కొచ్చి: కేరళలో బాలికల బలవంతపు మతమార్పిడులు ఆందోళనకరంగా మారిందని జాతీయ మహిళాకమిషన్ ఇంచార్జ్ చైర్మన్ రేఖా శర్మ ఆరోపించారు. కేరళలో హాదియా (24) అనే యువతి ‘లవ్ జిహాద్’లో చిక్కుకున్నాననడంతో ఈ విషయం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ఎన్సీడబ్ల్యూ చైర్మన్ కేరళలోని కొట్టాయం జిల్లా వైకోమ్‌లో బాధితురాలిని పరామర్శించారు. ‘హాదియా ఆరోగ్యం బాగుంది. ఇక్కడెవరూ ఆమెను కొట్టడం లేదు. సుప్రీంకోర్టు ముందు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉంది. కొందరు ఆమెను బెదిరిస్తున్నారు. కొందరు బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. ఇదేమీ చిన్న విషయం కాదు. పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది’ అని రేఖా శర్మ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment