BRS MLC Kaushik Reddy apologizes To Governor Tamilisai - Sakshi
Sakshi News home page

అనుచిత వ్యాఖ్యల వ్యవహారం: గవర్నర్‌ తమిళిసైకి ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి క్షమాపణ

Published Tue, Feb 21 2023 6:43 PM | Last Updated on Tue, Feb 21 2023 7:24 PM

Kaushik Reddy apologizes to Governor Tamilisai - Sakshi

సాక్షి, ఢిల్లీ: తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలకుగానూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి క్షమాపణలు తెలియజేశారు. ఈ వ్యాఖ్యలకుగానూ నోటీసులు అందుకున్న ఆయన ఇవాళ(మంగళవారం) జాతీయ మహిళా కమిషన్‌ ముందు హాజరయ్యారు. 

అయితే.. ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి గవర్నర్‌ తమిళిసైకి ఎన్‌డబ్ల్యూసీ సమక్షంలోనే లిఖిత పూర్వక క్షమాపణ చెప్పినట్లు తెలుస్తోంది. గవర్నర్‌ ఫైల్స్‌ను తన దగ్గరే పెట్టుకున్నారని, ఒక్క ఫైల్‌ను కూడా కదలనివ్వడం లేదంటూ తీవ్ర పదజాలంతో పలు వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి. అయితే.. ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించిన జాతీయ మహిళా కమిషన్‌, ఆయనకు నోటీసులు జారీ చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement