అవిభక్త కవలలకు వివాహం.. వరుడెవరంటే.. | Conjoined Twin Abby Hensel Marry | Sakshi
Sakshi News home page

Famous Conjoined Twins: అవిభక్త కవలలకు వివాహం.. వరుడెవరంటే..

Published Sat, Mar 30 2024 9:57 AM | Last Updated on Sat, Mar 30 2024 9:57 AM

Conjoined Twin Abby Hensel Marry - Sakshi

అమెరికాకు చెందిన అవిభక్త కవలలు (కంజోయిన్డ్ ట్విన్స్)అబ్బి, బ్రిట్నీ హెన్సెల్‌లు రిటైర్డ్‌ ఆర్మీ అధికారిని పెళ్లి చేసుకుని ముఖ్యాంశాలలో నిలిచారు. 1996లో ‘ది ఓప్రా విన్‌ఫ్రే షో’లో కనిపించి, ఇద్దరూ తొలిసారి వెలుగులోకి వచ్చారు. తాజాగా ఈ అవిభక్త కవలలు అమెరికా ఆర్మీ రిటైర్డ్‌ అధికారి  జోష్ బౌలింగ్‌ను వివాహం చేసుకున్నారు. 

బ్రిట్నీ హాన్సెల్ ఫేస్‌బుక్ ప్రొఫైల్‌లో వారి పెళ్లి ఫొటో ప్రత్యక్షమయ్యింది. దానిలో పెళ్లి దుస్తుల్లో ఈ అవిభక్త కవలలు జోష్‌ బౌలింగ్‌ ముందు నిలబడి అతని చేతిని పట్టుకోవడాన్ని చూడవచ్చు. ఈ కవల సోదరీమణులు ప్రస్తుతం  ఐదవ తరగతి విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. వీరు వీరి స్వస్థలమైన మిన్నెసోటాలో నివసిస్తున్నారు. 

మరోవైపు జోష్‌ బౌలింగ్ ఫేస్‌బుక్ పేజీలో అతను ఆ అవిభక్త కవలలకు ఐస్ క్రీం  అందిస్తున్న ఫొటోలు, వెకేషన్ ఫోటోలు ఉన్నాయి. వీరి వివాహానికి సంబంధించిన వీడియో క్లిప్‌ కూడా బయటకు వచ్చింది. దానిలో వారు డ్యాన్స్ చేస్తూ కనిపిస్తున్నారు. అబ్బి, బ్రిట్నీ హెన్సెల్‌ల శరీరం కలసిపోయివుంటుంది. అబ్బి  కుడి చేయి , కుడి కాలును నియంత్రిస్తుండగా, బ్రిట్నీ ఎడమ వైపు అవయవాలను నియంత్రిస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement