సాక్షి,ముంబై: బిలియనీర్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ట్విటర్ ఇండియాలో బ్లూటిక్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లను లాంచ్ చేసింది. ఇప్పటికే కొన్ని దేశాల్లో సబ్‌స్క్రిప్షన్ సేవల్ని లాంచ్ చేయగా తాజాగా ఇండియాలో కూడా మొదలు పెట్టింది .దీని ప్రకారం ఐఓఎస్, ఆండ్రాయిడ్ మొబైల్ వినియోగదారులు నెలకు రూ.900 చెల్లించాల్సి ఉంటుంది.
పూర్తి వివరాలను పరిశీలిస్తే ట్విటర్ చందాదారులు తమ ఖాతా ధృవీకరణకోసం ఈ బ్లూ టిక్ మార్క్‌ను పొందొచ్చు. ఈ బ్లూటిక్ వెరిఫికేషన్ కోసం నిర్దేశిత చందా చెల్లించిన యూజర్లు ఎవరైనా బ్లూ టిక్ మార్క్ పొందొచ్చు. చందా చెల్లించిన అనంతరం ప్రొఫైల్ పక్కన బ్లూటిక్ మార్క్ కనిపిస్తుంది.
బ్లూటిక్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ రూల్స్
►బ్లూటిక్ మార్క్ పొందాలంటే ఐఓఎస్, ఆండ్రాయిడ్ మొబైల్ వినియోగదారులు నెలకు రూ.900 ఖర్చు అవుతుంది. అలాగే వెబ్‌సైట్ సబ్‌స్క్రిప్షన్ కావాలంటే నెలకు రూ. 650 , సంవత్సరానికి రూ. 6800 చెల్లించాలి.
► బ్లూటిక్ మార్క్ పొందాలంటే దరఖాస్తు తేదీకి కనీసం 90 రోజులముందు ట్విటర్‌లో ఉండాలి.
► బ్లూటిక్‌కు సబ్‌స్క్రైబ్ చేసిన తర్వాత, ప్రొఫైల్ ఫోటో, డిస్‌ప్లే పేరు లేదా వినియోగదారు పేరుకు మార్పులు చేస్తే తిరిగి ఖాతా ధృవీకరించబడే వరకు వెరిఫికేషన్ మార్పు కోల్పోతారు. ఈ వ్యాలిడేషన్ సమయంలో ఎలాంటి మార్పులకు అనుమతి లేదు.
► వినియోగదారులు తమ ట్విటర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేసుకోవచ్చు. బిల్లింగ్ సైకిల్ ముగియకముందే సబ్‌స్క్రిప్షన్‌ను పునరుద్ధరించాలి లేదా రద్దు చేసుకోవాలి. ఆటో రెన్యూవల్‌కి 24 గంటల ముందే రద్దు చేసుకోవాలి. లేదంటే ఇప్పటికే చెల్లించిన డబ్బు వాపసు లభించదు
► ప్రొఫైల్‌కు బ్లూ టిక్ మార్క్ వల్ల లాభాలు: చందాదారులు ట్వీట్‌లను రద్దు చేయడం, ట్వీట్‌లను సవరించడం, కొన్ని ఫీచర్‌లకు ముందస్తు యాక్సెస్, చాట్‌లలో ప్రాధాన్యత కలిగిన ర్యాంకింగ్‌లతో పాటు ఎక్కువ , అధిక నాణ్యత గల వీడియోలను పోస్ట్ చేయగల సామర్థ్యం వంటి అనేక సేవలను పొందుతారని ట్విటర్ వెల్లడించింది. ముఖ్యంగా ట్వీట్ చేసిన తర్వాత 30 నిమిషాల్లోపు ఐదు సార్లు ఎడిట్ చేసుకోవచ్చు. అలాగే బ్లూటిక్ సబ్‌స్క్రైబర్‌లు మిగిలిన వారితో పోలిస్తే దాదాపు సగం ప్రకటనలనుంచి కూడా విముక్తి. అంతిమంగా ప్రీమియం ఫీచర్‌ల ద్వారా యూజర్లకు మరింత సౌలభ్యమైన సేవలను అందించడమే లక్ష్యం అని ట్విటర్ పేర్కొంది.
బ్లూ టిక్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను అమెరికా కెనడా, జపాన్, ఇండోనేషియా, న్యూజిలాండ్, బ్రెజిల్,యూఏ సౌదీ అరేబియా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, పోర్చుగల్, స్పెయిన్, ఆస్ట్రేలియాదేశాల్లో బ్లూటిక్ సబ్ స్క్రిప్షన్ ప్లాన్ అమల్లోఉంది.
Comments
Please login to add a commentAdd a comment