
సాక్షి, న్యూఢిల్లీ/ హైదరాబాద్: ప్రియాంకపై లైంగికదాడి, హత్య ఘటనపై జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సీడబ్య్లూ) స్పందించింది. జరిగిన ఘటన చాలా దారుణమని కమిషన్ చైర్‌పర్సన్ రేఖాశర్మ అభివర్ణించారు. ప్రియాంక అదృశ్యమవగానే పోలీసులు స్పందించిన తీరుపైనా ఆమె ట్వీట్‌లో అసంతృప్తి వ్యక్తం చేశారు. అమ్మాయి కనిపించకండా పోగానే వెతకకుండా ఎవరితోనో వెళ్లిపోయిందని ఎలా నిందిస్తారని ఆమె ప్రశ్నించారు. ప్రియాంక హత్య కేసులో దోషులను ఉరితీయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబ సభ్యులకు సాయం చేసేందుకు, కేసు త్వరగా విచారణ జరిపి చర్యలు తీసుకునేలా పోలీసులతో స్వమన్వయం చేసుకునేందుకు తమ ప్రతినిధులను పంపనున్నట్లు తెలిపారు. సదరు పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీ, తెలంగాణ సీఎంవో కార్యాలయానికి సూచించారు.
ఊహే భయానకంగా ఉంది: రాహుల్
ప్రియాంక హత్య తనను తీవ్రంగా కలచివేసిం దని కాంగ్రెస్ నేత రాహుల్ అన్నారు. ఒక మనిషి సాటి మనిషిపై ఇంత క్రూరంగా ఎలా దాడికి పాల్పడతాడనేది ఊహే భయానకంగా ఉందన్నారు. బాధితురాలి కుటుంబ సభ్యుల కోసం ప్రార్థిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment