NCW
-
అమరవీరుల జవాన్ల కుటుంబాలనూ వదలని సోషల్ మీడియా భూతం
సోషల్ మీడియా భూతం అమరవీరుల జవాన్ల కుటుంబాలనూ వదలడం లేదు. దేశం కోసం ప్రాణాల్పించిన జవాన్లు, వారి కుటుంబ సభ్యులపై అసభ్యకరంగా పోస్ట్‌లు పెడుతున్నారు.ఇటీవల అమరుడైన కెప్టెన్ అన్షుమాన్ సింగ్‌కు కేంద్ర ప్రభుత్వం కీర్తచక్ర అవార్డ్‌ను ప్రకటించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్షుమాన్ సింగ్ సతీమణి స్మృతికి అవార్డ్‌ను అందించారు. ఆ వీడియోపై కొందరు దుర్మార్గులు ట్రోలింగ్‌కు దిగారు. ఆమె చాలా అందంగా ఉందంటూ అసభ్యకరంగా ఉందంటూ కామెంట్లు పెట్టారు.ఈ అంశంపై నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ (ఎన్సీడబ్ల్యూ) స్పందించింది. సోషల్ మీడియాలో అనుచిత కామెంట్లు చేస్తున్న వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. -
స్వాతి మాలీవాల్ ఎపిసోడ్: బిభవ్ కుమార్‌కు ఎన్డబ్ల్యూసీ సమన్లు
ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పీఏ బిభవ్‌కుమార్ తనపై దాడి చేశారని ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలీవాల్ చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. ఆమె చేసిన ఆరోపణలను ఆ పార్టీ సీనియర్ ఎంపీ సంజయ్ సింగ్ నిజమేనని ధృవీకరించారు. దీంతో ఈ వ్యవహారంపై గురువారం జాతీయ మహిళా కమిషన్ స్పందించింది.సీఎం అరవింద్ కేజ్రీవాల్ పీఏ బిభవ్కుమార్కు సమన్లు జారీ చేసింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు తమ ముందు హాజరై.. స్వాతి మాలీవాల్‌పై దాడి చేసినట్లు వచ్చిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని సమన్లలో ర్కొంది. ఈ నోటీసులను జాతీయ మహిళా కమిషన్.. సీఎం కేజ్రీవాల్ కార్యాలయానికి పంపించటం గమనార్హం.సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఆయన పీఏ బిభవ్ కుమార్ తనపై తీవ్రంగా దాడి చేశారని ఎంపీ స్వాతిమాలీవాల్ సోషల్ మీడియా పోస్ట్ చేసింది. అయితే ఆమె చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఆధారంగా సుమోటోగా తీసుకున్నామని జాతీయ మహిళా కమిషన్ పేర్కొంది. తనపై దాడి జరిగినట్లు ఎంపీ స్వాతి మాలీవాల్ సోమవారం బయటపెట్టారు. ఈ ఘటనపై బీజేపీ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. -
త్రిషపై లియో నటుడి కామెంట్స్.. ఎన్సీడబ్ల్యూ సీరియస్!
కోలీవుడ్ నటుడు మన్సూర్ అలీ ఖాన్ వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. లియో సినిమాలో ఓ పాత్రలో నటించిన ఆయన హీరోయిన్ త్రిషను ఉద్దేశించి అసభ్యకరమైన రీతిలో మాట్లాడారు. దీంతో అతనిపై సినీతారలు, డైరెక్టర్ లోకేశ్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ సీరియస్‌గా తీసుకుంది. ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించిన ఎన్సీడబ్ల్యూ.. మన్సూర్‌పై కేసు నమోదు చేయాలని తమిళనాడు పోలీసులను ఆదేశించింది. త్రిషపై ఆయన చేసిన కామెంట్స్ తమను ఎంతగానో బాధించాయని.. మహిళల గురించి ఇలాంటి అసభ్యకరమైన కామెంట్స్ చేస్తే సహించేదిలేదని తెలిపింది. ఈ మేరకు ఎన్సీడబ్ల్యూ ట్వీట్ చేసింది. ఎన్సీడబ్ల్యూ తన ట్వీట్లో.. 'త్రిషపై మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. అతడిపై కేసు నమోదు చేయాలని తమిళనాడు డీజీపీకి ఆదేశాలు జారీ చేస్తున్నాం. మహిళలపై హింసను ప్రేరేపించే ఇలాంటి వాటిని సహించేది లేదంటూ పోస్ట్ చేసింది. The National Commission for Women is deeply concerned about the derogatory remarks made by actor Mansoor Ali Khan towards actress Trisha Krishna. We're taking suo motu in this matter directing the DGP to invoke IPC Section 509 B and other relevant laws.Such remarks normalize… — NCW (@NCWIndia) November 20, 2023 -
Swati Maliwal: ఢిల్లీ పోలీసులకు ఎన్సీడబ్ల్యూ అల్టిమేటం
ఢిల్లీ: దేశ రాజధాని పోలీసులకు జాతీయ మహిళా కమిషన్ తాజాగా అల్టిమేటం జారీ చేసింది. ఢిల్లీ మహిళా కమిషన్ స్వాతి మలివాల్‌ను వేధించిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని, తీసుకున్న చర్యల పూర్తి నివేదికను రెండు రోజుల్లోగా తమ ముందు ఉంచాలని ఎన్సీడబ్ల్యూ చైర్పర్సన్ రేఖా శర్మ.. ఢిల్లీ పోలీసులను ఆదేశించారు. స్వాతి మలివాల్‌తో తప్పతాగిన ఓ వ్యక్తి బుధవారం అర్ధరాత్రి పూట అనుచితంగా ప్రవర్తించాడని, కారుతో పాటు కొద్దిదూరం లాక్కెళ్లాడని మీడియాలో వచ్చిన కథనాలను పరిగణనలోకి తీసుకుంది జాతీయ మహిళా కమిషన్. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ పోలీసులకు ఆదేశాలు జారీ చేస్తూ.. ఢిల్లీ కమిషనర్‌కు రేఖా శర్మ లేఖ రాశారు. అంతకు ముందు ఇదే విషయంపై ఆమె ట్వీట్ కూడా చేశారు. కారుతో ఈడ్చుకెళ్లిన తాగుబోతు! ఇదిలా ఉంటే.. ఢిల్లీలో మహిళ భద్రతను పర్యవేక్షించే క్రమంలో ఎయిమ్స్ గేట్ వద్ద అర్ధరాత్రి 3 గంటల ప్రాంతంలో తన టీంతో నిఘా పెట్టారు డీసీడబ్ల్యూ చీఫ్ స్వాతి మలివాల్. అయితే తప్పతాగి కారులో వచ్చిన వ్యక్తి ఆమెతో అనుచితంగా ప్రవర్తించడంతో పాటు ప్రతిఘటించే సమయంలో ఆమెను కారుతో పాటు లాక్కెళ్లే యత్నం చేశాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన స్వాతి మలివాల్.. భగవంతుడి దయతో బయటపడ్డానని, లేకుంటే తాను మరో అంజలి సింగ్‌ను అయ్యేదానిని అంటూ వ్యాఖ్యానించారు కూడా. ఇదిలా ఉంటే ఈ ఘటనకు సంబంధించి.. నిందితుడిని అరెస్ట్ చేయడంతో పాటు కారును పోలీసులు సీజ్ చేశారు కూడా. -
చైల్డ్ పోర్నోగ్రఫీ కంటెంట్‌పై ట్విటర్ వివరణ
పిల్లల అశ్లీల కంటెంట్ ను పోస్ట్ చేయడానికి అనుమతించినందుకు ట్విటర్ పై నిన్న ఢిల్లీ పోలీసులు కేసు దాఖలు చేశారు. అయితే, నేడు ఆ చైల్డ్ పోర్నోగ్రఫీ కంటెంట్ కేసుపై సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్ స్పందించింది. పిల్లల అశ్లీల కంటెంట్ విషయాల్లో సంస్థ జీరో-టాలరెన్స్ పాలసీని కలిగి ఉన్నట్లు తెలిపింది. సంస్థ మార్గదర్శకాలను ఉల్లంఘించే కంటెంట్ ను ముందుగానే గుర్తించి తొలగిస్తుందని, అటువంటి విషయాల్లో చట్టానికి సహకరిస్తామని కంపెనీ తెలిపింది. "ట్విటర్ నిబంధనలను ఉల్లంఘించే కంటెంట్ ను ముందుగా గుర్తించి తొలగించడంలో మేము కృషి చేస్తున్నాము. ఈ సమస్యను పరిష్కరించడం కోసం, భారతదేశంలోని చట్టాల అమలు కోసం ఎన్జిఓ భాగస్వాములతో పనిచేస్తాము" అని ట్విటర్ ప్రతినిధి ఎఎన్ఐకు తెలిపారు . జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్(ఎన్సీపీసీఆర్) దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా నిన్న(జూన్ 29) ఢిల్లీ పోలీస్ సైబర్ సెల్ ట్విటర్ పై కేసు నమోదు చేసింది. అశ్లీల కంటెంట్ ను తొలగించాలని, మైక్రోబ్లాగింగ్ సైట్ లో సర్క్యులేట్ చేసిన ఖాతాల వివరాలను పంచుకోవాలని ట్విటర్ ను కోరినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(సైబర్ సెల్) అన్యేష్ రాయ్ తెలిపారు. జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యు) ట్విటర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ను ఒక వారంలోగా మీడియా వేదిక నుంచి అన్ని అశ్లీల కంటెంట్ ను తొలగించాలని కోరింది. ఈ విషయంపై దర్యాప్తు చేసి తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎన్సీడబ్ల్యు చైర్ పర్సన్ రేఖా శర్మ ఢిల్లీ పోలీసు కమిషనర్ కు లేఖ రాశారు. చదవండి: వాట్సాప్ వార్నింగ్.. ఈ యాప్ వాడితే మీ అకౌంట్ బ్లాక్ -
ఎన్సీడబ్ల్యు సభ్యురాలి అనుచిత వ్యాఖ్యలు : తాప్సీ ఫైర్
సాక్షి, లక్నో: ఒకవైపు ఉత్తరప్రదేశ్ బదాయూ జిల్లాలో 50 ఏళ్ల మహిళపై సామూహిక హత్యాచార ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు ధితురాలి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సిడబ్ల్యు) సభ్యురాలు అనుచిత వ్యాఖ్యలు చేయడం వివాదానికి దారి తీసింది. సాక్షాత్తూ జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సిడబ్ల్యు) సభ్యురాలు చంద్రముఖి మహిళలు, వారి కదలికలపై చేసిన అసంబద్ధ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రాత్రిపూట ఆ మహిళ ఒంటరిగా బయటికి వెళ్లి ఉండకపోతే అత్యాచార ఘటన జరిగి ఉండేది కాదంటూ ఆమె నోరు పారేసుకున్నారు. ఆమె వెంట ఎవరైనా తోడు ఉండి ఉంటే ఇలాంటి ఘటన జరిగేది కాదని వ్యాఖ్యానించారు. అంతేకాదు వేళగాని వేళ మహిళలు బయటికి రాకూడదంటూ సలహా ఇచ్చి పారేశారు. ఈ వ్యవహారంపై ఎన్‌సిడబ్ల్యు చీఫ్ రేఖ శర్మ కూడా స్పందించారు. ఆమె అలా ఎందుకు వ్యాఖ్యానించారో తెలియదుకానీ మహిళలు ఎక్కడ ఎలా ఉండాలో వారిష్టం అంటూ చంద్రముఖి వ్యాఖ్యలను తిరస్కరించారు. మహిళలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత సమాజానిది, ప్రభుత్వానిది అని పేర్కొన్నారు. అటు మహిళా సంఘాలతోపాటు పలువురు మండిపడుతున్నారు. ముఖ్యంగా హీరోయిన్ తాప్సి స్పందిస్తూ ఇలాంటి రకమైన ఆలోచన ఉన్నవారు ఈ దేశంలో లేకపోతే ఇలాంటి ఘటనలు జరగవంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఆదివారం సాయంత్రం మహిళ ఆలయానికి వెళ్లినపుడు స్వయంగా పూజారి, మరో ఇద్దరితో కలిసి ఆమెపై దారుణానికి పాల్పడ్డారు. ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేయడంతోపాటు దారుణంగా హింసించారు. ఫలితంగా మృతురాలి ఊపరితిత్తులు దెబ్బతిన్నాయి, పక్కటెముకలు, కాలు విరిగిపోయాయని పోస్టుమార్టం రిపోర్టులో వైద్యులు గుర్తించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన సంబంధించి ఆలయ పూజారి, అతడి ఇద్దరు సహచరులపై ఆరోపణలు నమోదు చేశారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామని పోలీసులు చెప్పారు. ప్రధాన నిందితుడు ఆలయ పూజారిని ఇంకా పరారీలో ఉన్నాడు. If people with her kind of thinking didn’t exist in this country toh aisi ghatna nahi hoti. #Hopeless #Shame https://t.co/Zcs7iYaWV4 — taapsee pannu (@taapsee) January 7, 2021 -
భీమ్ ఆర్మీ చీఫ్‌పై ఎన్సీడబ్యూ ఫిర్యాదు
లక్నో: భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ అజాద్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళ కమిషన్ (ఎన్సీడబ్యూ) శుక్రవారం ఉత్తరప్రదేశ్ డీజీపీ హెచ్‌సీ అవస్థీని కోరింది. మహిళలపై అసభ్య కామెంట్లు చేసినందుకు గాను అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. మార్చి 23, 2018, ఏప్రిల్ 16,2018 న అజాద్ ఒక మహిళతో ట్విట్టర్ వేదికగా మాట్లాడుతూ, అసభ్యకరపదజాలంతో దూషించాడు. ప్రముఖ వీడియో బ్లాగర్ అయిన ఆమె ఆ కామెంట్లను ట్విట్టర్ వేదికగా మళ్లీ షేర్ చేసింది. (మహిళను వేధించిన డాక్టర్‌పై విచారణ) ఈ వ్యాఖ్యలపై సీరియస్‌గా స్పందించిన ఎన్సీడబ్యూ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిపై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని ఉత్తరప్రదేశ్ డీజీపీని కోరింది. చంద్రశేఖర్ అజాద్ చేసిన ట్వీట్లను పరిశీలించిన పోలీసులు ఆయనపై దర్యాప్తుకు ఆదేశించినట్లు తెలిపారు. దీనికి సంబంధించి ఎన్సీడబ్యూ ట్వీట్ చేస్తూ మహిళలపై సోషల్మీడయా వేదికగా జరుగతున్న దాడులపై చర్యలు తీసుకోవాలని షరాన్‌పూర్ ఎస్పీని కోరాం. మహిళలకు సైబర్ సెక్యూరిటీ కల్పిస్తూ, వారికి సురక్షితమైన వాతావారణాన్ని అందిచడానికి ఎన్సీడబ్యూ ప్రయత్నిస్తుందని ట్వీట్ చేశారు. @NCWIndia has taken cognizance of the demeaning tweets made on #women by @BhimArmyChief. Chairperson @sharmarekha has written to @dgpup requesting strict action against Azad to put an end to #cybercrimes against #women. pic.twitter.com/uNQwMJza9z — NCW (@NCWIndia) June 19, 2020 -
మహిళను వేధించిన డాక్టర్‌పై విచారణ
సాక్షి, న్యూఢిల్లీ : ఫరీదాబాద్‌లోని క్యూఆర్జీ ఆస్పత్రిలో మహిళా సిబ్బందిని లైంగిక వేధింపులకు గురిచేసిన డాక్టర్‌పై విచారణ చేపట్టాలని జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ) కోరింది. ఏప్రిల్ 18న ఆస్పత్రిలో జరిగిన ఘటనలో వైద్యుడిపై మహిళ ఇచ్చిన ఫిర్యాదుకు సంబంధించి ట్విటర్ పోస్ట్ ఆధారంగా సుమోటోగా ఎన్సీడబ్ల్యూ ఈ కేసును చేపట్టింది. ఈ వైద్యుడు ఇతర మహిళా సభ్యుల పట్ల కూడా అభ్యంతరకరంగా వ్యవహరించినట్టు ఫిర్యాదులు వచ్చినా ఆస్పత్రి యాజమాన్యం స్పందించలేదని దుయ్యబట్టింది. వైద్యుడిపై ఎలాంటి చర్యలూ చేపట్టకపోగా బాధితురాలిని ప్రస్తుత పోస్ట్ నుంచి తప్పించి డిమోట్ చేసిందని ఎన్సీడబ్ల్యూ ఓ ప్రకటనలో పేర్కొంది. బాధిత మహిళ ఫిర్యాదుపై అంతర్గత కమిటీ విచారించిందా..? ఈ విచారణలో నిందితుడు దోషిగా తేలితే ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరిస్తూ తక్షణమే కమిషన్‌కు నివేదిక పంపాలని కోరుతూ ఎన్సీడబ్ల్యూ క్యూఆర్జీ ఆస్పత్రి డైరెక్టర్ సంగీతా రాయ్ గుప్తాకు లేఖ రాసింది. చదవండి : తారతమ్యం మరచిన తాతయ్య -
సంజుపై సెక్స్ వర్కర్ల ఆగ్రహం
సాక్షి, న్యూఢిల్లీ: సెక్స్ వర్కర్ల మనోభావాలను దెబ్బతీశారంటూ బాలీవుడ్ చిత్రం సంజుపై జాతీయ మహిళా కమిషన్‌లో ఫిర్యాదు నమోదు అయ్యింది. చిత్ర ట్రైలర్లో ఓ డైలాగ్పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వారు ఎన్సీడబ్య్లూలో ఫిర్యాదు చేశారు. ‘మీ భార్యతో కాకుండా ఎంత మందితో పడుకున్నారంటూ అనుష్క పాత్ర రణ్ బీర్ ను అడుగుతుంది. దానికి స్పందిస్తూ.. వేశ్యలతో కలుపుకుని చెప్పాలా? లేక.. అంటే వారిని మినహాయించి చెప్పాలంటే 308 మందితో... అంటూ సమాధానం ఇస్తాడు. ఈ డైలాగ్ తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉందంటూ సెక్స్ వర్కర్ల కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉద్యమకారుడు, న్యాయవాది గౌరవ్ గులాటి సెక్స్ వర్కర్ల తరపున ఎన్సీడబ్యూలో ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని చైర్పర్సన్ రేఖా శర్మ బుధవారం మీడియాతో ధృవీకరించారు. ‘చిత్రంలో ఓ డైలాగ్పై అభ్యంతరం వ్యక్తం అయ్యింది. ఎలక్ట్రానిక్ మీడియా మానిటరింగ్ సెంటర్‌కు ఈ ఫిర్యాదును పంపించాం. వారిచ్చే నివేదిక మీదే చర్యలు ఆధారపడి ఉంటాయి’ అని ఆమె చెప్పారు. కాగా, రణ్‌బీర్ కపూర్, పరేష్ రావెల్, మనీషా కోయిరాలా, సోనమ్ కపూర్ కీలక పాత్రల్లో నటించిన సంజు రేపు అంటే జూన్ 29న విడుదల కానుంది. -
60వేలమందికి శిక్షణ -ఫేస్బుక్
సాక్షి, న్యూఢిల్లీ: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ భారతీయ మహిళలకోసం డిజిటల్ లిటరసీ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఇందుకోసం జార్ఖండ్ రాంచీలోని స్వచ్ఛంద సంస్థ , జాతీయ మహిళా కమిషన్‌తో సంయుక్త భాగస్వామ్యంలో ఈ పథకాన్ని ప్రారంభించింది. దేశవ్యాప్తంగా 60వేలమంది యూనివర్శిటీ మహిళా విద్యార్థులకు ఇంటర్నెట్, సోషల్ మీడియా, ఈ మెయిల్ వాడకంపై శిక్షణ ఇవ్వనుంది. ఇటీవలి కాలంలో మహిళలు, బాలికలపై సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ఫేస్బుక్ భద్రతా అంశాలపై అవగాహన కల్పించనుంది. ఇంటర్నెట్ భద్రతపై 60వేలమంది భారతీయ మహిళలకు శిక్షణ ఇవ్వనున్నామని ఫేస్బుక్ బుధవారం ప్రకటించింది. సైబర్ పీస్ ఫౌండేషన్ సహకారంతో ఈ పైలట్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించినట్టు తెలిపింది. ఈ శిక్షణ స్థానిక భాషలలో ఉంటుందని పేర్కొంది. మహిళలు ఆన్లైన్లో, ఇంటర్నెట్లో ఉన్నపుడు వారు సురక్షితంగా, భద్రంగా ఫీల్ అవ్వాలని తాము భావిస్తున్నామని ఎన్సీడబ్ల్యు అధ్యక్షురాలు రేఖ శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. గత మూడు సంవత్సరాలలో సైబర్ నేర సంబంధిత ఫిర్యాదులు పెరుగుతున్న ధోరణి ఆందోళన కలిగిస్తోందన్నారు. ఈ నేపథ్యంలో మహిళల ఇంటర్నెట్ సేఫ్టీపై ఫేస్బుక్, సైబర్ పీస్ షౌండేషన్ చొరవ అభినందనీయమన్నారు. ఈ శిక్షణద్వారా మహిళలు, బాలికలకు ప్రయోజనం పొందనున్నారని చెప్పారు. డిజిటల్ అక్షరాస్యత కార్యక్రమం హర్యానా, ఢిల్లీ-ఎన్సీఆర్, మణిపూర్, సిక్కిం, మేఘాలయ, మహారాష్ట్ర, తమిళనాడులోని ప్రధాన నగరాలలోని విశ్వవిద్యాలయాలలోని మహిళలకు ప్రయోజనం చేకూరుస్తుందని సైబర్‌పీస్ ఫౌండేషన్ తెలిపింది. మహిళల సమాన భాగస్వామ్యంతోనే ఆర్ధికవ్యవస్థ బాగా పుంజుకుంటుందనీ, ఇంటర్నెట్ వాడకంలో వారికి స్వేచ్ఛ, భద్రత ఉన్నపుడుమాత్రమే సాధ్యపడుతుందని ఫేస్బుక్ పబ్లిక్ పాలసీ డైరెక్టర్ ఆఫ్ ఇండియా( దక్షిణ, మధ్య ఆసియా) అంకి దాస్ చెప్పారు. తమ శిక్షణ మహిళలకు భరోసా ఇవ్వడంతోపాటూ, వారి భావాలను స్వేచ్ఛగా పంచుకునేందుకు వీలు కల్పిస్తుందన్నారు. -
బెంగళూరు ఘటనపై ఆ ఇద్దరికీ సమన్లు!
బెంగళూరు/న్యూఢిల్లీ: బెంగళూరులో మహిళలు బహిరంగంగా లైంగిక వేధింపులకు గురైన ఘటనపై తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కర్ణాటక హోంమంత్రి జీ పరమేశ్వరకు, ఎస్పీ ఎమ్మెల్యే అబూ అజ్మీకి జాతీయ మహిళ కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) షాక్ ఇచ్చింది. ఆ ఇద్దరు నేతలకు సమన్లు జారీచేసింది. 'పార్టీలకతీతంగా కొందరు వ్యక్తులు జుగుప్సకరమైన వ్యాఖ్యలు చేశారు. ఉన్నతస్థానంలో ఉన్నవారే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే.. దేశం ఎటువైపు వెళ్తున్నట్టు?' అని ఎన్సీడబ్ల్యూ చీఫ్ లలితా కుమారమంగళం అన్నారు. బెంగళూరులో కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా పలువురు మహిళలపై ఆకతాయిలు బహిరంగంగా రెచ్చిపోయి.. లైంగికంగా తాకడం, వేధించడం వంటి వికృత చర్యలకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై స్పందిస్తూ యువత పాశ్చాత్య ధోరణిని అవలంబిస్తుండటం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, యువతులు కూడా పాశ్చాత్య దుస్తులు వేసుకొని వేడుకల్లో పాల్గొన్నారని, ఇలాంటి ఘటనలు జరగడం మామూలేనని కర్ణాటక హోంమంత్రి జీ పరమేశ్వర పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై ఎన్సీడబ్ల్యూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు దేశ మహిళలకు ఆయన క్షమాపణ చెప్పాలని, తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. 'ఒక హోంమంత్రి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం దురదృష్ణకరం, ఆమోదనీయం కాదు. వేడుకల సందర్భంగా మహిళలు పాశ్చాత్య దుస్తులు వేసుకున్నంత మాత్రాన భారతీయ పురుషులు అదుపుతప్పి రెచ్చిపోతారా? అని నేను మంత్రిని అడుగదలుచుకున్నా. మహిళలను గౌరవించడం భారతీయ పురుషులు ఎప్పుడు నేర్చుకుంటారు? ఆ మంత్రి వెంటనే మహిళలకు క్షమాపణ చెప్పి.. రాజీనామా చేయాలి' అని లలిత కుమారమంగళం స్పష్టం చేశారు. -
'మహిళగా రాజీపడు.. లేకుంటే పార్టీలో ఎదగవ్'
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఆప్ మహిళా కార్యకర్త ఆత్మహత్య ఘటనకు సంబంధించి విస్తుపోయే అంశాలు వెలుగుచూస్తున్నాయి. ఆమెను శారీరకంగా మానసికంగా వేధించేందుకు ప్రయత్నాలు జరిగింది వాస్తవమే అని తెలిసింది. ఆమెను అన్ని రకాలుగా లొంగదీసుకోవాలనే ప్రయత్నం అవతలి వ్యక్తి చేసినట్లు తెలుస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లో తనతోపాటు పనిచేసే కార్యకర్త రమేశ్ వాద్వా వేధింపులు భరించలేక ఓ మహిళా కార్యకర్త ఆత్మహత్య కు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటన న్యూఢిల్లీలోని నెరెల ప్రాంతంలో చోటుచేసుకుంది. వేధింపులకు గురిచేసిన అతడు జైలుకు వెళ్లి అనంతరం బెయిల్ పై విడుదల కావడంతోపాటు స్వేచ్ఛగా బయటకు వచ్చాక కూడా అలాంటి చేష్టలే చేయడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై ప్రస్తుతం విచారిస్తున్న జాతీయ మహిళా కమిషన్ కు కుటుంబ సభ్యులు పలు విస్తుపోయే అంశాలు చెప్పారు. వేధింపులకు దిగిన ఆ వ్యక్తి ఆ మహిళా కార్యకర్తను 'నీ శరీరాన్ని ప్రేమించుకోవడం ఆపేయ్. రాజీపడు. అలా చేయకుంటే నువ్వు పార్టీలో ఎదగడం జరగదు' అని బెదిరించాడట. అలాగే, ఆమె ఇద్దరు కూతుర్లను కూడా కిడ్నాప్ చేస్తానని బెదిరించాడట. అంతేకాదు, ఆమె ఇద్దరు పిల్లల అడ్మిషన్లను కూడా ఆప్ ప్రభుత్వం రద్దు చేయడంతో వారు స్కూల్ కు వెళ్లడం మానేశారట. ఈ పర్యవసనాలతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు జాతీయ మహిళా కమిషన్ ఆరోపించింది. -
సల్మాన్ ఖాన్ కు సమన్లు
న్యూఢిల్లీ: బాలీవుడ్ సూపర్ స్టార్, కండల వీరుడు సల్మాన్ ఖాన్ రేప్ వ్యాఖ్యల వివాదం ఇప్పట్లో ముగిసేట్టు కనిపించడంలేదు. సల్మాన్ కు తాజాగా జాతీయ మహిళా కమిషన్ సమన్లు జారీ చేసింది. జులై 8 న హాజరై సమాధానం చెప్పాల్సిందిగా కమిషన్ తేల్చి చెప్పింది. ఇంతకు ముందు సల్మాన్ ను పబ్లిక్ గా క్షమాపణ చెప్పాల్సిందిగా కోరుతూ కమిషన్ కోరింది. అయితే క్షమాపణ చెప్పే అవసరం లేదని ఆయన తరఫు న్యాయవాది స్పష్టం చేయడంతో్ తాజాగా ఆయనకు సమన్లు జారీ అయ్యాయి. సుల్తాన్ సినిమా ప్రమోషన్లో భాగంగా ఒక టీవీ ఛానల్లో సల్మాన్ మాట్లాడుతూ.. సినిమా విడుదలకు ముందు నా పరిస్థితి రేప్ కు గురైన మహిళగా ఉందని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. -
నన్ రేప్ కేసులో అరెస్టులేవి?
సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా పశ్చిమ బెంగాల్ గంగ్నాపూర్ లో 72 ఏళ్ల నన్‌పై జరిగిన గ్యాంగ్ రేప్ కేసులో నిందితుల్ని అరెస్టు చేయకపోవడంపై జాతీయ మహిళా కమిషన్ మండిపడింది. సీసీ టీవీ కెమెరాల్లో నిందితులు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ వారిని గుర్తించి అదుపులోకి తీసుకోవడంలో బెంగాల్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించింది. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు షమీనా సఫియా నేతృత్వంలోని బృందం శనివారం గంగ్నాపూర్లో పర్యటించింది. 'నేరం జరిగి వారంరోజులు కావాస్తోంది. సీసీ టీవీల్లో నిందితుల తాలూకు ఆధారాలు కూడా ఉన్నాయి. అయినా సరే అవసరమైనమేరకు పోలీసులు స్పందించకపోవటం దారుణం' అని సఫియా మీడియాతో అన్నారు. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తున్నట్లు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఘటన జరిగినాడే ప్రకటించారు. అయితే సీబీఐ అధికారులు మాత్రం ఇప్పటివరకు ఎలాంటి స్పందనను వ్యక్తం చేయకపోవడం గమనార్హం. ఎలాగూ కేసు సీబీఐ చేతికి వెళ్తుందనే ఉద్దేశంతో స్థానిక పోలీసులు దర్యాప్తుపై దృష్టిసారించట్లేదు. దీంతో నిందితులు తప్పించుకు తిరిగే అవకాశాన్ని స్వయంగా పోలీసులే కల్పిస్తున్నట్లయింది. మార్చి 13 అర్ధరాత్రి స్కూల్ లోకి చొరబడ్డ పన్నెండుమంది దొంగలు నన్ పై సామూహిక లైంగికదాడిచేయడంతోపాటు రూ.12 లక్షలు దోచుకెళ్లారు. చికిత్స అనంతరం శుక్రవారం ఆసుపత్రినుంచి డిశ్చార్జి అయిన నన్.. ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లారు. -
రేప్‌కేసులో ఉన్న కేంద్ర మంత్రిని తొలగించాలి:మహిళా కమిషన్
న్యూఢిల్లీ: అత్యాచారం కేసులో నిందితుడుగా ఉన్న కేంద్ర మంత్రి నిహల్ చంద్‌ను ఆ పదవి నుంచి తొలగించాలని జాతీయ మహిళా కమిషన్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కోరింది. ఈ మేరకు మహిళా కమిషన్ చైర్పర్సన్ మమతా శర్మ ప్రధానికి ఒక లేఖ రాశారు. జైపూర్‌లో ఒక వివాహిత యువతిపై జరిగిన అత్యాచారం కేసులో 17 మంది నిందితులలో నిహల్ చంద్ ఒకరు. ఇటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని మంత్రిగా ఉంచడం భావ్యంకాదని మమతా శర్మ పేర్కొన్నారు. అతనిని వెంటనే కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగించాలని కోరారు. -
ప్రీతి జింటా ఫిర్యాదుతో నెస్‌వాడియాకు తిప్పలు!
ముంబై/న్యూఢిల్లీ: మాజీ ప్రియురాలు, వ్యాపార భాగస్వామి, బాలీవుడ్ నటి ప్రీతిజింటా ఇచ్చిన ఫిర్యాదుతో ప్రముఖ వ్యాపార వేత్త నెస్ వాడియాకు తిప్పలు మొదలయ్యాయి. ఐపిఎల్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు యాజమాన్య భాగస్వాములైన వీరిద్దరూ సహజీవనం చేసినట్లు సమాచారం. దాదాపు అయిదు సంత్సరాలు కొనసాగిన వారి మధ్య సంబంధం రెండేళ్ల క్రితం దెబ్బతిన్నట్లు తెలిసింది. రెండేళ్ల క్రితం ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. అయినా ఇద్దరి మధ్యా వ్యాపార సంబంధాలు కొనసాగుతున్నాయి. మే 30న వాంఖేడ్ స్టేడియంలో పంజాబ్-చెన్నై జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా తనతో నెస్ వాడియా అసభ్యంగా ప్రవర్తించాడని ప్రీతి జింటా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతే కాకుండా తనపై చేయి చేసుకున్నాడని ప్రీతి జింతా ఆరోపించింది. సినీనటి ప్రీతిజింటా ఫిర్యాదుపై పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. ఐపీఎల్ సీఈఓ సుందర్ రామన్ స్టేట్మెంట్ను రికార్డు చేశారు. వాంఖడే స్టేడియం సిబ్బందిని కూడా పోలీసులు విచారించనున్నారు. పంజాబ్ ప్లేయర్ల నుంచీ వివరాలు తెలుసుకుంటున్నారు. ఇప్పటికే మెరైన్ డ్రైవ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. అతనిపై 354,504,506,509 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 39 సంవత్సరాల వయసున్న ప్రీతి ఫిర్యాదుతో మహారాష్ట్ర మహిళా కమిషన్ నెస్‌వాడియాకు అల్టిమేటం జారీచేసింది. 24 గంటల్లోగా అతనిని అరెస్టు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. జాతీయ మహిళా కమిషన్ (ఎన్సిడబ్ల్యూ) కూడా స్పందించింది. దీనిని సుమోటోగా స్వీకరించాలని నిర్ణయించింది. ప్రీతిజింటాకు జరిగిన అవమాన ఘటనను సమగ్రంగా విచారించనున్నట్లు ఎన్సిడబ్ల్యూ చైర్పర్సన్ మమతా శర్మ చెప్పారు. -
సోమ్నాధ్ రాజీనామాకు విపక్షాల పట్టు