లక్నో: ఉత్తరప్రదేశ్‌లో భీమ్ ఆర్మీ చీఫ్ కారుపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. షహరాన్‌పూర్‌లో డియోబంద్ ప్రాంతంలో వెళ్లున్న చంద్రశేఖర్ ఆజాద్ రావణ్‌పై దాడి జరిగింది. ఈ కాల్పుల్లో ఆజాద్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. దీనిపై భీమ్ సేన ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఆజాద్ కారుపై దుండగులు కాల్పులు జరపగా.. ఓ బుల్లెట్ కారు సీట్‌లోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో ఆజాద్ నడుము భాగంలో బుల్లెట్ గాయమైంది. రెండో బుల్లెట్ కారు వెనక భాగంలో డోర్‌కు తగలగా.. దానిని ఆయన తప్పించుకున్నారు. అయితే.. దాడి జరిగిన సమయంలో ఆజాద్ ఫార్చునర్ కారులో ప్రయాణిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలను భీమ్ సేన సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది.
'బహుజన్ మిషన్ ఉద్యమాన్ని నిలిపివేయాలనే భీమ్ ఆర్మీ చీఫ్, జాతీయ అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆజాద్‌పై దాడి చేశారు. ఇది ఓ పిరికి చర్య. నిందితులను వెంటనే అరెస్టు చేయాలి' అని భీమ్ సేన డిమాండ్ చేసింది. తమ నాయకునికి భద్రత కల్పించాలని కోరింది.
ఇదీ చదవండి: కేసీఆర్ భారీ కాన్వాయ్‌పై స్పందించిన శరద్ పవార్.. ఏమన్నాడంటే!
Comments
Please login to add a commentAdd a comment