National Women Commission
-
అనుచిత వ్యాఖ్యల దుమారం.. యూట్యూబర్‌కు దక్కని ఊరట
న్యూఢిల్లీ: ప్రముఖ యూట్యూబర్ రణవీర్ అల్హాబాదియా సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ సహా తన పిటిషన్లను అత్యవసరంగా విచారించాలన్న విజ్ఞప్తిని సీజేఐ బెంచ్ తిరస్కరించింది. ఇండియాస్ గాట్ లాటెంట్ వేదికగా ఓ కంటెస్టెంట్‌ను ఉద్దేశించి రణవీర్ చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో అతనిపై కేసులు నమోదు అయ్యాయి. అయితే..ఆ ఎఫ్ఐఆర్లు అన్నింటిని ఒకే దగ్గరికి చేర్చేలా ఆదేశాలివ్వాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశాడతను. అలాగే.. గువాహతి పోలీసులు ఈ వ్యవహారంలో ఇప్పటికే అతనికి సమన్లు జారీ చేశారు. దీంతో అరెస్ట్ చేస్తారనే భయంతో అతను ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా వేశాడు. ఈ పిటిషన్లన్నీ ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు వెళ్లాయి. దీంతో ఆయన విచారణకు తేదీని నిర్ణయించారు. అయితే.. ఈ పిటిషన్లను అత్యవసరంగా విచారించాలన్న రణవీర్ తరఫు లాయర్ విజ్ఞప్తిని సీజేఐ బెంచ్ తోసిపుచ్చింది. ఈ విషయంలో కోర్టు రిజిస్ట్రీని సంప్రదించాలని సూచించింది.బీర్‌బైసెప్స్ యూట్యూబ్ ఛానెల్‌తో రణవీర్ అల్హాబాదియాకు మంచి ఫాలోయింగ్ ఉండేది. అయితే స్టాండప్ కమెడియన్ సమయ్ రైనా నిర్వహిస్తున్న ఇండియాస్ గాట్ లాటెంట్ షోలో పాల్గొన్న రణవీర్.. ఓ అభ్యర్థిని ఉద్దేశించి దారుణమైన కామెంట్లు చేశాడు. అతని తల్లిదండ్రుల శృంగారం గురించి ప్రస్తావించడంతో పెను దుమారం రేగింది.మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌తో పాటు పలువురు రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు, తోటి యూట్యూబర్లు సైతం రణవీర్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. వాక్ స్వతంత్రం పేరిట అతను సమాజం అంగీకరించని వ్యాఖ్యలు చేశాడంటూ మండిపడ్డారు. ఈ క్రమంలో చివరకు అతను క్షమాపణలు చెప్పాడు. అయినప్పటికీ ఈ వ్యవహారం మాత్రం చల్లారడం లేదు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నోటీసులు ఇవ్వడంతో యూట్యూబ్ అతని వ్యాఖ్యలు ఉన్న వీడియోను తొలగించింది. అయినప్పటికీ అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఈ వ్యాఖ్యల ఎఫెక్ట్‌తో.. అతనికున్న 16 మిలియన్ల ఫాలోవర్ల(అన్ని ప్లాట్‌ఫారమ్‌లు కలిపి) సంఖ్య క్రమక్రమంగా తగ్గుతూ వస్తోంది. ఇప్పటికే అతనిపై పలు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. మరోవైపు.. ఈ వ్యవహారం పార్లమెంట్‌కు సైతం చేరింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా.. కంటెంట్ నియంత్రణపై ప్రభుత్వం దృష్టిసారించాలని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి చెందిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ లేఖ రాయబోతోంది. మరోవైపు సమయ్ రైనా, ఇండియాస్ గాట్ లాటెంట్ నిర్వాహకులందరి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. మహారాష్ట్ర సైబర్ విభాగం ఈ షో సభ్యులపై కేసు నమోదు చేసింది. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన జాతీయ మహిళా కమిషన్.. ఈ నెల 17వ తేదీన తమ ఎదుట హాజరు కావాల్సిందిగా రణవీర్ అల్హాబాదియా, సమయ్ రైనాలకు నోటీసులు జారీ చేసింది. -
స్వాతి మాలీవాల్ ఎపిసోడ్: బిభవ్ కుమార్‌కు ఎన్డబ్ల్యూసీ సమన్లు
ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పీఏ బిభవ్‌కుమార్ తనపై దాడి చేశారని ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలీవాల్ చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. ఆమె చేసిన ఆరోపణలను ఆ పార్టీ సీనియర్ ఎంపీ సంజయ్ సింగ్ నిజమేనని ధృవీకరించారు. దీంతో ఈ వ్యవహారంపై గురువారం జాతీయ మహిళా కమిషన్ స్పందించింది.సీఎం అరవింద్ కేజ్రీవాల్ పీఏ బిభవ్కుమార్కు సమన్లు జారీ చేసింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు తమ ముందు హాజరై.. స్వాతి మాలీవాల్‌పై దాడి చేసినట్లు వచ్చిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని సమన్లలో ర్కొంది. ఈ నోటీసులను జాతీయ మహిళా కమిషన్.. సీఎం కేజ్రీవాల్ కార్యాలయానికి పంపించటం గమనార్హం.సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఆయన పీఏ బిభవ్ కుమార్ తనపై తీవ్రంగా దాడి చేశారని ఎంపీ స్వాతిమాలీవాల్ సోషల్ మీడియా పోస్ట్ చేసింది. అయితే ఆమె చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఆధారంగా సుమోటోగా తీసుకున్నామని జాతీయ మహిళా కమిషన్ పేర్కొంది. తనపై దాడి జరిగినట్లు ఎంపీ స్వాతి మాలీవాల్ సోమవారం బయటపెట్టారు. ఈ ఘటనపై బీజేపీ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. -
జవహార్ నగర్ బాధితురాలికి అండగా మల్లారెడ్డి
సాక్షి, హైదరాబాద్: జవహార్ నగర్లో జరిగిన దుశ్శాసన పర్వం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ఘటనలో బాధితురాలికి తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అండగా నిలిచారు. ఆమెకు పెళ్లి చేయడంతో పాటు ఉద్యోగం ఇప్పించే బాధ్యతను ఆయనే తీసుకున్నారు. బాలాజీ నగర్లో మద్యం మత్తులో ఓ కీచకుడు ఆమె దుస్తులు చించేసి.. నగ్నంగా రోడ్డుపై నిలబెట్టిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చుట్టూ వంద మంది ఉన్నా ఎవరూ ఆమెను రక్షించే ప్రయత్నం చేయకపోగా.. ఫొటోలు, వీడియోలు తీశారు. ఈ ఉదంతంపై బాధితురాలు మీడియా ముందు వాపోయింది కూడా. అయితే.. ఈ కేసులో పోలీసులు బాధితురాలికి అండగా నిలవడంతో పాటు నిందితుడ్ని వెంటనే అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. అయితే ఆ బాధితురాలికి మంత్రి మల్లారెడ్డి అండగా నిలబడ్డారు. బాధితురాలికి(28) మున్సిపల్ కార్పోరేషన్లో ఉద్యోగం ఇప్పించడంతో పాటు ఆమె పెళ్లి చేసేందుకు కూడా ఆయన ముందుకొచ్చారు. అంతేకాదు.. ఆమెకు డబుల్ బెడ్రూం ఇవ్వాలంటూ అధికారులకు సైతం మంత్రి మల్లారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. భవిష్యత్‌లోనూ ఆమె యోగక్షేమాలన్నీ తానే చూసుకుంటానని ఆమె కుటుంబ సభ్యులకు అభయం ఇచ్చారు మంత్రి మల్లారెడ్డి. గవర్నర్ ఆరా జవహార్ నగర్లో మహిళను వివస్త్ర చేసిన ఘటనపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆరా తీశారు. మహిళా కమిషన్ సీరియస్ జవహార్ నగర్ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సైతం సీరియస్ అయ్యింది. హైదరాబాద్‌లో శాంతి భద్రతలు ఆందోళన కలిగించేవిగా ఉన్నాయంటూ.. డీజీపీ నుంచి వివరణ కోరింది. -
శేజల్ ఫిర్యాదుపై విచారణ జరపాలని టీఎస్ డీజీపీకి లేఖ రాసిన కమిషన్
-
ఢిల్లీకి చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివాదం.. జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు
-
ఢిల్లీకి చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివాదం..NWCకి ఫిర్యాదు
సాక్షి, మంచిర్యాల: బెల్లంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, అరిజిన్డెయిరీ నిర్వాహకుల మధ్య తలెత్తిన వివాదం దేశ రాజధాని ఢిల్లీకి చేరింది. తనపై లైంగిక వేధింపులకు పాల్పడిన దుర్గం చిన్నయ్యపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు అరిజిన్ డెయిరీ భాగస్వామి తెలిపారు. జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను కలిసి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఎమ్మెల్యే వల్ల ప్రాణ హానీ ఉందని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. చిన్నయ్యపై చట్టరీత్యా చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరుతూ డెయిరీ సీఈవో ఆదినారాయణ, సీఏవో శేజల్ ఆదివారం ఢిల్లీలోని కొత్త పార్లమెంట్ భవనం వద్ద ఆందోళన చేశారు. దుర్గం చిన్నయ్య వల్ల తమ కంపెనీలో ఉన్న వాళ్లంతా రోడ్డున పడ్డారని బాధితురాలు శేజల్ ఆరోపించారు. ఎమ్మెల్యే తమను లైంగికంగా వేధిస్తున్నారని.. న్యాయం జరిగేంత వరకు పోరాడతామని పేర్కొన్నారు. ఇప్పటికే తమపై తప్పుడు కేసులు పెట్టారని.. బెయిల్‌పై బయటకు వచ్చినా.. బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. మంత్రి కేటీఆర్ అపాయింట్మెంట్ అడిగానని.. ఎందుకో ఇవ్వడం లేదంటూ ఆరోపించారు. కాగా, ఎమ్మెల్యేకు, అరిజిన్ డెయిరీ పాల సంస్థ ప్రతినిధులకు మధ్య గతంలో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. లైంగిక వేధింపులతో పాటు ఎమ్మెల్యే తమపై అక్రమ కేసులు బనాయించారని సదరు యువతి ఆరోపించారు. చదవండి: జూబ్లీహిల్స్ పబ్‌లో పాములు, తొండలు.. కస్టమర్లను ఆకర్షించేందుకు -
హోలీ రోజు జపాన్ యువతిని వేధించిన ఆకతాయిలు.. వీడియో వైరల్..
న్యూఢిల్లీ: హోలీ పండుగ రోజు ఢిల్లీలో కొందరు ఆకతాయిలు రెచ్చిపోయారు. విదేశీయురాలు అని కూడా చూడకుండా జపాన్ యువతిని వేధించారు. బలవంతంగా ఆమెకు రంగులు పూసి, కోడిగుడ్డును తలపై పగలగొట్టారు. ఆమె వద్దని చెబుతున్నా పట్టించుకోకుండా ఇబ్బందిపెట్టారు. వీరి తీరుతో ఆగ్రహించిన సదరు యువతి గ్యాంగ్‌లో ఒకడి చెంపచెళ్లుమనిపించింది. అనంతరం అక్కడి నుంచి ఇంట్లోకి వెళ్లిపోయింది. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన ఈ వీడియోపై ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతీయులు సిగ్గపడే విధంగా ఈ ఆకతాయిలు ప్రవర్తించారని మండిపడ్డారు. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులకు నోటీసులు పంపి కేసు నమోదు చేయాలని పేర్కొన్నారు. For those who were against the #BHARATMATRIMONY Holi campaign. A Japanese tourist in India. Imagine your sister, mother or wife being treated like this in another county? Maybe you will understand then. pic.twitter.com/VribIpXBab — Ram Subramanian (@iramsubramanian) March 10, 2023 అయితే ఈ వీడియోను బాధితురాలు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసి వెంటనే డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. కొందరు నెటిజన్లేమో ఇది పాత వీడియో అయి ఉండొచ్చని, మళ్లీ చక్కర్లు కొడుతోందని పేర్కొన్నారు. ఘటనకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు కూడా పోలీసులకు అందలేదు. ఢిల్లీ పోలీసులు ఈ వీడియోను చూసిన అనంతరం జపాన్ యువతి వివరాల కోసం ఎంబసీకి లేఖ రాశారు. అలాగే వీడియోలో అమ్మాయిని వేధించిన యువకుల వివరాలను సేకరించారు. చదవండి: సీజనల్ ఇన్‌ఫ్లూయెంజాపై కేంద్రం కీలక ప్రకటన.. -
తప్పైంది.. నన్ను క్షమించండి
సాక్షి, న్యూఢిల్లీ: ‘తప్పైంది.. నన్ను క్షమించండి’ అని జాతీయ మహిళా కమిషన్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి క్షమాపణ చెప్పారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌పై చేసిన వ్యాఖ్యలపై నోటీసులు అందుకున్న కౌశిక్‌రెడ్డి.. మంగళవారం ఢిల్లీలోని జాతీయ మహిళా కమిషన్ ముందు వ్యక్తిగతంగా హాజరయ్యారు. జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖాశర్మ సుమారు 40 నిమిషాల పాటు ఆయన్ను గతంలో చేసిన వ్యాఖ్యలపై విచారించారు. ఈ సందర్భంగా కమిషన్‌కు కౌశిక్‌రెడ్డి వివరణ ఇచ్చుకున్నారు. అంతేగాక ఈ అంశంలో కమిషన్‌కు క్షమాపణలు చెప్పారని.. త్వరలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు లిఖితపూర్వక క్షమాపణ చెప్తానని కౌశిక్‌రెడ్డి హామీ ఇచ్చినట్లు జాతీయ మహిళా కమిషన్ ట్వీట్ చేసింది. -
జాతీయ మహిళా కమిషన్ ఎదుట హాజరైన ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి
-
గవర్నర్ తమిళిసైకి కౌశిక్‌రెడ్డి క్షమాపణ
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలకుగానూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి క్షమాపణలు తెలియజేశారు. ఈ వ్యాఖ్యలకుగానూ నోటీసులు అందుకున్న ఆయన ఇవాళ(మంగళవారం) జాతీయ మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. అయితే.. ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి గవర్నర్ తమిళిసైకి ఎన్డబ్ల్యూసీ సమక్షంలోనే లిఖిత పూర్వక క్షమాపణ చెప్పినట్లు తెలుస్తోంది. గవర్నర్ ఫైల్స్‌ను తన దగ్గరే పెట్టుకున్నారని, ఒక్క ఫైల్‌ను కూడా కదలనివ్వడం లేదంటూ తీవ్ర పదజాలంతో పలు వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి. అయితే.. ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించిన జాతీయ మహిళా కమిషన్, ఆయనకు నోటీసులు జారీ చేసింది. -
ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డికి జాతీయ మహిళా కమిషన్ నోటీసులు
-
గవర్నర్ తమిళిసై తీవ్ర వ్యాఖ్యల ఎఫెక్ట్.. ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డికి షాక్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేసీఆర్ ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం నడిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గవర్నర్‌ను టార్గెట్ చేసిన బీఆర్ఎస్ పార్టీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. దీంతో, గవర్నర్ కూడా వారికి కౌంటర్ ఇచ్చారు. ఇదిలా ఉండగా.. గవర్నర్ తమిళిసై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ తీవ్ర పదజాలంతో వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో తీర్మానం చేసిన ఫైళ్లను గవర్నర్ తన దగ్గర పెట్టుకున్నారని, ఒక్క ఫైల్‌ను కూడా కదలనివ్వడం లేదని ఆరోపణలు చేశారు. దీంతో, కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ సీరియస్‌గా తీసుకుంది. కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలను కమిషన్ సుమోటోగా తీసుకుని ఎమ్మెల్సీకి నోటీసులు ఇచ్చింది. ఈనెల 21న కమిషన్ ఎదుట విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. ఇదిలా ఉండగా.. గవర్నర్‌పై కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పలుచోట్ల నిరసనలు తెలిపారు. -
అమ్మాయిల కనీస వివాహ వయసు ఎంత?
న్యూఢిల్లీ: మతంతో సంబంధం లేకుండా అమ్మాయిల వివాహ వయసులో ఏకరూపత ఉండాలని జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) దాఖలు చేసిన పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వ వైఖరి తెలపాలని సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. అమ్మాయి రజస్వల అయితే పెళ్లి చేసేయడానికి ముస్లిం మతాచారాలు అనుమతిస్తున్నాయని, ఇది పోస్కో చట్టానికి, ఐపీసీకి విరుద్ధమని మహిళా కమిషన్ పేర్కొంది. మతాలతో సంబంధం లేకుండా అమ్మాయిలకు 18 ఏళ్లు కనీస వివాహ వయసుగా నిర్ణయించాలని అభ్యర్థించింది. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు కేంద్ర ప్రభుత్వ వైఖరి తెలుపాలంటూ నోటీసులు జారీచేసింది. ముస్లిం పర్సనల్ లా అమ్మాయి రజస్వల అయితే వివాహం చేయడానికి అర్హురాలేనని పేర్కొంటోందని, మిగతా మతాల పర్సనల్ లాల్లో మాత్రం 18 ఏళ్ల కనీస వివాహ వయసుందని మహిళా కమిషన్ పేర్కొంది. ఇదీ చదవండి: ఆప్‌లోకి కాంగ్రెస్ కౌన్సిలర్లు.. గంటల వ్యవధిలోనే సొంత గూటికి.. -
ఆసక్తిగా ఏపీలోని మహిళా సంక్షేమ విధానాలు
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి, భద్రత కోసం అమలు చేస్తున్న కార్యక్రమాలు ఆసక్తికరంగా ఉన్నాయని జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖాశర్మ వ్యాఖ్యానించారు. జాతీయ మహిళా కమిషన్, ఏపీ మహిళా కమిషన్ సంయుక్త ఆధ్వర్యంలో విశాఖపట్నంలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి సమావేశాలు సోమవారం ముగిశాయి. ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అధ్యక్షతన రెండు రోజులపాటు నిర్వహించిన సదస్సులో 16 రాష్ట్రాలకు చెందిన మహిళా కమిషన్ చైర్పర్సన్లు, సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేఖా శర్మ మాట్లాడుతూ.. ఎన్నారై వివాహ మోసాలకు సంబంధించిన కేసులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. విదేశీ సంబంధాల విషయంలో పూర్తి వివరాలు ముందుగానే తెలుసుకునేలా యువతులను అప్రమత్తం చేయాలని సూచించారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. ఏపీలో అమలవుతున్న మహిళా సంక్షేమ పథకాలు, రక్షణకు తీసుకుంటున్న చర్యలు, మహిళా సాధికారితను వివరించారు. మహిళలకు ఇళ్ల పట్టాల పంపిణీ, అమ్మ ఒడి, చేయూత, చేదోడు, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ తదితర సంక్షేమ పథకాలతో మహిళలకు వైఎస్ జగన్ ప్రభుత్వం అండగా ఉంటోందని తెలియజేశారు. ‘దిశ’ యాప్, దిశ పోలీస్స్టేషన్ల ద్వారా మహిళలు, బాలికల భద్రతకు ప్రభుత్వం భరోసా ఇస్తోందని వివరించారు. కాగా, ఏపీ ప్రభుత్వ మహిళా సంక్షేమ కార్యక్రమాలను తెలుసుకునేందుకు జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌తో పాటు వివిధ రాష్ట్రాల ప్రతినిధులు ఆసక్తి వ్యక్తం చేసినట్లు వాసిరెడ్డి పద్మ చెప్పారు. -
Rashtrapatni Row: సోనియా జీ చర్యలు తీస్కోండి
సాక్షి, ఢిల్లీ: కేంద్రం వైఖరి పట్ల నిరసనల్లో భాగంగా.. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఉద్దేశిస్తూ ‘రాష్ట్రపత్ని’ అని పేర్కొనడం ద్వారా కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ కామెంట్లపై భగ్గుమంటున్న బీజేపీ నేతలు.. పార్లమెంట్ ఉభయ సభల్లోనూ కాంగ్రెస్ వ్యతిరేక నినాదాలతో హోరెత్తిస్తున్నారు. తాజాగా.. అధిర్ రంజన్ వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణిస్తోంది. అధిర్ రంజన్ చౌదరికి నోటీసులు జారీ చేసింది. తమ ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని, వ్యాఖ్యల పట్ల లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో స్పష్టం చేసింది. ఆగస్టు 3వ తేదీ ఉదయం 11.30 గంటలకు విచారణ ఉంటుందని తెలిపింది. అంతేకాదు, జాతీయ మహిళా కమిషన్ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి కూడా లేఖ రాసింది. ఈ వివాదంలో జోక్యం చేసుకోవాలని, అనుచిత వ్యాఖ్యలు చేసిన అధిర్ రంజన్ చౌదరిపై తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ‘అధిర్ రంజన్‌వి దిగజారిన వ్యాఖ్యలే. ఆయన చేసినవి ముమ్మాటికీ సెక్సీయెస్ట్ కామెంట్లే. అవి ఆయన మైండ్‌సెట్‌ను ప్రతిబింబిస్తున్నాయని జాతీయ మహిళా కమిషన్ చీఫ్ రేఖా శర్మ చెప్తున్నారు. అధిర్ రంజన్.. రాతపూర్వకంగా క్షమాపణలు చెప్పాలి. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆయనపై చర్యలు తీసుకోవాలి’ రేఖా శర్మ కోరుతున్నారు. -
అమ్నీషియా పబ్ కేసు: సీఎస్, డీజీపీకి మహిళా కమిషన్ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ లైంగిక దాడి ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసులో రాజకీయ నేతల కొడుకులు ఉండటంతో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో లైంగిక దాడి ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్‌గా స్పందించింది. కేసులో భాగంగా మంగళవారం.. తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డిలకు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. అలాగే, సికింద్రాబాద్ లైంగిక దాడి కేసుపై కూడా జాతీయ మహిళా కమిషన్ విచారణ చేపట్టనున్నట్టు తెలిపింది. ఇది కూడా చదవండి: రఘనందన్ రావు.. ఇన్నోవా వీడియో ఎందుకు చూపించలేదు: రేణుకా చౌదరి -
మెట్రో స్టేషన్లో యువతిపై లైంగిక వేధింపులు
దేశంలో యువతులు, మహిళలపై లైంగిక వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. బస్సుల్లో, రైళ్లలో ప్రయాణించే సమయంలో కొందరు ఆకతాయిలు మహిళలను లైంగికంగా వేధిస్తూనే ఉన్నారు. తాజాగా మెట్రో స్టేషన్లో ఓ యువతికి చేదు అనుభవం ఎదురైంది. ఓ యువకుడు.. ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. ఈ దారుణ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చేటుచేసుకుంది. వివరాల ప్రకారం.. బాధిత యువతి ఢిల్లీలోని జోర్‌బాగ్ మెట్రో స్టేషన్లో రైలు ఎక్కింది. అనంతరం రైలులో ఉన్న ఓ వ్యక్తి ఆమె వద్దకు వచ్చి ఓ అడ్రస్ గురించి అడిగాడు. ఈ క్రమంలో ఆమె అతడికి అడ్రస్ చెప్పింది. అనంతరం ఆమె దిగిపోవాల్సిన స్టేషన్ రాగా.. రైలు దిగి మరో రైలు కోసం ఎదురు చూస్తూ ప్లాట్‌ఫామ్ మీద ఉన్న బెంచి మీద కూర్చుంది. ఇంతలో అడ్రస్ అడిగిన వ్యక్తి మళ్లీ ఆమె వద్దకు వచ్చి.. మరోసారి అడ్రస్‌ను కోరి.. క్లియర్ చెప్పమని అడిగాడు. ఈ క్రమంలో సదరు వ్యక్తి.. బాధితురాలి పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. తన శారీరక అవయవాలను ఆమెకు తాకిస్తూ దారుణంగా ప్రవర్తించాడు. దీంతో బాధితురాలు.. అతను ఏం చేస్తున్నాడో గమనించి.. ప్లాట్‌ఫామ్ మీది ఉన్న సీఐఎస్ఎఫ్ సిబ్బందికి ఫిర్యాదు చేసింది. ఆమె చెప్పింది అతను పట్టించుకోకుండా పై ఫ్లోర్లో ఉన్న స్టేషన్లో ఫిర్యాదు చేయమన్నాడు. దీంతో షాకైన యువతి.. మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితుడిని కూడా గుర్తించింది. అయితే పోలీసులు కేసు నమోదు చేసుకునేందుకు నిరాకరించారు. దానిని పెద్ద సీన్ చేయవద్దని ఆమెకు నచ్చ చెప్పేందుకు ప్రయత్నించారు. దీంతో, బాధితురాలు తనకు జరిగిన చేదు అనుభవాన్ని ట్విట్టర్ ద్వారా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్‌కు ఫిర్యాదు చేసింది. ఆమె ట్వీట్‌కు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులు స్పందించారు. ఆ ఘటనపై తగు చర్యలు తీసుకుంటున్నట్టు స్పష్టం చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితుడిని గుర్తిస్తున్నట్టు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారని వెల్లడించారు. ఇక, ఈ ఘటనపై సీరియస్ అయిన ఢిల్లీ మహిళా కమిషన్.. కేసు సుమోటోగా స్వీకరిస్తున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. Zero-tolerance for any indecent behaviour, sexual harassment: DMRC on Jor Bagh station case In a statement, it also asserted that the Delhi Metro Rail Corporation, as an organisation has "zero-tolerance for any act amount... #News by #EconomicTimes https://t.co/wOyd25dCYK — Market’s Cafe (@MarketsCafe) June 4, 2022 In the context of the recent incident reported at Jorbagh, we have already taken up the issue with the concerned security agencies. Delhi Police has already taken cognizance of the complaint and are investigating into the matter. — Delhi Metro Rail Corporation I कृपया मास्क पहनें😷 (@OfficialDMRC) June 3, 2022 ఇది కూడా చదవండి: ‘ఆర్య సమాజ్’ మ్యారేజ్ సర్టిఫికెట్లు చెల్లవు -
రమ్య హత్యకు ముందు రెక్కీ
పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): గుంటూరులో ఈ నెల 15న బీటెక్ విద్యార్థిని రమ్యను హత్యచేసిన శశికృష్ణ ముందురోజు రెక్కీ నిర్వహించినట్లు తెలిసింది. అతడిని పోలీసులు విచారించినప్పుడు మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈ ఏడాది జనవరిలో ఇన్‌స్ట్రాగామ్‌లో రమ్యకు, వట్టిచెరుకూరు మండలం ముట్లూరు గ్రామానికి చెందిన నిందితుడు కుంచాల శశికృష్ణకు పరిచయం ఏర్పడింది. కొద్దిరోజులు ఇద్దరూ ఇన్‌స్ట్రాగామ్‌లో స్నేహంగా మెలిగారు. తనని ప్రేమించాలంటూ శశికృష్ణ వేధిస్తుండటంతో రమ్య ఇన్‌స్ట్రాగామ్‌తోపాటు, అతడి ఫోన్ నంబరును బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది. ఈ క్రమంలో శశికృష్ణ ఏప్రిల్‌లో రమ్య స్వగ్రామమైన చిలుమూరు వెళ్లి ఇబ్బంది పెట్టాడు. రమ్య కళాశాలకు వస్తోందా.. లేదా అని తెలుసుకునేందుకు ఈ నెల 14న శశికృష్ణ బుడంపాడులోని కళాశాలకు వెళ్లాడు. ద్విచక్ర వాహనంపై తన స్నేహితుడితో కలిసి వెళ్లిన అతడు దూరం నుంచి రమ్యను చూశాడు. బస్సు దిగుతూ శశికృష్ణను గమనించిన రమ్య భయంతో తన స్నేహితురాలితో కలిసి కళాశాలలోకి పరుగులు పెట్టింది. అదేరోజు సాయంత్రం ఇద్దరు స్నేహితులతో కలిసి కాలేజీ వద్దకు వెళ్లాడు. మధ్యాహ్నానికే కాలేజీ అయిపోవడంతో రమ్య అప్పటికే ఇంటికి వెళ్లిపోయింది. తనతో ఉన్న స్నేహితుల్లో ఒకరి వద్ద కత్తిని తీసుకున్న శశికృష్ణ ఈ నెల 15న ఉదయం కాకానిరోడ్డులో రమ్య కోసం మాటేశాడు. ఆ సమయంలో టిఫిన్ కోసం వచ్చిన రమ్యతో.. తనను ఎందుకు ప్రేమించడంలేదంటూ వాదులాటకు దిగాడు. రమ్య ఫోన్ లాక్కున్నాడు. టిఫిన్ ఇంట్లో ఇచ్చి, తన ఫోన్ కోసం వచ్చిన రమ్యను బండి ఎక్కాలని బలవంతం చేశాడు. దీంతో రమ్య శశికృష్ణను నెట్టి ఫోన్ తీసుకుని ఇంటికి వెళుతున్న క్రమంలో అడ్డగించి కత్తితో పొడిచి చంపేశాడు. నిష్పక్షపాత దర్యాప్తు చేయండి రమ్య హత్యపై డీజీపీకి జాతీయ మహిళా కమిషన్ లేఖ సాక్షి, న్యూఢిల్లీ: గుంటూరులో బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసులో నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని ఏపీ డీజీపీకి జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) ఆదేశించింది. ఈ మేరకు ఎన్సీడబ్ల్యూ చైర్పర్సన్ రేఖాశర్మ మంగళవారం డీజీపీకి లేఖ రాశారు. మహిళలపై జరుగుతున్న దాడులు, భద్రత గురించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా సుమోటోగా కేసు స్వీకరిస్తున్నట్లు ఎన్సీడబ్ల్యూ ట్వీట్ చేసింది. -
సోషల్ మీడియాను బాగా వాడుకోవాలి
సాక్షి, హైదరాబాద్: బీజేపీ కార్యక్రమాలు, మోదీ ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, మంచి పనుల ప్రచారానికి సోషల్ మీడియాను విరివిగా ఉపయోగించుకోవాలని బీజేపీ జాతీయ మహిళా మోర్చా తీర్మానించింది. శనివారం హైదరాబాద్‌లో జాతీయ మహిళా మోర్చా ఆధ్వర్యంలో మీడియా, సోషల్ మీడియా వర్క్‌షాప్ జరిగింది. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమాలను ఎలా ఉపయోగించుకోవాలన్న దానిపై జాతీయ పార్టీ బాధ్యులు సందీప్ పాత్రా, దుష్యంత్‌కుమార్ గౌతమ్, మహిళా మోర్చా మీడియా, సోషల్ మీడియా బాధ్యులకు శిక్షణనిచ్చారు. సామాజిక మాధ్యమాలను మెరుగైన విధంగా ఉపయోగించుకోవాలని, పార్టీ సంస్థాగతంగా బలోపేతమయ్యే దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్, ప్రధాన కార్యదర్శి సుఖ్‌ప్రీత్‌కౌర్, రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి తదితరులు పాల్గొన్నారు. కాగా, 2019 లోక్‌సభ ఎన్నికల్లో తాను సోషల్ మీడియాను సరిగా ఉపయోగించుకోకపోవడం వల్లే ఓటమి పాలైనట్లు డీకే అరుణ తెలిపారు. -
ఆమె అలా చేస్తే అత్యాచారం తప్పేది!
బధాయూ: ఉత్తరప్రదేశ్‌లో 50 ఏళ్ల మహిళపై జరిగిన అత్యాచారం, హత్య ఘటనపై విచారణ జరిపేందుకు వచ్చిన జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సదరు మహిళ సంఘటన జరిగిన సాయంకాలం బయటకు రాకుండా ఉండిఉంటే ఈ ఘటన జరిగేది కాదని కమిషన్ సభ్యురాలు చంద్రముఖి దేవి వ్యాఖ్యానించారు. ఈ కేసులో పోలీసుల స్పందన సరిగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘ప్రతిసారీ నేను స్త్రీలకు ఒకటే చెబుతున్నా. ఎలాంటి పరిస్థితుల్లో కూడా అనవసర సమయాల్లో బయటకు వెళ్లకండి’’అని బాధిత మహిళా కుటుంబంతో సమావేశానంతరం చెప్పారు. బాధిత మహిళ ఆ సాయంత్రం బయటకు పోకుండా ఉన్నా, లేదా కుటుంబంలో ఒక చిన్నారిని తోడుగా తీసుకువెళ్లినా ఈ సంఘటన జరిగేది కాదన్నారు. అత్యాచార సంఘటన ముందస్తు ప్రణాళిక ప్రకారం జరిగిందని ఆమెకు వచ్చిన ఫోన్‌కాల్ బట్టి తెలుస్తోందన్నారు. ఆదివారం 50 ఏళ్ల అంగన్వాడీ వర్కర్ దగ్గరలో గుడికి వెళ్లి అత్యాచారానికి, హత్యకు గురైంది. ఇది గుడిపూజారి, అతని సహాయకులు చేసిన పనేనని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వీరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతానికి పూజారి పరారీలో ఉన్నారు. పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే కనీసం బాధితురాలు ప్రాణాలతో ఉండేదని దేవి అసంతృప్తి వ్యక్తం చేశారు. బాధ్యులపై తీవ్ర చర్యలు తీసుకోవాలని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఇలాంటి విషయాలపై సీరియస్‌గా ఉన్నా, ఇంకా జరుగుతూనే ఉన్నాయన్నారు. పోలీసులు తమ పేలవ స్పందన కప్పిపుచ్చుకునేందుకు ఎస్హెచ్ఓను సస్పెండ్ చేశారని దేవి తెలిపారు. మరోవైపు ప్రభుత్వం, పోలీసులు కావాలనే పోస్టుమార్టం ఆలస్యం చేశారని సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్ ఆరోపించారు. యోగి పాలనలో స్త్రీలపై అత్యాచారాలు ఎన్నడూ లేనంతగా పెరిగాయని దుయ్యబట్టారు. -
మాదొక విన్నపం మేడం.. అసలేంటి ఇదంతా?!
న్యూఢిల్లీ/ముంబై: జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ) చీఫ్ రేఖా శర్మపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఆమె, లవ్ జిహాద్ కేసులు అంటూ విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించడం సరికాదంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొష్యారీతో మంగళవారం రేఖా శర్మ భేటీ అనంతరం ఎన్సీడబ్ల్యూ తన అధికార ట్విటర్లో పేర్కొన్న అంశాలే ఇందుకు కారణం. ‘‘మా చైర్ పరస్సర్ రేఖా శర్మ, మహారాష్ట్ర గవర్నర్ శ్రీ భగత్ సింగ్ కొష్యారీని కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మహిళల భద్రత, ఆడవాళ్లపై వేధింపులు, కోవిడ్ సెంటర్లలో మహిళా పేషెంట్లపై జరుగుతున్న లైంగిక దాడులు, లవ్ జిహాద్ కేసుల గురించి చర్చించారు’’ అని ఎన్సీడబ్ల్యూ పేర్కొంది. ఇందుకు స్పందించిన నెటిజన్లు, రేఖా శర్మ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: నా ఒడి నింపే వేడుక..ఇప్పుడేంటి!?) రేఖా శర్మ గారు మాదొక విన్నపం ‘‘మాదొక విన్నపం రేఖా శర్మగారు. లవ్ జిహాద్ అన్న పదానికి నిర్వచనం ఏమిటి? కొంతమంది అతివాదులు ఉపయోగించే ఈ పదాన్ని బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మీరు వాడటమేమిటి? చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని వివాదాలు సృష్టించే వారి తరఫున మీరు మాట్లాడుతున్నారా?’’అంటూ ఓ నెటిజన్ ప్రశ్నలు సంధించారు. ‘‘ఇది నిజంగా బాధ్యతారాహిత్యమే. లవ్ జిహాద్ అనే పదం ఉపయోగించి ఓ వర్గాన్ని టార్గెట్ చేయడం ఎంతమాత్రం సరికాదు. మైనారిటీలు, మహిళలపై అత్యాచారాలు పెరుగుతున్న తరుణంలో మరింత రెచ్చగొట్టేవిధంగా వ్యాఖ్యలు చేయడం దేనికి సంకేతం. రైట్ వింగ్ భావజాలం ఉన్న ఓ మహిళ ఇలాంటి బాధ్యతాయుతమైన పదవి ఎలా చేపట్టగలిగారు. ఇటువంటి వ్యక్తుల కారణంగా దేశంలోని మహిళలకు, లౌకిక వాదుల భద్రతకు ప్రమాదం పొంచి ఉన్నది. మేజర్లు అయిన వ్యక్తులు తమకు నచ్చిన వారిని ప్రేమించి, పెళ్లి చేసుకునే హక్కు లేదా? ఆమెను పదవి నుంచి తక్షణమే తొలగించాలి’’ అంటూ మరొకరు డిమాండ్ చేశారు. అనుమానాస్పద కార్యకలాపాలు అంతేగాకుండా గతంలో రాజకీయ నాయకులు, ముఖ్యంగా మహిళా నేతల గురించి రేఖా శర్మ గతంలో చేసిన వివాదాస్పద ట్వీట్లను షేర్ చేస్తూ ఆగ్రహాన్ని ప్రదర్శించారు. ఈ క్రమంలో తనపై వస్తున్న విమర్శలపై స్పందించిన రేఖా శర్మ, తన ట్విటర్ అకౌంట్ ద్వారా జరిగిన కార్యకలాపాలు అనుమానాస్పదంగా ఉన్నాయని, ఈవిషయం గురించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్లు పేర్కొన్నారు. దీంతో లోతుగా విచారణ చేపట్టి సమస్యను పరిష్కరిస్తామని చెప్పినట్లు పేర్కొన్నారు. కాగా ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ తనిష్క్ ఇటీవల రూపొందించిన యాడ్ వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ముస్లిం కుటుంబంలోని హిందూ కోడలికి సీమంతం నిర్వహించే థీమ్‌తో రూపొందించిన ఈ వీడియో కారణంగా లవ్ జిహాద్ అంశం మరోసారి చర్చనీయాంశమైంది. ఈ విషయం గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం రేగుతున్న తరుణంలో ఎన్సీడబ్యూ చీఫ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇక ట్రోలింగ్ నేపథ్యంలో తనిష్క్ తన యాడ్ తొలగించిన విషయం తెలిసిందే. Our Chairperson @sharmarekha met with Shri Bhagat Singh Koshyari, His Excellency, Governor of Maharashtra & discussed issues related to #womensafety in the state including defunct One Stop Centres, molestation & rape of women patients at #COVID centres & rise in love jihad cases pic.twitter.com/JBiFT477IU — NCW (@NCWIndia) October 20, 2020 -
కశ్యప్‌పై పాయల్ లైంగిక దాడి ఆరోపణలు
ముంబై: బాలీవుడ్ చిత్ర నిర్మాత అనురాగ్ కశ్యప్ తనపై లైంగిక దాడి చేశారంటూ నటి పాయల్ ఘోష్ ఆరోపించారు. తనకు న్యాయం చేయాలంటూ ప్రధాని మోదీని కోరారు. శనివారం ఆమె ట్విట్టర్లో..‘అనురాగ్ కశ్యప్ నాపై చాలా తీవ్రంగా ఒత్తిడి తెచ్చాడు. నరేంద్ర మోదీజీ.. ఈ విషయంలో చర్య తీసుకోండి. కశ్యప్‌లోని రాక్షస కోణాన్ని ప్రజలకు చూపెట్టండి. ఇలా వెల్లడించడం నాకు హాని చేస్తుందని, నా భద్రతకు ముప్పు అని నాకు తెలుసు. సాయం చేయండి’ అని కోరారు. దీనిపై జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖా శర్మ స్పందించారు. పూర్తి వివరాలతో ఫిర్యాదు చేస్తే తాము చర్య తీసుకుంటామని ట్విట్టర్లో పేర్కొన్నారు. పటేల్‌కి పంజాబీ బీబీ అనే సినిమాలో, నిభానా సాథియా అనే టీవీ కార్యక్రమంలో పాయల్ ఉన్నారు. ఇప్పటికే నటి కంగనా రనౌత్, దర్శకుడు అనురాగ్ కశ్యప్ మధ్య మాటల యుద్ధం నడుస్తున్న నేపథ్యంలో పాయల్ ఘోష్ ఆరోపణలపై కంగనా మద్దతు తెలిపారు. -
ఉదయం పెళ్లి.. రాత్రి జైలుకు
సాక్షి ప్రతినిధి, చెన్నై: పెళ్లంటే నూరేళ్ల పంట. స్త్రీ, పురుషులు ఒకరి కోసం ఒకరుగా కలిసిమెలసి పండించుకోవాల్సిన నిండైన జీవితం. కొందరు యువతుల జీవితాల్లో చిత్రమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. భార్యల కాళ్లపారాణి ఆరకముందే వారి భర్తలు కటకటాల వెనక్కి వెళ్లిపోతున్నారు. ఇదేం చోద్యమని సాక్షాత్తు న్యాయమూర్తులే ఆశ్చర్యం వ్యక్తంచేశారు. విచారణ జరపాలని జాతీయ మహి ళా కమిషన్‌ను ఆదేశించారు. యావజ్జీవ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న తన భర్త కు పెరోల్ మంజూరు చేయాలని కోరుతూ ఒక యువతి మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తులు ఎన్ కృపాకరన్, వీఎం వేలుమణి విచారించారు. పెళ్లి చేసుకునేటప్పు తన భర్త ఒక యావజ్జీవ ఖైదీ అనే విషయం తెలియదని ఆమె చెప్పింది. ఒక హత్య కేసులో కింది కోర్టు భర్తకు యావజ్జీవ శిక్ష విధించడాన్ని హైకోర్టులో సవాలు చేసి జామీనుపై బయటకు వచ్చిన సమయంలో తనను పెళ్లిచేసుకున్నాడని పేర్కొంది. దీంతో న్యాయమూర్తులు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇలాంటి కేసులు మరికొన్ని దాఖలయ్యాయి. గతంలో అస్లాం అనే ఖైదీకి 30 రోజుల పెరోల్ మంజూరు చేసేలా జైళ్ల శాఖను ఆదేశించాలని కోరుతూ అతడి భార్య అడ్‌కొనర్వ్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ మహిళ తన భర్త ఒక యావజ్జీవ ఖైదీ అని తెలిసే పెళ్లి చేసుకుంది. 20 ఏళ్లుగా జైల్లో ఉంటున్న భర్తను పెరోల్‌పై విడుదల చేయాల్సిందిగా కోరింది. పదేళ్లకు ముందు ఒక్కరోజు పెరోల్‌పై జైలు నుంచి బయటకు వచ్చినపుడు పెళ్లి చేసుకున్నాడని, అదే రోజు రాత్రి జైలుకు వెళ్లిపోవడంతో అత్తగారితోపాటూ ఉంటు న్నట్లు తెలిపింది. దీనిపై న్యాయమూర్తులు మాట్లాడుతూ ప్రస్తుతం సమాజంలో పెళ్లి చేసుకునే వారు అనేక వివరాలను సేకరిస్తున్నారని, ఒక ఖైదీని, అందునా యావజ్జీవ ఖైదీని వివాహమాడేందుకు ఏ యువతీ అంగీకరించదన్నారు. యువతుల అభీష్టం మేరకు పెళ్లిళ్లు జరుగుతున్నాయా? లేక బలవంతంగా చేస్తున్నారా అన్న దానిపై విచారణ చేసి బదులు పిటిషన్ వేయాలని జాతీయ, రాష్ట్ర మహిళా కమిషన్, మహిళా శిశు సంక్షేమం, అభివృద్ధి శాఖలను ఆదేశిస్తున్నట్టు ప్రకటించారు. కేసు విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేశారు. -
ఏపీ పోలీసుల తీరును అభినందించిన జాతీయ మహిళా కమిషన్
-
రక్షక భటులం.. మాకు రక్షణేదీ?
సాక్షి, గుంటూరు: అమరావతి ప్రాంతంలోని రైతులు, మహిళలపై పోలీసులు అకారణంగా దాడులు చేస్తున్నారంటూ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతలు సాగిస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని తేలిపోయింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు వారు అడుతున్న కుట్రల బాగోతం బయటపడింది. విధి నిర్వహణలో గత 26 రోజుల్లో తాము ఏనాడూ లాఠీ ఎత్తలేదని పోలీసులు స్పష్టం చేశారు. అమరావతిలో విధుల్లో ఉన్న తమను మహిళలని కూడా చూడకుండా ఆందోళనకారులు నోటికొచ్చినట్లు దూషించారని మహిళా పోలీసులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమపై జరిగే దాడులు, వేధింపులకు ఎవరు రక్షణగా నిలుస్తారని కన్నీరు పెట్టుకున్నారు. దాహం వేస్తే దుకాణాల్లో నీళ్లు కూడా అమ్మలేదని వాపోయారు. గుంటూరు జిల్లా పర్యటనకు వచ్చిన జాతీయ మహిళా కమిషన్ సీనియర్ కో–ఆర్డినేటర్ కాంచన్ ఖత్తర్, మహిళా కమిషన్ కౌన్సిలర్ ప్రవీణ్సింగ్ను గుంటూరు రూరల్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు టి.మాణిక్యాలరావు, మహిళా పోలీసు సిబ్బంది ఆదివారం కలిశారు. అమరావతి ప్రాంతంలో రైతుల ముసుగులో కొందరు ఆందోళనకారులు, గ్రామస్థులు తమను వేధింపులకు గురిచేశారని ఫిర్యాదు చేశారు. కొందరు అసభ్యకరంగా ప్రవర్తించారు అమరావతి ప్రాంతంలో సెక్షన్ 144, 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున నిబంధనల మేరకు నలుగురు కన్నా ఎక్కువ మంది గుమిగూడితే మాత్రమే వారిని పక్కకు వెళ్లమని నచ్చజెప్పేందుకు ప్రయత్నించామని మహిళా పోలీసులు జాతీయ మహిళా కమిషన్ సీనియర్ కో–ఆర్డినేటర్‌కు తెలియజేశారు. తాము ఏ రోజూ ఆందోళనకారుల ఇళ్లలోకి ప్రవేశించలేదన్నారు. ఆందోళనల పేరుతో మహిళలను ముందు పెట్టి కొందరు పురుషులు తమ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని పేర్కొన్నారు. తమను దారుణంగా తిట్టారని, మనోవేదనకు గురిచేశారని ఫిర్యాదు చేశారు. కుటుంబాలను వదిలిపెట్టి రేయింబవళ్లు సేవ చేస్తున్న తమపై తప్పుడు సాగించడం ఏమిటని కన్నీటి పర్యంతమయ్యారు. తాగడానికి నీళ్లు కూడా అమ్మడం లేదు ‘‘గత 26 రోజులుగా అమరావతి ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్నాం. మేం ఏ రోజూ లాఠీ పట్టలేదు. లాఠీచార్జి చేయలేదు. అలాంటిది మహిళలపై లాఠీచార్జి చేశామంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మహిళా పోలీస్ సిబ్బందిలో కొందరు గర్భవతులు, పెద్ద వయసు వారు, ఆరోగ్యం బాగాలేనివారు కూడా ఉన్నారు. వారు ఎక్కువసేపు నిలబడలేక ఎక్కడైనా కాసేపు కూర్చుందామని వెళితే.. అరుగులు, సిమెంట్ బెంచీలపై ఆయిల్, పేడ నీళ్లు, కారంపొడి చల్లారు. కూర్చోవడానికి కూడా వీల్లేకుండా చేస్తున్నారు. దాహం వేసి షాపుల్లో నీళ్ల బాటిల్ కొనుక్కోవడానికి వెళితే అక్కడ మంచినీళ్లు అమ్మడం లేదు. ఆడవారు, మగవారు మమ్మల్ని అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు. అయినా ఏనాడూ మేం సహనం కోల్పోలేదు’’ – వెంకటేశ్వరమ్మ, మహిళా హెడ్ కానిస్టేబుల్ 17 ఏళ్ల సర్వీస్‌లో ఏ రోజూ ఈ మాటలు పడలేదు ‘‘నేడు 17 ఏళ్ల క్రితం పోలీసు డిపార్ట్మెంట్లోకి వచ్చాను. ఎన్నో ఆందోళనలు, నిరసనల్లో విధులు నిర్వహించాను. ఏ రోజూ ఆందోళనకారులు మమ్మల్ని దూషించడం, మాపై చేయి చేసుకోవడం జరుగలేదు. నా 17 ఏళ్ల సర్వీస్‌లో ఎన్నడూ లేని విధంగా రాజధాని ప్రాంతంలో ఆందోళనకారులు మహిళలమని కూడా చూడకుండా మాటల్లో చెప్పలేని విధంగా తిడుతున్నారు. ఆఖరికి మహిళా నిరసనకారులు కూడా మమ్మల్ని ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడుతున్నారు’’ – పద్మజ, మహిళా హెడ్ కానిస్టేబుల్ వేయకూడని చోట చేతులు వేస్తున్నారు ‘‘మహిళలను ముందు పెట్టి, వెనుక పురుషులు ఉండి ఆందోళన చేస్తున్నారు. మహిళా నిరసనకారులను అడ్డుకునే సమయంలో వాళ్లు పక్కకు తప్పుకుంటున్నారు. వారి వెనకున్న పురుషులు మహిళా పోలీస్ సిబ్బందిని ఎక్కడ పడితే అక్కడ పట్టుకుంటున్నారు. వేయకూడని చోట చేతులు వేస్తున్నారు. నలుగురికి రక్షణగా నిలవాల్సిన మాకే రక్షణ లేకుండా పోతోంది. కొన్ని సందర్భాల్లో ఆందోళనకారుల నుంచి మమ్మల్ని మేం రక్షించుకోవాల్సి వస్తోంది’’ – శిరీష, మహిళా ఏఎస్సై దాడికి దిగుతున్నారు ‘‘పోలీసులపైనే ఆందోళనకారులు దాడికి దిగుతున్నారు. వారు రాళ్లు విసిరడంతో నా తలకు గాయమైంది. కొట్టడం, గిచ్చడం, బరకడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. విధులకు హాజరయ్యే మహిళా పోలీస్ అధికారులు, సిబ్బందిని ఆడ, మగ తేడా లేకుండా నోటికి వచ్చినట్టు దూషిస్తున్నారు. తాగడానికి నీళ్లు కొనుక్కోవడానికి వెళితే దుకాణాల్లో నీళ్లు కూడా అమ్మడం లేదు’’ – శివకుమారి, మహిళా ఏఎస్సై -
సోషల్ మీడియాలో టీడీపీ దుష్ప్రచారం..
సాక్షి, విజయవాడ: మహిళలను రాజకీయ క్రీడా చదరంగంలో పావులుగా వాడుకోవడం తెలుగుదేశం పార్టీకి తగదని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. జాతీయ మహిళా కమిషన్ సభ్యులను టీడీపీ తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించిందని ఆమె వ్యాఖ్యానించారు. కమిషన్ సభ్యులకు అడుగడుగునా టీడీపీ ఆటంకాలు సృష్టించిందని వాసిరెడ్డి పద్మ అన్నారు. పథకం ప్రకారం మహిళలపై అరాచకాలు జరుగుతున్నట్లు చెప్పేందుకు ప్రయత్నించిందన్నారు. లేనిదాన్ని ఉన్నట్లు చెప్పించడం టీడీపీ దిగజారుడుతనానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. సోషల్ మీడియాలో టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని, ఎక్కడో జరిగిన సంఘటనలను ఇక్కడవంటూ అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారన్నారు. జీతాలు పెంచాలంటూ ధర్నాలు చేసిన అంగన్వాడీ కార్యకర్తలను గుర్రాలతో తొక్కించిన ఘటన చంద్రబాబుది అని వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. -
పరిధి కాకుంటే స్పందించరా..?
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: రాష్ట్ర పోలీసు యంత్రాంగంపై జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) ఆగ్రహం వ్యక్తం చేసింది. శంషాబాద్ ఘటనలో మృతి చెందిన ప్రియాంకరెడ్డి తల్లిదండ్రులు కుమార్తె అదృశ్యంపై ఫిర్యాదు చేసేందుకు ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్‌కు వస్తే పోలీసులు వ్యవహరించిన తీరు దారుణమని పేర్కొంది. తమ పరిధి కాదని నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. కనీసం మానవీయ కోణంలో కూడా స్పందించకపోవడం శోచనీయమని వ్యాఖ్యానించింది. ప్రియాంకరెడ్డి హత్య ను సెక్షన్ 10 కింద సుమోటోగా స్వీకరించిన జాతీయ మహిళా కమిషన్..విచారణ నిమిత్తం ఎన్సీడబ్ల్యూ సభ్యురాలు శ్యామల ఎస్ కుందన్ శనివారం ఉదయం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ప్రియాంకారెడ్డి తల్లిదండ్రులను పరామర్శించి వారిని ఓదార్చారు. ఆ తర్వాత బేగంపేటలోని హరితాప్లాజాలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పోలీసులు పరిధి ప్రకారం విధులు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ గైడ్ చేయడంలో కూడా కీలక భూమిక పోషించాల్సి ఉందన్నారు. ప్రియాంకారెడ్డి తల్లిదండ్రుల ఫిర్యాదుపై సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో సమన్వయపరిస్తే సమస్య మరింత ముందుగా వెలుగులోకి వచ్చేదన్నారు. బాధితురాలి హత్య ఉదంతంపై పలు అనుమానాలున్నాయని, తమ విచారణలోనూ పోలీసులు చెప్పలేదన్నారు. పలు అంశాలకు సంబంధిం చి ఆధారాలు లభ్యం కాలేదని తెలిపారు. ప్రధాన రహదారి, నగరానికి అత్యంత సమీపం లో ఉన్న ప్రాంతంలో పెట్రోలింగ్ సరిగ్గా జరగలేదని, రెండ్రోజులుగా లారీ నిలిపి ఉన్నా కనీసం గుర్తించకపోవడం దారుణమన్నారు. ఇందులో పోలీసుల వైఫల్యం కనిపిస్తుందని పేర్కొన్నారు. నిరంతర పర్యవేక్షణ కోసమే సీసీటీవీలను ఏర్పాటు చేస్తారని, ఘటన జరిగిన తర్వాత ఆధారాల కోసం కాదన్నారు. సీసీటీవీ ఫుటేజీ సరిగ్గా నమోదు కాలేదని, వాటిని నిర్మించిన కాంట్రాక్టు సంస్థను బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని, కేసు నమోదు చేయాలన్నారు. ఆర్జీఐఏ పీఎస్ అధికారులు, పెట్రోలింగ్‌లో ఉన్న పోలీసులపై పూర్తి విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వెంటనే మహిళా కమిషన్ ఏర్పాటు చేయాలన్నారు. ఇక్కడ కమిషన్ ఉంటే కేసు విచారణ మరింత సులభతరమయ్యేదన్నారు. ఆపద సమయంలో 100 నంబర్‌కు డయల్ చేసి ఫిర్యాదు చేయాలని, ప్రతి పేరెంట్ పిల్లలకు సామాజిక అంశాలపై అవగాహన కల్పించాలన్నారు. విలువైన సమయాన్ని వృథా చేశారు: రేఖాశర్మ పశువైద్యురాలు ప్రియాంకరెడ్డి హత్య కేసులో పోలీసులు విలువైన సమయాన్ని వృథా చేశారని, ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు సత్వరం స్పందించి ఉంటే ప్రి యాంకారెడ్డి ప్రాణాలతో మనకు దొరికి ఉండేదని జాతీయ మహిళా కమిషన్ చైర్ప ర్సన్ రేఖా శర్మ పేర్కొన్నారు. ఈ కేసులో పోలీసుల నిర్లక్ష్యం పూర్తిగా ఉందని ఆరోపిం చారు. ఫిర్యాదు చేసేందుకు వెళ్లినప్పుడు ఎవరితోనో వెళ్లుంటుందిలే అన్న పోలీసు వ్యాఖ్యలపై కూడా ఆమె విరుచుకుపడ్డారు. సున్నితమైన ఈ కేసుకు సంబంధించి తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ బాధ్యతగా వ్యాఖ్యలు చేయాల్సిందన్నారు. -
‘సీసీ కెమెరాలు ఉన్నది దాని కోసం కాదు’
సాక్షి, హైదరాబాద్ : సీసీ కెమెరాలను పెట్టింది ఘటన జరిగిన తర్వాత ఉపయోగించడానికి కాదని, వాటి ఆధారంగా నిరంతరం పర్యవేక్షించాలని జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు శ్యామల స్పష్టం చేశారు. ప్రియాంక రెడ్డి ఘటనపై శనివారం బేగంపేట హరిత ప్లాజాలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. పరిధిలతో సంబంధం లేకుండా పోలీసులు మానవతా దృక్పథంతో సహాయం చేయాలని సూచించారు. సీసీ కెమెరాలు నాణ్యత లేకుండా పెట్టారని, పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రియాంక కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించామని తెలిపారు. రాష్ట్రంలో మహిళా కమిషన్ లేదు కాబట్టి, ఘటనను సెక్షన్ 10 ప్రకారం సుమోటోగా స్వీకరించి విచారిస్తున్నామని వెల్లడించారు. -
తుషార కేవలం 20 కిలోల బరువే ఉంది!
కిరోసిన్ పోసి నిప్పంటించడం, ఫ్యానుకు ఉరి బిగించడం... కట్నం హత్యలలో చాలా జరిగాయి. కాని కేరళలో అన్నం పెట్టకుండా కోడలిని చంపిన ఘటన మనుషులుగా మనం ఎంత పతనమయ్యామో తెలియచేస్తోంది. రెండు లక్షలు ఇవ్వలేకపోయారు తుషార తల్లిదండ్రులు. వారు కేరళలోని కొళ్లం సమీపంలో ఒక పల్లెలో ఉంటారు. తమ కుమార్తె తుషారను దాపున ఉండే ఇంకో పల్లెలో ఇచ్చి పెళ్లిచేశారు. కట్నం మూడు లక్షలు. కొన్నినగలు ఇస్తామన్నారు. నగలు ఇచ్చి, లక్ష రూపాయలు ఇచ్చి పెళ్లి చేశారు. ఇంకా రెండు లక్షలు బాకీ. తల తాకట్టు పెట్టయినా ఆ బాకీ చెల్లిస్తామని చెప్పారు. పెళ్లి 2013లో జరిగింది. కాని తుషార తల్లిదండ్రులు నిరుపేదలు. కూతురుని ఇల్లు దాటించగలిగారు గానీ తిరిగి ఆమె ఇంటికి వచ్చేస్తే మోయలేరు. అన్నం పెట్టలేరు. కట్నం బాకీ ఉంది కనుక అల్లుడికి ఎదురు పడలేరు. అత్తగారింటికి వెళ్లి కూతురు ఎలా ఉందో చూసి రాలేరు. డబ్బు ఒక ఇంటి ఆడకూతురు ఎలా ఉందో ఎలా బతుకుతుందో తెలుసుకోలేని దౌర్భాగ్యాన్ని తెచ్చిపెట్టింది. కట్నం ఇవ్వలేదని తుషార భర్త చందులాల్, అత్త గీతా లాల్ తుషారను ఇంటి బయటకు అడుగు పెట్టనివ్వలేదు. చందులాల్ ఏవో కుదురు లేని పనులు చేసేవాడు. తల్లీ కొడుకులకు తాంత్రిక విద్యల పిచ్చి ఉంది. ఇరుగు పొరుగూ అభ్యంతరాలకు వారు ఆ పల్లె విడిచి మరో పల్లెకు వెళ్లిపోయారు. ఎక్కడ కాపురం పెట్టిందీ తుషార తల్లిదండ్రులకు తెలియనివ్వలేదు. తుషారకు ఇద్దరుపిల్లలు పుట్టారు. రెండో పిల్లాడి వయసు ఒకటిన్నర సంవత్సరాలు. తుషార తన సజావు కాపురానికి రుసుముగా తక్కిన కట్నం చెల్లించలేకపోయింది. కన్నవారు ఆ కట్నం ఇవ్వలేకపోయారు. కనుక ఆమె అత్తారింటిలో దారుణ హింసను ఎదుర్కొంది. భర్త కొట్టేవాడు. నాలుగు వారాలుగా ఆమెకు తిండి పెట్టడం మానేశారు. కొంచెం చక్కెర నీళ్లు, నానిన బియ్యం ఆహారంగా పడేసేవారు. ఆ స్థితిలో కూడా ఆమె రెండో పిల్లాడికి పాలిచ్చేది. తుషార రోజురోజుకూ కృశించిపోయింది. మార్చి 21న ఆమె చనిపోయింది. పోలీసులు అనుమానాస్పద మరణంగా భావించారు. కాని శవాన్ని చూసి నిశ్చేష్టులయ్యారు. తుషార కేవలం 20 కిలోల బరువు ఉంది. తిండికి మాడి మాడి శరీరం బలహీన పడి ఆమె మరణించింది. కేరళలో ప్రస్తుతం ఈ కేసు గగ్గోలుగా ఉంది. జాతీయ మహిళా కమిషన్ ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. ఇంత ఘోరం జరుగుతుంటే పోలీసులు, ఇరుగుపొరుగు ఏం చేస్తున్నారన్నదానికి సమాజంలోని మానవ సంబంధాల నిమిత్తమాత్రత కారణంగా చెప్పుకోవాల్సి వస్తోంది. ఇద్దరు పిల్లల ఆ కన్నతల్లి 27 ఏళ్ల వయసుకే జీవితాన్ని ముగించింది. ఉలిక్కి పడటం, శోకించడమా ఇప్పుడు చేయవలసింది? మన ఇరుగుపొరుగులో ఏ కోడలైనా ఇలాంటి నిశ్శబ్ద హింస అనుభవిస్తూ ఉంటే మనం జోక్యం చేసుకోగలుగుతున్నామా లేదా చూసుకోవాలి. మన ఇంటికోడలు ఎంత ఆనందంగా ఉందో గమనించుకోగలగాలి. అత్తింటివారు హద్దుకు మించి ఇబ్బంది పెడుతూ ఉంటే మొదట చట్టాన్ని ఆశ్రయించగలగాలి. ఇవన్నీ ఒక స్త్రీ ఈ సమాజంలో బతకడానికి. తల్లిగా, కోడలిగా, భార్యగా బతకడానికి. నానిన బియ్యం తిని గొంతు బిగుసుకుపోయి శరీరం బలహీనపడిపోయి తుషార చేసిన ఆర్తనాదాల ఉసురు దేశాన్ని కమ్ముకోవడం మంచిది కాదు. మార్పుకు మనం కారణం కావాలి. అది మన నుంచి కూడా మొదలు కావాలి. -
మాయావతి హిజ్రా కన్నా అధ్వానం
చందౌలి(యూపీ): బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి, యూపీ మాజీ సీఎం మాయావతిపై బీజేపీ ఎమ్మెల్యే సాధనా సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా యూపీలో ఎస్పీ–బీఎస్పీ పొత్తుపై ఆమె ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ..‘అధికారం కోసం గౌరవాన్ని వదులుకున్న మాయావతి తనపై దాడిచేసిన వారితోనే చేతులు కలిపారు. ఆమె ఆడజాతికే కళంకం లాంటిది. అసలు మాయావతి ఆడో, మగో చెప్పలేం. ఆమె హిజ్రా కంటే అధ్వానమైన వ్యక్తి’ అని దుర్భాషలాడారు. దీంతో ఈ వ్యాఖ్యలను సుమోటోగా విచారణను స్వీకరిస్తున్నట్లు జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ రేఖ శర్మ తెలిపారు. సోమవారం నోటీసులు జారీచేస్తామన్నారు. మరోవైపు సాధనా సింగ్ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథావలే, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, బీఎస్పీ నేత ఎస్సీ మిశ్రా, కాంగ్రెస్ నేత ప్రియాంకా చతుర్వేది ఖండించారు. 1995లో లక్నోలోని ఓ గెస్ట్‌హౌస్‌లో బీఎస్పీ నేతలతో సమావేశమైన మాయావతిపై ఎస్పీ కార్యకర్తలు దాడి చేశారు. -
‘ఆ రిజర్వేషన్లు కేవలం వారి కోసమే’
సాక్షి, న్యూఢిల్లీ : మహిళా రిజర్వేషన్ల బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందినా అవి కేవలం రాజకీయ నాయకుల బిడ్డలకు, భార్యలకు మాత్రమే దక్కే అవకాశం ఉందని జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖా శర్మ అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో మహిళా కమిషన్ శుక్రవారం నిర్వహించిన ‘భారతదేశంలో మహిళల రాజకీయ పాత్ర, ప్రాతినిధ్యం’ అనే అంశంపై ఆమె మాట్లాడుతూ... ‘ దేశంలో మహిళలు స్వశక్తితో ఎదగాలి. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభిస్తే.. అది కేవలం రాజకీయ నాయకుల కుటుంబాలకు మాత్రమే లబ్ధి చేకూరుస్తుంది. మీ లాంటి, మా లాంటి సామాన్య మహిళకు ప్రాతినిధ్యం వహించే అవకాశం రాదు. 50 శాతం మహిళా జనాభా ఉన్నప్పుడు అంతే శాతం రాజకీయాల్లో కూడా ఉండాలి. అది మహిళల హక్కు. ప్రస్తుతం గ్రామ పంచాయతీ స్థాయిలో ఎన్నికైన మహిళలకు రాజకీయ హక్కును వారి భర్తలే హరిస్తున్నారు. పేరుకే మహిళా ప్రజా ప్రతినిధి. అధికారాలన్నీ పురుషులే చలాయిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు వస్తున్నాయో కూడా వారికి తెలియదు. వారు కేవలం సంతకాలకే పరిమితం అవుతున్నారు’ అంటూ వ్యాఖ్యానించారు. చదువుకున్న యువతులు రాజకీయంగా ఎదగడనికి ప్రయత్నించాలని సూచించారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాల్లో మహిళా బిల్లు చర్చకు రానున్న నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. పార్లమెంట్లో, అసెంబ్లీలో మహిళలకు 33 శాతం రిజరేషన్ల బిల్లు రాజ్యసభలో ఆమోదం పొంది ప్రస్తుతం లోక్‌సభలో పెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. -
'నన్ను ఉరి తీయాలంటారా?'
న్యూఢిల్లీ: మాజీ మంత్రి సందీప్ కుమార్ వీడియో టేపు వ్యవహారంపై స్పందిస్తూ ఆప్ అధికార ప్రతినిధి అశుతోష్ ఓ టీవీ చానెల్ కు రాసిన కాలమ్ వివాదాస్పదమైంది. మహిళలపై అభ్యంతరకమైన కామెంట్లు చేశారంటూ ప్రతిపక్షాలు ఈ మేరకు కేంద్ర మహిళా కమిషన్(సీడబ్ల్యూసీ)కు ఫిర్యాదు చేశాయి. ఫిర్యాదులు స్వీకరించిన సీడబ్ల్యూసీ ఆప్ నేత అశుతోష్ ను తన ముందు హజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. సీడబ్ల్యూసీ ఆదేశాలపై స్పందించిన అశుతోష్.. కాలమ్ రాస్తే తనను ఉరితీస్తారా? అని ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. భారత్ నియంతృత్వ దేశంగా మారుతోందా? అంటూ మరో ట్వీట్ చేశారు. దేశంలో చాలా మంది బడా నేతలకు చీకటి చరిత్రలు ఉన్నాయని అశుతోష్ కాలమ్ లో రాశారు. వాటి కారణంగా వారు రాజకీయం ఏనాడు నష్టపోలేదని అన్నారు. మీడియా సందీప్ విషయంలో ఎక్కువగా స్పందించిందని ఘాటుగా వ్యాఖ్యానించారు. పలు రకాల దృష్టి కోణాల కారణంగా పార్టీ సందీప్ ను తొలగించిందని ఆయన తన కాలమ్ లో పేర్కొన్నారు. అశుతోష్ విచారణకు హజరుకావాలనే ఆదేశాలపై ఎన్ డబ్ల్యూసీ చైర్మన్ లలిత కుమారమంగళం మీడియాతో మాట్లాడారు. గురువారం ఎన్ డబ్ల్యూసీ ముందు హాజరుకావాలనే ఆదేశాలను అశుతోష్ గౌరవిస్తారని భావిస్తున్నామని అన్నారు. సందీప్ కుమార్ ను సమర్ధిస్తూ ఆయన కాలమ్ లో రాసిన విషయాలు తప్పని ఒప్పుకోవాలని అన్నారు. అశుతోష్ రాసిన కాలమ్ మహిళలను కించపరిచేవిధంగా ఉందని చెప్పారు. -
వివాదంలో సల్మాన్‌ఖాన్
- షూటింగ్ తర్వాత నా పరిస్థితి రేప్‌కు గురైన మహిళలా ఉండేది: సల్మాన్ - సల్మాన్ వివాదాస్పద వ్యాఖ్యలపై అన్ని వర్గాల నుంచీ విమర్శలు ముంబై: బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్‌ఖాన్ తన వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్నాడు. సల్మాన్ నటించిన తాజా చిత్రం ‘సుల్తాన్’ త్వరలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సుల్తాన్ సినిమా షూటింగ్ తర్వాత తన పరిస్థితి అత్యాచారానికి గురైన మహిళ మాదిరిగా ఉండేదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీంతో దుమారం రేగింది. సల్మాన్ క్షమాపణలు చెప్పాలని అన్ని వైపులను నుంచి డిమాండ్లు వస్తున్నాయి. రెజ్లింగ్ నేపథ్యంగా తెరకెక్కుతున్న సుల్తాన్ సినిమా కోసం మల్లయుద్ధంలో తీవ్ర శిక్షణ తీసుకున్నాడు సల్మాన్. జూలై 6న ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో ఇటీవలవిలేకరులకు సల్మాన్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఒక సన్నివేశం షూటింగ్ పూర్తయిన తర్వాత తన పరిస్థితి ఎలా ఉందో వివరిస్తూ.. ‘ఆరు గంటల పాటు షూటింగ్ జరిగేది. ప్రత్యర్థిని ఎత్తి కిందపడేయాల్సి వచ్చేది. 120 కిలోల బరువున్న వ్యక్తిని పది సార్లు.. పది వేర్వేరు భంగిమల్లో ఎత్తాల్సి వచ్చేది. ఆ తర్వాత వారిని చాలాసార్లు కింద పడేయాల్సి వచ్చేది. నిజమైన పోరాటాల్లో ఇన్నిసార్లు చేయాల్సిన అవసరం లేదు. కానీ సినిమా కోసం ఒకేపనిని పదిసార్లు చేయాల్సి వచ్చేది. షూటింగ్ పూర్తైరింగ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నడవడం కూడా కష్టంగా ఉండేది. అప్పుడు నా పరిస్థితి అత్యాచారానికి గురైన మహిళ మాదిరిగా ఉండేది’ అన్నారు. అయితే తన వ్యాఖ్యలపై వెంటనే స్పందించిన సల్మాన్.. తాను ఇలా పోల్చి ఉండాల్సింది కాదని వెంటనే వివరణ ఇచ్చుకున్నాడు. సల్మాన్ వ్యాఖ్యలను సుమోటో కేసుగా స్వీకరించిన జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ) తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని లేఖ రాసింది. ఏడు రోజుల్లో సంతృప్తికరమైన వివరణ ఇవ్వకపోతే కమిషన్ ఎదుట హాజరు కావాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఎన్సీడబ్ల్యూ చీఫ్ లలితా కుమారమంగళం సల్మాన్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ముంబై బాంద్రాలోని సల్మాన్ నివాసం ఎదుట పలువురు మహిళా కార్యకర్తలు నిరసనకు దిగారు. సల్మాన్ ఖాన్ తండ్రి, సినీ రచయిత సలీంఖాన్ కుమారుని తరఫున క్షమాపణలు చెప్పారు.