న్యూఢిల్లీ: ఢిల్లీలో ఆప్ మహిళా కార్యకర్త ఆత్మహత్య ఘటనకు సంబంధించి విస్తుపోయే అంశాలు వెలుగుచూస్తున్నాయి. ఆమెను శారీరకంగా మానసికంగా వేధించేందుకు ప్రయత్నాలు జరిగింది వాస్తవమే అని తెలిసింది. ఆమెను అన్ని రకాలుగా లొంగదీసుకోవాలనే ప్రయత్నం అవతలి వ్యక్తి చేసినట్లు తెలుస్తోంది.
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లో తనతోపాటు పనిచేసే కార్యకర్త రమేశ్ వాద్వా వేధింపులు భరించలేక ఓ మహిళా కార్యకర్త ఆత్మహత్య కు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటన న్యూఢిల్లీలోని నెరెల ప్రాంతంలో చోటుచేసుకుంది. వేధింపులకు గురిచేసిన అతడు జైలుకు వెళ్లి అనంతరం బెయిల్ పై విడుదల కావడంతోపాటు స్వేచ్ఛగా బయటకు వచ్చాక కూడా అలాంటి చేష్టలే చేయడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది.
ఈ ఘటనపై ప్రస్తుతం విచారిస్తున్న జాతీయ మహిళా కమిషన్ కు కుటుంబ సభ్యులు పలు విస్తుపోయే అంశాలు చెప్పారు. వేధింపులకు దిగిన ఆ వ్యక్తి ఆ మహిళా కార్యకర్తను 'నీ శరీరాన్ని ప్రేమించుకోవడం ఆపేయ్. రాజీపడు. అలా చేయకుంటే నువ్వు పార్టీలో ఎదగడం జరగదు' అని బెదిరించాడట. అలాగే, ఆమె ఇద్దరు కూతుర్లను కూడా కిడ్నాప్ చేస్తానని బెదిరించాడట. అంతేకాదు, ఆమె ఇద్దరు పిల్లల అడ్మిషన్లను కూడా ఆప్ ప్రభుత్వం రద్దు చేయడంతో వారు స్కూల్ కు వెళ్లడం మానేశారట. ఈ పర్యవసనాలతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు జాతీయ మహిళా కమిషన్ ఆరోపించింది.
'మహిళగా రాజీపడు.. లేకుంటే పార్టీలో ఎదగవ్'
Published Thu, Jul 28 2016 3:36 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement
Advertisement