తమ్ముడి కౌగిలితో.. మతిమరుపు మాయం | Brother's hug treats british teenagers amnesia | Sakshi
Sakshi News home page

తమ్ముడి కౌగిలితో.. మతిమరుపు మాయం

Published Sat, Mar 7 2015 6:11 PM | Last Updated on Sat, Sep 2 2017 10:28 PM

తమ్ముడి కౌగిలితో.. మతిమరుపు మాయం

తమ్ముడి కౌగిలితో.. మతిమరుపు మాయం

అమ్నీషియా.. అంటే విపరీతమైన మతిమరుపు. ఈ వ్యాధి అంత తొందరగా మందులకు కూడా లొంగదు. ఇంగ్లండ్లో ఓ టీనేజి యువతి ఈ వ్యాధితో బాధపడేది. వైద్యులు ఎంత ప్రయత్నించినా ఆమెకు పాత జ్ఞాపకాలేవీ గుర్తురాలేదు. కానీ.. ఓ రోజు ఆమె తమ్ముడు ఆమెను ఆప్యాయంగా కౌగలించుకున్నాడు.. అంతే, శంకర్దాదా ఎంబీబీఎస్ సినిమాలో చూపించినట్లుగా ఏదో మాయ జరిగింది.. ఆమెకు పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చేశాయి. అమ్నీషియా మటుమాయమైంది!!

డెవన్లోని ప్లిమౌత్ ప్రాంతంలో నివసించే కోల్ ఇమ్మన్ (16) అనే యువతి ఇన్నాళ్లూ తన జీవితంలో జరిగిన విషయాలన్నింటినీ మర్చిపోయింది. వైద్యులు ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కానీ ఓసారి వాళ్ల చిన్నారి తమ్ముడు కాలెబ్ వచ్చి, అక్కను గట్టిగా పట్టుకున్నాడు. వెంటనే తనకు మొత్తం కుటుంబంలో జరిగిన విషయాలన్నీ గుర్తుకొచ్చాయని, ఏ ఒక్కటీ మర్చిపోలేదని ఆమె చెప్పింది. ఆరేళ్లుగా ఆమెకు విపరీతమైన తలనొప్పి వస్తుండేది. తర్వాత ఆమె వెన్నెముకలో అదనంగా చేరిన ఫ్లూయిడ్లను బయటకు పంపేందుకు లుంబర్ పంక్చర్ చికిత్స చేశారు. దాంతో ఆమెకు మతిమరుపు మొదలైంది. ఇప్పుడు అది పోవడంతో ఆమె చాలా సంతోషంగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement