![Womens Commission Notices To CS And DGP In Amnesia Pub Case - Sakshi](/styles/webp/s3/article_images/2022/06/7/dgp.jpg.webp?itok=tgaVam0c)
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ లైంగిక దాడి ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసులో రాజకీయ నేతల కొడుకులు ఉండటంతో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ‍్యంలో లైంగిక దాడి ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్‌గా స్పందించింది. కేసులో భాగంగా మంగళవారం.. తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డిలకు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. అలాగే, సికింద్రాబాద్ లైంగిక దాడి కేసుపై కూడా జాతీయ మహిళా కమిషన్ విచారణ చేపట్టనున్నట్టు తెలిపింది.
ఇది కూడా చదవండి: రఘనందన్ రావు.. ఇన్నోవా వీడియో ఎందుకు చూపించలేదు: రేణుకా చౌదరి
Comments
Please login to add a commentAdd a comment