కూటమి ప్రభుత్వంపై జాతీయ మహిళా కమిషన్‌కు వైఎస్సార్‌సీపీ నేతల ఫిర్యాదు | YSRCP Women Leaders Will File A Complaint To NCW Against AP Government, More Details Inside | Sakshi
Sakshi News home page

కూటమి ప్రభుత్వంపై జాతీయ మహిళా కమిషన్‌కు వైఎస్సార్‌సీపీ నేతల ఫిర్యాదు

Published Tue, Oct 29 2024 9:30 AM | Last Updated on Tue, Oct 29 2024 3:07 PM

Ysrcp Women Leaders Will File A Complaint To NCW Against AP Government

సాక్షి, ఢిల్లీ: కూటమి ప్రభుత్వంలో మహిళలపై జరుగుతున్న దారుణలపై వైఎస్సార్‌సీపీ మహిళా నేతలు జాతీయ మహిళా కమిషన్‌ (ఎన్‌సీడబ్ల్యూ) ఛైర్‌పర్సన్‌ విజయా కిశోర్‌ రహాట్కర్‌కు ఫిర్యాదు చేయనున్నారు.

మంగళవారం మద్యాహ్నం 2గంటలకు వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, ఎంపీ డాక్టర్ గుమ్మ తనుజా రాణి, మాజీ ఎంపీలు చింత అనురాధ, మాధవిలు.. ఎన్‌సీడబ్ల్యూ ఛైర్‌పర్సన్‌ విజయా కిశోర్‌ రహాట్కర్‌తో భేటీ కానున్నారు.

ఈ భేటీలో కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, కూటమి ప్రభుత్వ పాలనలో రోజూ మహిళలపై దాడులు, అత్యాచారాలు, వేధింపులు నిత్యకృత్యంగా మారాయని ఫిర్యాదు చేయనున్నారు. మహిళలపై 100కు పైగా జరిగిన దురాగతాల నివేదికను అందించనున్నారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టడంలో చంద్రబాబు సర్కార్ వైఫల్యంపై వైఎస్సార్‌సీసీ మహిళ నేతలు జాతీయ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళనున్నారు.

జాతీయ మహిళా కమిషన్‌ ని కలవనున్న వైసీపీ మహిళా నేతలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement