
సాక్షి, న్యూఢిల్లీ: సెక్స్ వర్కర్ల మనోభావాలను దెబ్బతీశారంటూ బాలీవుడ్ చిత్రం సంజుపై జాతీయ మహిళా కమిషన్‌లో ఫిర్యాదు నమోదు అయ్యింది. చిత్ర ట్రైలర్‌లో ఓ డైలాగ్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వారు ఎన్‌సీడబ్య్లూలో ఫిర్యాదు చేశారు. ‘మీ భార్యతో కాకుండా ఎంత మందితో పడుకున్నారంటూ అనుష్క పాత్ర రణ్ బీర్ ను అడుగుతుంది. దానికి స్పందిస్తూ.. వేశ్యలతో కలుపుకుని చెప్పాలా? లేక.. అంటే వారిని మినహాయించి చెప్పాలంటే 308 మందితో... అంటూ సమాధానం ఇస్తాడు. ఈ డైలాగ్ తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉందంటూ సెక్స్ వర్కర్ల కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉద్యమకారుడు, న్యాయవాది గౌరవ్ గులాటి సెక్స్ వర్కర్ల తరపున ఎన్‌సీడబ్యూలో ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని చైర్‌పర్సన్ రేఖా శర్మ బుధవారం మీడియాతో ధృవీకరించారు. ‘చిత్రంలో ఓ డైలాగ్‌పై అభ్యంతరం వ్యక్తం అయ్యింది. ఎలక్ట్రానిక్ మీడియా మానిటరింగ్ సెంటర్‌కు ఈ ఫిర్యాదును పంపించాం. వారిచ్చే నివేదిక మీదే చర్యలు ఆధారపడి ఉంటాయి’ అని ఆమె చెప్పారు. కాగా, రణ్‌బీర్ కపూర్, పరేష్ రావెల్, మనీషా కోయిరాలా, సోనమ్ కపూర్ కీలక పాత్రల్లో నటించిన సంజు రేపు అంటే జూన్ 29న విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment