మాధవరెడ్డి ∙పీవీ మెుదలు చెన్నారెడ్డితో కలిసి పయనం ∙తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర జనగామ : తెలంగాణ సాయుధ పోరాటంలో రావినారాయణరెడ్డి, ఆరుట్ల రాం చంద్రారెడ్డి, భీంరెడ్డి నర్సింహారెడ్డితో కలిసి పాల్గొన్న కల్వల మాధవరెడ్డి(82) గురువారం కన్నుమూశారు. ఆరున్నర దశాబ్దాల పాటు రాజకీయాల్లో కొనసాగిన ఆయన మృతి అభిమానుల్లో విసాదాన్ని నింపింది. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మాధవరెడ్డి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 1950 దశకంలో విద్యార్థిగా రాజ కీయ జీవితాన్ని ప్రారంభించిన ఆయన.. కమ్మూనిస్టు పార్టీ పూర్తి స్థా యి కార్యకర్తగా పదేళ్ల పాటు సేవలందించారు. అంతకు ముందు ఆయన స్వగ్రామమైన పాలకుర్తి మండలం ముత్తారంలో రెండు దశాబ్దాలుగా సర్పంచ్‌గా పనిచేశారు. అనంతరం జనగామ కేం ద్రంగా 1960 నుంచి క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చిన మాధవరెడి కాంగ్రెస్‌లో గొప్ప నాయకుడిగా పేరు సంపాదించుకున్నాడు. వరంగల్ జిల్లా కాంగ్రె స్ జిల్లా అధ్యక్షుడిగా, జనగామ మార్కె ట్ కమిటీ చైర్మెన్‌గా నిస్వార్థంగా పని చేసి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. నాటి మాజీ ప్రధాని పీ.వీ.నర్సింహారావు నుంచి మాజీ సీఎంలు మర్రి చెన్నారెడ్డి, జలంగం వెంలరావు, వరదారెడ్డి, హయగ్రీవాచారి, మాజీ కేంద్రం మంత్రి కమాలొద్దీన్, ప్రస్తుత సీఎం కేసీఆర్ రాజకీయ గురువు అనంతలు మదన్మోహన్కు సమకాలికుడు. నాటి ప్రధాని ఇందిరా గాంధి నల్లగొండ జిల్లా సూర్యాపేటలో జరిగిన భా రీ బహిరంగ సభలో తెలుగు అనువాదంచేసి ఆమె మెప్పు పొందిన నా యకుడు మాధవరెడ్డి. ఇందిరా, నెహ్రూ కు అత్యంత సన్నిహితంగా ఉన్నప్పటికీ ఏరోజు కూడా పదవులను ఆశించకుం డా పార్టీకీ నిస్వార్థంగా సేవలందించా రు. 1983లో ఎన్టీఆర్ ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ నుంచి జనగామ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కోరితే సున్నితంగా తిరస్కరించడం ఆయనలోని మంచితనానికి నిదర్శనం. నీతి, నిజాయితీతో కూడిన రాజకీయం చేసిన మాధవరెడ్డి ప్రజాసేవలో మచ్చలేని నాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు. రచయితగా తన కలానికి పదును పెట్టి ఎన్నో పుస్తకాలు రాశారు. మాధవరెడ్డి జీవితం భావితరాలకు ఆదర్శం : మాజీ మంత్రి పురుషోత్తమరావు రాజకీయ విలువల కోసం పరితపించిన మాధవరెడ్డి జీవితం భావితరాలకు ఆదర్శంగా నిలుస్తుందని మాజీ మంత్రి తక్కెళ్లపల్లి పురుషోత్తమరావు అన్నారు. మాధవరెడ్డి మృతి వార్త తెలుసుకున్న ఆయన కుమారుడు రాంతో కలిసి జనగామకు వచ్చారు. మాధవరెడ్డి భౌతికఖాయంపై పుష్పగుచ్ఛాలు నివాళులర్పించారు. అలాగే, పీసీసీ మా జీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఫోన్ లో మాధవరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అంత్యక్రియలకు పెద్ద సంఖ్యలో అభిమానులు, బంధువులు, ప్రజలు తరలివచ్చి తుది వీడ్కోలు పలికారు. -
మా ప్రభుత్వాన్నే విమర్శిస్తారా?
గుమ్మఘట్ట : ‘టీడీపీ అధికారంలోకి వచ్చీరాగానే నిరుపేదల పింఛన్లకు కత్తెరేశారు. గిట్టనివారి ఫిర్యాదుల ఆధారంగా ఇష్టానుసారంగా చౌక దుకాణపు డీలర్లను తొలగిస్తున్నారు. నాణ్యతగా తయారు చేస్తున్న మధ్యాహ్న భోజన ఏజెన్సీలను తొలగించి వారికి ఇష్టమున్న వారికి కట్టబెడుతున్నారు. నేను ఐదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక్క పింఛను కాని, కార్డుకాని, ఇతర సంక్షేమ పథకాలేవైనా తొలగించామేమో ఒక్కటి చూపండ’ని మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి.. తహశీల్దార్ అబ్జల్‌ఖాన్, ఎంపీడీఓ జీ మునయ్య వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. గుమ్మఘట్ట తహశీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి మాదవరెడ్డి, స్థానిక నాయకులతో కలసి సోమవారం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ప్రజా సమస్యలకు తోడు రుణమాఫీ విధి విధానాల వల్ల రైతులు నిత్యం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని, ఎన్నికల వాగ్దానానికి కట్టుబడి ముఖ్యమంత్రి ఆంక్షలు లేని రుణమాఫీ చేసి ఉంటే రైతులకు ఇబ్బందే ఉండేది కాదని మాజీ ఎమ్మెల్యే కాపు.. అధికారులతో చర్చిస్తుండగా, ఎంపీపీ గిరిమల్లప్ప, టీడీపీ కార్యదర్శి మారెంపల్లి ఉస్మాన్, కలుగోడు మాజీ ఎంపీటీసీ సభ్యుడు గోవిందుతో పాటు వారి వెంట వచ్చిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు అడ్డుతగిలారు. తానేమీ తప్పు మాట్లాడలేదని కాపు ఓ వైపు చెబుతుండగానే టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. గంటకు పైబడి ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలకు సర్ది చెప్పారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే కాపు.. విలేకరులతో మాట్లాడుతూ.. కార్యాలయాలన్నీ టీడీపీ నాయకుల చాంబర్లలా మార్చుకున్నారని, గంటల తరబడి తిష్టవేయడం వల్ల సామాన్యులు అధికారులను కలవడానికి ఇబ్బందిగా మారిందన్నారు. ఈ పద్ధతిలో మార్పు తేవాలని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు ప్రతిపక్షానికి ఉందని, దాన్ని కూడా గొంతు నొక్కాలని చూస్తే ప్రజలతో కలసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఎమర్జెన్సీ రోజులను తలపించేలా ప్రభుత్వ పాలన నడుస్తోందని, ఎలాంటి ఆంక్షలు లేకుండా డ్వాక్రా, రైతు రుణ మాఫీని అమలు చేయూలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై అధికారులతో మాట్లాడుతుంటే టీడీపీ నేతలు దౌర్జన్యం చేయడం తగదన్నారు. పింఛను, రేషన్ కార్డు, డీలర్షిప్, మధ్యాహ్న భోజన ఏజె న్సీ కోల్పోరుున వారి తరుఫున పోరాటం చేస్తామని హెచ్చరించారు. డీలర్లతో ఇష్టానుసారంగా వ్యవహరించిన ఆర్ఐపై చర్యలు చేపట్టాలని తహశీల్దార్‌కు విజ్ఞప్తి చేశారు. మాజీ ఎమ్మెల్యే కాపు వెంట వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా నాయకుడు నవీన్‌కుమార్‌రెడ్డి, పైతోట సంజీవ, బీటీపీ గోవిందు, గుమ్మఘట్ట రాజు, గోనబావి కురుబ రామాంజినేయులు, రంగచేడు లక్ష్మణ్ణ, భూ పసముద్రం పగాకుల గోవిందప్ప, కలుగోడు గోవిందు, గొల్లపల్లి సర్పంచులు ముసలిరెడ్డి, విజేంద్రతో పాటు వివిధ గ్రామాల కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. -
ఏఎంఆర్పీని సందర్శించిన ప్యారిస్ రైతుబృందం
పెద్ద అడిశర్లపల్లి, న్యూస్‌లైన్: ఫ్రాన్స్ దేశ రాజధాని ప్యారిస్‌కు చెందిన 56మందితో కూడిన రైతు బృందం సభ్యులు గురువారం పెద్ద అడిశర్లపల్లి మండలంలోని ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్ల ఫోరం ప్రధాన కార్యదర్శి శ్యాంప్రసాద్‌రెడ్డి ప్రాజెక్టు వివరాలు వారికి తెలియజేశారు. ఈ లిఫ్ట్ ఆసియా ఖండంలోకెల్లా ఎత్తై సింగిల్ ఫేజ్ లిఫ్ట్ అని చెప్పారు. నాగార్జునసాగర్ జలాశయం వెనుక జలాల నుంచి పైపుల ద్వారా లిఫ్ట్‌చేసి 3లక్షల ఎకరాలకు సాగునీరు, వెయ్యి గ్రామాలతో పాటు హైదరాబాద్ జంట నగరాలకు తాగునీరందిస్తుందని వివరించారు. ప్రాజెక్టును సందర్శించిన రైతు ప్రతినిధులు మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు అద్భుతంగా ఉందని కొనియాడారు. సాగునీటి సామర్థ్యం పెంపు, భారతదేశ రైతుల ఆదాయ వనరులు, వ్యవసాయ రంగంలో చిన్న కమతాల సాగు, తాగునీటి వినియోగం తదితర అంశాలపై అధ్యయనం చేస్తున్నట్టు చెప్పారు. ఈ బృందం హైదరబాద్‌కు చెందిన ఎన్జీఓ సంస్థ ప్రతినిధి పద్మ ఆధ్వర్యంలో పరిశీలన జరిపింది. వారివెంట ప్రాజెక్టు డీఈఈ నర్సింగరాజు ఉన్నారు.