టిక్‌టాక్‌ను పూర్తిగా నిషేధించాలి: ఎన్‌సీడబ్ల్యూ | NCW Chief Rekha Sharma Writing To Government To Ban TikTok | Sakshi
Sakshi News home page

టిక్‌టాక్‌ను పూర్తిగా నిషేధించాలి: ఎన్‌సీడబ్ల్యూ

Published Tue, May 19 2020 1:01 PM | Last Updated on Tue, May 19 2020 1:45 PM

NCW Chief Rekha Sharma Writing To Government To Ban TikTok - Sakshi

న్యూ ఢిల్లీ : అసభ్యకరమైన వీడియోలతో యువతను టిక్‌టాక్‌ పెడదోవ పట్టిస్తుందని జాతీయ మహిళా కమిషన్‌ ఛైర్మన్‌ రేఖా శర్మ ధ్వజమెత్తారు. టిక్‌టాక్‌ను పూర్తిగా నిషేధించాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు ఆమె తెలిపారు. సోషల్‌ మీడియా యాప్‌ టిక్‌టాక్‌ను యువత అత్యంత ఎ‍క్కువ వినియోగిస్తున్న విషయం తెలిసిందే. సరాదా కోసం వినియోగించే టిక్‌టాక్‌ ప్రస్తుతం హింసను రెచ్చగొట్టే విధంగా తయారవుతోంది. మహిళలపై అత్యాచార వీడియోలు యాసిడ్‌ దాడులను ప్రోత్సహించే విధంగా టిక్‌టాక్‌లో వీడియోలు చేస్తున్నారని బీజేపీ నాయకుడు తాజిందర్‌ సింగ్‌​ బగ్గా చేసిన ట్వీట్‌పై ఆమె స్పందించారు. (వ్యాక్సిన్‌ లేకుండానే కరోనా కట్టడి.. ప్రయోగం సక్సెస్‌! )

టిక్‌టాక్‌లో అసభ్యకరమైన వీడియోలు పోస్ట్‌ చేయడంతోపాటు హింసను ప్రేరేపిస్తున్నారని రేఖ శర్మ మండిపడ్డారు.  టిక్‌టాక్‌ను పూర్తిగా నిషేధించాలని కేంద్రానికి లేఖ రాయనున్నట్లు పేర్కొన్నారు. కాగా యాసిడ్ దాడులను ప్రోత్సహించే విధంగా టిక్‌టాక్‌ కంటెంట్‌ క్రియేటర్‌ ఫైజల్‌ సిద్దిఖీ వీడియో పోస్ట్‌ చేశారు. ఇతనికి 13.4 మిలియన్లకు పైగా అనుచరులు ఉన్నారు. ఈ క్రమంలో ఇలాంటి అభ్యంతరకరమైన వీడియోలను పోస్ట్‌ చేయడం ద్వారా సమాజంపై చెడు ప్రభావం పడుతుందని, అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళ కమిషన్‌ మహారాష్ట్ర డీజీపీకి లేఖ రాసింది. ఫైజల్‌ చేసిన పోస్ట్‌ను వెంటనే తొలగించాలని ఎన్‌సీడబ్ల్యూ డిమాండ్‌ చేసింది. (మహేశ్‌ జిమ్‌ బాడీ చూసి ఫ్యాన్స్‌ ఫిదా! ) 

సల్మాన్‌ను టార్గెట్‌ చేసిన సింగర్‌ సోనా 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement