
తమిళ సినిమా: కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న మిత్రన్ కొత్త చిత్రానికి సిద్ధమవుతున్నారు. ఇంతకుముందు యారడీ నీ మోహిని, కుట్టి, ఉత్తమ పుత్తిరన్, మీండుమ్ ఆరు కాదల్ క్రైం, మదిల్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన ఈయన ఇటీవల ధనుష్ కథానాయకుడిగా తిరుచ్చిట్రం ఫలం చిత్రాన్ని తెరకెక్కించారు. నాలుగు చిత్రాలకు ధనుష్‌నే హీరో కావడం గమనార్హం. కాగా తిరుచ్చిట్రం ఫలం మంచి విజయాన్ని సాధించింది.
ఇందులో ధనుష్, నిత్యామీనన్ నటన ప్రేక్షకులను విపరీతంగా అలరించింది. కాగా దర్శకుడు మిత్రన్ జోహార్ తాజా చిత్రానికి సిద్ధమయ్యారు. ఇందులో నయనతారను కథానాయకిగా నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ విషయమై ఆమెతో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. ఇది కథానాయకి నేపథ్యంలో సాగే కథా చిత్రమా? లేక కమర్షియల్ అంశాలతో హీరో ఓరియంటెడ్ కథా చిత్రమా అన్నది తెలియాల్సి ఉంది.
నయనతార ఇటీవల ఎక్కువగా హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రంల్లోనే నటిస్తున్నారు. ఈమె ఇంతకుముందు ధనుష్ సరసన యారడీ నీ మోహిని చిత్రంలో నటించారు. ఆ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా మిత్రన్ జవహర్ దర్శకత్వంలో నటించడానికి అంగీకరించే అవకాశం ఎక్కువగా ఉంది. అంతేకాకుండా ప్రస్తుతం ఈమె చేతిలో కొత్త చిత్రాలు ఏమీ లేవు. షారుక్ ఖాన్ జంటగా నటించిన హిందీ చిత్రం జవాన్ త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment