Amnesia Pub Rape Case: Corporator Son Trapped Victim First - Sakshi
Sakshi News home page

Amnesia Pub Rape Case: బాధితురాలిని మొదట ట్రాప్‌ చేసింది ఎవరంటే..

Published Thu, Jun 9 2022 4:47 PM | Last Updated on Thu, Jun 9 2022 5:18 PM

Amnesia Pub Rape Case: Corporator Son Trapped Victim First - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని జూబ్లీహిల్స్‌ అమ్నీషియా పబ్‌ మైనర్‌ సామూహిక అత్యాచార ఘటనలో.. పోను పోను సంచలనాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా మాజీ ఎమ్మెల్యే మనవడు, పాతబస్తీ ఎమ్మెల్యే కుమారుడి అరెస్ట్‌ రిమాండ్‌లో మరిన్ని విషయాలు వెలుగు చూశాయి. 

కార్పొరేటర్‌ కుమారుడే బాధితురాలిని ట్రాప్‌ చేశాడన్న నిందితులు వెల్లడించారు. పబ్‌లో బాధితురాలితో, కార్పొరేటర్‌ కుమారుడు అనుచిత ప్రవర్తించాడు. మళ్లీ పబ్‌ బయటకు వచ్చాక కార్పొరేటర్‌ కొడుకే మాయమాటలు చెప్పి ట్రాప్‌ చేశాడు. ఆపై ఆమెను కారులో ఎక్కించాడని నిందితులు వెల్లడించారు. 

‘‘బెంజ్‌ కారులో మొదట ఎమ్మెల్యే కుమారుడు.. బాధితురాలిపట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. అతని తర్వాత.. కార్పొరేటర్‌ కొడుకు అసభ్యంగా వ్యవహరించాడు. కాన్సూ బేకరీ దగ్గరికి వెళ్లేసరికి ముందు సీట్లో నుంచి సాదుద్దీన్‌ వెనక సీట్లోకి మారాడు. ఆమెపై సాదుద్దీన్‌ లైంగిక దాడి చేశాడు. కాన్సూ బేకరీ దగ్గర బాధితురాలిని కార్‌లోనే కూర్చోబెట్టాం. 

బేకరీలో అందరూ ఫుడ్‌తిని, సిగరెట్లు తాగాం. అక్కడి నుంచి అంతా కలిసి ఇన్నోవా కారులో పబ్‌కి బయల్దేరాం. ఆమె సెల్‌ఫోన్‌, కళ్లద్దాలను బలవంతంగా లాక్కున్నాం. అవి కావాలంటే ఇన్నోవా ఎక్కాలని బెదిరించాం. కారులో ఒకరి తర్వాత ఒకరం లైంగిక దాడి చేశాం’’ అని నిందితులు నేరాన్ని అంగీకరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కేసులో విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది.

అమ్నీషియా పబ్‌ రేప్‌ కేసులో జువనైల్స్‌ని కస్టడీకి అనుమతించింది కోర్టు. దీంతో రేపటి నుంచి నాలుగు రోజులపాటు పోలీస్‌ కస్టడీకి అనుమతి దొరికినట్లయ్యింది. ఇప్పటికే ఈ కేసులో ఏ-1గా ఉన్న సాదుద్దీన్‌ మాలిక్‌ను విచారిస్తున్నారు. ఐదుగురిని కలిసి రేపటి నుంచి విచారించనున్నారు.

చదవండి: బాధితురాలి రెండో స్టేట్‌మెంట్‌లో సంచలన విషయాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement