Mitron
-
వార్తల్లో పృథ్వీ షా.. సీజ్ చేసిన లాంజ్‌లో తెల్లవారుజాముదాకా
టీమిండియా క్రికెటర్ పృథ్వీ షా మరోసారి వార్తల్లో నిలిచాడు. కొంతకాలంగా మోడల్ నిధి తపాడియాతో రిలేషిన్‌షిప్‌లో ఉన్న పృథ్వీ షా ఈ సోమవారం రాత్రి థానేలోని నెహ్రూ నగర్లో ఉన్న మిట్రన్ లాంజ్‌కు వచ్చాడు. ఈ లాంజ్ హాంగ్ఔట్ ప్లేస్‌కు పాపులర్ అని చెప్పొచ్చు. ఓపెన్ ఎయిర్ సీటింగ్ సౌకర్యం ఉన్న ఈ లాంజ్‌కు ఎంతో మంది సెలబ్రిటీలు వస్తుంటారు. అయితే మంగళవారం మిట్రన్ లాంజ్‌ను వేగల్ ఎస్టేట్ పోలీసులు సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఉదయం ఆరు గంటల వరకు లాంజ్ నడుస్తున్నట్లు సమాచారం అందడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు లాంజ్‌లో రెక్కీ నిర్వహించి సీజ్ చేశారు. ఆ సమయంలో పృథ్వీ షా అదే లాంజ్‌లో ఉన్నట్లు తేలింది. సీజ్ చేస్తున్నారన్న విషయాన్ని తెలుసుకొని పృథ్వీ అక్కడినుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. కాగా ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ బినూ వర్గీస్ తన ట్విటర్లో మిట్రన్ లాంజ్ గురించి రాయడం ద్వారా విషయం వెలుగులోకి వచ్చింది. ''ఉదయం ఆరు గంటలు దాటిన తర్వాత లాంజ్ బయట ఒక ఆరుగురు బౌన్సర్స్ కస్టమర్స్‌తో గొడవ పడుతున్నట్లు తెలిసింది. అయితే అన్ని బార్స్, లాంజ్, రెస్టారెంట్లకు అర్థరాత్రి 1:30 తర్వాత మూసేయాలని నిబంధన ఉంది. కానీ మిట్రన్ లాంజ్‌కు ఆ నిబంధన వర్తించదా. సెలబ్రిటీలు ఎక్కువగా వస్తారన్న కారణంతో స్పెషల్ లైసెన్స్ ఏమైనా ఇచ్చారా.. దీనివల్ల లాంజ్ చుట్టుపక్కల ఉండే ఫ్యామిలీలు ఇబ్బంది పడుతాయి కదా.. దీనిపై వెంటనే తగిన యాక్షన్ తీసుకోవాల్సిందే'' అంటూ రాసుకొచ్చాడు. బినూ వర్గీస్ ట్వీట్‌పై స్పందించిన ఎక్సైజ్ శాఖ వెంటనే అప్రమత్తం అయింది. మంగళవారం ఉదయం ఆరు గంటలకు ఇన్స్పెక్టర్ ఆర్సీ బిరాజ్దార్ తన సిబ్బందితో కలిసి లాంజ్‌లో రెక్కి నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉదయం ఆరు గంటల వరకు లాంజ్నడుస్తున్నందున పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడంతో రెండు చార్జీషీట్లు దాఖలు చేశారు. చార్జీషీట్లో పేర్కొన్నవన్నీ కోర్టులో నిజమని తేలితే మెట్రజ్ లాంజ్ పర్మినెంట్‌గా క్లోజ్ అయ్యే అవకాశాలున్నాయి. ఇక పృథ్వీ షా ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 2023 సీజన్లో అంతగా ఆకట్టుకోలేకపోయాడు. కేవలం 8 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన పృథ్వీ 13.25 సగటుతో 106 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒకే ఒక్క అర్థసెంచరీ ఉంది. Excise Department have lodge the Breech Case against Mitron Lounge, 2 More cases The Lounge will Shutdown Permanently #Nightlife #ThaneCitypolice #earthquake https://t.co/dKlv8f9Pek pic.twitter.com/LeOnlrZ7Xo — SBT News (@TimesSukhi) June 13, 2023 చదవండి: ఒక్క బంతికి 18 పరుగులా.. నువ్వు దేవుడివయ్యా! -
ధనుష్ డైరెక్టర్‌తో నయన్ మూవీ?
తమిళ సినిమా: కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న మిత్రన్ కొత్త చిత్రానికి సిద్ధమవుతున్నారు. ఇంతకుముందు యారడీ నీ మోహిని, కుట్టి, ఉత్తమ పుత్తిరన్, మీండుమ్ ఆరు కాదల్ క్రైం, మదిల్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన ఈయన ఇటీవల ధనుష్ కథానాయకుడిగా తిరుచ్చిట్రం ఫలం చిత్రాన్ని తెరకెక్కించారు. నాలుగు చిత్రాలకు ధనుష్‌నే హీరో కావడం గమనార్హం. కాగా తిరుచ్చిట్రం ఫలం మంచి విజయాన్ని సాధించింది. ఇందులో ధనుష్, నిత్యామీనన్ నటన ప్రేక్షకులను విపరీతంగా అలరించింది. కాగా దర్శకుడు మిత్రన్ జోహార్ తాజా చిత్రానికి సిద్ధమయ్యారు. ఇందులో నయనతారను కథానాయకిగా నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ విషయమై ఆమెతో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. ఇది కథానాయకి నేపథ్యంలో సాగే కథా చిత్రమా? లేక కమర్షియల్ అంశాలతో హీరో ఓరియంటెడ్ కథా చిత్రమా అన్నది తెలియాల్సి ఉంది. నయనతార ఇటీవల ఎక్కువగా హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రంల్లోనే నటిస్తున్నారు. ఈమె ఇంతకుముందు ధనుష్ సరసన యారడీ నీ మోహిని చిత్రంలో నటించారు. ఆ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా మిత్రన్ జవహర్ దర్శకత్వంలో నటించడానికి అంగీకరించే అవకాశం ఎక్కువగా ఉంది. అంతేకాకుండా ప్రస్తుతం ఈమె చేతిలో కొత్త చిత్రాలు ఏమీ లేవు. షారుక్ ఖాన్ జంటగా నటించిన హిందీ చిత్రం జవాన్ త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. -
అందుకే మిట్రాన్ యాప్ తొలగించాం: గూగుల్
ముంబై: టిక్‌టాక్‌కు పోటీగా అవతరించిన మిట్రాన్ యాప్ అనతి కాలంలోనే యూజర్లను విశేషంగా ఆకట్టుకుంది. ఇటీవల భద్రతా సమస్యల కారణంగా ప్లే స్టోర్‌లో మిట్రాన్ యాప్‌ను గూగుల్ తొలగించిన విషయం తెలిసిందే. అయితే సంస్థలకు ఏదయినా సాంకేతిక సమస్యలుంటే పరిష్కరించడానికి సిద్దమేనని గూగుల్, ఆండ్రాయిడ్లు ప్రకటించాయి. మిట్రాన్ యాప్ కేవలం ఒక నెలలోనే 50 లక్షల డౌన్లోడ్లతో యూజర్లను అలరించింది. ఈ యాప్‌కు సంబంధించిన సమస్యకు తాము పరిష్కారం చూపించామని ఆండ్రాయిడ్, గూగుల్ ప్లే పేర్కొంటు.. అయితే తాము సూచించిన నిబంధనలను పాటించాలని వైస్ ప్రెసిడెంట్ సమీర్ సామత్ పేర్కొన్నారు. ఇటీవల తమ విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరించినందుకు మిట్రాన్ యాప్‌ను ప్లే స్టోర్ నుంచి గూగుల్ తొలగించింది. కాగా సైబర్ నిపుణులు సైతం వినియోగదారుల వివరాలు గోప్యంగా ఉంచేందుకు మిట్రాన్ యాప్ డెవలపర్స్ ఎటువంటి భద్రతా ప్రమాణాలు పాటించలేదని.. యాప్‌ను తొలగించాలని సలహా ఇచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల విపరీతమైన పోటీ కారణంగా యాప్‌లు నిబంధనలు పాటించడం లేదని.. తాము సమాజానికి ఉపయోగపడే నిబంధనలు రూపొందించామని గూగుల్ పేర్కొంది. ప్లే స్టోర్‌లో ఉన్న వివిధ యాప్‌లు గూగుల్ రూపొందించిన నియమాలను పాలించాల్సిందేనని సంస్థ స్పష్టం చేసింది. చదవండి: ప్లే స్టోర్‌లో కనిపించని మిట్రాన్ -
మిట్రాన్‌కు షాకిచ్చిన గూగుల్
న్యూఢిల్లీ: క్యారిమీనటి ఉదంతం, చైనా యాప్ బహిష్కరణ నినాదం.. ఈ రెండూ టిక్‌టాక్‌కు ముచ్చెమటలు పట్టించాయి. ఫలితంగా యాప్ రేటింగ్స్ దారుణంగా పడిపోయాయి. సరిగ్గా ఇదే సమయంలో నెగెటివ్ రివ్యూల తొలగింపు పేరుతో గూగుల్ టిక్‌టాక్‌కు అండగా నిలిచింది. అయితే దీనికన్నా ముందు టిక్‌టాక్ కష్టకాలాన్ని ఉపయోగించుకుంటూ స్వదేశీ యాప్ పేరిట 'మిట్రాన్' తెరమీదకు వచ్చింది. దీంతో అప్పటికే చైనాపై వ్యతిరేకత ఉన్న నెటిజన్లు పెద్ద ఎత్తున ఈ యాప్‌ను డౌన్లోడ్ చేశారు. తక్కువ కాలంలోనే దీని డౌన్లోడ్ల సంఖ్య 5 మిలియన్లు దాటిపోయింది. 4.7 రేటింగ్‌తో తిరుగులేని యాప్‌గా నిలిచింది. ఇలా బ్రేకులు లేకుండా దూసుకుపోతున్న మిట్రాన్‌కు గూగుల్ సడన్ షాకిచ్చింది. (మిట్రాన్ యాప్.. అసలు కథ ఇది!) భద్రతా సమస్యల కారణంగా ప్లే స్టోర్‌లో మిట్రాన్ యాప్‌ను తొలగించినట్లు గూగుల్ పేర్కొంది. సైబర్ నిపుణులు సైతం వినియోగదారుల వివరాలు గోప్యంగా ఉంచేందుకు యాప్ డెవలపర్స్ ఎటువంటి భద్రతా ప్రమాణాలు పాటించలేదని తెలిపారు. వీలైతే యాప్‌ను డిలీట్ చేయాల్సిందిగా కోరారు. కాగా ఈ యాప్‌ను రూర్కే ఐఐటీ విద్యార్థి శిబంక్ అగర్వాల్ తయారు చేసినట్లు ప్రచారం జరిగింది. దీనిపై క్యూబాక్సస్ వ్యవస్థాపకుడు ఇర్ఫాన్ షేక్ మాట్లాడుతూ.. 'తమ సంస్థ యాప్ సోర్స్ కోడ్‌ను సదరు విద్యార్థికి విక్రయించాం. అతను దాన్ని మిట్రాన్ పేరిట భారత్‌లో విడుదల చేశాడు' అని పేర్కొన్న విషయం తెలిసిందే. (ట్రంపొకరు కిమ్మొకరు) -
మిట్రాన్ యాప్ రేటింగ్ అందుకే పెరిగింది!
న్యూఢిల్లీ: మిట్రాన్ యాప్‌కు సంబంధించి ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. టిక్‌టాక్‌కు వ్యతిరేకంగా మిట్రాన్ యాప్‌ను భారత్ తయారు చేసిందని, దానిని ఐఐటీ విద్యార్థిచే తయారు చేయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో వాస్తవం లేదని తేలింది. మిట్రాన్ యాప్ వాస్తవానికి పాకిస్తాన్‌కు చెందిన టిక్‌టిక్ యాప్ రీప్యాకేజీ వెర్షన్ అని వెల్లడైంది. దీని తామే తయారు చేసినట్టు పాకిస్తాన్‌కు చెందిన క్యూబాక్సస్ అనే సాఫ్ట్వేర్ సంస్థ వెల్లడించింది. ఈ యాప్‌కు సంబంధించిన పూర్తి సోర్స్ కోడ్ తమ సంస్థకు చెందినదని క్యూబాక్సస్ వ్యవస్థాపకుడు, సీఈవో ఇర్ఫాన్ షేక్ తెలిపారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ‘మా సంస్థ యాప్ సోర్స్ కోడ్‌ను మిట్రాన్ ప్రమోటర్‌కు 34 డాలర్లు(రూ. 2600) లకు విక్రయించాం. మిట్రాన్ డెవలపర్ మా సంస్థ సోర్స్ కోడ్ ద్వారా మిట్రాన్ యాప్‌ను తయారు చేసి కేవలం లోగో మార్చి వారి స్టోర్‌లో అప్లోడ్ చేసుకున్నారు. అయితే ఇదేమి పెద్ద సమస్య కాదు. ఎందుకంటే వారు మా కోడ్‌ను డబ్బులతో కోనుగోలు చేసి దాన్ని ఉపయోగించుకున్నారు. కానీ మా సంస్థ సోర్స్ కోడ్‌తో తయారు చేసిన మిట్రాన్ యాప్‌ను భారతీయ యాప్‌గా పేర్కొనడమే అభ్యంతకరం. ఎందుకంటే వారు ఆ కోడింగ్‌లో ఎటువంటి మార్పులు చేయలేద’ని ఆయన స్పష్టం చేశారు. (ప్లే స్టోర్‌లో టిక్‌టాక్‌కు ఎదురుదెబ్బ) ఇక డేటా హోస్టింగ్ ప్రక్రియ గురించి ఆయనను అడగ్గా.. ‘క్యూబాక్సస్ సర్వర్‌లో యూజర్ డేటాను పొందే అవకాశాన్ని మా సంస్థ కల్పిస్తుంది. కానీ మిట్రాన్ అలా చేయలేదు. బదులుగా యూజర్ డేటాను వారి స్వంత సర్వర్‌లో పొందేలా యాక్సెస్ ఇచ్చింది. ఇప్పటికీ మిట్రాన్ యూజర్ డేటాపై స్పష్టత లేద’ని ఆయన పేర్కొన్నారు. కాగా యాప్‌కు సంబంధించిన కోడ్‌ను కోనుగోలు చేయడం, వేరే పేరుతో దానిని ఉపయోగించడం అనేది చట్ట విరుద్దమేమి కాదు. క్యూబాక్సస్ కూడా గతంలో ఎన్నో ఇతర ఆప్ కోడ్లను క్లోన్లుగా పనిచేసే బహుళ యాప్‌లను తయారు చేసింది. అంతేగాక ఇన్స్టాగ్రామ్ సోర్స్ ఆధారంగా (హష్గామ్), ఫుండీస్ సింగిల్ రెస్టారెంట్ ఆధారంగా (ఆస్కింగ్ టూ జోమాటో), అచ్చం టిక్‌టాక్ మాదిరిగానే (టిక్‌టిక్) యాప్‌లను తయారు చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ మిట్రాన్ యాప్ కోడ్‌లో తమ సోర్స్ కోడ్‌ను కనీసం ఒక బిట్ కూడా మార్చే ప్రయత్నం చేయకపోవడం నిజంగా మోసపూరితమైనదిగా క్యూబాక్సస్ పేర్కొంది. (ఊపిరి పీల్చుకున్న టిక్‌టాక్) మిట్రాన్ యాప్‌లో పటిష్టమైన గోప్యతా విధానం కూడా లేదని నిపుణులు అంటున్నారు. వినియోగదారులు సైన్ అప్ చేసి ఇందులో వీడియోలు అప్లోడ్ చేయొచ్చు. వారి డేటాతో ఏమి జరుగుతుందో తెలియదు వినియోగదారులకు తెలిసే అవకాశం లేదు. మిట్రాన్ యాప్ భారత్‌కు చెందినది అన్న భావనతోనే ప్లే స్టోర్‌లో అధిక రేటింగ్ వచ్చిందని భావిస్తున్నారు. పాకిస్తాన్‌కు చెందిన డెవలపర్ నుంచి కొనుగోలు చేశారని తెలిస్తే రేటింగ్ పడిపోతుందని అభిప్రాయపడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కువగా వాడే 'మిత్రోం' పదానికి దగ్గరా ఉండడంతో ఈ యాప్ ఆయనకు చెందినదని చాలా మంది అనుకున్నారు. ఇది కూడా మిట్రాన్ యాప్ రేటింగ్ పెరగడానికి ఒక కారణమని అంచనా. (దూసుకెళ్తున్న టిక్‌టాక్ మాతృసంస్థ) -
ప్లే స్టోర్‌లో టిక్‌టాక్‌కు ఎదురుదెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ: వీడియో షేరింగ్ ప్లాట్‌ఫాం టిక్‌టాక్‌కు ప్లే స్టోర్‌లో ఎదురుదెబ్బ తగిలింది. కొత్త యాప్ మిట్రాన్ గుగూల్ ప్లేస్టోర్ రేటింగ్‌లో టిక్‌టాక్‌ను అధిగమించింది. ఇప్పటి వరకు గుగూల్ ప్లే స్టోర్ రేటింగ్‌లో టిక్‌టాక్, యూట్యూబ్‌లు మాత్రమే పోటీ పడేవి. తాజా నివేదిక ప్రకారం గుగూల్ రేటింగ్‌లో టిక్‌టాక్, యూట్యూబ్‌లను మిట్రాన్ యాప్ అధిగమించి 4.7 రేటింగ్‌తో ట్రేండింగ్లో ఉంది. అంతేగాక ప్లే స్టోర్‌లో యూజర్లు టిక్‌టాక్‌కు తక్కువ రేటింగ్, నెగటివ్ ఫీడ్‌బ్యాక్ ఇవ్వడంతో టిక్‌టాక్ ప్లే స్టోర్ రేటింగ్ 1కి పడిపోయింది. ప్రస్తుతం టిక్‌టాక్‌కు ప్లేస్టొర్‌లో 1.4 రేటింగ్‌తో ఉంది. మిట్రాన్ యాప్ ప్లే స్టోర్‌లో 5 మిలియన్లకు పైగా డౌన్లోడ్లను కలిగి 4.7 రేటింగ్‌తో ప్లే స్టోర్‌లో దూసుకుపోతుంది. అతి తక్కువ సమయంలోనే 5 మిలియన్లకు పైగా యూజర్లను పొంది 4.7 రేటింగ్‌తో మిట్రాన్ ట్రేండింగ్ యాప్‌ల జాబితాలో చేరిపోయింది. (ప్రత్యర్థులకు గుబులు: దూసుకొచ్చిన జియో మార్ట్) మిట్రాన్ ఎలా పని చేస్తుందంటే.. మిట్రాన్ కూడా టిక్‌టాక్ మాదిరిగానే దాని శ్రేణి సాధనాలతో (రేంజ్ ఆఫ్ టూల్స్) పనిచేస్తుంది. దీనిలో ఫిల్టర్ ఆప్షన్ ద్వారా షాట్ వీడియోలను ఎడిట్ చేసి వాటిని ఈ వీడియో ప్లాట్‌ఫారమ్‌లో షేర్ చేయోచ్చు. అంతేగాక టిక్‌టాక్ మాదిరిగానే, మిట్రాన్ వినియోగదారులకు వారివద్ద ఉన్న మల్టీమీడియా కంటెంట్‌కు వైడ్ లైబ్రరీని పొందే యాక్సెస్ కూడా ఉంది. ఇక మీరు ఈ యాప్‌లో కొత్తగా వీడియోలు క్రియోట్ చేయడంతో పాటు పాపులర్ మ్యూజిక్ క్లిప్స్ లేదా మూవీ డైలాగ్‌లను సింక్రనైజ్ చేయోచ్చు. (యాప్‌లో వివరాలు 30రోజుల్లో డిలీట్) మిట్రాన్ అన్ని ఫోన్లలో పనిచేస్తుందా? ఇది ప్రస్తుతానికి ఆన్‌డ్రాయిడ్ ఫోన్లలో మాత్రమే పనిచేస్తుంది. ఇది గుగూల్ ప్లే స్టోర్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. అంతేగాక ఈయాప్ డౌన్లోడ్ చేసుకోవాలంటే మీ స్మార్ట్‌ఫోన్‌లో కనీస స్పేస్ ఉన్న సరిపోతుంది. ఎందుకంటే ఇది 8 ఎంబీ పరిమాణాన్ని మాత్రమే కలిగి ఉంది. అదే విధంగా ఆన్‌డ్రాయిడ్ 5.0 కలిగిన ఏ డివైస్‌లోనైనా ఈయాప్ డౌన్లోడ్ అవుతుంది. అయితే ఇప్పటి వరకు దీనికి ఐఓఎస్(ios) యాక్సెస్‌కు అనమతి లేదు. ఐఓఎస్ యాక్సెస్‌ను స్టోర్‌లో ఎప్పుడు ప్రారంభిస్తారన్న దానిపై కూడా ఎలాంటి సమాచారం లేదు. -
మోదీ ప్రసంగంలో ఆ 'పదం' ఏమైంది!
ప్రధాని నరేంద్రమోదీ ఎప్పుడు ప్రసంగించినా.. 'మిత్రోం' అని జనాల్ని ఉద్దేశించి సంబోధించడం పరిపాటి. కానీ కొత్త సంవత్సరం సందర్భంగా శనివారం (డిసెంబర్ 31న) జాతిని ఉద్దేశించి ప్రసంగించిన మోదీ.. 'మిత్రోం'కు బదులు 'దోస్తోం' అని సంబోధించారు. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో పేదలు, మహిళలు, పలువర్గాల వారికి రాయితీలు ప్రకటిస్తూ.. నోట్ల కష్టాలు తొలగిపోతాయని హామీ ఇస్తూ మోదీ ప్రసంగం సాగినప్పటికీ.. ట్వీపుల్ (ట్విట్టర్ జనం) మాత్రం 'మిత్రోం' ఏమైందంటూ ఆరా తీశారు. మోదీ ప్రసంగంలో 'మిత్రోం' లేకపోవడం నిరాశపరిచిందంటూ కొందరు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీంతో ట్విట్టర్లో ప్రస్తుతం 'మిత్రో' పదం ట్రెండ్ అవుతోంది. ''మిత్రోం' నుంచి ఉర్దూ పదం 'దోస్తోం'కి మోదీ మారిపోయారు. క్రైస్తవుల నూతన సంవత్సర పండుగకి శుభాకాంక్షలు తెలిపారు. పేదలకు అనుకూల పథకాలు ప్రకటిస్తున్నారు. ఇప్పుడు ఆయన ఉదారవాద సెక్యూలర్ నాయకుడిగా మారిపోయారు' అంటూ మాధవన్ నారాయణ్ ట్వీట్ చేయగా.. మోదీ మొదట మన నోట్లను దూరం చేశారు. ఇప్పుడు మనకు ఇష్టమైన 'మిత్రోం'ని కూడా దూరం చేస్తున్నారంటూ మరొక నెటిజన్ కామెంట్ చేశారు. ఈరోజు ప్రసంగంలో మోదీ 'మిత్రోం' అనలేదు. కొంపదీసి ఆయన మనల్ని అన్‌ఫ్రెండ్ చేయలేదు కదా అని మరొకరు చమత్కరించారు. డిమానిటైజేషన్ నుంచి డిమిత్రోనైజేషన్ జరిగినట్టుందని మరొకరు ట్వీట్ చేశారు.