ఆల్‌టైమ్‌ హయ్యస్ట్‌ గ్రాసర్‌ లిస్ట్‌లో ‘సంజు’! | Sanju Movie Is Fourth Highest Grosser in Bollywood | Sakshi
Sakshi News home page

Published Mon, Jul 30 2018 4:21 PM | Last Updated on Mon, Jul 30 2018 4:28 PM

Sanju Movie Is Fourth Highest Grosser in Bollywood - Sakshi

రణ్‌బీర్‌ కపూర్‌ లుక్‌ను రిలీజ్‌ చేసినప్పటినుంచీ సంజు సినిమాపై అంచనాలు పెరుగుతూ వచ్చాయి. టీజర్‌, ట్రైలర్‌ విడుదలయ్యాక సినీ అభిమానులు సంజు కోసం ఎదురుచూశారు. మొత్తానికి సినిమా విడుదలై రికార్డుల వేటను మొదలుపెట్టింది. సినిమా రిలీజ్‌ రోజు నుంచీ కలెక్షన్ల మోతమోగిస్తోంది. 

సంజు మూవీ కంటెంట్‌ పట్ల కొందరు వ్యతిరేకతను ప్రదర్శిస్నున్నా.. అవేమీ సినిమా కలెక్షన్లపై ప్రభావాన్ని చూపలేకపోతున్నాయి. మొన్నటికి మొన్న వివాదాస్పద దర్శకుడు వర్మ ఈ సినిమాపై తనదైన శైలిలో కామెంట్స్‌ చేశాడు. నిజాల్ని దాచి సంజయ్‌దత్‌ను మంచిగా చూపించాడనే విమర్శలు వినిపిస్తోన్నా.. ఈ మూవీ మాత్రం బాలీవుడ్‌లో ఆల్‌టైమ్‌ హిట్‌గా నిలుస్తోంది. విడుదలైన ఐదో వారాంతం కూడా అదిరిపోయే కలెక్షన్లు వచ్చాయని ప్రముఖ ట్రేడ్‌ అనలిష్ట్‌ తరణ్‌ ఆదర్శ్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. టైగర్‌ హై జిందాను దాటి.. పీకేను చేజ్‌ చేస్తూ.. ఇప్పటికి నాల్లో హయ్యస్ట్‌ గ్రాసర్‌గా 339కోట్లతో వసూళ్లతో దూసుకెళ్తోందంటూ ట్వీట్‌ చేశారు. సంజయ్‌దత్‌గా రణ్‌బీర్‌ నటన ఈ మూవీకి హైలెట్‌గా నిలిచింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement