సల్మాన్ ఖాన్ కు సమన్లు
Published Thu, Jun 30 2016 8:08 PM | Last Updated on Sat, Jul 28 2018 8:43 PM
న్యూఢిల్లీ: బాలీవుడ్ సూపర్ స్టార్, కండల వీరుడు సల్మాన్ ఖాన్ రేప్ వ్యాఖ్యల వివాదం ఇప్పట్లో ముగిసేట్టు కనిపించడంలేదు. సల్మాన్ కు తాజాగా జాతీయ మహిళా కమిషన్ సమన్లు జారీ చేసింది. జులై 8 న హాజరై సమాధానం చెప్పాల్సిందిగా కమిషన్ తేల్చి చెప్పింది. ఇంతకు ముందు సల్మాన్ ను పబ్లిక్ గా క్షమాపణ చెప్పాల్సిందిగా కోరుతూ కమిషన్ కోరింది. అయితే క్షమాపణ చెప్పే అవసరం లేదని ఆయన తరఫు న్యాయవాది స్పష్టం చేయడంతో్ తాజాగా ఆయనకు సమన్లు జారీ అయ్యాయి. సుల్తాన్ సినిమా ప్రమోషన్లో భాగంగా ఒక టీవీ ఛానల్లో సల్మాన్ మాట్లాడుతూ.. సినిమా విడుదలకు ముందు నా పరిస్థితి రేప్ కు గురైన మహిళగా ఉందని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
Advertisement
Advertisement