సర్వీస్ ఫీజుల వివాదంతో ప్లే స్టోర్ నుంచి గూగుల్ పది భారతీయ మొబైల్ యాప్‌లను తొలగించిన విషయం తెలిసిందే. దాంతో పలు అంకుర సంస్థలకు చెందిన యాజమాన్యాలతో కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్స్ మంత్రి అశ్వనీ వైష్ణవ్ సమావేశమయ్యారు.
గూగుల్, ప్లేస్టోర్ నుంచి తొలగించిన మొబైల్ యాప్‌లకు చెందిన యాజమాన్యాలతో కేంద్ర మంత్రులు సోమవారం పలు సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో ఎటువంటి పరిష్కారం లభించలేదని తెలుస్తోంది. యాప్‌ల విషయంలో గూగుల్ గుత్తాధిపత్యాన్ని ప్రదర్శిస్తుందని భారత కంపెనీలు ఆరోపిస్తున్నాయి.
గూగుల్ కారణంగా సమస్యలను లేవనెత్తిన సంస్థలు, ప్రభుత్వం తోడ్పాటు అందించాలని కోరాయి. ఇన్-యాప్ చెల్లింపులపై గూగుల్ 11-26 శాతం ఫీజు వసూలు చేస్తుండటంతో ఈ వివాదం మొదలైంది. యాంటీ కాంపిటీషన్ సంస్థ సీసీఐ ఇంతకు ముందు 15-30 శాతం బిల్లింగ్ వ్యవస్థను తొలగించింది.
కంపెనీలకు సుప్రీంకోర్టు ఉపశమనం ఇవ్వకపోవడంతో ఫీజు రద్దుచేస్తున్న సంస్థలను గూగుల్ ప్లేస్టోర్ నుంచి తొలగించింది. అనంతరం ప్రభుత్వ జోక్యంతో పునరుద్ధరించింది. సమావేశ వివరాలను ఇప్పుడే వెల్లడించలేమని అశ్వనీ వైష్ణవ్ తెలిపారు. భారత యాప్ డెవలపర్స్ సంఘం అలయన్స్ ఆఫ్ డిజిటల్ ఇండియా ఫౌండేషన్ (ఏడీఐఎఫ్)తో చంద్రశేఖర్ వర్చువల్‌గా సమావేశం అయ్యారు.
ఇదీ చదవండి: మెరైన్ రోబో తయారుచేసిన ఐఐటీ పరిశోధకులు.. ఉపయోగాలివే..
తొలగించిన యాప్‌లలో మాట్రిమోనీ.కామ్, షాదీ.కామ్, ఇన్ఫోఎడ్జ్, అన్‌అకాడమీ, ఆహా, డిస్నీ+ హాట్‌స్టార్, ట్రూలీ మ్యాడ్లీ, క్వాక్‌క్వాక్, స్టేజ్, కుటుంబ్, టెస్ట్‌బుక్ ఉన్నాయి. దీంతో భారతీయ స్టార్టప్‌లు యుఎస్ టెక్ దిగ్గజం చేస్తున్న అన్యాయమైన విధానాలకు వ్యతిరేకంగా చాలా కాలంగా నిరసన వ్యక్తం చేస్తున్నాయి. మాట్రిమొని.కమ్, భారత్ మాట్రిమొని, జోడి వంటి యాప్స్ వ్యవస్థాపకుడు 'మురుగవేల్ జానకిరామన్' గూగుల్ చర్యపై గతంలో అసంతృప్తి వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment