Bhim Army
-
భీమ్ ఆర్మీ చీఫ్ ప్రయాణిస్తున్న వందే భారత్‌పై రాళ్ల దాడి
లక్నో: భీమ్ ఆర్మీ పార్టీ చీఫ్ చంద్ర శేఖర్ ఆజాద్ ప్రయాణిస్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌పై అల్లరి మూకలు రాళ్ల దాడికి పాల్పడ్డాయి. ఈ ఘటనలో రైలు కిటికీ ధ్వంసమైంది. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లా కమల్పూర్లో ఆదివారం చోటుచేసుకున్న ఘటనలో ఆజాద్‌కు ఎటువంటి హాని జరగలేదు. ఢిల్లీ నుంచి కాన్పూర్ వస్తుండగా ఉదయం 7.12 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనతో షాక్‌కు గురయ్యాయనని అనంతరం ఆజాద్ ఎక్స్‌లో పేర్కొన్నారు. ‘నా కంటే రెండు సీట్లు ముందు కూర్చున్న ప్రయాణికుడి దగ్గర ఉన్న అద్దాలు పగిలిపోయాయి. ఈ సంఘటనతో నేను షాక్‌కి గురయ్యాను. ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగించడమే కాదు, ప్రయాణికుల భద్రతకు సైతం ముప్పు కలిగించే పరిణామమిది. ఇటువంటి ఘటనలకు పాల్పడే వారిని వదిలిపెట్టకూడదు’అని ఆయన పేర్కొన్నారు. ఘటన నేపథ్యంలో భద్రత కోసం సి–3 నుంచి సి–14 బోగీకి మారినట్లు చెప్పారు. దీనిపై రైల్వే భద్రతాధికారులకు సమాచారమివ్వగా వారు వచ్చి పరిశీలించారని, సి–3 బోగీపై మాత్రమే రాళ్ల దాడి జరిగినట్లు గుర్తించారని ఆజాద్ చెప్పారు. ‘ఒక్క 2022 లోనే రైళ్లపై రాళ్లు రువి్వన ఘటనలు 1,503 నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. వీటితో రైల్వే శాఖకు కోట్లాది రూపాయల మేర నష్టం వాటిల్లింది. పదేపదే జరుగుతున్న ఈ ఘటనలు ప్రయాణికుల ప్రాణాలకు సైతం ప్రమాదకరంగా మారాయి’అని ఆజాద్ తెలిపారు. -
‘ప్రమాణ స్వీకారం తర్వాత అందుకే నినాదాలు చేశా’
లక్నో: లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని నగీనా లోక్‌సభ స్థానం నుంచి ఆజాద్ సమాజ్ పార్టీ నేత చంద్ర శేఖర్ ఆజాద్ తొలిసారి ఎంపీగా గెలుపొందారు. ఇటీవల 18వ లోక్‌సభలో నగీనా ఎంపీగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ఎంపీగా రాజ్యాంగ ప్రతిని పట్టుకుని ప్రమాణం చేసిన తర్వాత ‘జై భీమ్, జై భారత్, జై సంవిధాన్, జై మండల్, జై జోహార్, జై జవాన్, జై కిసాన్’ అని నినాదాలు చేశారు. అయితే తాజాగా ఆయన ఓ జాతీయా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ప్రమాణ స్వీకారం తర్వాత నినాదాలు చేయటానికి గల కారణాన్ని ఆయన వివరించారు. ‘‘ఆ నినాదాలు గొప్ప వ్యక్తులతో ముడిపడి ఉన్నాయి. 'జై భీమ్', 'జై భారత్' మా గుర్తింపును తెలియజేస్తాయి. మండల్ కమిషన్ అమలులోకి వచ్చాక వెనుకబడిన వర్గాలకు పలు అవకాశాలు లభించాయి. ఆయన వల్లే వెనకడిన వర్గాలు ముందుకు సాగుతున్నాయి. భారత ప్రజాస్వామ్యానికి, ప్రజలకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అయితే నేను లోక్‌సభలో ప్రమాణం చేసిన సమయంలో ఓ ఎంపీ అది నచ్చక ఈరోజే మొత్తం స్పీచ్ ఇస్తావా అంటూ వెక్కిరించారు. నేను ఇక్కడికి స్పీచ్ ఇవ్వడానికే వచ్చానని బదులు ఇచ్చా. నేను మాట్లాడటానికి వచ్చాను. మీరు వినాల్సి ఉంటుందన్నా’’ అని ఆజాద్ తెలిపారు. తమ హక్కులను లాగేసుకున్నవారు లోక్‌సభలో మత గళాన్ని వినడం అలవాటు చేసుకోవాలని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో నగీనా లోక్‌సభ స్థానం నుంచి ఆజాద్ 1,51,473 ఓట్ల మెజార్టీతో బీజేపీకి చెందిన ఓం కుమార్‌పై విజయం సాధించారు. -
యూపీలో భీమ్ ఆర్మీ అధినేత చంద్రశేఖర్ ఆజాద్‌పై కాల్పులు
షహరాన్‌పూర్: ప్రముఖ దళిత నాయకుడు, భీమ్ ఆర్మీ అధినేత, ఆజాద్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆజాద్(36)పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆ యన గాయపడ్డారు. ప్రస్తు తం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్లు చెప్పారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం షహరాన్‌పూర్ జిల్లాలోని దేవ్‌బంద్ పట్టణంలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆజాద్‌పై కాల్పులు జరిగాయని పోలీసులు బుధవారం చెప్పారు. కారులో ఉండగానే గుర్తుతెలియని వ్యక్తులు ఆయనపై తుపాకీతో కాల్పులు జరిపి పారిపోయారని చెప్పారు. చంద్రశేఖర్ ఆజాద్ కడుపులోకి ఓ తూటా దూసుకెళ్లిందని అన్నారు. దుండగులు ప్రయాణించిన వాహనంపై హరియాణా రిజిస్ట్రేషన్ నెంబర్ ఉందని వెల్లడించారు. వారిని గుర్తించి, అదుపులోకి తీసుకొనేందుకు ముమ్మరంగా గాలింపు చేపట్టామన్నారు. చంద్రశేఖర్ ఆజాద్‌పై కాల్పుల ఘటన పట్ల ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్‌లో శాంతి భద్రతలు నానాటికీ క్షీణిస్తున్నాయని, ప్రజలకు రక్షణ లేకుండాపోయిందని విమర్శించారు. -
భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌పై కాల్పులు..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో భీమ్ ఆర్మీ చీఫ్ కారుపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. షహరాన్‌పూర్‌లో డియోబంద్ ప్రాంతంలో వెళ్లున్న చంద్రశేఖర్ ఆజాద్ రావణ్‌పై దాడి జరిగింది. ఈ కాల్పుల్లో ఆజాద్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. దీనిపై భీమ్ సేన ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆజాద్ కారుపై దుండగులు కాల్పులు జరపగా.. ఓ బుల్లెట్ కారు సీట్లోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో ఆజాద్ నడుము భాగంలో బుల్లెట్ గాయమైంది. రెండో బుల్లెట్ కారు వెనక భాగంలో డోర్‌కు తగలగా.. దానిని ఆయన తప్పించుకున్నారు. అయితే.. దాడి జరిగిన సమయంలో ఆజాద్ ఫార్చునర్ కారులో ప్రయాణిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలను భీమ్ సేన సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. 'బహుజన్ మిషన్ ఉద్యమాన్ని నిలిపివేయాలనే భీమ్ ఆర్మీ చీఫ్, జాతీయ అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆజాద్‌పై దాడి చేశారు. ఇది ఓ పిరికి చర్య. నిందితులను వెంటనే అరెస్టు చేయాలి' అని భీమ్ సేన డిమాండ్ చేసింది. తమ నాయకునికి భద్రత కల్పించాలని కోరింది. ఇదీ చదవండి: కేసీఆర్ భారీ కాన్వాయ్‌పై స్పందించిన శరద్ పవార్.. ఏమన్నాడంటే! -
టైమ్ 100లో భీంఆర్మీ చంద్రశేఖర్ ఆజాద్
న్యూయార్క్: ట్విట్టర్ ఉన్నతస్థాయి న్యాయవాది విజయ గద్దెతో యూకె ఆర్థిక మంత్రి రిషి సునక్ సహా, భారతీయ సంతతికి చెందిన సామాజిక కార్యకర్తకు టైమ్ మ్యాగజైన్ వార్షిక ‘’ఎమర్జింగ్ లీడర్స్హూ ఆర్ షేపింగ్ ద ఫ్యూచర్’’జాబితాలో చోటు సంపాదించుకున్నారు. భవిష్యత్తుని తీర్చిదిద్దుతూ ఎదుగుతోన్న 100 మంది ప్రపంచ స్థాయి అత్యంత ప్రతిభావంతమైన నేతల పేర్లను 2021 టైమ్ 100 జాబితా ప్రకటిస్తుంది. ‘‘ఈ జాబితాలో చేరిన వ్యక్తులంతా చరిత్రసృష్టిస్తారు. నిజానికి చాలా మంది ఆ పనిచేసే ఉంటారు’’. టైమ్ 100 ఎడిటోరియల్ డైరెక్టర్ డాన్మాక్సై చెప్పారు. ♦ టైమ్ 100 జాబితాలో పేరు దక్కించుకున్న మిగిలిన భారతీయ సంతతికి చెందిన నేతలు ఇన్‌స్టాకార్ట్ వ్యవస్థాపకులు, సీఈఓ అపూర్వ మెహతా, డాక్టర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నాన్‌ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ‘గెట్ ఆన్ పీపీ ఈ’శిఖా గుప్తా, మరో స్వచ్ఛంద సంస్థకు చెందిన రోహన్ పావులూరి ఉన్నారు. ♦ భీంఆర్మీ చీఫ్ చంద్ర శేఖర్ ఆజాద్ కూడా ప్రపంచస్థాయి ప్రముఖ నేతల సరసన చేరారు’’ఇక టైమ్ మ్యాగజైన్. బ్రిటన్ ఆర్థిక మంత్రి రిషి సునాక్ ప్రొఫైల్‌లో ‘‘కొద్దికాలం క్రితం ఈ 40 ఏళ్ల బ్రిటన్‌లోని చాలా తక్కువ మందికి తెలిసిన జూనియర్ మినిస్టర్ అతి స్వల్పకాలంలోనే బ్రిటన్ ఆర్థిక వ్యవస్థకు నేతృత్వం వహించే స్థాయికి ఎదిగారు’అని రాశారు. సునాక్ దేశంలోని అత్యంత ప్రాచుర్యం పొందిన రాజకీయ వేత్త ’’అని పేర్కొనడం గమనార్హం. ♦ జనవరి 6న క్యాపిటల్ ఎటాక్ అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఎకౌంట్‌ని రద్దు చేస్తున్నట్టు ట్విట్టర్ సీఈఓ జాక్ డార్సేకి చెప్పింది విజయ గద్దె అన్న విషయాన్ని ప్రస్తావించిన టైమ్ ప్రొఫైల్, అత్యంత శక్తివంతమైన ట్విట్టర్ ఎగ్జిక్యూటివ్ విజయ గద్దెని ప్రశంసించింది. ♦ భీం ఆర్మీ నాయకుడు 34 ఏళ్ల చంద్రశేఖర్ ఆజాద్ నడుపుతోన్న పాఠశాలలు విద్య ద్వారా దళితుల్లో పేదరికాన్ని పారదోలేందుకు కృషి చేస్తున్నాయి. కులపరమైన అణచివేత, హింసపై గళం విప్పుతూ, వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమిస్తోంది’అంటూ భీం ఆర్మీ నాయకుడిని గురించి టైం ప్రస్తావించింది. ఉత్తర ప్రదేశ్‌లోని హత్రాస్‌లో దళిత యువతిపై జరిగిన సామూహిక అత్యాచారంపై భీంఆర్మీ ఉద్యమాన్ని టైమ్ గుర్తించింది. ♦ వైట్‌హౌస్ టాస్క్‌ఫోర్స్‌లో గుప్తా లేకపోయినప్పటికీ, ఆయన అత్యంత కీలక కోవిడ్ సంక్షోభకాలంలో వైట్‌హౌస్ లో నాయకత్వ లేమిని పూరిస్తూ, దేశవ్యాప్తంగా ఉన్న ఆరోగ్య నిపుణులకు అవసరమైన ఆరోగ్య పరికరాలను సమకూర్చారు. గుప్తా సారథ్యంలో 6.5 మిలియన్ల పీపీఈ కిట్లను ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌కి అందించగలిగారు. ♦ 25 ఏళ్ల పావులూరి ఫ్రీ ఆన్లైన్ టూల్‌కి ఆద్యుడు. కోవిడ్–19 సంక్షోభంలో అగ్రరాజ్యం అమెరికా ఎన్నో ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొంది. వీటి నుంచి బయటపడేందుకు పావులూరి తయారుచేసిన యాప్ సమర్థంగా పనిచేసింది. -
యోగీ కాచుకో.. ఇదే నా చాలెంజ్!
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హథ్రాస్ ఘటనను అడ్డం పెట్టుకుని డబ్బు వసూలు చేస్తున్నారనే సీఎం ఆరోపణలపై విచారణకు సిద్ధమని ప్రకటించారు. సీఎం యోగి భీమ్ ఆర్మీపై చేసిన ఆరోపణల్ని నిరూపించాలని చంద్రశేఖర్ ట్విటర్లో పేర్కొన్నారు. గౌరవప్రదమైన జీవితానికి కట్టుబడి ఉంటానని అన్నారు. చివరి శ్వాస వరకు తన జాతి బాగుకోసం పనిచేస్తానని, ఖర్చుల భారం కూడా తన జాతి బిడ్డలే భరిస్తారని అన్నారు. అంతేగానీ ఇతరుల వద్ద చేయి చాచమని, బెదిరింపులతో సొమ్ము రాబట్టాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. (చదవండి: వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వ్యక్తి అరెస్ట్) 100 కోట్లు కాదు కదా.. లక్ష రూపాయలు వసూలు చేసినట్టు తేలినా రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పకుంటానని అన్నారు. భీమ్ ఆర్మీపై చేసిన ఆరోపణలు తప్పని రుజువైతే యోగి తన సీఎం పదవికి రాజీనామా చేయాలని చంద్రశేఖర్ సవాల్ విసిరారు. హథ్రాస్ ఘటనపై అంతర్జాతీయ సమాజం స్పందించి.. న్యాయం జరగాలి అని కోరితే అనవసర ఆరోపణలు చేస్తున్నారని యోగీపై మండిపడ్డారు. కాగా, అంతర్జాతీయ నిధుల ద్వారా కుల, మత అల్లర్లకు పునాది వేయడానికి ప్రత్యర్థులు ప్రయత్నిస్తున్నారని సీఎం యోగి భీమ్ ఆర్మీపై పరోక్షంగా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఇదిలాఉండగా.. భీమ్ ఆర్మీ విదేశాల నుంచి డబ్బు వసూలు చేసిందనేందుకు ఎలాంటి ఆధారలు లేవని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తేల్చింది. (చదవండి: దళిత యువతి మృత్యు ఘోషకు భయపడే..) -
హత్రాస్ ఉదంతం: పోలీసుల ఎదుటే బెదిరింపులు
లక్నో: హత్రాస్ ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. బాధితులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం మీడియాలో ఒక వీడియో తెగ వైరలవుతోంది. ఠాకూర్ల సామాజిక వర్గానికి చెందిన కొందరు ఎలాంటి భయం లేకుండా.. పోలీసుల ఎదుటే భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌ను బెదిరించారు. ఇక యోగి ప్రభుత్వం మృతురాలి కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చే వారికి అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే. 144 సెక్షన్ విధించారు. గుంపులు గుంపులుగా చేరడాన్ని నిషేధించారు. చివరకు రాహుల్ గాంధీ, ప్రియాంకలను కూడా అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆదివారం బాధితురాలి కుటుంబాన్ని పరామర్శిండానికి వెళ్లిన భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌తో పాటు మరో 400 మందిపై యూపీ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. కానీ దారుణానికి పాల్పడిన నిందుతులకు మద్దతుగా 500 వ్యక్తులు చేరడమే కాక ఆజాద్‌ను బహిరంగంగా హెచ్చరించారు. అయితే పోలీసులు వీరి మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. (చదవండి: బాధిత కుటుంబంపై కేసు పెట్టాలి) దీనిపై ఆజాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నిందితులకు మద్దతుగా ఎలాంటి సమావేశాలు జరిపినా చర్యలు ఉండవు. బాధితురాలి కుటుంబం ప్రమాదంలో ఉంది. వారికి ప్రత్యేక భద్రత కల్పించండి’ అని డిమాండ్ చేశారు. ఇక గ్రామంలోని ఉన్నత కులస్తులు రాష్ట్రీయ సావర్న్ పరిషత్ అధ్వర్యంలో సమావేశం అయ్యారు. బాధితురాలి కుటుంబం సదరు వ్యక్తుల మీద అనవసర ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. యోగి ప్రభుత్వం సీబీఐ దర్యాప్తుకు ఆదేశించింది. కానీ వారు మాత్రం నమ్మడం లేదు. రాజకీయాలు చేయడానికి ఇక్కడకు వచ్చారంటూ చంద్రశేఖర్ ఆజాద్ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాక ఓ వ్యక్తి ‘దెబ్బలను తట్టుకునేందుకు ఠాకూర్లు పుట్టారు.. బయటకు రండి మీ పెద్ద సోదరులు మిమ్మల్ని కలవడానికి ఇక్కడ ఉన్నారు రండి’ అంటూ భీమ్ ఆర్మీ నాయకుడిని ఆహ్వానించారు. -
భీమ్ ఆర్మీ చీఫ్‌పై ఎన్సీడబ్యూ ఫిర్యాదు
లక్నో: భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ అజాద్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళ కమిషన్ (ఎన్సీడబ్యూ) శుక్రవారం ఉత్తరప్రదేశ్ డీజీపీ హెచ్‌సీ అవస్థీని కోరింది. మహిళలపై అసభ్య కామెంట్లు చేసినందుకు గాను అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. మార్చి 23, 2018, ఏప్రిల్ 16,2018 న అజాద్ ఒక మహిళతో ట్విట్టర్ వేదికగా మాట్లాడుతూ, అసభ్యకరపదజాలంతో దూషించాడు. ప్రముఖ వీడియో బ్లాగర్ అయిన ఆమె ఆ కామెంట్లను ట్విట్టర్ వేదికగా మళ్లీ షేర్ చేసింది. (మహిళను వేధించిన డాక్టర్‌పై విచారణ) ఈ వ్యాఖ్యలపై సీరియస్‌గా స్పందించిన ఎన్సీడబ్యూ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిపై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని ఉత్తరప్రదేశ్ డీజీపీని కోరింది. చంద్రశేఖర్ అజాద్ చేసిన ట్వీట్లను పరిశీలించిన పోలీసులు ఆయనపై దర్యాప్తుకు ఆదేశించినట్లు తెలిపారు. దీనికి సంబంధించి ఎన్సీడబ్యూ ట్వీట్ చేస్తూ మహిళలపై సోషల్మీడయా వేదికగా జరుగతున్న దాడులపై చర్యలు తీసుకోవాలని షరాన్‌పూర్ ఎస్పీని కోరాం. మహిళలకు సైబర్ సెక్యూరిటీ కల్పిస్తూ, వారికి సురక్షితమైన వాతావారణాన్ని అందిచడానికి ఎన్సీడబ్యూ ప్రయత్నిస్తుందని ట్వీట్ చేశారు. @NCWIndia has taken cognizance of the demeaning tweets made on #women by @BhimArmyChief. Chairperson @sharmarekha has written to @dgpup requesting strict action against Azad to put an end to #cybercrimes against #women. pic.twitter.com/uNQwMJza9z — NCW (@NCWIndia) June 19, 2020 -
దేశ రాజకీయాల్లోకి మరో కొత్త పార్టీ
సాక్షి, నోడాయి: దేశంలో మరో కొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకుంది. భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ ఆదివారం కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. ‘ఆజాద్ సమాజ్ పార్టీ’గా నామకరణం చేసి అధికారికంగా ప్రకటన చేశారు. బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరాం జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో చంద్రశేఖర్ ఆజాద్ పార్టీ పేరును వెల్లడించారు. ‘కాన్షీరాం చేపట్టిన మిషన్ అసంపూర్తిగా ఉంది. దాన్ని ఆజాద్ సమాజ్ పార్టీ పూర్తి చేస్తుంది’ అంటూ పార్టీ ప్రకటన అనంతరం చంద్రశేఖర్ ఆజాద్ ట్వీట్ చేశారు. 2022లో జరిగే ఎన్నికల్లో యూపీలో అధికారం చేజిక్కించుకునేందుకు అధికార బీజేపీతో పాటు ఎస్పీ,బీఎస్పీల మధ్య రసవత్తరమైన హోరు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త పార్టీ ఏర్పాటుతో యూపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారనున్నాయి. మరోవైపు ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్, ఆర్ఎల్డీకి చెందిన 98మంది నాయకులు ఆజాద్ సమాజ్ పార్టీలో చేశారు. -
ఈ అవమానాన్ని ఎప్పటికీ మర్చిపోలేను: ఆజాద్
సాక్షి, హైదరాబాద్ : భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌ను హైదరాబాద్ పోలీసులు సోమవారం విడుదల చేశారు. ఉదయం 6.55 నిమిషాలకు ఆయన్ను తిరిగి ఢిల్లీకి పంపించారు. పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ), ఎన్నార్సీకి వ్యతిరేకంగా హైదరాబాద్‌లో టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్( టీఐఎస్ఎస్) విద్యార్థులు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ఆజాద్‌ను ఆదివారం హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మెహిదిపట్నంలోని క్రిస్టల్ గార్డెన్లో జరిగే సమావేశంలో ఆజాద్ పాల్గొని అక్కడ ప్రసంగించాల్సి ఉంది. అయితే నిరసన ర్యాలీలో పాల్గొనేందుకు అనుమతి లేనందున మార్గ మాధ్యలోనే ఆయన్ను అరెస్టు చేసి బొల్లారం పోలీసు స్టేషన్‌కు తరలించారు. (చంద్రశేఖర్ ఆజాద్‌కు బెయిల్ సవరణ) సోమవారం తనను బలవంతంగా ఢిల్లీకి తీసుకెళ్తున్నారని ఆజాద్ ఈ మేరకు ట్వీట్ చేశారు. అలాగే ’తెలంగాణలో నియంతృత్వం తారాస్థాయికి చేరింది. ప్రజల నిరసన హక్కులను కొల్లగొడుతున్నారు. తొలుత మా అనుచరులపై లాఠీ చార్జ్ జరిపారు. తరువాత నన్ను అరెస్టు చేశారు. ప్రస్తుతం విమానాశ్రయానికి తీసుకువచ్చి ఢిల్లీకి పంపుతున్నారు. బహుజన్ సమాజం ఈ అవమానాన్ని ఎప్పటికీ మరచిపోదు. త్వరలో తిరిగి వస్తాం’ అని ట్వీట్ చేశారు. కాగా, జామా మసీదు వద్ద పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టినందుకు గాను ఆజాద్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత జనవరి 16న ఆజాద్ తీహార్ జైలు నుంచి బయటకొచ్చి.. మరోసారి జామా మసీదుకు వెళ్లి అక్కడ రాజ్యాంగ ప్రవేశికను చదివి వినిపించారు. తాను కోర్టు ఆదేశాలను ఉల్లంఘించలేదని.. జామా మసీదుకు రావడానికి ముందు గురుద్వారా, దేవాలయాలను సందర్శించినట్లు ఆ సందర్భంగా ఆజాద్ తెలిపారు. చదవండి: జామా మసీదు ముందు భీమ్ ఆర్మీ చీఫ్ -
చంద్రశేఖర్ ఆజాద్‌కు బెయిల్ సవరణ
న్యూఢిల్లీ: భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌కు విధించిన బెయిల్ షరతులను ఢిల్లీ కోర్టు మంగళవారం సవరించింది. వైద్యకారణాలు, ఎన్నికల ప్రయోజనాల కోసం ఢిల్లీని సందర్శించడానికి కోర్టు అనుమతిస్తున్నట్లు అదనపు సెషన్స్ న్యాయమూర్తి కామిని ఆదేశాలిచ్చారు. చంద్రశేఖర్ ఆజాద్ గత నెలలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) వ్యతిరేక నిరసనల్లో ప్రజలను రెచ్చగొట్టాడన్న ఆరోపణలపై అరెస్టు కాగా.. ఆజాద్‌కు ఢిల్లీలోని స్థానిక కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. చదవండి: జామా మసీదు ముందు భీమ్ ఆర్మీ చీఫ్ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగే నిరసన ప్రదర్శనల్లో పాల్గొనరాదని, నాలుగు వారాల వరకు ఢిల్లీకి రావద్దని ఆయనపై కోర్టు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై ఆజాద్ తనకు విధించిన బెయిల్ షరతులను సవరించాలని పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిపిన ఢిల్లీ కోర్టు షరతులను సవరించింది. అదే విధంగా ఆజాద్ కార్యాలయం రాజకీయపార్టీకి సంబంధించిందా.. కాదా.. అని ఎన్నికల సంఘం నుంచి నివేదిక తీసుకోవాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. చదవండి: జామా మసీద్ పాక్‌లో ఉందా..? -
జామా మసీదు ముందు భీమ్ ఆర్మీ చీఫ్
న్యూఢిల్లీ: సీఏఏ వ్యతిరేక నిరసనల్లో అరెస్టయి, బెయిల్‌పై విడుదలైన భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ శుక్రవారం జామా మసీదు ముందు ప్రత్యక్షం అయ్యారు. ఆయన గత నెలలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) వ్యతిరేక నిరసనల్లో ప్రజలను రెచ్చగొట్టాడన్న ఆరోపణలపై అరెస్టు కాగా.. ఆజాద్‌కు ఢిల్లీలోని స్థానిక కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగే నిరసన ప్రదర్శనల్లో పాల్గొనరాదని ఆయనకు కోర్టు నిబంధన విధించింది. నాలుగు వారాల వరకు ఢిల్లీకి రావద్దని ఆయనపై కోర్టు ఆంక్షలు విధించింది. కాగా మతపరమైన ప్రార్థనా మందిరాలకు వెళ్లడానికి మాత్రం అనుమతి కల్పించింది. కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయగా గురువారం రాత్రి విడుదలయ్యారు. (భీమ్ ఆర్మీ చీఫ్ ఆజాద్ అరెస్ట్) ఢిల్లీ వదిలి వెళ్లడానికి 24 గంటల సమయం ఉండడంతో శుక్రవారం ఆయన జామా మసీదు దగ్గర జరుగుతున్న నిరసన ప్రదర్శనలో రాజ్యాంగ ప్రవేశికను చదివి వినిపించారు. ఈ సందర్భంగా ఆయన కోర్టు ఆర్డర్స్‌ను ఉల్లంఘించలేదని ఆయన పేర్కొన్నారు. శాంతియుత నిరసనే తమ బలమన్నారు. సీఏఏకు వ్యతిరేకంగా ముస్లింలు మాత్రమే ఆందోళన చేపట్టడంలేదని, అన్ని మతాల ప్రజలు ఆ చట్టానికి వ్యతిరేకంగా ఉన్నారన్నారు. వాస్తవానికి ఇదే మసీదు ముందు నెల రోజుల క్రితం భీమ్ ఆర్మీ చీఫ్ ధర్నా చేపట్టి అరెస్టయ్యారు. కోర్టు షరతులకు అనుగుణంగానే తాను 24 గంటల్లో ఢిల్లీ వదిలి వెలతానని చెప్పారు. అయితే ఆయన జామా మసీదు వద్ద జరుగుతున్న నిరసనల్లో పాల్గొన్నట్లే కనిపిస్తున్నా.. ఆయన మాత్రం నేను నిరసనల్లో పాల్గొనలేదని కేవలం రాజ్యాంగ ప్రవేశికను మాత్రమే చదివి వినిపించానని చెప్పారు. ఆయన జామా మసీదు ప్రాంగణంలో ఉన్నంతసేపు నిరసనకారులు ఆజాదీ.. ఆజాదీ అంటూ నినదించారు. (జామా మసీద్ పాక్‌లో ఉందా..?) -
జామా మసీద్ పాక్‌లో ఉందా..?
సాక్షి, న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ జామా మసీద్‌లో నిరసన తెలిపిన భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా ఢిల్లీ కోర్టు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నిరసన తెలపడం పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కని, పార్లమెంట్లో చెప్పాల్సిన విషయాలు చెప్పనందుకే ప్రజలు వీధుల్లోకి వచ్చారని స్పష్టం చేసింది. చంద్రశేఖర్ ఆజాద్‌పై మోపిన ఆరోపణలను ప్రస్తావిస్తూ జామా మసీద్ పాకిస్తాన్లో ఉన్నట్టు మీరు ప్రవర్తిస్తున్నారని, గతంలో పాకిస్తాన్ అవిభక్త భారత్‌లో అంతర్భాగమైనందున మీరు అక్కడికి వెళ్లైనా నిరసన తెలుపవచ్చని ఢిల్లీ పోలీసుల తీరును తప్పుపట్టారు. ఆజాద్ సోషల్ మీడియా పోస్ట్‌లను ప్రాసిక్యూటర్ ప్రస్తావిస్తూ హింసను ప్రేరేపించేలా ఆయన పోస్ట్‌లున్నాయని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. జామా మసీద్ వద్ద ధర్నా చేస్తున్నట్టు సోషల్ మీడియాలో ఆజాద్ పోస్ట్ చేశారని ప్రాసిక్యూటర్ చెబుతుండగా ధర్నా చేస్తే తప్పేముందని, నిరసన తెలపడం పౌరుల రాజ్యాంగ హక్కని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఈ పోస్టుల్లో తప్పేముందని, హింస ఎక్కడ చెలరేగిందని..మీరసలు రాజ్యాంగాన్ని చదివారా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. సెక్షన్ 144 అమల్లో ఉన్నందున ముందస్తు అనుమతి అవసరమని ప్రాసిక్యూటర్ వాదిస్తుండగా ఏం అనుమతి కావాలని అంటూ పదేపదే సెక్షన్ 144 విధించడం వేధింపుల కిందకు వస్తుందని సర్వోన్నత న్యాయస్ధానం స్పష్టం చేసిందని చెప్పారు. ఆజాద్ హింసను ప్రేరేపించారనేందుకు ఆధారాలు చూపాలని న్యాయమూర్తి కోరగా ఇందుకు తమకు తగినంత సమయం ఇవ్వాలని ప్రాసిక్యూటర్ కోరగా విచారణ బుధవారానికి వాయిదా పడింది. -
భీమ్ ఆర్మీ చీఫ్ ఆరోగ్యంపై ఆందోళన..
సాక్షి, న్యూఢిల్లీ : పౌర చట్టానికి వ్యతిరేకంగా నిర్వహించిన ఆందోళనలో పాల్గొని అరెస్టై జైలులో ఉన్న భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ ఆరోగ్యం బాగాలేదని, తక్షణమే వైద్యసాయం అందించకుంటే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని ఆ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఆజాద్‌కు ప్రతి రెండు వారాలకు ఒకసారి అదనపు ఎర్ర రక్త కణాలను రక్తం నుంచి తొలగించే ప్రక్రియ చేపట్టాల్సి ఉందని ఆయన వ్యక్తిగత వైద్యులు హర్జీత్ సింగ్ భట్టీ చెప్పారు.గత వారం కిందటే ఆయనకు వైద్య చికిత్స అందించాల్సి ఉందని, ప్రస్తుతం ఆజాద్ తలనొప్పి, కడుపునొప్పితో బాధిపడుతున్నారని డాక్టర్ భట్టి తెలిపారు. సత్వరమే ఆయనకు చికిత్స అందించకుంటే అతడి రక్తం మందమై గుండె పోటుకు దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. జైలు అధికారులు ఆయనను ఎయిమ్స్‌కు తరలించేందుకు అనుమతించడలేదని అన్నారు. కాగా గత ఏడాదిన్నరగా ఈ వ్యాధికి ఆజాద్ వైద్యచికిత్స తీసుకుంటున్నారని, అదే విషయం ప్రస్తుతం ఆయన ఉంటున్న తీహార్ జైలు అధికారులకు తెలిపామని భీమ్ ఆర్మీ ప్రతినిధి కుష్ అంబేడ్కర్‌వాది తెలిపారు. మరోవైపు ఆజాద్ ఆరోగ్యం బాగానే ఉందని, ఆయనను పరిశీలించిన జైలు వైద్యుడు నిర్ధారించారని జైలు అధికారులు పేర్కొనడం గమనార్హం. -
భీం ఆర్మీది ఓట్ల రాజకీయం : మాయావతి
సాక్షి, న్యూఢిల్లీ : భీం ఆర్మీ అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆజాద్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాడని బీఎస్పీ అధినేత మాయావతి మండిపడ్డారు. పౌరసత్వ సవరణ చట్టానికి నిరసనగా చంద్రశేఖర్ ఆజాద్ శనివారం ఢిల్లీలోని జామా మసీదు నుంచి జంతర్ మంతర్ వరకు ర్యాలీ నిర్వహించిన విషయం తెలిసిందే. ముందస్తు అనుమతిని పోలీసులు నిరాకరించినా ర్యాలీ నిర్వహించడంతో శనివారం ఉదయం జామా మసీదు వెలుపల చంద్రశేఖర్ ఆజాద్‌ను పోలీసులు ఆరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టు ఆయన్ను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించింది. తర్వాత ఆజాద్‌ను తీహార్ జైలుకు తరలించారు. ఈ పరిణామాలపై మాయావతి ఆదివారం ట్విటర్లో స్పందించారు. ఉత్తరప్రదేశ్‌కి చెందిన చంద్రశేఖర్ ఆజాద్ ఢిల్లీలో నిరసన తెలపాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆమె ప్రశ్నించారు. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందునే ఓటర్లను ప్రభావితం చేయడానికి అనుమతి లేకున్నా ర్యాలీ నిర్వహించి కావాలని అరెస్ట్ అయ్యారని మాయావతి విమర్శించారు. ఇలాంటి స్వార్థపూరిత వ్యక్తులు, సంస్థలు, పార్టీల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలను, బీఎస్పీ పార్టీ కార్యకర్తలను మాయావతి హెచ్చరించారు. చదవండి : భీమ్ ఆర్మీ చీఫ్ ఆజాద్ అరెస్ట్ -
తీస్ హాజరే కోర్టుకు భీమ్ ఆర్మీ చీఫ్ ఆజాద్
సాక్షి, న్యూఢిల్లీ: భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌ను ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. దర్యాగంజ్ హింసాత్మక ఘటనకు సంబంధించి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు ఇంకా కొనసాగుతున్నాయి. చట్టాన్ని వెనక్కి తీసుకోవాలంటూ నిరసనకారులు శనివారం ఉదయం బ్యానర్లు, ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళనకు దిగారు. నిరసనలు ఉధృతం కావడంతో ప్రజా జీవనం స్తంభించింది.ఆందోళనకారుల నిరసనలతో పలుచోట్ల ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం అయ్యాయి. అయితే హింసకు ప్రేరేపిస్తున్నారంటూ భీమ్ ఆర్మీ చీఫ్ ఆజాద్‌తో పాటు మరో 15మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని, ఇవాళ తీస్ హజారే కోర్టులో హాజరు పరచారు. కాగా పౌరసత్వ సవరణ చట్టంపై దేశ రాజధాని ఢిల్లీ సహా ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిబెంగాల్ ఆందోళనలతో అట్టుడికిపోతున్నాయి. అధిక సంఖ్యలో విద్యార్థులు, సామాన్యులు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. వీరిని కట్టడి చేసేందుకు పోలీసులు చేపడుతున్న చర్యల్లో పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. మరోవైపు సీఏఏను నిరసిస్తూ ఆర్జేడీ ఇచ్చిన పిలుపుతో బిహార్‌లో బంద్ కొనసాగుతోంది. -
ఆజాద్ సంచలన నిర్ణయం!
లక్నో : వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీపై పోటీ చేసే విషయంలో తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ తెలిపారు. తాను, అనుచర వర్గమంతా ఎస్పీ-బీఎస్పీ కూటమికి మద్దతుగా నిలుస్తామని పేర్కొన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ‘ వారణాసి నుంచి పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నాను. నా కారణంగా నరేంద్ర మోదీకి ఎటువంటి లాభం చేకూరకూడదని భావించాను. మేమంతా బీజేపీ ఓటమి కోసం కృషి చేస్తాం’ అని వ్యాఖ్యానించారు. లోకసభ ఎన్నికల్లో మోదీ ఎక్కడ నుంచి పోటీ చేస్తారో అదే నియోజక వర్గం నుంచే తాను బరిలో ఉంటానని ఆజాద్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దళితుల ఓట్లు చీల్చి బీజేపీకీ లాభం చేకూర్చడానికే ఆజాద్ ఈ నిర్ణయం తీసుకున్నారంటూ బీఎస్పీ అధినేత్రి మాయావతి విమర్శించారు. ఈ నేపథ్యంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా ఓ కార్యక్రమంలో ప్రసంగించిన ఆజాద్.. మాయావతి ఎన్నటికీ దళితుల శ్రేయోభిలాసి కాలేరని.. కేవలం భీమ్ఆర్మీ మాత్రమే వారికి అండగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు. అదే విధంగా ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ కూడా తన అనునాయులకు ప్రమోషన్ ఇవ్వడం కోసం దళితులపై ఎన్నో అకృత్యాలకు ఒడిగట్టారని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అలాంటి వ్యక్తులు తనను బీజేపీ ఏజెంట్ అనడం విడ్డూరంగా ఉందని... దళితులకు ఓటు వేయడమే కాకుండా ప్రభుత్వాన్ని కూల్చడం కూడా తెలుసునని హెచ్చరించారు. కాగా వారం రోజులు కూడా తిరగకముందే ఆజాద్ తన స్టాండ్ మార్చుకోవడం విశేషం. మాయావతిని తప్పుదోవ పట్టిస్తున్నారంటూ బ్రాహ్మణ నాయకుడు సతీష్ చంద్ర మిశ్రాను విమర్శించిన ఆజాద్... మోదీపై ఆయనను పోటీకి నిలబెడితే ఎస్పీ-బీఎస్పీ కూటమికి మద్దతునిస్తానంటూ ప్రకటన చేయడం గమనార్హం. అంతేకాకుండా తనపై మాయావతి చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి.. ‘ మా వాళ్లే నన్ను బీజేపీ ఏజెంట్ అంటున్నారు. కానీ ఇప్పటికీ కూడా మాయావతి ప్రధాన మంత్రి కావాలని నేను కోరుకుంటున్నాను’ అంటూ అందరినీ ఆశ్చర్యపరిచారు. తన కారణంగా ఓట్లు చీలి బీజేపీకి ప్రయోజనం చేకూరకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇక వారణాసి నుంచి ప్రధాని మోదీపై పోటీ చేసే అభ్యర్థిని ఎస్పీ-బీఎస్పీ కూటమి ఇంతవరకు ఖరారు చేయలేదు. చదవండి : మోదీపై కచ్చితంగా పోటీ చేస్తా : ఆజాద్ -
దళిత ఓట్లకు ప్రియాంక గాలం
లక్నో: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకోబోమని బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతి ప్రకటించిన నేపథ్యంలో ఎస్పీ–బీఎస్పీ కూటమికి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ చురుగ్గా పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా ప్రియాంకా గాంధీ బుధవారం మీరట్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌ను పరామర్శించారు. దీంతో బీఎస్పీకి పట్టుకొమ్మలుగా ఉన్న దళితుల ఓట్లను ఆకర్షించేందుకే ప్రియాంక ఆజాద్‌ను కలుసుకున్నారని రాజకీయవర్గాల్లో చర్చ మొదలైంది. ఈ భేటీ అనంతరం ప్రియాంక మీడియాతో మాట్లాడుతూ..‘ఆజాద్ ఓ లక్ష్యం కోసం పోరాడుతున్నారు. ఆయన పోరాటాన్ని నేను గౌరవిస్తున్నా. ఈ పరామర్శ వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవు. ఆజాద్ తమ సమస్యలను వినాల్సిందిగా గొంతెత్తి అరుస్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం అహంకారంతో యువత గొంతు నొక్కేస్తోంది. ఈ ప్రభుత్వం ఉద్యోగాలను కల్పించడం లేదు. వాళ్లు యువత సమస్యలను వినాలనుకోవడం లేదు’ అని తెలిపారు. మరోవైపు ఈ విషయమై ఆజాద్ స్పందిస్తూ..‘ప్రియాంక ఆసుపత్రికి వచ్చినట్లు మీడియా ద్వారానే నాకు తెలిసింది. నా ఆరోగ్యం గురించి వాకబు చేసేందుకు ఆమె ఆసుపత్రికి వచ్చారు. మామధ్య రాజకీయాలకు సంబంధించి ఎలాంటి చర్చ జరగలేదు’ అని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలన్నీ కలిస్తే బీజేపీని ఓడించవచ్చని అభిప్రాయపడ్డారు. కాగా, ఈ సందర్భంగా ‘ఆజాద్ కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తారా?’ అన్న ప్రశ్నకు ప్రియాంక జవాబును దాటవేశారు. నిబంధనలకు విరుద్ధంగా భారీ సంఖ్యలో వాహనాలతో ర్యాలీ నిర్వహించడంతో ఆజాద్‌ను మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అస్వస్థతకు లోనుకావడంతో మీరట్‌లోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. యూపీలోని 80 లోక్‌సభ స్థానాలకు గానూ ఎస్పీ 37, బీఎస్పీ 38, ఆర్ఎల్డీ 3 స్థానాల్లో పోటీచేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. రాయ్‌బరేలి(సోనియాగాంధీ) అమేథీ(రాహుల్ గాంధీ) స్థానాల్లో మాత్రం పోటీచేయకూడదని నిర్ణయించాయి. ప్రియాంక పోటీలో లేనట్టే! సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఇటీవల నియమితులైన ప్రియాంక గాంధీ ఈ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయదని పార్టీ వర్గాలు చెప్పాయి. గుజరాత్లో బుధవారం ఆమె చేసిన తన తొలి ప్రసంగానికి మంచి మార్కులు పడ్డాయి. ఆ ప్రసంగం తర్వాత పార్టీ శ్రేణులు మరింత ఉత్సాహంగా, సంతోషంగా ఉన్నాయి. ఈ ఏడాది జవనరిలో ప్రియాంక క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చాక ఆమె లోక్‌సభకు పోటీ చేస్తారని భారీ ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుత ఎన్నికల్లో ప్రియాంక పోటీ చేయరనీ, ప్రచారానికి మాత్రమే వస్తారని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. ప్రియాంక ఇప్పటికే పలుమార్లు పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. -
మోదీపై కచ్చితంగా పోటీ చేస్తా : ఆజాద్
లక్నో : లోకసభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి నుంచి గనుక బరిలో దిగితే తాను కూడా అక్కడి నుంచి పోటీ చేస్తానని భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ పేర్కొన్నారు. ఒకవేళ అలా జరగని పక్షంలో మోదీ ఎక్కడ నుంచి పోటీ చేస్తారో అదే నియోజక వర్గం నుంచే తాను బరిలో ఉంటానని స్పష్టం చేశారు. పరిమితికి మించిన బైకులతో ర్యాలీ నిర్వహించి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన కారణంగా ఆయనను ఉత్తరప్రదేశ్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఈ క్రమంలో అనారోగ్యం పాలైన ఆజాద్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.(మరోసారి అక్కడి నుంచే మోదీ పోటీ..!) చదవండి : ఆజాద్ విడుదల కూడా రాజకీయమేనా? ఈ నేపథ్యంలో యూపీ తూర్పు ప్రాంతం తూర్పు ప్రాంతం ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ పార్టీ నేతలు రాజ్ బబ్బర్, జ్యోతిరాదిత్య సింధియాలతో కలిసి ఆజాద్‌ను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ప్రియాంక.. ఈ పరామర్శను రాజకీయం చేయొద్దని కోరారు. ‘ ఇది అహంకార ప్రభుత్వం. యువకుల గొంతు నొక్కేయాలని ప్రయత్నిస్తోంది’ అంటూ యోగి సర్కారును విమర్శించారు. ఇక ప్రియాంక తనను కలిసిన అనంతరం ఆజాద్ తాను మోదీపై పోటీ చేస్తున్నానని ప్రకటించడం గమనార్హం. -
రావణ దహనం నిషేధించాలి..!
సాక్షి, ముంబై : దసరా సందర్భంగా రావణ దహనాన్ని నిషేధించాలని దళిత హక్కుల సంస్థ భీమ్ ఆర్మీ డిమాండ్ చేసింది. రావణ దిష్టిబొమ్మల దహనం నిషేధించాలని కోరుతూ ఈ సంస్థ పూణే పోలీసులకు లేఖ రాసింది. దసరా వేడుకల నేపథ్యంలో రావణ దిష్టిబొమ్మల దగ్ధానికి పాల్పడిన వారిపై ఎస్సీ,ఎస్టీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని కోరింది. మానవతా సంస్కృతికి రావణుడు చిహ్నమని, అందుకే పలు ఆదివాసీ వర్గాలకు ఆయన పూజ్యనీయుడని పేర్కొంది. రావణుడు న్యాయం, సమానత్వం పట్ల విశ్వాసం కలిగిన రాజని భీమ్ ఆర్మీ కొనియాడింది. రావణుడిని వేల సంవత్సరాలుగా చరిత్ర వక్రీకరించిందని, ఆయనను దుర్మార్గుడిగా చూపిందని పోలీసులకు ఇచ్చిన లేఖలో సంస్థ పేర్కొంది. రావణ దహనంపై నిషేధం విధించడంలో పోలీసులు విఫలమైతే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని హెచ్చరించింది. భీమ్ ఆర్మీతో పాటు మహారాష్ట్రలోని ఇతర ఆదివాసీ సంస్థలు రావణ దహనాన్ని వ్యతిరేకించాయి. -
ఆజాద్ విడుదల కూడా రాజకీయమే
సాక్షి, న్యూఢిల్లీ : కుల ఘర్షణల్లో అరెస్ట్ చేసిన భీమ్ ఆర్మీ అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆజాద్‌ను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గురువారం అనూహ్యంగా విడుదల చేయడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది. 2017, మే 5వ తేదీన శహరాన్ పూర్ ఘర్షణల్లో హస్తం ఉందనే ఆరోపణలపై చంద్రశేఖర్ ఆజాద్‌ను యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. నాడు ఠాకూర్లకు, దళితులకు మధ్య ఘర్షణలు జరిగాయి. ఇందులో శాంతిభద్రతల చట్టం కింద అరెస్ట్ చేసిన కొంత మంది ఠాకూర్లు ఎప్పుడో బెయిల్‌పై విడుదలయ్యారు. నాన్ బెయిలబుల్ చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం కింద చంద్రశేఖర్ ఆజాద్‌ను పోలీసులు అరెస్ట్ చేయడం వల్ల ఆయన ఇంతకాలం జైల్లోనే ఉండాల్సి వచ్చింది. కేసు పూర్తయ్యేవరకు ఆయన్ని జైల్లోనే నిర్బంధించే అవకాశం ఉన్నప్పటికీ యూపీ ప్రభుత్వం విడుదల చేసిందంటే అందుకు రాజకీయ కారణాలు ఉండే ఉంటాయి. అటూ కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా దళితుల పోరాటం ఎక్కువవుతోంది. షెడ్యూల్డ్ కులాలు, తెగల వేధింపుల నిరోధక చట్టాన్ని సుప్రీం కోర్టు సడలించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ గత ఏప్రిల్ 2వ తేదీన దళితులు దేశవ్యాప్తంగా ఆందోళన చేశారు. చట్టాన్ని యథావిధిగా పునరుద్ధరించాలంటూ దళితులు కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు పార్లమెంట్లో ఓ బిల్లును తీసుకురావాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తర్వాత మే నెలలో కరియాన లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడానికి దళితుల వ్యతిరేకతే కారణమని బీజేపీ అభిప్రాయపడింది. అఖిలేష్ యాదవ్ నాయకత్వంలోని సమాజ్ వాది, మాయావతి నాయకత్వంలోని బహుజన సమాజ్ పార్టీ ఉమ్మడిగా పోటీచేయడం కూడా వారికి కలసి వచ్చింది. మాయావతి పార్టీ అంటే చంద్ర శేఖర్ ఆజాద్‌కు అసలు పడదు. ఆమెను అనేకసార్లు నేరుగా, ఘాటుగా ఆజాద్ విమర్శించారు. మాయావతికి వ్యతిరేకంగా భీమ్ ఆర్మీ బలోపేతం అవుతున్నందున రానున్న ఎన్నికల్లో రెండు దళిత కూటముల మధ్య ఓట్లు చీలుతాయని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. 2019 యూపీ సార్వత్రిక ఎన్నికల్లో వీలైనంత వరకు దళితుల ఓట్లను చీల్చడం వల్లనే లాభ పడవడవచ్చని భావించిన బీజేపీ, దూరదృష్టితో ఆజాద్‌ను విడుదల చేసి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
యుద్ధానికి సన్నద్ధమంటే ఎవరి మీద?
సాక్షి, న్యూఢిల్లీ : యుద్ధానికి సన్నద్ధం కావాలంటే భారత సైన్యానికి ఆరు నెలలు పడుతుందని, అదే తమ ఆరెస్సెస్ కార్యకర్తలకైతే మూడు రోజులు పడుతుందని ఆ సంస్థ చీఫ్ మోహన్ భాగవత్ వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెల్సిందే. మోహన్ భాగవత్ భారత సైన్యాన్ని అవమానించారని ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. అయితే అసలు యుద్ధానికి సన్నద్ధం కావడానికి ఆరెస్సెస్ ఏమిటీ? అది భారత సైన్యంలో భాగమా? అదో సాంస్కృత సంస్థ. అలాంటి సంస్థకు యుద్ధం చేయాల్సిన అవసరం ఎందుకు వస్తుంది ? ఎవరి మీద యుద్ధం చేస్తుంది? ఎవరూ మీదయినా యుద్ధం చేయాల్సిందే భారత సైన్యమే. అందుకు అవసరమైతే ఆదేశాలు జారీ చేయాల్సింది కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన భారత ప్రభుత్వమే. మోహన్ భాగవత్ తన మాటల ద్వారా పరోక్షంగా యుద్ధానికి ఆరెస్సెస్ కార్యకర్తలను సిద్ధం చేస్తున్నట్లుంది. అయితే ఎవరి మీద ? పాకిస్థాన్ మీదనా? పాకిస్థాన్ సైన్యానికి ఎదుర్కొనే శక్తి లేదు. పైగా అది భారత సైన్యానికి సంబంధించిన అంశం. ఇకపోతే దేశంలోని ముస్లింలపై యుద్ధమా? దేశంలోని ముస్లింలపై జరిపే దాడులను యుద్ధం అనలేం. హింస అని అంటాం. ఇప్పటికే ఆరెస్సెస్ కార్యకర్తల్లో కావాల్సినంత హింస దాగి ఉంది. అలాంటి హింసను మరీ రెచ్చగొట్టడం ఏమిటీ? ఇప్పటికే దేశంలోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లో తమకుతాము సైన్యంగా చెప్పుకునే దళాలు పెరిగిపోయాయి. భజరంగ్ దళ్ సైనిక శిబిరాల్లాంటివి ఏర్పాటు చేసుకొని వాటిలో ఆయుధ శిక్షణ తీసుకుంటుండగా, గోరక్ష దళాలు లైసెన్స్‌లేని తుపాకులను పట్టుకొని దేశంలో విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. కొన్ని చోట్ల దాడులకు కూడా దిగుతున్నాయి. శివసేన ఆర్మీ ఆఫ్ శివాజీ అని చెప్పుకుంటోంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఏర్పాటు చేసిన ‘హిందూ యువ వాహిణి’ని ఇప్పుడు ‘హిందూ యూత్ ఆర్మీ’ అని చెప్పుకుంటోంది. తమపై జరుగుతున్న దాడులను దృష్టిలో పెట్టుకొని ఉత్తరప్రదేశ్‌లోని దళితులు భీమ్ ఆర్మీని ఏర్పాటు చేసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యుద్ధానికి సన్నద్ధం అంటే వివిధ మితవాద సంస్థల్లో పేరుకుపోయిన హింసాత్మక ధోరణులను రెచ్చగొట్టడమే. ఈ ఏడాది ఎనిమిది రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఓ పార్టీకి లబ్ధి చేకూర్చడం కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నట్లు స్పష్టం అవుతోంది. -
‘ఈ దేశానికి మేమే శాసకులం’
‘మేరే సాత్ కహో–హమ్ ఇస్ దేశ్కా శాసక్ హై (నాతో గొంతు కలిపి చెప్పండి. మనం ఈ దేశానికి పాలకులం) అంటూ ‘భీమ్ ఆర్మీ’ నాయకుడు, 30 ఏళ్ల యువకుడు చంద్రశేఖర్ ఇటీవల జంతర్ మంతర్ వద్ద పిలుపునివ్వగానే వేలాది మంది యువకులు ‘హమ్ ఇస్ దేశ్కా శాసక్ హై’ అంటూ నినదించారు. ప్రస్తుతం ఉవ్వెత్తున లేచిన భీమ్ ఆర్మీ ఉద్యమాన్ని ఎలా ఆపాలి లేదా ఎలా తమ సానుకూలంగా మలుచుకోవాలనే అంశంపై ఢిల్లీలో కాంగ్రెస్, బీజేపీ నేతలు అంతర్గత చర్చలు జరపడమే అందుకు సాక్ష్యం. భీమ్ ఆర్మీని ఇప్పటికే బీజేపీ తొత్తు సంస్థగా ఆరోపణలు చేసి నాలుక కరుచుకున్న బీఎస్పీ నాయకురాలు మాయావతి వారిని ఎలా తన వైపు తిప్పుకోవాలనే అంశంపై ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం యూపీకే పరిమితమైన భీమ్ ఆర్మీ ఢిల్లీలో లక్షలాది మంది యువకులతో భారీ సమావేశాన్ని నిర్వహించడం ద్వారా తాము ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరిస్తామన్న సంకేతాలను ఇచ్చింది. లా డిగ్రీ చదివిన చంద్రశేఖర్ రెండేళ్ల క్రితం, అంటే 2015లో ‘ది గ్రేట్ చామర్స్ ఆఫ్ దడ్కౌలి వెల్కమ్స్ యు’ అన్న బోర్డును ఇంటిముందు వేలాడదీయడం ద్వారా అందరినీ ఆకర్షించారు. ఆయనది సహరాన్పూర్ పరిధిలోని దడ్కౌలి గ్రామమే. ఆయన ఇంటికి దళిత యువకులు ఎక్కువగా రావడం మొదలైంది. దాంతో ఆయన ‘భీమ్ ఆర్మీ’ని ఏర్పాటు చేశారు. దళితులు అభివృద్ధి చెందాలంటే ముందుగా చదువులో రాణించాలని ఆశించిన చంద్రశేఖర్ దళితులకు ఉచితంగా చదువు చెప్పే కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం భీమ్ ఆర్మీ ఆధ్వర్యంలో అలాంటివి దాదాపు 300 కేంద్రాలు నడుస్తున్నాయి. ఇంతకాలం చదువు మీదనే దృష్టిని కేంద్రీకరించిన ఈ ఆర్మీ యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రయ్యాక రాజకీయ, సామాజిక అంశాలపై తమ దృష్టిని కేంద్రీకరించింది. ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌లో మే 9వ తేదీన ఠాకూర్లకు వ్యతిరేకంగా నిర్వహించిన నిరసన ర్యాలీ ద్వారా భీమ్ ఆర్మీ నాయకుడు చంద్రశేఖర్ కాస్త ఒక్కసారిగా పెద్ద నాయకుడై చంద్రశేఖర్ ఆజాద్‌గా అభిమానులు పిలుచుకునే స్థాయికి ఎదిగిపోయారు. చంద్రశేఖర్ మాత్రం తనకు తాను రావన్ అని చెప్పుకుంటారు. మే 6న దళితులకు చెందిన 25 గుడిసెలను ఠాకూర్లు దహనం చేయడాన్ని నిరసిస్తూ 9వ తేదీన భీమ్ ఆర్మీ ర్యాలీని నిర్వహించింది. ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ కూడా ఠాకూర్ కులానికి చెందినవారు కావడంతో పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. ర్యాలీని అణచివేతలో ఓ దళిత యువకుడు మరణించారు. మే ఐదో తేదీన ఓ ఠాకూర్ యువకుడిని దళితులు కొట్టి చంపడం వల్లనే తాము వారి గుడిసెలను తగులబెట్టామని ఠాకూర్లు అంటున్నారు. ఠాకూర్లపై ఒక్క కేసు కూడా నమోదు చేయని స్థానిక పోలీసులు చంద్రశేఖర్‌పై మాత్రం 24 ఎఫ్ఐఆర్లు దాఖలు చేశారు. అల్లర్లను అరికట్టడంలో విఫలమయ్యారంటూ జిల్లా కలెక్టర్‌ను, జిల్లా పోలీసు అధికారిని ముఖ్యమంత్రి యోగి విధుల నుంచి సస్పెండ్ చేశారు. జిల్లా బీజేపీ నాయకులను, క్రియాశీలక కార్యకర్తలను కొంతకాలం సహరాన్‌పూర్‌కు దూరంగా ఉండాలంటూ కూడా యోగి సూచించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ దశలో చంద్రశేఖర్‌ను అణచివేసేందుకు ప్రయత్నిస్తే అనవసరంగా అతను పెద్ద నాయకుడవతారన్నది ఆయన ఆందోళనట. భీమ్ ఆర్మీ తమ ఉనికిని కూడా దెబ్బతీసే ప్రమాదం ఏర్పడిందని కాంగ్రెస్ పార్టీ షెడ్యూల్ కులాల విభాగం చైర్మన్ కొప్పుల రాజు వ్యాఖ్యానించారు. ఇంతకాలం దళితులను ఓటు బ్యాంకుగా పరిగణిస్తూ వచ్చిన జాతీయ పార్టీలకు భీమ్ ఆర్మీ ఓ మేలుకొలుపని జేడీయూ అధికార ప్రతినిధి కేసీ త్యాగి వ్యాఖ్యానించారు. తీవ్ర అణచివేతకు గురైనప్పుడు, పార్టీలు వారి ప్రయోజనాలను పట్టించుకోనప్పుడు భీమ్ ఆర్మీ లాంటి ఉద్యమాలు పుట్టుకొస్తాయని సీపీఐ సీనియర్ నాయకుడు డి. రాజా వ్యాఖ్యానించారు. భీమ్ ఆర్మీ వల్ల బీజేపీకి కూడా భారీ నష్టమేనేనని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని ఓ పార్టీ నాయకుడు వ్యాఖ్యానించారు. గోరక్షకుల దాడుల వల్ల ఇప్పటికే దళితులు పార్టీకి దూరమవుతున్నారన్నారు. అయినా భీమ్ ఆర్మీ లాంటి ఉద్యమాలు ఏదో ఒక పార్టీని ఆశ్రయిస్తే తప్ప ఎక్కువకాలం మనుగడ సాగించలేవన్నారు. రానున్న గుజరాత్, కర్ణాటక ఎన్నికలను దృష్టిలో పెట్టకొని ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా వెళ్లిన చోటల్లా దళితుల గురించే మాట్లాడుతున్నారు. భీమ్ ఆర్మీలోకి మైనారిటీలైన ముస్లిం యువకులను ఆహ్వానించడం రాజకీయ పార్టీలకు కొరుకుడు పడని మరో అంశం. ఇప్పటికే భీమ్ ఆర్మీలో ఏడు శాతం ముస్లిం యువకులు ఉన్నారు. ప్రస్తుతం 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్కులనే భీమ్ ఆర్మీలోకి తీసుకుంటున్నారు. -
మరో దళిత ఉద్యమం భీం ఆర్మీ
న్యూఢిల్లీ: దిల్లీలో ప్రజాందోళలనకు వేదిక జంతర్ మంతర్ ఆదివారం పది వేల మంది దళితులతో నిండిపోయింది. దళితులు ప్రధానంగా చర్మకారులైన జాటవ్‌ల కొత్త రాజకీయ ఉద్యమం భీం ఆర్మీ నాయకత్వాన ఎవరూ ఊహించని రీతిలో ఇంతటి జన ప్రదర్శన జరగడం ఆశ్చర్యంలో ముంచెత్తింది. కేవలం రెండేళ్ల క్రితం సహారన్పూర్ జిల్లాలో పుట్టిన దళితుల సమరశీల యువ సైన్యం భీం ఆర్మీ ఇప్పుడు జాతీయస్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించింది. ఉత్తర్‌ప్రదేశ్ షబ్బీర్‌పూర్‌లో మే 9న జరిగిన హింసాకాండకు బాధ్యులనే కారణంతో తమను వెంటాడుతున్న యూపీ పోలీసులకు చిక్కకుండా అజ్ఞాతంలోకి పోయిన భీం ఆర్మీ నేతలు ‘అడ్వకేట్’ చంద్రశేఖర్ ఆజాద్(రావణ్), వినయ్‌రతన్‌సింగ్‌లు ఈ జంతర్‌మంతర్ ర్యాలీలో హఠాత్తుగా ప్రత్యక్షమయ్యారు. జేఎన్‌యూ విద్యార్థిసంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ్యా కుమార్ కూడా చంద్రశేఖర్ ఆజాద్‌తో పాటు ప్రదర్శనలో కనిపించారు. 350 స్కూళ్లు నడుపుతున్న భీం ఆర్మీ కాలేజీ చదువులు పూర్తి చేసుకుని చంద్రశేఖర్, వినయ్‌రతన్ 2015 జులై 21న భీం ఆర్మీ ప్రారంభ సమావేశం ఏర్పాటుచేశారు. దళితుల పిల్లల కోసం పాఠశాలలు ఆరంభించాలని నిర్ణయించారు. సర్కారీ బడుల్లో అంతంత మాత్రం బోధనతో నష్టపోతున్న దళిత బాలల కోసం సహారన్పూర్ జిల్లా ఫతేపూర్ భాదో గ్రామంలో మొదటి పాఠశాల స్థాపించారు. ఇక్కడ పిల్లలకు తరగతి పాఠాలతోపాటు, అంబేడ్కర్ బోధనలు కూడా వివరిస్తారు. భీం ఆర్మీ స్కూళ్ల సంఖ్య కొద్దికాలంలోనే 350కి చేరుకుంది. అయితే, దళితులపై జరిగే అత్యాచారాలపై పోరాడుతూ, భూస్వామ్య శక్తులను ప్రతిఘటించే క్రమంలో యూపీ పోలీసులు భీం ఆర్మీకి నక్సలైట్లతో సంబంధాలున్నాయని ఆరోపించడమేగాక దాని నేతలపై జాతీయభద్రతా చట్టం కింద కేసులు నమోదు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. న్యాయం, తగిన నష్ట పరిహారం షబ్బీర్‌పూర్ దళితవాడపై ఠాకూర్లు జరిపిన దాడి, దహనకాండలో నష్టపోయిన దళితులకు న్యాయం జరిగేలా చూడాలని, ఆస్తి నష్టపోయిన వారికి సవరించిన ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాల నిరోధకచట్టం ప్రకారం తగినంత నష్టపరిహారం చెల్లించాలని మాత్రమే జంతర్‌మంతర్ ర్యాలీకి వచ్చిన దళితులు కోరారు. అంబేడ్కర్ బతికున్న కాలంలోనే అనేక రంగాల్లో పైకొచ్చిన పశ్చిమ యూపీ జిల్లాల నుంచే కొత్త దళిత చైతన్య ఉద్యమం పుట్టుకురావడం సహజమే. అందుకే వేలాదిగా తరలివచ్చిన భీం ఆర్మీ సేనలను పోలీసులు దిల్లీకి రాకుండా అడ్డుకోలేకపోయారు.