సాక్షి, న్యూఢిల్లీ: వీడియో షేరింగ్ ప్లాట్‌ఫాం టిక్‌టాక్‌కు ప్లే స్టోర్‌లో ఎదురుదెబ్బ తగిలింది. కొత్త యాప్ మిట్రాన్ గుగూల్ ప్లేస్టోర్ రేటింగ్‌లో టిక్‌టాక్‌ను అధిగమించింది. ఇప్పటి వరకు గుగూల్ ప్లే స్టోర్ రేటింగ్‌లో టిక్‌టాక్, యూట్యూబ్‌లు మాత్రమే పోటీ పడేవి. తాజా నివేదిక ప్రకారం గుగూల్ రేటింగ్‌లో టిక్‌టాక్, యూట్యూబ్‌లను మిట్రాన్ యాప్ అధిగమించి 4.7 రేటింగ్‌తో ట్రేండింగ్‌లో ఉంది. అంతేగాక ప్లే స్టోర్‌లో యూజర్లు టిక్‌టాక్‌కు తక్కువ రేటింగ్, నెగటివ్ ఫీడ్‌బ్యాక్ ఇవ్వడంతో టిక్‌టాక్ ప్లే స్టోర్ రేటింగ్ 1కి పడిపోయింది. ప్రస్తుతం టిక్‌టాక్‌కు ప్లేస్టొర్‌లో 1.4 రేటింగ్‌తో ఉంది. మిట్రాన్ యాప్ ప్లే స్టోర్‌లో 5 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్‌లను కలిగి 4.7 రేటింగ్‌తో ప్లే స్టోర్‌లో దూసుకుపోతుంది. అతి తక్కువ సమయంలోనే 5 మిలియన్లకు పైగా యూజర్లను పొంది 4.7 రేటింగ్‌తో మిట్రాన్ ట్రేండింగ్ యాప్‌ల జాబితాలో చేరిపోయింది. (ప్రత్యర్థులకు గుబులు: దూసుకొచ్చిన జియో మార్ట్)
మిట్రాన్ ఎలా పని చేస్తుందంటే..
మిట్రాన్ కూడా టిక్‌టాక్ మాదిరిగానే దాని శ్రేణి సాధనాలతో (రేంజ్ ఆఫ్ టూల్స్) పనిచేస్తుంది. దీనిలో ఫిల్టర్ ఆప్షన్ ద్వారా షాట్ వీడియోలను ఎడిట్ చేసి వాటిని ఈ వీడియో ప్లాట్‌ఫారమ్‌లో షేర్ చేయోచ్చు. అంతేగాక టిక్‌టాక్ మాదిరిగానే, మిట్రాన్ వినియోగదారులకు వారివద్ద ఉన్న మల్టీమీడియా కంటెంట్‌కు వైడ్ లైబ్రరీని పొందే యాక్సెస్ కూడా ఉంది. ఇక మీరు ఈ యాప్‌లో కొత్తగా వీడియోలు క్రియోట్ చేయడంతో పాటు పాపులర్ మ్యూజిక్ క్లిప్స్ లేదా మూవీ డైలాగ్‌లను సింక్రనైజ్ చేయోచ్చు. (యాప్‌లో వివరాలు 30రోజుల్లో డిలీట్)
మిట్రాన్ అన్ని ఫోన్లలో పనిచేస్తుందా?
ఇది ప్రస్తుతానికి ఆన్‌డ్రాయిడ్ ఫోన్‌లలో మాత్రమే పనిచేస్తుంది. ఇది గుగూల్ ప్లే స్టోర్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. అంతేగాక ఈయాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలంటే మీ స్మార్ట్‌ఫోన్‌లో కనీస స్పేస్ ఉన్న సరిపోతుంది. ఎందుకంటే ఇది 8 ఎంబీ పరిమాణాన్ని మాత్రమే కలిగి ఉంది. అదే విధంగా ఆన్‌డ్రాయిడ్ 5.0 కలిగిన ఏ డివైస్‌లోనైనా ఈయాప్ డౌన్‌లోడ్ అవుతుంది. అయితే ఇప్పటి వరకు దీనికి ఐఓఎస్(ios) యాక్సెస్‌కు అనమతి లేదు. ఐఓఎస్ యాక్సెస్‌ను స్టోర్‌లో ఎప్పుడు ప్రారంభిస్తారన్న దానిపై కూడా ఎలాంటి సమాచారం లేదు.
Comments
Please login to add a commentAdd a comment