లక్నో: భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ అజాద్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళ కమిషన్ (ఎన్‌సీడబ్యూ) శుక్రవారం ఉత్తరప్రదేశ్ డీజీపీ హెచ్‌సీ అవస్థీని కోరింది. మహిళలపై అసభ్య కామెంట్లు చేసినందుకు గాను అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. మార్చి 23, 2018, ఏప్రిల్ 16,2018 న అజాద్ ఒక మహిళతో ట్విట్టర్ వేదికగా మాట్లాడుతూ, అసభ్యకరపదజాలంతో దూషించాడు. ప్రముఖ వీడియో బ్లాగర్ అయిన ఆమె ఆ కామెంట్లను ట్విట్టర్ వేదికగా మళ్లీ షేర్ చేసింది. (మహిళను వేధించిన డాక్టర్‌పై విచారణ)
ఈ వ్యాఖ్యలపై సీరియస్‌గా స్పందించిన ఎన్‌సీడబ్యూ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిపై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని ఉత్తరప్రదేశ్ డీజీపీని కోరింది. చంద్రశేఖర్ అజాద్ చేసిన ట్వీట్లను పరిశీలించిన పోలీసులు ఆయనపై దర్యాప్తుకు ఆదేశించినట్లు తెలిపారు. దీనికి సంబంధించి ఎన్‌సీడబ్యూ ట్వీట్ చేస్తూ మహిళలపై సోషల్‌మీడయా వేదికగా జరుగతున్న దాడులపై చర్యలు తీసుకోవాలని షరాన్‌పూర్ ఎస్పీని కోరాం. మహిళలకు సైబర్ సెక్యూరిటీ కల్పిస్తూ, వారికి సురక్షితమైన వాతావారణాన్ని అందిచడానికి ఎన్‌సీడబ్యూ ప్రయత్నిస్తుందని ట్వీట్ చేశారు.
@NCWIndia has taken cognizance of the demeaning tweets made on #women by @BhimArmyChief. Chairperson @sharmarekha has written to @dgpup requesting strict action against Azad to put an end to #cybercrimes against #women. pic.twitter.com/uNQwMJza9z
— NCW (@NCWIndia) June 19, 2020
Comments
Please login to add a commentAdd a comment