
ఆండ్రాయిడ్ ఫోన్ మార్కెట్ పోటీలో నిలబడేందుకు గూగుల్ వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌లలో థర్డ్ పార్టీ యాప్‌లకు చోటు లేకుండా చేయడం.. తద్వారా ఫోన్ కంపెనీలకు భారీగా ముట్టజెప్పడం చేస్తూ వస్తోంది. తాజాగా మరోసారి కాంట్రాక్ట్ చేయాలనుకునే ప్రయత్నం మరింత వివాదానికి దారితీసింది.
2019లో గూగుల్ ప్రీమియర్ డివైజ్ ప్రోగ్రామ్‌ను లాంఛ్ చేసింది. ఈ ప్రోగ్రామ్ ప్రకారం.. స్మార్ట్ ఫోన్ తయారీదారులు గనుక థర్డ్ పార్టీ యాప్ స్టోర్‌లను అనుమతించనట్లయితే(ప్రీ ఇన్‌స్టాల్ టైంలో వేరే ప్లేస్టోర్‌లకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం).. వల్ల గూగుల్ ఆ కంపెనీలకు కొంత రెవెన్యూను అందజేస్తుంది. ఈ ప్రోగ్రాంతోనే ప్లేస్టోర్ ద్వారా ఆండ్రాయిడ్ డివైజ్‌లలో ఓ వెలుగు వెలుగుతోంది గూగుల్. అయితే తాజాగా ఆ డీల్‌ను మరోసారి తెర మీదకు తెచ్చింది.
చదవండి:గూగుల్ ఫొటోస్.. ఇది తెలుసుకోండి
ఈసారి థర్డ్ పార్టీ యాప్ స్టోర్‌లతో పాటు, ఏపీకే ఇన్‌స్టాల్స్ యాప్స్‌ను సైతం ఇన్‌స్టాల్ చేయకూడదని కండిషన్స్ పెట్టింది గూగుల్. అప్పుడు కేవలం ఫోన్ల మార్కెట్‌ప్లేస్‌లో గూగుల్‌ప్లేస్టోర్ మాత్రమే కనిపిస్తుంది. అయితే ఈ విషయంలో ఎపిక్ గేమ్స్‌తో గూగుల్‌కు వివాదం మొదలైంది. సీక్రెట్‌గా ఫోన్ కంపెనీలతో గూగుల్ చేసుకుంటున్న ఒప్పందం నైతిక విలువలకు విరుద్ధమని కోర్టుకు ఎక్కింది ఎపిక్ గేమ్స్.
ఇక గూగుల్ ప్రీమియర్ డివైజ్ ప్రోగ్రామ్‌లో భాగంగా మొత్తం రెవెన్యూ నుంచి 12 శాతం వాటా తీసుకుంటాయి కంపెనీలు. ఇది ఆల్రెడీ అందుకుంటున్న 8 శాతం ఆదాయం కంటే అదనం. original equipment manufacturer (OEM)లో భాగంగా.. ఒప్పో, వీవో, వన్‌ఫ్లస్ 70 శాతం, సోనీ, జియోమీ 50, 40 శాతం గూగుల్ ప్రీమియర్ డివైజ్ ప్రోగ్రామ్ భాగం అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment