![NCW Asks Twitter To Remove Vulgar Content From Website - Sakshi](/styles/webp/s3/article_images/2021/07/1/twitter.gif.webp?itok=vKFH4WC_)
న్యూఢిల్లీ: ట్విట్టర్ ప్లాట్‌ఫామ్ నుంచి అసభ్య, పోర్నోగ్రఫిక్ డేటాను వారంలోగా పూర్తిగా తొలగించాలని జాతీయ మహిళ కమిషన్ బుధవారం ఆ సంస్థను ఆదేశింంది. అలాగే, దీనికి సంబంధిం సమగ్ర దర్యాప్తు జరిపి, బాధ్యులపై చర్య తీసుకోవాలని కమిషన్ అధ్యక్షురాలు రేఖా శర్మ ఢిల్లీ పోలీస్ కమిషనర్‌ను ఆదేశించారు. కొన్ని ట్విటర్ ఖాతాలు అసభ్య వీడియోలు, సందేశాలను షేర్ చేస్తున్న విషయాన్ని గుర్తించామని, వీటిని తొలగించాలని ఆదేశిస్త ట్విటర్ ఎండీకి లేఖ రాశామని కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఆయా ఖాతాల వివరాలను కూడా అందించామని పేర్కొంది. గతంలోనూ ఇదే తరహాలో కమిషన్ ఇచ్చిన ఆదేశాలను ట్విటర్ పట్టించుకోకపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment