
సాక్షి, న్యూఢిల్లీ: ‘తప్పైంది.. నన్ను క్షమించండి’ అని జాతీయ మహిళా కమిషన్‌కు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి క్షమాపణ చెప్పారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌పై చేసిన వ్యాఖ్యలపై నోటీసులు అందుకున్న కౌశిక్‌రెడ్డి.. మంగళవారం ఢిల్లీలోని జాతీయ మహిళా కమిషన్ ముందు వ్యక్తిగతంగా హాజరయ్యారు.
జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేఖాశర్మ సుమారు 40 నిమిషాల పాటు ఆయన్ను గతంలో చేసిన వ్యాఖ్యలపై విచారించారు. ఈ సందర్భంగా కమిషన్‌కు కౌశిక్‌రెడ్డి వివరణ ఇచ్చుకున్నారు. అంతేగాక ఈ అంశంలో కమిషన్‌కు క్షమాపణలు చెప్పారని.. త్వరలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు లిఖితపూర్వక క్షమాపణ చెప్తానని కౌశిక్‌రెడ్డి హామీ ఇచ్చినట్లు జాతీయ మహిళా కమిషన్ ట్వీట్ చేసింది.