
సాక్షి, న్యూఢిల్లీ: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ భారతీయ మహిళలకోసం డిజిటల్ లిటరసీ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఇందుకోసం జార‍్ఖండ్ రాంచీలోని స్వచ్ఛంద సంస్థ , జాతీయ మహిళా కమిషన్‌తో సంయుక్త భాగస్వామ్యంలో ఈ పథకాన్ని ప్రారంభించింది. దేశవ్యాప్తంగా 60వేలమంది యూనివర్శిటీ మహిళా విద్యార్థులకు ఇంటర్నెట్, సోషల్ మీడియా, ఈ మెయిల్ వాడకంపై శిక్షణ ఇవ్వనుంది. ఇటీవలి కాలంలో మహిళలు, బాలికలపై సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ఫేస్‌బుక్ భద్రతా అంశాలపై అవగాహన కల్పించనుంది.
ఇంటర్నెట్ భద్రతపై 60వేలమంది భారతీయ మహిళలకు శిక్షణ ఇవ్వనున్నామని ఫేస్‌బుక్ బుధవారం ప్రకటించింది. సైబర్ పీస్ ఫౌండేషన్ సహకారంతో ఈ పైలట్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించినట్టు తెలిపింది. ఈ శిక్షణ స్థానిక భాషలలో ఉంటుందని పేర్కొంది. మహిళలు ఆన్‌లైన్‌లో, ఇంటర్నెట్‌లో ఉన్నపుడు వారు సురక్షితంగా, భద్రంగా ఫీల్ అవ్వాలని తాము భావిస్తున్నామని ఎన్‌సీడబ్ల్యు అధ్యక్షురాలు రేఖ శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. గత మూడు సంవత్సరాలలో సైబర్ నేర సంబంధిత ఫిర్యాదులు పెరుగుతున్న ధోరణి ఆందోళన కలిగిస్తోందన్నారు. ఈ నేపథ్యంలో మహిళల ఇంటర్నెట్ సేఫ్టీపై ఫేస్‌బుక్, సైబర్ పీస్ షౌండేషన్ చొరవ అభినందనీయమన్నారు. ఈ శిక్షణద్వారా మహిళలు, బాలికలకు ప్రయోజనం పొందనున్నారని చెప్పారు.
డిజిటల్ అక్షరాస్యత కార్యక్రమం హర్యానా, ఢిల్లీ-ఎన్సీఆర్, మణిపూర్, సిక్కిం, మేఘాలయ, మహారాష్ట్ర, తమిళనాడులోని ప్రధాన నగరాలలోని విశ్వవిద్యాలయాలలోని మహిళలకు ప్రయోజనం చేకూరుస్తుందని సైబర్‌పీస్ ఫౌండేషన్ తెలిపింది. మహిళల సమాన భాగస్వామ్యంతోనే ఆర్ధికవ్యవస్థ బాగా పుంజుకుంటుందనీ, ఇంటర్నెట్ వాడకంలో వారికి స్వేచ్ఛ, భద్రత ఉన్నపుడుమాత్రమే సాధ్యపడుతుందని ఫేస్‌బుక్ పబ్లిక్ పాలసీ డైరెక్టర్ ఆఫ్ ఇండియా( దక్షిణ, మధ్య ఆసియా) అంకి దాస్ చెప్పారు. తమ శిక్షణ మహిళలకు భరోసా ఇవ్వడంతోపాటూ, వారి భావాలను స్వేచ్ఛగా పంచుకునేందుకు వీలు కల్పిస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment