శ్రీరాముని పాటకు విద్యార్థుల నృత్యం.. వీడియో వైరల్‌! | Viral Video: School Children's 'Meri Ram Ji Se Keh Dena' Dance Performance | Sakshi
Sakshi News home page

Viral Video: శ్రీరాముని పాటకు విద్యార్థుల నృత్యం.. వీడియో వైరల్‌!

Published Tue, Jan 2 2024 9:48 AM | Last Updated on Tue, Jan 2 2024 10:30 AM

Meri Ram ji se keh dena was played video - Sakshi

దేశంలో ప్రస్తుతం ఎక్కడ చూసినా అయోధ్య, నూతన రామాలయం గురించే చర్చ జరుగుతోంది. జనవరి 22న అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది. దీనికి సంబంధించిన పోస్టులు, వీడియోలు సోషల్ మీడియాలో ప్రతిరోజూ వైరల్ అవుతున్నాయి. 

ఈ నేపధ్యంలోనే పాఠశాల విద్యార్థులకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో కొంతమంది చిన్నారులు శ్రీరాముని పాటకు నృత్యం చేస్తున్నారు. 

సోషల్ మీడియాలో ప్రతిరోజూ రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఈ వీడియోల్లో చాలా మంది సినిమా పాటలకు డ్యాన్స్ చేస్తూ కనిపిస్తుంటారు. అయితే తాజాగా చిన్నారుల నృత్యానికి సంబంధించిన ఒక వీడియో వైరల్‌గా మారి, అందరి హృదయాలను హత్తుకుంటోంది. ఈ వీడియోలో ‘మేరీ రామ్ జీ సే కహ్ దేనా జై సియా రామ్’ అనే పాట వినిపిస్తుంటుంది. ఈ పాటకు అనుగుణమైన నృత్యాన్ని ఒక గురువు అక్కడున్న చిన్నారులకు నేర్పిస్తుంటారు. ఈ వీడియో సోషల్ మీడియాలోని వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అవుతోంది.

ఈ వీడియో @desimojito అనే పేరుతో మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్  ఎక్స్‌ (గతంలో ట్విట్టర్‌)లో షేర్‌  చేశారు. ‘నా దేశం మారుతోంది’ అని  ఆ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోను ఇప్పటి వరకు తొమ్మి వేల మందికి పైగా వీక్షించారు. వీడియోను చూసిన  యూజర్స్‌  కామెంట్‌ బాక్స్‌లో ‘జై శ్రీరాం’ అని రాస్తున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement