స్వాతి మాలీవాల్‌ ఎపిసోడ్‌: బిభవ్‌ కుమార్‌కు ఎన్‌డబ్ల్యూసీ సమన్లు | Swati Maliwal row: NCW summons To cm Kejriwal PA Bibhav Kumar | Sakshi
Sakshi News home page

స్వాతి మాలీవాల్‌ ఎపిసోడ్‌: బిభవ్‌ కుమార్‌కు ఎన్‌డబ్ల్యూసీ సమన్లు

Published Thu, May 16 2024 2:20 PM | Last Updated on Thu, May 16 2024 3:06 PM

Swati Maliwal row: NCW summons To cm Kejriwal PA Bibhav Kumar

ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పీఏ బిభవ్‌కుమార్‌ తనపై దాడి చేశారని  ఆప్‌ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలీవాల్‌ చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. ఆమె చేసిన ఆరోపణలను ఆ పార్టీ సీనియర్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌ నిజమేనని ధృవీకరించారు. దీంతో ఈ వ్యవహారంపై గురువారం జాతీయ మహిళా కమిషన్‌ స్పందించింది.

సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ పీఏ బిభవ్‌కుమార్‌కు సమన్లు జారీ చేసింది. శుక్రవారం  ఉదయం 11 గంటలకు తమ ముందు హాజరై.. స్వాతి మాలీవాల్‌పై దాడి చేసినట్లు వచ్చిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని సమన్లలో ర్కొంది. ఈ నోటీసులను జాతీయ మహిళా కమిషన్‌.. సీఎం కేజ్రీవాల్‌ కార్యాలయానికి పంపించటం గమనార్హం.

సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ నివాసంలో ఆయన పీఏ బిభవ్‌ కుమార్‌ తనపై తీవ్రంగా దాడి చేశారని ఎంపీ స్వాతిమాలీవాల్‌ సోషల్‌ మీడియా పోస్ట్‌ చేసింది. అయితే ఆమె చేసిన సోషల్‌ మీడియా పోస్ట్‌ ఆధారంగా సుమోటోగా తీసుకున్నామని జాతీయ మహిళా కమిషన్‌ పేర్కొంది. తనపై దాడి జరిగినట్లు ఎంపీ స్వాతి మాలీవాల్‌ సోమవారం బయటపెట్టారు. ఈ ఘటనపై బీజేపీ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టాలని బీజేపీ డిమాండ్‌ చేస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement