amnesia
-
జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో కీలక మలుపు
-
జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో కీలక మలుపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనంగా మారిన జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ గ్యాంగ్ రేప్ కేసు మరో కీలక మలుపు తిరిగింది. నలుగురు నిందితులను మేజర్లుగా పరిగణిస్తూ జువైనల్ కోర్టు తీర్పు వెలువరించింది. ఐతే.. ఎమ్మెల్యే కొడుకును మాత్రం జువైనల్‌గా పరిగణించాలని పేర్కొంది. మొత్తం ఆరుగురు నిందితుల్లో ఐదుగురు మైనర్లుగా పేర్కొంటూ కేసు నమోదు కాగా.. జువైనల్ కోర్టు తీర్పు కీలకంగా మారనుంది. ఇదీ కేసు.. జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్‌లో మే 28 ఓ బాలికను ట్రాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఆరుగురు నిందితులు. అందులో ఒకరు మేజరు కాగా.. ఐదుగురు మైనర్లుగా పోలీసులు తేల్చారు. బాలికను రోడ్డు నెంబర్ 44లో ఉన్న ఖాళీ ప్రదేశంలో గ్యాంగ్ రేప్ చేసి.. ఆ తర్వాత సాయంత్రం మళ్లీ పబ్ దగ్గర వదిలిపెట్టారు. ఈ ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత విషయం వెలుగులోకి వచ్చింది. మెడపై గాయాలను చూసి తల్లిదండ్రులకు అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించారు. మే 31న పోక్సో యాక్ట్ ప్రకారం.. జూబ్లీహిల్స్ పీఎస్‌లో కేసు నమోదు చేశారు. ఇదీ చదవండి: ప్లాన్ ప్రకారమే జూబ్లీహిల్స్ గ్యాంగ్‌రేప్ ఘటన.. మైనర్లు ఉన్నందున పేర్లు కుదరదన్న సీపీ -
చిన్న చిన్న విషయాలను కూడా మరిచిపోతున్నారా?.. కారణం ఇదే కావచ్చు..!
సాక్షి, కర్నూలు జిల్లా : అల్జీమర్స్ ఈ పేరు చాలా మందికి తెలియదు. వయస్సు పైబడిన వారిలో మతిమరుపు అంటే.. ఓ అదా అంటారు. ఈ సమస్య ఉన్న వారు ఆ రోజు జరిగే చిన్న చిన్న విషయాలు మరిచిపోతుంటారు గానీ ఎప్పుడో చిన్నప్పుడు జరిగినవి గుర్తుకు తెచ్చుకుని మరీ చెబుతుంటారు. ఇలాంటి వ్యాధితో బాధపడే వారు ఒకరుంటే ఆ కుటుంబం మొత్తం పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఒంట్లో సత్తువ క్షీణించి, జ్ఞాపకశక్తి నశించిన మనుషులను అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ అల్జీమర్స్ డే సందర్భంగా ప్రత్యేక కథనం. చదవండి: వీరి సంపాదన నెలకు రూ.90 వేలకుపైనే.. భవిష్యత్తు స్కిల్ వర్కర్లదే..! కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల మానసిక విభాగం, ఇతర ప్రైవేటు ఆసుపత్రులు, క్లినిక్‌లలో సైకియాట్రిస్ట్‌ల వద్దకు వచ్చే వారిలో ప్రస్తుతం 10 శాతానికి పైగా అల్జీమర్స్‌తో బాధపడే వారు ఉంటున్నారు. ఇలాంటి వారికి అడ్మిషన్ అవసరం ఉండదు. ఓపీలో మందులు, కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేస్తారు. అయితే డిమెన్షియాతో బాధపడే వారికి మందులతో పాటు ఒక్కోసారి అడ్మిషన్ అవసరం అవుతుంది. కొన్నిరోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స ఇచ్చాక ఇంటికి పంపిస్తారు. పెరుగుతున్న బాధితుల సంఖ్య అల్జీమర్స్ దాదాపు 60 నుంచి 80 శాతం మతిమరుపు జబ్బులకు కారణం అవుతుంది. ఇది వారి కుటుంబసభ్యులపైనా ప్రభావం చూపుతుంది. సాధారణంగా అల్జీమర్స్ 65 సంవత్సరాలు పైబడిన వారికి వస్తుంది. ఇటీవల 65 ఏళ్లలోపు వారూ దీని బారిన పడుతున్నారు. ఈ జబ్బు ఆలోచనా విధానం, ప్రవర్తనపై ప్రభావం చూపుతుంది. అల్జీమర్స్‌తో బాధపడే వారి సంఖ్యలో చైనా, అమెరికా తర్వాత మూడో స్థానంలో భారత్ ఉంది. 65 ఏళ్లు పైబడిన వారిలో 5 శాతం మందికి ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉండగా వయసుపెరిగే కొద్దీ 80 ఏళ్ల వయస్సు వారిలో 20 శాతం మందికి వచ్చేందుకు అవకాశం ఉంది. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి. అల్జీమర్స్ లక్షణాలు కళ్లద్దాలను, ఇంటి తాళాలను ఎక్కడో భద్రంగా పెట్టి మరిచిపోతారు. కుటుంబసభ్యుల పేర్లు కూడా మరిచిపోతుంటారు. మాట్లాడేటప్పుడు పదాల కోసం తడుముకుంటారు. కొద్దినిమిషాల కిందటే జరిపిన సంభాషణను కూడా మరిచిపోతుంటారు. అడిగిపవే పదేపదే అడగడం, ఎక్కువసేపు నిద్ర, మెలకువగా ఉన్నా పనులపై ఆసక్తి చూపరు. బయటకు వెళ్లిన వారు తిరిగి ఇంటికి చేరుకోవడానికి నానా తంటాలు పడతారు. అల్జీమర్స్‌కు కారణాలు ♦మతిమరుపు జబ్బు వారసత్వంగా సంక్రమించే అవకాశం ఎక్కువ. 60 ఏళ్లు పైబడిన వారిలో ఎక్కువగా వస్తుంది. ♦మెదడులో ‘అసిటైల్ కోలిన్’ అనే రసాయన ద్రవం తగ్గడం, సాధారణ ప్రొటీన్లు మెదడు కణజాలంలో చేరడం వల్ల సంక్రమిస్తుంది ♦దీర్ఘకాలంగా ఆల్కహాల్ లాంటి మత్తు పదార్థాలు తీసుకోవడం, అకారణంగా నిద్రమాత్రలు వాడడం వల్ల కూడా వస్తుంది ♦సంవత్సరాల కొద్దీ మానసిక ఒత్తిడి, సరైన పోషకాహారం తీసుకోకపోవడం, అదుపులో లేని బీపీ, షుగర్ వల్ల సమస్య తీవ్రం అయ్యే అవకాశం ఉంది. మతిమరుపులన్నీ అల్జీమర్స్ కాదు మతిమరుపు లక్షణాలు పలు రకాల ఆరోగ్య సమస్యలు, వ్యాధుల వల్ల కూడా రావచ్చు. మతిమరుపు మాత్రమే అల్జీమర్స్ కాదు. ఈ వ్యాధి ఉన్నదీ లేనిదీ నిర్ధారించుకోవడానికి వ్యాధి లక్షణాలు పరిశీలించడమే గాక కొన్ని నిర్థిష్టమైన పరీక్షలు కూడా నిర్వహిస్తాం. రోగి ఏకాగ్రత స్థాయిని, గ్రహింపు శక్తిని, జ్ఞాపక శక్తిని తెలుసుకునేందుకు పరీక్షలు నిర్వహిస్తాం. జన్యుపరమైన, వైద్యపరమైన కారణాలను కనుగొనేందుకు బ్రెయిన్ ఇమేజింగ్, రక్తపరీక్షలు వంటివి నిర్వహించాల్సి వస్తుంది. అవసరమైన పరీక్షలన్నీ నిర్వహించిన తర్వాతనే రోగికి అల్జీమర్స్ వ్యాధిపై ఒక నిర్ధారణకు వచ్చి తగిన చికిత్స అందిస్తాం. ఈ వ్యాధితో బాధపడే వారిని చిన్నచూపు చూడకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. – డాక్టర్ నిషాంత్‌రెడ్డి, న్యూరాలజిస్టు, కర్నూలు కచ్చితమైన వైద్యం లేదు అల్జీమర్స్‌కు కచ్చితమైన, పూర్తిగా నయం చేసే వైద్యం ఇంతవరకు అందుబాటులో లేదు. వ్యాధి తీవ్రతను తగ్గించేందుకు కొన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. అల్జీమర్స్‌తో బాధపడే వారితో పాటు కుటుంబసభ్యులు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇందుకు అనుగుణంగా జబ్బున పడ్డ వారిని ఎలా నియంత్రించాలో కుటుంబసభ్యులు శిక్షణ తీసుకోవాలి. మెదడును పదును పెట్టే కొన్ని రకాల వ్యాయామాలు చేయడం, మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం, సరైన పోషకాహార అలవాట్లు పాటించాలి. – డాక్టర్ కె.నాగిరెడ్డి, మానసిక వైద్య నిపుణులు, కర్నూలు -
అమ్నీషియా పబ్ కేసులో నలుగురికి బెయిల్
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ మైనర్ సామూహిక అత్యాచార కేసులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. సుమారు 48 రోజుల తర్వాత.. అమ్నీషియా పబ్ కేసులో నలుగురు మైనర్లకు బెయిల్ మంజూరు చేసింది జువైనల్ జస్టిస్ బోర్డు. జూబ్లీ హిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో నలుగురు మైనర్లకు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది జువైనల్ జస్టిస్ బోర్డు. ఇదిలా ఉంటే.. మైనర్ల బెయిల్ పిటిషన్లను రెండుసార్లు తిరస్కరించింది జువైనల్ బోర్డు. అయితే.. ఈసారి మాత్రం షరతులతో బెయిల్ మంజూరు చేసింది. ఒక్కో మైనర్‌ను రూ. 5 వేల పూచీకత్తుపై బెయిల్ ఇస్తున్నట్లు తెలిపింది. అంతేకాదు కేసులో విచారణకు సహకరించాలని, హైదరాబాద్ డీపీవో ముందు ప్రతి నెల హాజరు కావాలని జువైనల్ జస్టిస్ బోర్డు ఆదేశించింది. ఎమ్మెల్యే కొడుకు ఇంకా.. అయితే ఈ కేసులో A1గా ఉన్న సాదుద్ధీన్ మాలిక్‌కు మాత్రం బెయిల్ విషయంలో నిరాశే ఎదురైంది. ఇక ఈ కేసులో మరో మైనర్ అయిన ఎమ్మెల్యే కొడుక్కి ఇంకా బెయిల్ దొరకలేదు. మొదట జువెనైల్ బోర్డు బెయిల్‌కు నిరాకరించడంతో.. హైకోర్టులో బెయిల్ కోసం అప్పీల్ చేసుకున్నాడు. అయితే.. అది ఇంకా పెండింగ్‌లో ఉండడంతో.. ఇంకా జువైనల్ హోంలోనే ఉండాల్సి వచ్చింది. -
Amnesia Pub Incident: ఐదుగురు మైనర్లకు ముగిసిన పోలీస్ కస్టడీ
-
జూబ్లీహిల్స్ పబ్ కేసు: ఇలాంటి ఘటనలకు పబ్స్ కారణం కాదు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ మైనర్ బాలిక అత్యాచార కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే! రొమేనియాకు చెందిన బాలికను ఇంటి వద్ద డ్రాప్ చేస్తామని కారులో ఎక్కించుకుని ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులోని నిందితుల్లో ఎమ్మెల్యే కొడుకు, కార్పొరేటర్ కొడుకు, వక్ఫ్‌బోర్డు చైర్మన్ కొడుకు, మాజీ ఎమ్మెల్యే మనవడితోపాటు మరో ఇద్దరు మైనర్లు ఉన్నారు. ఇప్పటికే క్రైమ్‌సీన్ రీకన్స్ట్రక్షన్ నిర్వహించిన పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. తాజాగా ఈ ఘటనపై నటుడు సోనూసూద్ స్పందించాడు. ఇలాంటి ఘటనలకు పబ్స్ కారణమనేది తప్పని వారించాడు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా బాలికలు, మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని, మనం చూసే విధానం తప్పుగా ఉంటే చెడు ఆలోచనలు వస్తాయని పేర్కొన్నాడు. చదవండి: పెళ్లి చేసుకున్నాం, కానీ మా లైఫ్‌లో పెద్ద ఛేంజ్ ఏం లేదు మైనర్లతో సీన్ రీకన్స్ట్రక్షన్ -
జూబ్లీహిల్స్ పబ్ కేసు: సాదుద్దీన్ కస్టడీ విచారణలో సంచలన విషయాలు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ కేసులో ప్రధాన నిందితుడు సాదుద్దీన్ పోలీస్ కస్టడీ రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఈ కేసులో శాస్త్రీపురం కార్పొరేటర్ కుమారుడు అసలు సూత్రధారి అని సాదుద్దీన్ పోలీసులకు వివరించాడు. కార్పొరేటర్ కుమారుడు, ఎమ్మెల్యే కొడుకు పబ్‌లోకి ఎంటర్ కాగానే అమ్మాయిలను వెతకడం ప్రారంభించారని, పబ్‌లోనూ మైనర్ అమ్మాయిలను వేధించినట్లు పేర్కొన్నాడు. ‘పబ్ నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యే కొడుకు, కార్పొరేటర్ కొడుకు మైనర్ వెంట పడ్డారు. నేను వారిని వద్దని వారించాను. దీంతో నన్ను బెంజ్ కారులో ఎక్కొద్దని ఎమ్మెల్యే కొడుకు ఆదేశించాడు. నన్ను పబ్ దగ్గర వదిలి అమ్మాయిని బెంజ్ కారులో ఎక్కించుకున్నాడు. నేను బెంజ్ కారులో కాకుండా ఇన్నోవాలో బేకరికి వెళ్లాను. బెంజ్ కారులోకి ఎక్కగానే మైనర్ అమ్మాయిని ఏమ్మెల్యే కుమారుడు వేధించడం ప్రారంభించాడు. మార్గ మధ్యలో ఇద్దరు, మరొక ముగ్గురు పెద్దమ్మతల్లి ఆలయం పక్కన ఖాళీ స్థలంలో అఘాయిత్యానికి ఒడిగట్టారు. నా ఫ్రెండ్స్ బలవంతం కారణంగానే నేనూ ఈ అత్యాచారం చేయాల్సి వచ్చింది. వారి ప్రోద్బలంతోనే ఇదంతా జరిగింది’ అని సాదుద్దీన్ పోలీసుల ముందు తెలిపాడు. సంబంధిత వార్త: జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ కేసు: అత్యాచార ఉద్ధేశంతోనే పబ్‌కు అయితే అత్యాచారంలో ఎవరి పాత్ర ఎంత ఉందనేది పోలీసులు తేల్చారు. శాస్త్రీపురం కార్పొరేటర్ కుమారుడు ఈ కేసులో అత్యంత కీలక సూత్రధారి అని అతని తరువాత సాదుద్దీన్, వక్ఫ్‌బోర్డ్ చైర్మన్ కొడుకు, ఎంఐఎం ఎమ్మెల్యే సోదరి కొడుకు, సంగారెడ్డి కార్పొరేటర్ కొడుకు, ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు ఉన్నట్లు తెలిపారు నిందితుల మధ్య ఘర్షణ మరోవైపు జూబ్లీహిల్స్ పబ్ కేసులోని నిందితుల మధ్య ఘర్షణ జరిగింది. జువైనల్ హోంలో ఉన్న ఐదుగురు మైనర్లు ప్లేట్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. శాస్త్రిపురం కార్పొరేటర్ కుమారుడు సాదుద్దీన్ టార్గెట్‌గా ఈ దాడి జరిగింది. నీ వల్లే విషయం బయటకు వచ్చిందని సాదుద్దీన్‌పై మిగతా నిందితులు దాడి చేశారు. చివరికి పోలీసులు జోక్యం చేసుకోవడంతో ఈ వివాదం సద్దుమణిగింది. సాదుద్దీన్కు రిమాండ్ అమ్నీషియా పబ్ అత్యాచార కేసులో ప్రధాన నిందితుడు సాదుద్దీన్ మాలిక్‌కు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో నాంపల్లి కోర్టు నుంచి చంచల్‌గూడ జైలుకు సాదుద్దీన్‌ను తరలించారు. -
జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ కేసు: అత్యాచార ఉద్ధేశంతోనే పబ్‌కు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ మైనర్ బాలిక అత్యాచార కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. కేసులో తవ్వేకొద్దీ అనేక వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఈ కేసులో సంచలన విషయాలు బయటకొచ్చాయి. నిందితులు పబ్‌లోకి ఎంటర్ అయ్యే ముందే ఇన్నోవా, బెంజ్ కారులో పోలీసులు కండోమ్ ప్యాకెట్లను తీసుకొచ్చినట్లు పోలీసులు గుర్తించారు. కండోమ్ ప్యాకెట్లు తెచ్చినట్లు నిందితులు పోలీసుల ఎదుట ఒప్పుకున్నారు. రేప్ ఇంటెన్షన్‌తోనే పబ్‌కు వచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడు సాదుద్దీన్ కస్టడీ ముగిసింది. కాసేపట్లో అతన్ని నాంపల్లి కోర్టులో హాజరుపర్చనున్నారు. అత్యాచార కేసులో మైనర్లతోపాటు సాదుద్దీన్ మాలిక్‌ను జూబ్లీహిల్స్ పోలీసులు విచారించారు. ఈ కేసులో కస్టడీకి తీసుకున్న ఎమ్మెల్యే కుమారుడు, వక్ఫ్‌బోర్డ్ చైర్మన్ కుమారుడు, పొరుగు జిల్లా కార్పొరేటర్ కుమారుడు సహా ఐదుగురు మైనర్లతో పోలీసులు ఆదివారం క్రైమ్‌సీన్ రీకన్స్ట్రక్షన్ నిర్వహించారు. ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు.. పబ్, కాన్సూ బేకరీ, రోడ్ నంబర్ 44లోని పవర్‌స్టేషన్, తిరిగి పబ్ మధ్య వారిని తిప్పుతూ ప్రశ్నించారు. ఘటన జరిగిన రోజు పబ్ నుంచి ఎవరెవరు, ఏ కారులో వెళ్లారు? ఆ రోజు బాధిత బాలిక ఏ కారులో కూర్చుంది? తిరిగి వచ్చే క్రమంలో ఎలా వచ్చారు? ఏయే ప్రాంతాల్లో ఆమెపై అత్యాచారం చేశారన్న వివరాలను సేకరించి రికార్డు చేశారు. సంబంధిత వార్త: జూబ్లీహిల్స్ గ్యాంగ్‌రేప్ కేసులో దర్యాప్తు ముమ్మరం అయితే సోమవారం మరోసారి అయిదుగురు మైనర్లను పోలీసులు కస్టడీకి తీసుకోనున్నారు. జువైనల్ హోమ్ నుంచి జూబ్లీహిల్స్ పీఎస్‌కు తరలించనున్నారు. సాదుద్దీన్ మాలిక్ రెచ్చగొట్టడం వల్లే తాము బాలికపై అత్యాచారం చేశామంటూ మైనర్లు పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే ముందుగా ఎమ్మెల్యే కుమారుడే బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని సాదుద్దీన్ పోలీసులకు తెలిపాడు. -
మైనర్లతో సీన్ రీకన్స్ట్రక్షన్
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: జూబ్లీహిల్స్‌లో రొమేనియా బాలికపై సామూహిక అత్యాచారం కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో కస్టడీకి తీసుకున్న ఎమ్మెల్యే కుమారుడు, వక్ఫ్‌బోర్డ్ చైర్మన్ కుమారుడు, పొరుగు జిల్లా కార్పొరేటర్ కుమారుడు సహా ఐదుగురు మైనర్లతో పోలీసులు ఆదివారం క్రైమ్‌సీన్ రీకన్స్ట్రక్షన్ నిర్వహించారు. ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు.. పబ్, కాన్సూ బేకరీ, రోడ్ నంబర్ 44లోని పవర్‌స్టేషన్, తిరిగి పబ్ మధ్య వారిని తిప్పుతూ ప్రశ్నించారు. ఘటన జరిగిన రోజు పబ్ నుంచి ఎవరెవరు, ఏ కారులో వెళ్లారు? ఆ రోజు బాధిత బాలిక ఏ కారులో కూర్చుంది? తిరిగి వచ్చే క్రమంలో ఎలా వచ్చారు? ఏయే ప్రాంతాల్లో ఆమెపై అత్యాచారం చేశారన్న వివరాలను సేకరించి రికార్డు చేశారు. అనంతరం మైనర్లను జువెనైల్ హోమ్‌కు తరలించారు. సోమవారం ఉదయం వీరిని ఠాణాకు తీసుకువచ్చి మళ్లీ విచారించనున్నారు. ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడు సాదుద్దీన్ మాలిక్‌తో ఇప్పటికే క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ పూర్తి చేశారు. సాదుద్దీన్ కస్టడీ గడువు ముగియడంతో సోమవారం కోర్టులో హాజరుపర్చనున్నారు. సాదుద్దీన్ చెప్పిన వివరాలు, మైనర్లు చెప్పిన వివరాలను పోల్చి చూడనున్నారు. రెండుసార్లు ‘గుర్తింపు’ పరేడ్ సామూహిక అత్యాచారం కేసులో ప్రధాన నిందితు డు సాదుద్దీన్, మిగతా ఐదుగురిని బాలిక గుర్తించి కన్ఫర్మ్ చేయాల్సిన ‘టెస్ట్ ఐడెంటిఫికేషన్ పరేడ్ (టీఐపీ)’ విషయంలో చిత్రమైన పరిస్థితి నెలకొంది. బాలికతో రెండు సార్లు, వేర్వేరు ప్రాంతాల్లో టీఐపీ చేయించడం అనివార్యంగా మారింది. రెండు వేర్వేరు కోర్టుల్లో కేసు విచారణ జరుగుతుండటం.. సాదుద్దీన్ చంచల్‌గూడ జైల్లో, మైనర్లు జువెనైల్ హోంలో ఉండటమే దీనికి కారణమని పోలీసులు చెప్తున్నారు. మేజర్ అయిన సాదుద్దీన్కు సంబంధించి నాంపల్లిలోని పోక్సో ప్రత్యేక కోర్టులో, మైనర్లకు సంబంధించి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ సమీపంలోని జువెనైల్ జస్టిస్ కోర్టులో సోమవారం టీఐపీ పిటిషన్లను దాఖలు చేయనున్నారు. టీఐపీ’ చేసేదిలా.. గ్యాంగ్ రేప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి శిక్ష పడాలంటే.. సాక్షులతో ‘టీఐపీ’ నిర్వహణ చాలా కీలకం. డిజిగ్నేటెడ్ న్యాయమూర్తి సమక్షంలో ఈ ప్రక్రియ జరుగుతుంది. నిందితులను పోలిన వయసు, శారీరక లక్షణాలున్న వారిని దాదాపు ఆరు నుంచి పది మందిని ఎంపిక చేస్తారు. వారి మధ్యలో నిందితులను ఉంచి.. బాధితులు, సాక్షులను పిలిచి గుర్తించాలని కోరుతారు. నిందితుల స్థానాన్ని రెండు, మూడు సార్లు మార్చి మళ్లీ గుర్తించాలని కోరుతారు. పరేడ్‌లో పాల్గొనే బాధితులు/సాక్షులకు ముసుగు వేయడం లేదా ప్రత్యేకమైన అద్దం వెనుక ఉంచడం ద్వారా.. వారిని నిందితులు గుర్తించకుండా జాగ్రత్త పడతారు. తాజా కేసులో.. అమ్నీషి యా పబ్, కాన్సూ బేకరీ, ఇతర ప్రాంతాల్లో నిందితులను చూసిన వారితో (సాక్షులతో) కూడా టీఐపీ నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని జైళ్లలో కేవలం శనివారం మాత్రమే టీఐడీ పరేడ్లు జరుగుతున్నాయి. దీనికి ఏర్పాటు చేయాల్సిందిగా ముందుగా జైలు అధికారులకు లేఖ రాయాల్సి ఉంటుంది. వీలును బట్టి జువెనైల్ హోమ్‌లోనూ టీఐపీ పరేడ్ నిర్వహించనున్నారు. -
జూబ్లీ హిల్స్ కేసులో కీలక వీడియో లభ్యం..!!
-
Jubilee Hills Pub Case: జూబ్లీ హిల్స్ కేసు సీన్ ను రీ-కన్ స్ట్రక్షన్ చేస్తున్న పోలీసులు
-
జూబ్లీహిల్స్ గ్యాంగ్‌రేప్ ఘటన: బాధితురాలిని ట్రాప్ చేసింది ఎవరంటే..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ మైనర్ సామూహిక అత్యాచార ఘటనలో.. పోను పోను సంచలనాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా మాజీ ఎమ్మెల్యే మనవడు, పాతబస్తీ ఎమ్మెల్యే కుమారుడి అరెస్ట్ రిమాండ్‌లో మరిన్ని విషయాలు వెలుగు చూశాయి. కార్పొరేటర్ కుమారుడే బాధితురాలిని ట్రాప్ చేశాడన్న నిందితులు వెల్లడించారు. పబ్‌లో బాధితురాలితో, కార్పొరేటర్ కుమారుడు అనుచిత ప్రవర్తించాడు. మళ్లీ పబ్ బయటకు వచ్చాక కార్పొరేటర్ కొడుకే మాయమాటలు చెప్పి ట్రాప్ చేశాడు. ఆపై ఆమెను కారులో ఎక్కించాడని నిందితులు వెల్లడించారు. ‘‘బెంజ్ కారులో మొదట ఎమ్మెల్యే కుమారుడు.. బాధితురాలిపట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. అతని తర్వాత.. కార్పొరేటర్ కొడుకు అసభ్యంగా వ్యవహరించాడు. కాన్సూ బేకరీ దగ్గరికి వెళ్లేసరికి ముందు సీట్లో నుంచి సాదుద్దీన్ వెనక సీట్లోకి మారాడు. ఆమెపై సాదుద్దీన్ లైంగిక దాడి చేశాడు. కాన్సూ బేకరీ దగ్గర బాధితురాలిని కార్లోనే కూర్చోబెట్టాం. బేకరీలో అందరూ ఫుడ్‌తిని, సిగరెట్లు తాగాం. అక్కడి నుంచి అంతా కలిసి ఇన్నోవా కారులో పబ్‌కి బయల్దేరాం. ఆమె సెల్‌ఫోన్, కళ్లద్దాలను బలవంతంగా లాక్కున్నాం. అవి కావాలంటే ఇన్నోవా ఎక్కాలని బెదిరించాం. కారులో ఒకరి తర్వాత ఒకరం లైంగిక దాడి చేశాం’’ అని నిందితులు నేరాన్ని అంగీకరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కేసులో విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. అమ్నీషియా పబ్ రేప్ కేసులో జువనైల్స్‌ని కస్టడీకి అనుమతించింది కోర్టు. దీంతో రేపటి నుంచి నాలుగు రోజులపాటు పోలీస్ కస్టడీకి అనుమతి దొరికినట్లయ్యింది. ఇప్పటికే ఈ కేసులో ఏ-1గా ఉన్న సాదుద్దీన్ మాలిక్‌ను విచారిస్తున్నారు. ఐదుగురిని కలిసి రేపటి నుంచి విచారించనున్నారు. చదవండి: బాధితురాలి రెండో స్టేట్మెంట్లో సంచలన విషయాలు -
జూబ్లీహిల్స్ పబ్ కేసు: ఆరుగురిలో ఐదుగురు మైనర్లే!
-
జూబ్లీహిల్స్ గ్యాంగ్‌రేప్ ఘటన.. కీలక వివరాలు వెల్లడించిన సీపీ
సాక్షి, హైదరాబాద్: సంచలన సృష్టించిన జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ సామూహిక అత్యాచార కేసులో ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు నగర సీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం ప్రెస్ మీట్ నిర్వహించిన నగర కమిషనర్.. ఈ కేసులో నిందితులు మైనర్లు కాబట్టి పేర్లు, ఇతర వివరాలు వెల్లడించడం కుదరని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ కేసును లోతుగా దర్యాప్తు చేశాం. ఆరుగురిలో ఒకరు మేజర్, ఐదుగురు మైనర్లు. కేసులో మైనర్లు ఉన్నందున పేర్లు చెప్పడం లేదు. మార్చి 28న ఈ వ్యవహారం మొదలైంది. బెంగళూరులో ఉండే ఒక స్టూడెంట్.. స్కూల్ మొదలుకాక ముందు పార్టీ చేసుకోవాలని హైదరాబాద్‌లో స్నేహితులతో ప్లాన్ చేశాడు. అందుకోసం అమ్నీషియా పబ్‌ను ఎంచుకుని.. ఏప్రిల్‌లో పార్టీ గురించి పోస్ట్ చేశాడు. నాన్ ఆల్కాహాలిక్, స్మోకింగ్ పార్టీ కోసం అప్లై చేసుకున్నారు. ఉస్మాన్ అలీఖాన్ అనే వ్యక్తి ద్వారా పబ్‌ను బుక్ చేయించారు. మే 28వ తేదీన పార్టీ గురించి సదరు స్టూడెంట్ మళ్లీ పోస్ట్ చేశాడు. మే 28వ తేదీన మధ్యాహ్నాం బాధితురాలు పబ్‌కు వెళ్లింది. నిందితులు.. పబ్‌లో ముందుగానే పథకం వేసుకున్నారు. ఆమె ఫాలో చేసి ట్రాప్ చేశారు. అదే రోజు సాయంత్రం రోడ్డు నెంబర్ 44లో ఉన్న ఖాళీ ప్రదేశంలో సామూహిక అత్యాచారం జరిగింది. ఒకరి తర్వాత ఒకరు అఘాయిత్యానికి పాల్పడ్డారు. సాయంత్రం మళ్లీ పబ్ దగ్గర బాధితురాలిని వదిలిపెట్టారు. ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత విషయం వెలుగులోకి వచ్చింది. మెడపై గాయాలను చూసి తల్లిదండ్రులకు అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించారు. మే 31న పోక్సో యాక్ట్ ప్రకారం.. జూబ్లీహిల్స్ పీఎస్‌లో కేసు నమోదు చేశారు. భరోసా సెంటర్లో కౌన్సెలింగ్ తర్వాత బాధితురాలు వివరాలు చెప్పింది. ఆ తర్వాత మరికొన్ని సెక్షన్లు నమోదు చేశాం. పబ్, బేకరి వద్ద అన్ని సీసీ ఫుటేజీలను పరిశీలించాం. ఏ1 సాదుద్దీన్‌తో పాటు మైనర్ నిందితులు, బాధితురాలు వాహనంలో వెళ్లారు. మైనర్‌తో పాటు సాదుద్దీన్ బాధితురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. నిందితులను బాధితురాలు గుర్తించలేకపోయింది. ఆధారాలతో సహా జూన్ 2వ తేదీన నిందితులను గుర్తించాం. జూన్ 3న సాదుద్దీన్‌ను అరెస్ట్ చేశాం. ఏ1 సాదుద్దీన్‌తో పాటు మిగతా వాళ్లపై కేసు నమోదు అయ్యింది. సాదుద్దీన్‌తో పాటు నలుగురిని అరెస్ట్‌చేశాం. మరొకరి కోసం స్పెషల్ టీమ్ ఏర్పాటు చేశాం. దర్యాప్తు చాలా పారదర్శకంగానే జరిగిందని.. పలు కోణాల్లో దర్యాప్తు చేయడం వల్లే ఆలస్యమైందని చెప్పారు. ఇలాంటి కేసుల్లో శిక్షలూ కఠినంగానే ఉంటాయని సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా.. పబ్‌ల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని కమిషనర్ స్పష్టం చేశారు. -
అమ్నీషియా పబ్ కేసు: సీఎస్, డీజీపీకి మహిళా కమిషన్ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ లైంగిక దాడి ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసులో రాజకీయ నేతల కొడుకులు ఉండటంతో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో లైంగిక దాడి ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్‌గా స్పందించింది. కేసులో భాగంగా మంగళవారం.. తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డిలకు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. అలాగే, సికింద్రాబాద్ లైంగిక దాడి కేసుపై కూడా జాతీయ మహిళా కమిషన్ విచారణ చేపట్టనున్నట్టు తెలిపింది. ఇది కూడా చదవండి: రఘనందన్ రావు.. ఇన్నోవా వీడియో ఎందుకు చూపించలేదు: రేణుకా చౌదరి -
జూబ్లీహిల్స్ అత్యాచారం కేసు రిమాండ్ రిపోర్ట్‌లో సంచలనాలు
-
ఆమ్నీషియా పబ్ కేసు.. మరో మైనర్తోనూ అసభ్యంగా..!
సాక్షి, హైదరాబాద్/ బంజారాహిల్స్: రొమేనియా బాలికపై జరిగిన ఘాతుకం కేసుకు సంబంధించి మరో కోణంలోనూ పోలీసుల నిర్లక్ష్యం బయటపడింది. ఈ నేరానికి పాల్పడిన నిందితులు ఆమ్నేషియా పబ్‌లో మరో బాలికతోనూ అసభ్యంగా ప్రవర్తించారు. ఈ అంశం రొమేనియా బాలిక వాంగ్మూలంతో వెలుగులోకి వచి్చనా ఇప్పటివరకు తదుపరి చర్యలు తీసుకోలేదు. అలా చేస్తే నిందితులపై మరో కేసు నమోదవుతుందనే ఒత్తిళ్ల నేపథ్యంలోనే పోలీసులు మిన్నకుండిపోయారని తెలుస్తోంది. మరోపక్క ‘కారులో బాలిక’ వీడియోలను వైరల్ చేసిన మూడు యూట్యూబ్ చానళ్లపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసులు నమోదు చేశారు. వీటిని మీడియాకు విడుదల చేసిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావుపై చర్యలు తీసుకునే అంశంలోనూ పోలీసులపై రాజకీయ ఒత్తిళ్లు ఉన్నట్లు సమాచారం. అది కాలేజీ పార్టీ కాదు ... ఆమ్నేíÙయా పబ్‌లో గత నెల 28న జరిగింది ఓ కార్పొరేట్ స్కూల్‌కు సంబంధించిన ఫేర్వెల్ పార్టీ అని ఇప్పటివరకు భావించారు. పబ్ సిబ్బందిని క్షుణ్ణంగా విచారించిన పోలీసులు అది ఓ ప్రైవేట్ పార్టీగా తేల్చారు. నగరానికి చెందిన హాదీ, సుల్తాన్ తదితరులు వేసవి సెలవులు ముగుస్తున్న నేపథ్యంలో పార్టీ ఏర్పాటుకు నిర్ణయించారు. హాదీ రొమేనియా బాలికను పార్టీకి హాదీ తీసుకువెళ్లాడు. మధ్యాహ్నం 1.30 గంటలకు వీళ్లు వెళ్లగా... 3.15 గంటలకు నిందితులు వచ్చారు. పబ్‌లోనే ఈమెకు మరో బాలికతో పరిచయమైంది. వీరిద్దరూ మాట్లాడుకుంటున్న సమయంలో సమీపించిన సాదుద్దీన్, ఉమేర్లతో పాటు మిగిలిన నిందితులు అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో విసుగు చెందిన బాలికలు ఇద్దరూ పార్టీ ముగియడానికి ముందే పబ్ నుంచి బయటకు వచ్చేశారు. మరో బాలిక క్యాబ్‌లో వెళ్లిపోగా.. హాదీ కోసం ఎదురుచూస్తూ రొమేనియా బాలిక బయటే ఆగింది. ఈ సమయంలో బయటకు వచి్చన ఎమ్మెల్యే కుమారుడు, నిందితులు ఆకర్షణీయమైన మాటలు చెప్పి ఆమెను లోబరుచుకున్నారు. ఈ వ్యవహారంలో సదరు కార్పొరేటర్ కుమారుడు కీలకంగా వ్యవహరించాడు. కాగా కారులోనూ బాలికతో అసభ్యంగా ప్రవర్తిస్తూ కాన్సూ బేకరీ వద్దకు తీసుకువచ్చారు. అక్కడ నుంచి వెళ్లిపోవడానికి బాలిక సిద్ధమవగా.. ఇంటి వద్ద దింపుతామన్న నిందితులు, బెంజ్ కారులో పెట్రోల్ అయిపోయిందని చెప్పి ఇన్నోవాలో ఎక్కించుకుని అఘాయిత్యానికి పాల్పడ్డారు. అయితే ఎమ్మెల్యే కుమారుడు బేకరీ వద్ద నుంచే వెళ్లిపోయాడు. బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన తర్వాత నిందితులు బేకరీకి వచ్చారు. తాము ఎంజాయ్ చేశామని గ్రూప్ ఫోటో దిగి ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్టు చేశారు. అక్కడ నుంచి ఎవరి ఇళ్లకు వెళ్లిపోయారు. ఈ వివరాలు రొమేనియా బాలిక, నిందితుల వాంగ్మూలాల్లో బయటకు వచ్చాయి. పోక్సో చట్టం కింద కేసు నమోదుకు అవకాశం చిన్నారులపై జరిగే లైంగిక దాడులు నిరోధించడానికి ఉద్దేశించిన పోక్సో చట్ట ప్రకారం ఏదైనా నేరం జరిగిందని తెలిసీ ఫిర్యాదు చేయకపోవడం, తదుపరి చర్యలు తీసుకోకపోవడం సైతం నేరమే. అలాగే పబ్‌లో మరో బాలిక పట్ల సాదుద్దీన్, ఉమేర్ తదితరులు అసభ్యంగా ప్రవర్తించడమూ నేరమే అవుతుంది. దీనికి సంబంధించి ఆ బాలిక లేదా ఆమె సంబం«దీకుల నుంచి వాంగ్మూలం నమోదు చేసి పోక్సో చట్టం కింద మరో కేసు రిజిస్టర్ చేయడానికి ఆస్కారం ఉంది. కానీ నగర పోలీసులు మరో బాలికను గుర్తించి, వాంగ్మూలం నమోదు చేయడం దిశగా చర్యలు తీసుకోలేదు. ఆమెపై జరిగిన అసభ్య ప్రవర్తన విషయం తెలిసినప్పటికీ మిన్నకుండిపోయారు. సోమవారం పోలీసులు పబ్‌లోని సీసీ కెమెరాలను పరిశీలించినప్పుడూ ఈ దృశ్యం వారికి స్పష్టంగా కనిపించింది. నిందితుల రిమాండ్ రిపోర్టులోనూ ఈ అంశాలను పోలీసులు చేర్చారు. ఎమ్మెల్యే కుమారుడికి చెక్ పెట్టేందుకే వీడియో? ఈ ఉదంతానికి సంబంధించి బయటకువచి్చన వీడియోల చిత్రీకరణ వెనుక మరో కోణం ఉన్నట్లు నిందితుల విచారణ సందర్భంగా పోలీసులు గుర్తించారు. ఎమ్మెల్యే కుమారుడు, ఈ కేసులో నిందితులు స్నేహితులే అయినప్పటికీ వారి మధ్య కొన్ని స్పర్ధలు ఉన్నాయి. ఎమ్మెల్యే కుమారుడు వీరిపై ఆధిపత్యం చెలాయిస్తుండేవాడని సమాచారం. దీంతో అతడికి చెక్ పెట్టడానికి అవకాశం కోసం మిగిలిన వాళ్లు ఎదురు చూశారు. బెంజ్ కారులో ప్రయాణిస్తున్న సమయంలో వెనుక సీట్లో కూర్చున్న ఎమ్మెల్యే కుమారుడు బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఇది చూసిన ఉమేర్ తన ఫోన్‌ను ముందు సీట్లో కూర్చున్న వ్యక్తికి ఇచ్చి రికార్డు చేయించాడు. దీని ఆధారంగా ఎమ్మెల్యే కుమారుడిని బెదిరించాలని వాళ్లు భావించారు. అయితే దారుణం బయటకు వచ్చి కేసు నమోదు కావడం, పోలీసుల గాలింపు నేపథ్యంలో వీడియోలను మరో రకంగా వాడుకున్నారు. ఆ ఉదంతంలో తమ తప్పు లేదని, బాలిక సమ్మతితోనే అంతా జరిగిందని చెప్పడానికి ఎంపిక చేసుకున్న వారికి ఓ నిందితుడి తండ్రి లీక్ చేశాడు. ఇలా చేసిన వ్యక్తితో పాటు నిందితులకు ఫామ్‌హౌస్‌లో ఆశ్రయం ఇచి్చన వారికీ నోటీసులు జారీ చేయాలని పోలీసులు భావిస్తున్నారు. ఎమ్మెల్యేపై కేసు వద్దంటూ ఒత్తిళ్లు... సంబంధించిన కారులోని వీడియోలు వైరల్ చేస్తున్న యూట్యూబ్ చానళ్లు, సోషల్ మీడియాపై చర్యలకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నిర్ణయించారు. ఇప్పటికే యూట్యూబ్‌ను పరిశీలించిన అధికారులు ఈ వీడియోలు పోస్టు చేసిన మూడు యూట్యూబ్ చానళ్లను గుర్తించారు. ఆదివారం వాటిపై సుమోటో కేసులు నమోదు చేసిన అధికారులు ఓ చానల్ రిపోర్టర్‌కు సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేశారు. అయితే బెంజ్ కారులో బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఎమ్మెల్యే కుమారుడిపైనా, ‘కారులో బాలిక’వీడియోలను మీడియాకు విడుదల చేసిన ఎమ్మెల్యే రఘునందన్‌రావుపైనా కేసు నమోదు చేసే విషయంలో పోలీసులపై రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయి. చట్ట ప్రకారం ఈయనపై కేసు నమోదు చేసే అవకాశం ఉందని పోలీసులు స్పష్టం చేస్తున్నాయి. అయితే అలా చేస్తే అది రాజకీయ ఇబ్బందులకు కారణమవుతుందంటూ పోలీసులపై ఒత్తిడి వస్తున్నట్లు తెలిసింది. న్యాయస్థానంలో బాలిక వాంగ్మూలం జూబ్లీహిల్స్ పోలీసులు రొమేనియా బాలికను సోమవారం న్యాయస్థానానికి తీసుకువెళ్లి మేజి్రస్టేట్ ఎదుట హాజరుపరిచారు. ఆయన సమక్షంలో బాధితురాలి నుంచి మరోసారి వాంగ్మూలం సేకరించారు. దీని ఆధారంగా ఎమ్మెల్యే కుమారుడిని ఆరో నిందితుడిగా చేర్చాలని ఎట్టకేలకు పోలీసులు నిర్ణయించారు. మరోపక్క ఫోరెన్సిక్ నిపుణులు సోమవారం మరోసారి బెంజ్, ఇన్నోవా కార్లను తనిఖీ చేసి పలు నమూనాలు సేకరించారు. -
అమ్నీషియా పబ్ కేసు: సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ!
సాక్షి, హైదరాబాద్: అమ్నీషియా పబ్ అత్యాచార ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌కు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ బహిరంగ లేఖ రాశారు. అత్యాచార ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారాయన. ఈ ఘటనపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు బాధాకరంగా ఉందని, నాలుగు రోజులు గడుస్తున్నా పోలీస్ శాఖ పనితీరు అనుమానాకు తావిస్తోందని లేఖలో ఆయన ఆరోపించారు. ఘటనలో కేసీఆర్ రాజకీయ మిత్రుల వారసుల పేర్లు ప్రముఖంగా మీడియాలో, సోషల్ మీడియాలో వినిస్తున్నాయని తెలిపారు. అనుమానాలు నివృత్తి చేసి.. సంఘటనపై స్పష్టత ఇప్పించాలని తెలంగాణ బీజేపీ తరపున కోరుతున్నట్లు లేఖలో బండి సంజయ్ పేర్కొన్నారు. హైదరాబాద్ లో మైనర్ బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం ఘటనపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావుకు బహిరంగ లేఖ.@TelanganaCMO pic.twitter.com/uwr4ivDW5c — Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) June 4, 2022 చదవండి: అమ్నీషియా పబ్ కేసు: సంచలన ఫొటోలు, వీడియోలు బయటకు.. -
అమ్నీషియా పబ్ కేసు: కారులో ఉంది ఎమ్మెల్యే కొడుకే!
-
అమ్నీషియా పబ్ కేసు: బెంజ్‌కారులో అత్యాచారం.. ఇన్నోవా కారులోని వారి అరెస్టా?
సాక్షి, హైదరాబాద్: రొమేనియా బాలికపై అత్యాచారం ఘటనలో ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడు కూడా ఉన్నాడని.. కానీ పోలీసులు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఆరోపించారు. బెంజ్ కారులో అత్యాచారం జరిగితే.. ఇన్నోవాలో ఉన్న వారిని అరెస్ట్ చేసి కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. బెంజ్ కారులో ఉన్న వారినెవరినీ ముద్దాయిలుగా చూపకపోవడం బాధాకరమన్నారు. అత్యాచార ఘటనకు సంబంధించి తాము సేకరించిన ఫొటోలు, వీడియోలను శనివారం బీజేపీ కార్యాలయంలో మీడియాకు విడుదల చేశారు. ఎరుపు రంగు బెంజ్ కారులో బాధితురాలిపై ఎమ్మెల్యే కుమారుడు, ఇతరులు లైంగిక దాడి చేశారని నిరూపించడానికి ఈ ఆధారాలు ఉపయోగపడతాయన్నారు. క్లీన్చిట్ ఎలా ఇస్తారు? అత్యాచార ఘటనతో సంబంధమున్న వారి ని ఇతర రాష్ట్రాలు, దేశాలకు పంపించినట్టు.. కొందరిని దుబాయ్ విమానం ఎక్కించినట్టు తనకు సమాచారం ఉందని రఘునందన్‌రావు తెలిపారు. ఈ కేసు చల్లబడ గానే వారిని తిరిగి హైదరాబాద్‌కు రప్పించుకునే ప్లాన్‌లో ఉన్నారని.. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి దోషులపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. పోలీసు అధికారులు విచారణ జరపకుండానే ఘటనలో ఎమ్మెల్యే కొడుకు లేడని, హోంమంత్రి మనవడి ప్రమేయం లేదని క్లీన్చిట్ ఎలా ఇస్తా రని నిలదీశారు. పబ్‌లో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న, అత్యాచార ఘటనలో పాల్గొనవారి ఫొటోలు, వీడియోలు తమ వద్ద ఉన్నాయని.. హైకోర్టుకు సమర్పించి.. సీబీఐ విచారణ కోరుతామన్నారు. పోలీసులకు ఆధారాలు ఇచ్చేందుకు తాను సిద్ధమేనని.. కానీ పోలీసులు వాటిని ధ్వంసం చేసి అంతా ఉత్తుత్తివేనంటే పరిస్థితి ఏమిటనే అనుమానం ఉందన్నారు. ఎంఐఎం వారిని కాపాడేందుకు.. అత్యాచార ఘటనలో ఎంఐఎం వారిని కాపాడేందుకు టీఆర్ఎస్ వారిని బలిపశువులను చేస్తున్న విషయాన్ని కేటీఆర్ గ్రహించడం లేదని రఘునందన్ అన్నారు. హైదరాబాద్‌లో పోలీసు వ్యవస్థ మొత్తాన్ని ఎంఐఎం నేతలే నడిపిస్తున్నారని.. ఈ కేసులో వాళ్లు చెప్పినట్టే ఎఫ్ఐఆర్లలో పేర్లు, విచారణ జరుగుతోందన్నారు. దోషులకు శిక్షపడే దాకా పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలి.. ఈ ఘటనపై సీబీఐతోగానీ, హైకోర్టు సిట్టింగ్ జడ్జి నేతృత్వంలోగానీ విచారణ చేపట్టాలని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణను రఘు నందన్‌రావు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ పోలీసులను ఎంఐఎం నేతలు కీలుబొమ్మలుగా చేసి ఆడిస్తున్నారని.. అందుకే సీబీఐ, హైకోర్టు జడ్జితో విచారణ చేయించాలని కోరుతున్నట్టు తెలిపారు. -
శృంగారంలో పాల్గొన్న కాసేపటికే గజనీలా మారిపోయాడు!
లైమ్‌రిక్ (ఐర్లాండ్): ఐర్లాండ్‌కు చెందిన ఓ వ్యక్తి భార్యతో శృంగారంలో పాల్గొన్న కాసేపటికే గజనీగా మారిపోయాడు. ఒకట్రెండు రోజులుగా జరిగినవేవీ జ్ఞాపకానికి రాక కిందా మీదా పడ్డాడు. 66 ఏళ్ల ఆ వ్యక్తి భార్యతో గడిపిన 10 నిమిషాలకు మొబైల్లో తేదీ చూసి ఒక్కసారిగా షాక్ తిన్నాడు. ఎందుకంటే ఆ ముందు రోజే వాళ్ల పెళ్లి రోజు. అంత ముఖ్యమైన విషయం మర్చిపోయానే అంటూ బాధపడిపోయాడు. నిజానికతను భార్యతో, కూతురితో కలిసి ముందు రోజు సాయంత్రం పెళ్లి రోజును చక్కగా సెలబ్రేట్ చేసుకున్నాడు. కానీ అవేమీ అతనికి గుర్తు లేకుండా పోయాయి. దాంతో, పెళ్లి రోజున సరదాగా గడిపామని భార్య, కూతురు ఎంత చెప్పినా ఓ పట్టాన నమ్మలేదు. ‘‘నిన్న సాయంత్రం నుంచి ఇప్పటిదాకా ఏం జరిగింది? నేను ఏమేం చేశాను? ఒక్కటీ వదలకుండా చెప్పండి’’ అంటూ వారిని పదేపదే అడిగాడు. పోనీ జ్ఞాపకశక్తి పూర్తిగా పోయిందా అంటే తన పేరు, వయసు వంటి పాత విషయాలన్నీ మాత్రం భేషుగ్గా గుర్తున్నాయి. ఇక లాభం లేదని ఆస్పత్రికి వెళ్లి పరీక్షలన్నీ చేయించినా సాధారణంగా మతిమరుపుకు దారితీసే నరాల సమస్య వంటివేమీ లేవని, అంతా మామూలుగానే ఉందని తేలింది. మరి ఈ తాత్కాలిక మరుపేమిటో అర్థం కాక డాక్టర్లు కూడా అయోమయానికి గురయ్యారు. కాసేపటికే ముందు రోజు జ్ఞాపకాలన్నీ తిరిగి రావడంతో హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఆసక్తికర ఉదంతం ఐరిష్ మెడికల్ జర్నల్ మే సంచికలో వ్యాసంగా పబ్లిషైంది. అతని సమస్యను ఒక రకమైన షార్ట్ టర్మ్ మెమరీ లాస్‌గా గుర్తించినట్టు వ్యాసకర్త వివరించారు. ‘‘సాధారణంగా స్ట్రోక్ తదితరాల వల్ల తలెత్తే నరాల బలహీనత ట్రాన్సియెంట్ గ్లోబల్ అమ్నీసియా (టీజీఏ)గా పేర్కొనే షార్ట్ టర్మ్ మెమరీ లాస్‌కు కారణమవుతుంది. కానీ అలాంటివేవీ లేకుండానే కొందరిలో అరుదుగా ఈ సమస్య తలెత్తుతుంది. ప్రస్తుత కేసు అలాంటిదే’’ అని ఆయన చెప్పుకొచ్చారు. 50 నుంచి 70 ఏళ్ల మధ్య వయస్కుల్లో ఇలా జరిగేందుకు ఆస్కారముంటుందన్నారు. ‘‘శారీరకంగా బాగా శ్రమ పడ్డా, అతి చల్లని, లేదా బాగా వేడి నీళ్లలో చాలాసేపు మునిగినా, ఎమోషనల్ స్ట్రెస్‌కు, బాధకు గురైనా, అరుదుగా కొన్నిసార్లు శృంగారంలో పాల్గొన్నాక ఇలా స్వల్పకాలిక మతిమరుపు వచ్చి పడుతుంది. ఫలితంగా తాజా సంఘటనలు ఎవరో చెరిపేసినట్టుగా జ్ఞాపకాల్లోంచి మాయమైపోతాయి. కొందరేమో ఏడాది క్రితం జరిగినవి మర్చిపోతుంటారు. చాలామటుకు కొద్ది గంటల్లోనే ఆ జ్ఞాపకాలన్నీ తిరిగొచ్చి మళ్లీ మామూలైపోతారు’’ అని వివరించారు. కొసమెరుపు ఈ ఉదంతంలోని కథానాయకునికి 2015లోనూ ఇలాంటి తాత్కాలిక మతిమరుపు వచ్చిందట. అది కూడా ఎప్పుడో తెలుసా? భార్యతో సన్నిహితంగా గడిపిన 10 నిమిషాలకే! -
కెనడాలో వింత వ్యాధి కలకలం.. ఇప్పటికే 48 మంది..
గత రెండు మూడు యేళ్లుగా కోవిడ్ సృష్టించిన కల్లోలం అంతాఇంతాకాదు. ఆ భయం నుంచి ఇంకా తేరుకోకముందే మరో వింత వ్యాధి జనాల్లో వ్యాపిస్తోంది. ఈ వ్యాధి లక్షణాలు కూడా వింతగానే ఉన్నాయట.. అంతుచిక్కని ఈ వింత వ్యాధి కెనడాలో కలకలం సృష్టిస్తోంది. బ్రన్స్విక్ ప్రావిన్స్‌లో వెలుగుచూసిన ఈ సంఘటనలో ఇప్పటికే ఈ వ్యాధితో ఆరుగురు మరణించారు. కారణం తెలియని బ్రెయిన్ డిసీజ్‌తో పదుల సంఖ్యలో ప్రజలు ఆనారోగ్యబారీన పడుతున్నారు. అక్కడి ప్రాంతీయ మీడియా కథనాల ప్రకారం 48 మంది ఇప్పటికే ఈ వ్యాధి బారీన పడ్డట్టు సమాచారం. వీరంతా మతిమరుపు, తికమకపడటం వంటి వ్యాధి తాలూకు లక్షణాలతో హాస్పిటల్లలో చేరుతున్నారని తెలిసింది. ఈ గుర్తుతెలియని వ్యాధికి గల కారణాలు డాక్టర్లకు కూడా అంతుచిక్కడం లేదు. తాజా నివేదికల ప్రకారం మరణించిన వారందరూ 18 నుంచి 85 యేళ్ల మధ్య వయసు వారు. మరణించిన వారంతా మానసిక వ్యాధితో మృతిచెందినట్టు నివేదికలో చెప్పబడింది. ఈ వ్యాధి బారీన పడ్డవారిలో ఉద్రేకం, మైకం, భ్రమలు, మతిమరుపు, కండరాల నొప్పులు అధిక స్థాయిలో పెరిగినట్టు గుర్తించారు. అక్కడి అధికారులు దీనికి గల కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు చేపడుతున్నారు. కాగా గత యేడాది చివరిలో కూడా ఇదే తరహాలో పెద్ద సంఖ్యలో అబ్నార్మల్ న్యూరోలాజికల్ కేసులు బయటపడినట్టు పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ ఆఫ్ కెనడా హెచ్చరించింది. మరణించిన వారి మృతదేహాలను పరీక్షించడం ద్వారా దీనికి గల కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పుకొచ్చింది. ఇప్పటికే రకరకాల వ్యాధులతో విసిగివేసారిపోయిన ప్రజలు.. ఎటునుంచి ఏ కొత్త వైరస్ రూపంలో ఏ వ్యాధి వ్యాపిస్తుందో తెలియక ప్రాణాలు గుప్పెట్టో పెట్టుకుని క్షణక్షణ గండంగా బతుకుతున్నారు. ఇలాంటి సమయంలో మెదడుకు సంబంధించిన ఈ కొత్త వ్యాధి ప్రజల్లో భయందోళనలు రేకెత్తిస్తోంది. చదవండి: ఈ హెర్బల్ టీతో మీ ఇమ్యునిటీని పెంచుకోండిలా.. -
ప్రియుడితో గొడవ.. ఆ నీళ్లు తాగితే బాధ మర్చిపోతావ్!
బీజింగ్ : ‘ఆమ్నీషియా(మతిమరుపు) నీళ్ల’ పేరిట ఓ మహిళను మోసం చేశాడు ఓ సైబర్ నేరగాడు. ఈ సంఘటన చైనాలోని జియాంగ్‌షూ ప్రావిన్స్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు.. ఈస్ట్ చైనా, షూఝౌకు చెందిన కియాన్ అనే మహిళ కొద్దిరోజుల క్రితం ప్రియుడితో గొడవపడింది. అతడి జ్ఞాపకాలతో ప్రతీ రోజు నరకం అనుభవించేది. ఎలాగైనా ఆ జ్ఞాపకాలను మర్చిపోవాలనుకునేది. ఇందుకోసం ఏదైనా మందు దొరుకుతుందన్న ఆశతో ఆన్లైన్లో వెతికింది. ఈ నేపథ్యంలో ఆమెకు ‘ఆమ్నీషియా వాటర్’ దర్శనమిచ్చింది. ఆన్లైన్లో దాని విలువ 500 యాన్లు( దాదాపు 5700 రూపాయలు)గా ఉంది. దాన్ని తాగితే బాధపెట్టే జ్ఞాపకాలనుంచి సాంత్వన లభిస్తుందని రాసి ఉంది. దీంతో ఆమె ఆన్లైన్లో ఉన్న నెంబర్లకు ఫోన్ చేసింది. ఫోన్లో మాట్లాడిన వ్యక్తి ‘ఆమ్నీషియా నీళ్లు తాగితే బాధ మర్చిపోతావ్!’ అని ఆమెకు చెప్పాడు. మరికొన్ని మాయమాటలు కూడా చెప్పి రూ.6500యాన్లు( దాదాపు రూ. 74 వేలు) వసూలు చేశాడు. అనంతరం ఓ టైం, ప్లేస్ చెప్పి.. ఆ సమయానికి ఆ ప్రదేశానికి సదరు మతిమరుపు మందును తీసుకువస్తానని హామీ ఇచ్చాడు. అయితే చెప్పిన టైం దగ్గర పడగానే రాలేనంటూ ఫోన్ స్విచ్చాఫ్ చేసేశాడు. తాను మోసపోయానని తెలుసుకున్న కియాన్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
తమ్ముడి కౌగిలితో.. మతిమరుపు మాయం
అమ్నీషియా.. అంటే విపరీతమైన మతిమరుపు. ఈ వ్యాధి అంత తొందరగా మందులకు కూడా లొంగదు. ఇంగ్లండ్‌లో ఓ టీనేజి యువతి ఈ వ్యాధితో బాధపడేది. వైద్యులు ఎంత ప్రయత్నించినా ఆమెకు పాత జ్ఞాపకాలేవీ గుర్తురాలేదు. కానీ.. ఓ రోజు ఆమె తమ్ముడు ఆమెను ఆప్యాయంగా కౌగలించుకున్నాడు.. అంతే, శంకర్‌దాదా ఎంబీబీఎస్ సినిమాలో చూపించినట్లుగా ఏదో మాయ జరిగింది.. ఆమెకు పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చేశాయి. అమ్నీషియా మటుమాయమైంది!! డెవన్లోని ప్లిమౌత్ ప్రాంతంలో నివసించే కోల్ ఇమ్మన్ (16) అనే యువతి ఇన్నాళ్లూ తన జీవితంలో జరిగిన విషయాలన్నింటినీ మర్చిపోయింది. వైద్యులు ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కానీ ఓసారి వాళ్ల చిన్నారి తమ్ముడు కాలెబ్ వచ్చి, అక్కను గట్టిగా పట్టుకున్నాడు. వెంటనే తనకు మొత్తం కుటుంబంలో జరిగిన విషయాలన్నీ గుర్తుకొచ్చాయని, ఏ ఒక్కటీ మర్చిపోలేదని ఆమె చెప్పింది. ఆరేళ్లుగా ఆమెకు విపరీతమైన తలనొప్పి వస్తుండేది. తర్వాత ఆమె వెన్నెముకలో అదనంగా చేరిన ఫ్లూయిడ్లను బయటకు పంపేందుకు లుంబర్ పంక్చర్ చికిత్స చేశారు. దాంతో ఆమెకు మతిమరుపు మొదలైంది. ఇప్పుడు అది పోవడంతో ఆమె చాలా సంతోషంగా ఉంది.