ప్రభుత్వ మొబైల్ యాప్‌లకు ప్రత్యేకమైన లేబుల్ వాడనున్నారు. ఈమేరకు ప్లేస్టోర్‌లో ప్రభుత్వ యాప్‌లకు లేబుల్‌వాడేందుకు గూగుల్ సిద్ధమైంది. ప్రస్తుత రోజుల్లో ఆన్‌లైన్ లావాదేవీలతోపాటు ఓటీటీ యుటిలిటీ బిల్లు చెల్లింపులు, క్రెడిట్ కార్డుల చెల్లింపుల వరకూ..దాదాపు డిజిటల్‌గానే జరుగుతున్నాయి. డిజిటలైజేషన్ పెరుగుతున్న నేపథ్యంలో ఆన్‌లైన్ మోసాలు అధికమవుతున్నాయి. వీటిని కట్టడిచేసేందుకు ఈ మార్పులు తీసుకురాబోతున్నట్లు తెలిసింది.
ప్లేస్టోర్‌లో లక్షల్లో యాప్‌లు పుట్టుకొస్తున్నాయి. వాటిలో వినియోగదారులకు ఏది నమ్మకమైన యాప్..ఏది కాదో అనే అంశంపై స్పష్టత కరవవుతోంది. కొన్ని ప్రభుత్వ యాప్‌లో వ్యక్తిగత సమాచారం పంచుకోవాల్సి ఉంటుంది. అయితే అలా మన వివరాలిస్తున్న యాప్ అసలు ప్రభుత్వ ఆమోదం పొందిందా..లేదా అనే విషయాన్ని ధ్రువపరుస్తూ కొత్త మార్పులు తీసుకురానున్నారు. ప్లేస్టోర్‌లోని ప్రభుత్వ యాప్‌లకు ప్రత్యేక లేబుల్ ఉపయోగించనున్నారు. దాంతో ఆ యాప్‌లను వెంటనే గుర్తించే వీలుంటుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. అయితే ఈ మేరకు యాప్‌లో లేబుల్ ఉంచేందుకు గూగుల్ సైతం సిద్ధమైందని తెలిసింది.
ఇదీ చదవండి: ప్రముఖ కంపెనీలకు ఇకపై బాస్‌లు వీరే..
‘ఎక్స్’ (ట్విటర్)లో బ్లూటిక్ ఎవరైనా కొనుగోలు చేసే వీలు ఉండటంతో ప్రభుత్వ ఖాతాలను తేలిగ్గా గుర్తించడానికి గ్రే టిక్ ఇవ్వడంతో అదే పేరుతో నకిలీ ఖాతాలు నడుపుతున్న వారిని తేలిగ్గా గుర్తించవచ్చు. ఇదే తరహాలో గూగుల్ ప్లే స్టోర్ లేబుల్ తెచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల యాప్‌లకు గూగుల్ ప్లే స్టోర్‌లో ఇకపై లేబుల్ కనిపిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment