
‘మాకు డ్యాన్స్ అంటే ప్రాణం.. మాకు అవకాశం రావాలే కానీ డ్యాన్స్‌తో హావభావాల్ని ఇట్టే పలికించగలం. ఇదొక కళ.. ఏ ఒక్కరికో పరిమితమైంది కాదు.. డ్యాన్స్‌తో పరవశించపోగలం.. పరవశించేలా చేయగలం అంటున్నారు నేటితరం పెళ్లికూతుళ్లు. ఇటీవల కాలంలో జరుగుతున్న పెళ్లిల్లో పెళ్లి కూతుళ్లు తమ డ్యాన్స్‌తోనే ఆ వేడుకకు ఒక అందం తీసుకువస్తున్నారు.. ఇప్పుడు భారత్‌లో ఇదొక ట్రెండ్‌గా మారిపోయిందంటే అతిశయోక్తి కాదేమో.
తాజాగా ఓ పెళ్లి కూతురు డ్యాన్స్ చేసి తనలోని కళాకారిణిని బయటకు తీసుకొచ్చింది. తమ కుటుంబ సభ్యులతో పెళ్లి మండపంలోకి వెళుతూనే క్రేజీ క్రేజీ డ్యాన్స్‌తో ఆకట్టుకుంది వధువు. వెడ్డింగ్ స్టేజ్‌పైకి వెళ్లే సమయంలో అలా నడుచుకుంటూ వెళుతూ పెళ్లి కొడుకును చూస్తూ బాలీవుడ్ మూవీ ‘సీక్రెట్ సూపర్ స్టార్’ లోని ఓ సాంగ్‌కు సొగసైన డ్యాన్స్ వేసింది వధువు. అదే సమయంలో పెళ్లి పీటలపై కూర్చొన్న వరుడు.. ఆమెను చూస్తూ మురిసిపోతాడు. తాజాగా ఈ వీడియో వైరల్‌గా మారింది. పెళ్లి మండపానికి వచ్చిన వధువుకు మోకాళ్లపై కూర్చొని రింగ్‌ను తొడుగుతాడు పెళ్లికొడుకు. ఆ సమయంలో వరుడ్ని కాసేపు ఆట పట్టించిన ఆ వధువు చివరకు రింగ్ తొడిగించుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment